రేపు వీఆర్వో, వీఆర్‌ఏ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన | vro ,vra candidates certificate verification | Sakshi
Sakshi News home page

రేపు వీఆర్వో, వీఆర్‌ఏ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

Published Mon, Feb 24 2014 1:13 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

vro ,vra candidates certificate verification

 గుంటూరు సిటీ, న్యూస్‌లైన్: వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మంగళవారం సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని కలెక్టర్ సురేశ్‌కుమార్ తెలిపారు. ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆదివారం కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫలితాలను జఠ్టఠట.జీఛి.జీ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చన్నారు. వీఆర్వో అభ్యర్థులకు మంగళవారం ఉదయం 9.30 గంటలకు కలెక్టర్ కార్యాలయంలో, వీఆర్‌ఏ అభ్యర్థులకు ఆయా ఆర్డీవో కార్యాలయాల్లో ఉదయం 9 గంటలకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరుగుతుందన్నారు. హాల్ టికెట్, విద్యార్హతలు, పుట్టిన తేదీ, కుల, నేటివిటీ ఒరిజనల్ సర్టిఫికెట్లు, 3 సెట్ల జిరాక్స్‌లు, రెండు పాస్‌పోర్టుసైజు ఫొటోలు, అభ్యర్థులు వెంట తీసుకురావాలని ఆయన సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement