గ్రూప్‌–1లో తెలుగు అర్హత పేపర్‌ పెట్టాలి | Students Request To Governor Tamilisai Soundararajan Over Group 1 Mains Exam | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–1లో తెలుగు అర్హత పేపర్‌ పెట్టాలి

Published Fri, Jan 28 2022 3:05 AM | Last Updated on Fri, Jan 28 2022 3:05 AM

Students Request To Governor Tamilisai Soundararajan Over Group 1 Mains Exam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలో తెలుగును అర్హత పేపర్‌గా ప్రవేశపెట్టాలని గ్రూప్‌–1 పరీక్ష అభ్యర్థులు టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ను కోరారు. ఈ మేరకు వారు గురువారం గవర్నర్‌ తమిళి సై సౌందర రాజన్, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు వినతి పత్రాలు అందజేశారు.

గ్రామీణ ప్రాంత అభ్యర్థులు చాల వరకూ తెలుగు మాధ్యమంలో చదువుకున్నారని, దీనివల్ల పట్టణ ప్రాంత అభ్యర్థులతో పోటీ పడలేకపోతున్నారని వారు తెలిపారు. పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు.  వినతి పత్రం సమర్పించిన వారిలో నరేందర్, నాగరాజు, రమేష్, శ్రీనివాస్, పి.వెంకటేశం తదితరులున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement