సాక్షి,హైదరాబాద్:గ్రూప్ వన్ పరీక్షపై బీఆర్‌ఎస్,బీజేపీలు కుమ్మక్కై లేనిపోని అనుమానాలు సృష్టిస్తున్నాయని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు.గాంధీభవన్‌లో ఆదివారం (అక్టోబర్20) ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు పార్టీల నేతలు యువతను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
‘బీఆర్‌ఎస్,బీజేపీ నేతలు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారు. బీసీ బిడ్డగా నేను మీకు భరోసా ఇస్తున్నా.సెలక్షన్ ప్రక్రియలో ఎక్కడా రిజర్వుడు కేటగిరీకి అన్యాయం జరగదు. జీఓ 29తో నష్టం అనేది అపోహ మాత్రమే. బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ హయాంలో ఎన్ని ఉద్యోగాలిచ్చారో బండి సంజయ్ చెప్పాలి.
బీఆర్ఎస్ నియామకాల పేరుతోనే అధికారంలోకి వచ్చింది. పదేళ్లలో టీఎస్పీఎస్సీ నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి.ఇన్నాళ్లూ ఉద్యోగాలు ఇవ్వని మీరు ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు’అని మహేశ్‌గౌడ్ మండిపడ్డారు.
ఇదీ చదవండి: న్యాయం అడిగితే తలలు పగులగొడతారా: కిషన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment