కాలానికి ప్రామాణిక ప్రమాణం ఏది? | What is the standard unit of time? | Sakshi
Sakshi News home page

కాలానికి ప్రామాణిక ప్రమాణం ఏది?

Published Fri, Oct 31 2014 9:58 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

కాలానికి ప్రామాణిక ప్రమాణం ఏది? - Sakshi

కాలానికి ప్రామాణిక ప్రమాణం ఏది?

రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ - 1, గ్రూప్ -2, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు, ఏఈ, ఏఈఈ, డీఏవో తదితర నియామక పరీక్షల్లో 150 మార్కులకు  జనరల్ స్టడీస్ తప్పనిసరిగా ఉంటుంది. దీంట్లో జనరల్ సైన్‌‌స ఒక భాగం. జనరల్ సైన్‌‌సలోని సబ్జెక్టుల్లో భౌతిక రసాయన శాస్త్రాలు, బయాలజీ ముఖ్యమైనవి. వీటిలో భౌతిక శాస్త్రానికి సంబంధించి 12 నుంచి 18, బయాలజీ నుంచి 10 - 15, రసాయన శాస్త్రానికి సంబంధించి 3 నుంచి 6 ప్రశ్నల వరకు అడుగుతారు. వీటితోపాటు సైన్‌‌స అండ్ టెక్నాలజీ విభాగం నుంచి 3 లేదా 4 ప్రశ్నలు వస్తాయి.

మొత్తంమీద జనరల్ సైన్‌‌స, సైన్‌‌స అండ్ టెక్నాలజీలకు కలిపి 25 నుంచి 40 మార్కులకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.  గతంలో నిర్వహించిన వివిధ పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా ఏ అంశంపై ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి? ప్రశ్నల సరళి  ఏవిధంగా ఉంది లాంటి అంశాలను తెలుసుకోవాలి. తదనుగుణంగా ప్రిపరేషన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి.

భౌతిక శాస్త్రంలో ముందుగా భౌతిక రాశులు, బలం, ఉష్ణం, కాంతి, ధ్వని, అయస్కాంతత్వం, విద్యుత్ మొదలైన పాఠ్యాంశాలపై పట్టు సాధించాలి. వీటి కోసం  10వ తరగతి వరకు ఉన్న భౌతిక శాస్త్ర పాఠ్యపుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. వీటితోపాటు శుద్ధగతిక శాస్త్రం, విశ్వ గురుత్వాకర్షణ, ప్రవాహిలు, తలతన్యత, ద్రవ్యరాశి కేంద్రం, ఆధునిక భౌతిక శాస్త్రం లాంటి అంశాలపై కూడా ఇటీవల ప్రశ్నలు అడుగుతున్నారు. వీటి కోసం 6 నుంచి 10వ తరగతి పాఠ్యపుస్తకాలతోపాటు ఇంటర్మీడియట్ స్థాయి పుస్తకాలను కూడా చదవాలి. అభ్యర్థికి 10వ తరగతి వరకు ఉన్న అన్ని అంశాలపై సాధారణ అవగాహన ఉండాలనేది జనరల్ స్టడీస్ ముఖ్య ఉద్దేశం. పరీక్షల దృష్ట్యా జనరల్ సైన్‌‌సలో భౌతిక శాస్త్రానికి వెయిటేజీ ఉంది.

శిక్షణా సంస్థల్లో కొంతమంది అధ్యాపకులు తరచుగా కొన్ని టాపిక్స్‌ను మాత్రమే బోధించి, వాటి నుంచే ప్రశ్నలు వస్తాయని చెబుతారు. కానీ పోటీ పరీక్షలకు సంబంధించి నిర్దిష్టంగా ఒక టాపిక్ నుంచి ప్రశ్నలు వస్తాయని చెప్పలేం. వర్తమాన అంశాల ప్రాధాన్యాల ఆధారంగా ఏ పాఠ్యభాగం నుంచైనా ప్రశ్నలు ఇవ్వవచ్చు. అందువల్ల అభ్యర్థులు గత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా ప్రశ్నల సరళిపై అవగాహన పెంచుకొని వాటికి అనుగుణంగా సన్నద్ధమవ్వాలి.
 
భౌతిక శాస్త్రంలో సాధారణంగా స్టాండర్‌‌డ జీకే, ప్యూర్ సైన్‌‌స, అప్లయిడ్ సైన్‌‌స లేదా జనరల్ సైన్‌‌స అనే మూడు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. శాస్త్రవేత్తలు, పరికరాల పేర్లు, ఆవిష్కరణలు- సంవత్సరాలు మొదలైనవి స్టాండర్‌‌డ జీకేకు సంబంధించిన అంశాలు. కొన్ని ఉదాహరణలు..
 
1.    టెలిస్కోప్‌ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
 2.    అచ్చుయంత్రాన్ని కనుగొన్నదెవరు?
 3.    విశ్వ గురుత్వ నియమాన్ని ప్రతిపాదించిందెవరు?
 4.    ఐన్‌స్టీన్‌కు ఏ సిద్ధాంతానికి నోబెల్ బహుమతి లభించింది?
 5.    ఐన్‌స్టీన్‌కు నోబెల్ బహుమతి ఏ సంవత్సరంలో లభించింది?
 6.    ‘యురేకా’ అని అరిచిందెవరు?
 
సమాధానాలు
 1) గెలీలియో    2) జాన్ గూటన్ బర్‌‌గ
 3) న్యూటన్
 4) ఐన్‌స్టీన్ ‘ఫొటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్’ కనుగొన్నందుకు నోబెల్ బహుమతి లభించింది. వాస్తవానికి ఈయన సాపేక్ష సిద్ధాంతానికి నోబెల్ వస్తుందని భావించారు.
 5)1921
 6) ఆర్కిమెడిస్. గ్రీకు భాషలో ‘యురేకా’ అంటే ‘కనుగొన్నాను’ లేదా ‘తెలుసుకున్నాను’ అని అర్థం. నూతన విషయాన్ని కనుగొన్న సందర్భంలో ఆర్కిమెడిస్ ‘యురేకా’ అని గట్టిగా అరుస్తూ వీధుల వెంట తిరిగారు.
 
ప్యూర్ సైన్‌‌సలో భాగంగా ఒక్కోసారి ఫిజిక్స్‌లో  సమస్య (ప్రాబ్లం)లపై కూడా ప్రశ్నలు అడగవచ్చు. సులభమైన అంశాలు, దాదాపుగా నేరుగా సమాధానం గుర్తించేవిధంగా ఈ ప్రశ్నలు ఉంటాయి. గతంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో  సమస్యలపై అడిగిన కొన్ని ప్రశ్నలను గమనించండి.
 1.    ఒక వస్తువు వేగాన్ని రెట్టింపు చేస్తే దాని గతిశక్తి ఎన్నిరెట్లు అవుతుంది?
 2.    ఒక రేడియోధార్మిక మూలకం అర్ధజీవిత కాలం 4 సంవత్సరాలు. అయితే అది 3/4వ వంతు విఘటనం చెందడానికి పట్టే కాలం ఎంత?
 3.    ఒక గ్రహం, దాని నక్షత్రానికి మధ్య ఉన్న దూరం రెట్టింపు అయితే దాని ఆవర్తన కాలం ఎన్ని రెట్లు అవుతుంది?
 
సమాధానాలు
 1) 4 రెట్లు   2) 8 సంవత్సరాలు  
 3) 2శీ2 రెట్లు

మూడో విభాగమైన అప్లయిడ్ సైన్‌‌స నుంచి అత్యధిక ప్రశ్నలు వస్తాయి. ఫిజిక్స్‌లో సుమారు తొంభై శాతం ప్రశ్నలు ఈ విభాగం నుంచే ఉంటాయి. దీంట్లో భాగంగా మౌలికాంశాలతో పాటు వివిధ ధర్మాలు, నియమాలు, సూత్రాలు, సిద్ధాంతాలు, వాటి అనువర్తనాలపై ప్రశ్నలు అడుగుతారు.
ఉదా: కాంతి ధర్మాలు, అయస్కాంతాల సాధారణ ధర్మాలు, ధ్వని ధర్మాలు.

నియమాలకు సంబంధించి న్యూటన్ గమన నియమాలు, కెప్లర్ గ్రహగమన నియమాలు, న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమం, ఆర్కిమెడిస్ సూత్రం, ప్లవన సూత్రం, బెర్నౌలీ సిద్ధాంతం, ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం, పాస్కల్ సూత్రం మొదలైనవాటిని క్షుణ్నంగా చదవాలి. వీటి ఆధారంగా నిజ జీవితంలో జరిగే సంఘటనల్ని విశ్లేషించుకోవాలి. అభ్యర్థి సబ్జెక్ట్‌కు సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని పరిశీలించడంతో పాటు జనరల్ సైన్‌‌సలో ప్రశ్నలను అడగడంలో ఉన్న మరో ముఖ్య ఉద్దేశం విశ్లేషణా సామర్థ్యాన్ని పరీక్షించడం.

విషయాన్ని బట్టీపట్టడం కంటే  అర్థం చేసుకుంటూ చదివినప్పుడే ఎలాంటి ప్రశ్నలు ఇచ్చినా సులభంగా సమాధానాలను గుర్తించవచ్చు. ఎక్కువగా ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలను చదవడం వల్ల నిర్మాణాత్మక పరిజ్ఞానం, సామర్థ్యం, తార్కిక విశ్లేషణ సాధ్యం కాదు. అందువల్ల ప్రధాన కాన్సెప్టులను క్షుణ్నంగా అధ్యయనం చేయడం ప్రయోజనకరం. పాఠ్యాంశాలపై పట్టు సాధించిన తర్వాత సాధ్యమైనంత ఎక్కువగా ప్రశ్నలను సాధన చేయాలి. అభ్యర్థులు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని చదివితే మంచి మార్కులు సంపాదించవచ్చు.
 
మాదిరి ప్రశ్నలు
 1.    కిందివాటిలో ఒక వస్తువు భారం దేంట్లో గరిష్ఠంగా ఉంటుంది?
     1) శూన్య ప్రదేశం    2) హైడ్రోజన్
     3) గాలి    4) నీరు
 2.    నీటిలో తేలియాడుతున్న వస్తువు దృశ్యభారం ఎంత?
     1) శూన్యం
     2) వస్తువు నిజ భారంలో సగం
     3) వస్తువు నిజ భారానికి సమానం
     4) వస్తువు నిజ భారానికి రెట్టింపు
 3.    ఒక ప్రవాహిలో మునిగి ఉన్న వస్తువు ఘ.ప. 200 ఘనపు సెంటీమీటర్లు. అయితే అది ఎంత ఘనపరిమాణం ఉన్న నీటిని స్థానభ్రంశం చెందిస్తుంది?
     1) 0           2) 50 ఘ.సెం.మీ.
     3) 200 ఘ.సెం.మీ.
     4) 400 ఘ.సెం.మీ
 4.    ఒక ప్రవాహిలో వేలాడుతున్న వస్తువు దృశ్యభారం ఎంత?
     1) దాని నిజ భారానికి రెట్టింపు
     2) నిజ భారానికి సమానం
     3) నిజ భారంలో సగం  4) శూన్యం
 5.    ఆకుపచ్చని కాంతిలో పసుపు పచ్చని పుష్పం ఏ వర్ణంలో కనిపిస్తుంది?
     1) తెలుపు    2) నలుపు
     3) ఆకుపచ్చ    4) పసుపు పచ్చ
 6.    కిందివాటిలో ప్రాథమిక వర్ణం కానిది?
     1) ఎరుపు    2) ఆకుపచ్చ
     3) పసుపుపచ్చ    4) నీలం
 7.    అణు రియాక్టర్లలో మితకారిణి విధి  ఏమిటి?
     1) చర్యా వేగాన్ని మార్చడం
     2) న్యూట్రాన్ల వేగాన్ని పెంచడం
     3) న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడం
     4) ఉష్ణోగ్రతను తగ్గించడం
 8.    భారజలం రసాయనిక నామం?
     1) డై హైడ్రోజన్ ఆక్సైడ్
     2) హైడ్రోజన్ డయాక్సైడ్
     3) డ్యుటీరియం ఆక్సైడ్
     4) హైడ్రోజన్ పెరాక్సైడ్
9.    ఒకే సైజు, ఒకే ఆకృతిలో ఉన్న అ, ఆ అనే రెండు లోహపు డబ్బాలను ఒకే పదార్థంతో తయారు చేశారు. వాటిని 40ఇ ఉష్ణోగ్రత వద్దనున్న నీటితో పూర్తిగా నింపి ఒకదాన్ని వేడిచేసి, మరో దాన్ని చల్లారిస్తే ఆ రెండింటిలో నీటి ఘనపరిమాణం ఏమవుతుంది?
     1) అలో పెరిగి ఆలో తగ్గుతుంది
     2) అలో తగ్గి ఆలో పెరుగుతుంది
     3) రెండింటిలో పెరుగుతుంది
     4) రెండింటిలో తగ్గుతుంది
10.    పీడనం పెరగడం వల్ల నీటి భాష్పీభవన స్థానం?
     1) పెరుగుతుంది
     2) తగ్గుతుంది
     3) స్థిరంగా ఉంటుంది
     4) పెరగవచ్చు లేదా తగ్గవచ్చు
11.    కిందివాటిలో డయా అయస్కాంత పదార్థం కానిది?
     1) బంగారం    2) వజ్రం
     3) కోబాల్ట్    4) ఆల్కహాల్
12. మాక్ నంబర్ దేనికి సంబంధించింది?
     1) ఉష్ణోగ్రత    2) వేగం
     3) పీడనం    4) భారం
13.    ఒక ట్యూబ్ లైట్ 40 వాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దాన్ని ఎన్ని గంటలపాటు వెలిగిస్తే 1 యూనిట్ కరెంట్ వినియోగం అవుతుంది?
     1) 40        2) 25
     3) 24        4) 10
14.    ఉష్ణోగ్రతతో నీటి స్పర్శ కోణం?
     1) పెరుగుతుంది    2) తగ్గుతుంది
     3) స్థిరంగా ఉంటుంది
     4) స్పర్శ కోణం ఉష్ణోగ్రతపై
         ఆధారపడదు
15.    భూస్థావర ఉపగ్రహాలు భూ ఉపరితలం నుంచి ఎంత ఎత్తు వద్ద తిరుగుతాయి?
     1) 1000 కి.మీ.    2) 3200 కి.మీ.
     3) 3600 కి.మీ.    4) 36,000 కి.మీ.
16.    భూ ఉపరితలం నుంచి పైకి
     వెళ్లేకొద్ది పీడనం?
     1) తగ్గుతుంది    2) పెరుగుతుంది
     3) స్థిరంగా ఉంటుంది
     4) పెరగవచ్చు లేదా తగ్గవచ్చు
17.    సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిందెవరు?
     1) టాలమీ    2) కోపర్నికస్
     3) గెలీలియో    4) న్యూటన్
18.    భూమిపై ప్రదేశం లేదా విశ్వంలోని ఏదైనా స్థానం ఆధారంగా ఒక వస్తువు ద్రవ్యరాశి, భారానికి సంబంధించి కిందివాటిలో సరైంది ఏది?
     1)    ద్రవ్యరాశి, భారం రెండూ స్థిరంగా ఉంటాయి
     2)    ద్రవ్యరాశి, భారం రెండూ
         మారతాయి
     3)    ద్రవ్యరాశి స్థిరంగా ఉంటుంది కానీ భారం మారుతుంది
     4)    భారం స్థిరంగా ఉంటుంది కానీ ద్రవ్యరాశి మారుతుంది
19.    1 కేజీ, 10 కేజీల ద్రవ్యరాశి ఉన్న రెండు వస్తువులను సమాన వేగాలతో నిటారుగా పైకి విసిరితే, ఆ రెండింటిలో ఏది గరిష్ఠ ఎత్తుకు చేరుతుంది?
     1) 1 కేజీ ద్రవ్యరాశి ఉన్న వస్తువు
     2) 10 కేజీ ద్రవ్యరాశి ఉన్న వస్తువు
     3)    రెండూ సమాన గరిష్ఠ ఎత్తునకు చేరుకుంటాయి
     4)    వాటి గరిష్ఠ ఎత్తు అనేది పైకి విసిరిన సాధారణ వేగంపై ఆధారపడి ఉంటుంది
20.    కాలానికి ప్రామాణిక ప్రమాణం ఏది?
     1) సెకన్    2) నిమిషం
     3) గంట    4) రోజు
 
సమాధానాలు
     1) 1;    2) 1;    3) 3;    4) 4;
     5) 2;    6) 3;    7) 3;    8) 3;
     9) 3;    10) 1;    11) 3;    12) 2;
     13) 2;    14) 2;    15) 4;    16) 1;
     17) 2;    18) 3;    19) 3;    20) 1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement