State Public Service Commission
-
‘నాలుగు వారాల్లో కౌంటర్ వేయండి’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల నియామకం చట్టవిరుద్ధమంటూ దాఖలైన వ్యాజ్యంపై నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని మరోసారి ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. టీఎస్పీఎస్సీ సభ్యులుగా రమావత్ ధన్సింగ్, ప్రొఫెసర్ బండి లింగారెడ్డి, సుమిత్రా ఆనంద్ తనోబా, కారం రవీందర్‌రెడ్డి, డాక్టర్ అరవిల్లి చంద్రశేఖర్‌రావు, ఆర్.సత్యనారాయణల నియామకం చట్టవిరుద్ధమంటూ కాకతీయ యూనివర్శిటీ పూర్వ ప్రొఫెసర్ ఎ.వినాయకరెడ్డి దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. కౌంటర్ దాఖలు చేయాలని గత ఏడాది నవంబర్ 8న ఆదేశించినా ఎందుకు దాఖలు చేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది. కౌంటర్ దాఖలుకు కొంత గడువు ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థించగా అనుమతించిన ధర్మాసనం.. నాలుగు వారాల్లో సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ), న్యాయశాఖ ముఖ్య కార్యదర్శులతోపాటు టీఎస్పీఎస్సీ, వ్యక్తిగత హోదాలో సభ్యులుగా నియమితులైన ఆరుగురు సభ్యులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 31కి వాయిదా వేసింది. -
గ్రూప్–1, 2కు కామన్ సిలబస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రస్థాయి సివిల్ సర్వీసులైన గ్రూప్–1, గ్రూప్–2 ఉద్యోగ నియామకాలకు దేశవ్యాప్తంగా ఒకే పద్ధతి అమలు కానుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆధ్వర్యంలో శనివారం గుజరాత్‌లోని కచ్‌లో జరిగిన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల జాతీయ సదస్సులో సభ్యులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ప్రతిపాదించగా.. యూపీఎస్సీ చైర్మన్ డేవిడ్ రీడ్ సిమ్లెతోపాటు వివిధ రాష్ట్రాల పీఎస్సీ చైర్మన్లు ఏకగ్రీవంగా ఆమోదించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల పబ్లిక్ సర్వీసు కమిషన్ల పనితీరు అధ్యయన సబ్‌కమిటీ చైర్మన్‌గా ఉన్న ఘంటా చక్రపాణి.. టీఎస్పీఎస్సీని నమూనాగా తీసుకుని ఈ మేరకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రతిపాదిత అంశాలివే.. ► దేశవ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్ పోస్టుల భర్తీ మాదిరిగా గ్రూప్–1, గ్రూప్–2 భర్తీలో ఒకే విధానం, ఒకే సిలబస్‌ను అనుసరించాలి. ► సిలబస్‌లో 70 శాతం ఒకేరకంగా ఉన్నప్పటికీ.. మిగతా 30 శాతం రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఉంటే సరిపోతుంది. ► అన్ని రాష్ట్రాలు యూపీఎస్సీ మోడల్‌నే అనుసరించాలి ► ఇప్పటికే టీఎస్పీఎస్సీ చాలా వరకు యూపీఎస్సీ విధానాన్నే అమలు చేస్తోంది. ► పీఎస్సీ ద్వారా నిర్వహించే కార్యక్రమాలన్నీ డిజిటలైజేషన్ చేయాలి. ► దరఖాస్తుల స్వీకరణ, ఫీజుల చెల్లింపులు తదితర కార్యక్రమాలు ఆన్లైన్ పద్ధతిలోనే జరగాలి. -
రూ.31 లక్షలకు ఏఎంవీఐ ఉద్యోగం!
- నిరుద్యోగులను మోసం చేసేందుకు రంగంలోకి ముఠా - నలుగురిని అరెస్టు చేసిన టాస్క్‌ఫోర్స్ టీమ్ సాక్షి, హైదరాబాద్: ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలుగన్న ఓ యువకుడిని ఓ ముఠా బుట్టలో వేసుకుంది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్ష ద్వారా ఎంపిక చేసే అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మించి.. ఏకంగా రూ.17.88 లక్షలు కాజేసింది. తమ ముఠాలో ఒకరిని టీఎస్పీఎస్సీ ఉద్యోగిగా చూపిస్తూ సొమ్ము వసూలు చేసింది. చివరికి సెల్ఫోన్లు స్విచాఫ్ చేసుకుని మాయమైపోయింది. ఏఎంవీఐ పోస్టుల ఫలితాల్లో తన పేరు లేకపోవడంతో బాధితుడు లబోదిబోమంటూ టీఎస్పీఎస్సీ కార్యాలయానికి పరుగెత్తాడు. అక్కడ తనకు ‘హామీ ఇచ్చిన ఉద్యోగి’ ఎవరూ లేకపోవడంతో హతాశుడయ్యాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి.. వెంటనే టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందించారు. దీంతో వారు రంగంలోకి దిగి ఆ ముఠాకు చెందిన నలుగురిని అరెస్టు చేసి, రూ.15.88 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రెండుసార్లు విఫలం కావడంతో... కృష్ణా జిల్లాకు చెందిన పామర్తి శ్రీనివాసరావు గతంలో రెండు సార్లు పబ్లిక్ సర్వీసు కమిషన్ పరీక్షలు రాసినా ఉద్యోగం సాధించలేకపోయాడు. ఈసారి టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఏఎంవీఐ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకుని పరీక్ష రాశాడు. ఎలాగైనా ఉద్యోగం పొందాలనే ఉద్దేశంతో అన్ని రకాల ప్రయత్నాలూ మొదలుపెట్టాడు. మాజీ ఎమ్మెల్యే రామారావును కలిసేందుకు హైదరాబాద్‌కు వచ్చిన శ్రీనివాసరావుకు జూబ్లీహిల్స్‌లో నివసించే ఎం.తిరుపతయ్య అలియాస్ తిరుమలరాజుతో పరిచయమైంది. కృష్ణా జిల్లాకే చెందిన తిరుపతయ్య బేగంపేటలోని రాజీవ్‌గాంధీ ఏవియేషన్ అకాడమీ చీఫ్ ట్రైనర్‌కు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న శ్రీనివాస్... తనకు ఏఎంవీఐ ఉద్యోగం వచ్చేలా పైరవీ చేయాలని తిరుపతయ్యను కోరాడు. తిరుపతయ్య ఈ విషయాన్ని తమ కార్యాలయంలో పనిచేస్తున్న సయ్యద్ ఖమర్ హుస్సేన్‌కు చెప్పాడు. ఖమర్ సూచనల మేరకు తిరుపతయ్య, మీర్ కర్రార్ అలీ, మహ్మద్ అలీలను సంప్రదించాడు. అందరూ కలసి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి సొమ్ము దండుకునేందుకు ప్లాన్ వేశారు. లిస్టుల్లో పేరు రాకపోవడంతో.. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ఏఎంవీఐ పోస్టులకు ఎంపికైన వారి తొలి జాబితాను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. అందులో తన పేరు లేకపోవడం గుర్తించిన శ్రీనివాస్ దీనిపై తిరుపతయ్యను సంప్రదించగా రెండో జాబితాలో ఉంటుందని చెప్పాడు. అదే రోజు శ్రీనివాస్‌ను సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌కు పిలిపించిన తిరుపతయ్య, యాకూబ్ అలీ తదితరులు ఉద్యోగం కచ్చితంగా వస్తుందని నమ్మబలికి మరో రూ.5.88 లక్షలు తీసుకున్నారు. అయితే ఈ నెల 13న టీఎస్పీఎస్సీ విడుదల చేసిన రెండో జాబితాలోనూ తన పేరు లేకపోవడంతో శ్రీనివాస్‌కు అనుమానం వచ్చింది. దీంతో టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్లి ఆరా తీసి... కోటేశ్వరరావు ఎవరూ లేరని గుర్తించాడు, దీనికితోడు తిరుపతయ్య తదితరుల సెల్ఫోన్లు స్విచాఫ్ చేసి ఉండడంతో మోసపోయినట్లు గుర్తించాడు. రూ.31లక్షలకు ఒప్పందం శ్రీనివాస్‌ను ఓ పథకం ప్రకారం తిరుపతయ్య, మీర్ అలీ, మహ్మద్ అలీలు హైదరాబాద్‌లో అబిడ్స్‌లోని ఓ హోటల్‌కు రప్పించారు. తమకున్న పరిచయాలతో ఏఎంవీఐ ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మబలికి రూ.31లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. అడ్వాన్సుగా రూ.2లక్షలు తీసుకున్నారు. డిసెంబర్లో శ్రీనివాస్ నుంచి తిరుపతయ్య మరో రూ.10లక్షలు తీసుకున్నాడు. అయితే మీర్ కర్రార్ అలీ, మహ్మద్ అలీ నుంచి సరైన స్పందన లేకపోవడం, శ్రీనివాస్ నుంచి ఒత్తిడి పెరగడంతో తిరుపతయ్య మరో పథకం వేశాడు. జీడిమెట్లలోని ఓ ఫైబర్ కంపెనీలో అకౌంటెం ట్‌గా పనిచేస్తున్న తన స్నేహితుడు షేక్ యాకూబ్ అలీని కోటేశ్వరరావు పేరుతో శ్రీనివాస్‌కు పరిచయం చేశాడు. కోటేశ్వరరావు టీఎస్పీఎస్సీలో కంప్యూటర్ సెక్షన్లో పనిచేస్తున్నట్లు శ్రీనివాస్‌ను నమ్మించి, అతని ద్వారా ‘పని’ అవుతోందని చెప్పాడు. వెంటనే స్పందించిన టీఎస్పీఎస్సీ చైర్మన్ టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వచ్చిన శ్రీనివాస్ ద్వారా చైర్మన్ ఘంటా చక్రపాణికి ఈ వ్యవహారం తెలిసింది. ఆయన వెంటనే టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎల్.రాజావెంకటరెడ్డి నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగి... శుక్రవారం తిరుపతయ్య, యాకూబ్, మహ్మద్ అలీ, మీర్ కర్రార్ అలీలను అరెస్టు చేసింది. వారి నుంచి రూ.15.88 లక్షల నగదు, నాన్-జ్యుడీషియల్ స్టాంపు పేపర్లు, ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకుంది. టీఎస్పీఎస్సీ ద్వారా జరిగే నియామకాలన్నీ పారదర్శకంగా ఉంటాయని, ఎవరూ దళారుల్ని నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ సూచించారు. -
ఎడ్యుకేషన్ & జాబ్స్
మరో 283 కొలువులకు నోటిఫికేషన్ * మూడు విభాగాల్లో నియామకాల కోసం విడుదల సాక్షి, హైదరాబాద్: ఇప్పటికే పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేసిన రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మరిన్ని కొలువులకు పచ్చజెండా ఊపింది. మూడు విభాగాలలో కలిపి 283 ఉద్యోగాలకు మంగళవారం నోటిఫికేషన్ జారీచేసింది. రవాణాశాఖలో అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్(ఏఎంవీఐ), హైదరాబాద్ జల మండలి, పారిశుద్ధ్య నిర్వహణ బోర్డులో ఫైనాన్స్ అండ్ అకౌంట్ అసిస్టెంట్లు, మున్సిపాలిటీల్లోని టౌన్ ప్లానింగ్ విభాగంలో నియామకాల కోసం ఈ నోటిఫికేషన్ వెలువరించింది. దరఖాస్తు విధానం మొత్తం ఆన్లైన్ ద్వారా చేపట్టనున్నట్లు పేర్కొంది. మరింత సమాచారం కోసం టీఎస్పీఎస్సీ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. పోటీ పరీక్షలకు 24 నుంచి ఉచిత శిక్షణ హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలోని ఈక్వల్ ఆపర్చునిటీ సెల్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీలో ఈ నెల 24 నుంచి గ్రూప్-1, 2 తదితర పోటీ పరీక్షలకు నిష్ణాతులైన అధ్యాపకులతో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మంగళవారం సెల్ డెరైక్టర్ విష్ణుదేవ్ తెలిపారు. ఓయూలో చదివే విద్యార్థులు ఇందుకు అర్హులని, ఆసక్తి ఉన్నవారు ఈక్వల్ ఆపర్చునిటీ సెల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నేడు, రేపు ఓయూసెట్ స్లైడింగ్ హైదరాబాద్: ఓయూసెట్-2015 ప్రవేశాలకు ఈ నెల 23, 24న స్లైడింగ్ నిర్వహించనున్నట్లు పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ గోపాల్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఎమ్మెస్సీ కోర్సులు, గురువారం ఎంఏ, సోషల్ సైన్స్ కోర్సులకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సీట్లు అలాట్ అయినట్లు ఎస్ఎంఎస్ వచ్చిన అభ్యర్థులు మాత్రమే స్లైడింగ్‌కు హాజరుకావాలని సూచించారు. అధిక ఫీజులు తీసుకుంటే చర్యలు * ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రసాద్ హెచ్చరిక హైదరాబాద్: రెండేళ్ల బీఈడీ కోర్సులో చేరిన అభ్యర్థుల నుంచి నిర్ణీత ఫీజు కన్నా ఎక్కువగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎడ్‌సెట్-2015 కన్వీనర్ ప్రసాద్ హెచ్చరించారు. అసోసియేషన్ ఆఫ్ ఫీ రెగ్యులేషన్ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) నిర్ణయించిన ఫీజు కన్నా ఎక్కువ తీసుకుంటే ఫిర్యాదు చేయాలని కోరారు. డిసెంబర్లో రెండో విడత ‘విద్యానిధి’ సాక్షి, హైదరాబాద్: అంబేద్కర్ విద్యానిధి పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్యకు అర్హులైన ఎస్సీ విద్యార్థులను రెండో విడతలో భాగంగా డిసెంబర్లో ఎంపిక చేయనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ డెరైక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ-పాస్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సివిల్స్, గ్రూప్ -1, 2 వంటి పోటీ పరీక్షలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. నెలకు 50 యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగిస్తున్న ఎస్సీ కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నట్లు, గతేడాది 2.7 లక్షల కుటుంబాలకు రూ.174.25 కోట్ల మేర లబ్ధిచేకూర్చినట్లు తెలిపారు. -
నేడు ‘ఏఈఈ’ ప్రాథమిక కీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ‘ఏఈఈ’ పరీక్ష ప్రాథమిక కీని మంగళవారం (ఈ నెల 22న) ఉదయం 10 గంటలకు తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని టీఎస్పీఎస్సీ పేర్కొంది. అలాగే అభ్యర్థుల జవాబు పత్రాల కాపీలను కూడా అందజేస్తామని.. వీటిని కూడా మంగళవారం వెబ్సైట్లో పొందవచ్చని పేర్కొంది. పరీక్షను వాయిదా వేయించే కుట్ర? ఆదివారం నిర్వహించిన ఏఈఈ పరీక్షలను వాయిదా వేయించేందుకు పన్నిన కుట్రలో భాగంగానే రంగారెడ్డి జిల్లాలోని శ్రీదత్త ఇంజనీరింగ్ కాలేజీలో 100 కంప్యూటర్లను మొరాయించేలా చేశారని టీఎస్పీఎస్సీ ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. ఉదయం పరీక్ష పరిశీలకులు వెళ్లినపుడు బాగానే పనిచేసిన కంప్యూటర్లు తర్వాత కొద్దిసేపటికే పనిచేయకుండా పోవడంపై టీఎస్పీఎస్సీ, టెక్నికల్ బృందంతో పరిశీలన జరిపించింది. ఆ బృందంతోపాటు అబ్జర్వర్లు ఇచ్చిన నివేదిక ప్రకారం కొంత మంది విద్యార్థులు, కాలేజీలో పనిచేసే ఒకరిద్దరు వ్యక్తులు కావాలనే తప్పిదానికి పాల్పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో విచారణ జరిపేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీరభద్రయ్యను విచారణ అధికారిగా టీఎస్పీఎస్సీ నియమించింది. మరోవైపు ఈ సంఘటనపై టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతీ సుబ్రమణ్యం కూడా డీజీపీకి లేఖ రాశారని, దీంతో పోలీసు విచారణ కూడా ప్రారంభమైనట్లు సమాచారం. మరో వైపు రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల కోసం తొలిసారిగా ఆన్లైన్ ద్వారా నిర్వహించిన పరీక్ష విజయవం తం కావడానికి సహకారం అందించిన వారందరికీ టీఎస్పీఎస్సీ ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపింది. -
కాలానికి ప్రామాణిక ప్రమాణం ఏది?
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ - 1, గ్రూప్ -2, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు, ఏఈ, ఏఈఈ, డీఏవో తదితర నియామక పరీక్షల్లో 150 మార్కులకు జనరల్ స్టడీస్ తప్పనిసరిగా ఉంటుంది. దీంట్లో జనరల్ సైన్స ఒక భాగం. జనరల్ సైన్‌సలోని సబ్జెక్టుల్లో భౌతిక రసాయన శాస్త్రాలు, బయాలజీ ముఖ్యమైనవి. వీటిలో భౌతిక శాస్త్రానికి సంబంధించి 12 నుంచి 18, బయాలజీ నుంచి 10 - 15, రసాయన శాస్త్రానికి సంబంధించి 3 నుంచి 6 ప్రశ్నల వరకు అడుగుతారు. వీటితోపాటు సైన్స అండ్ టెక్నాలజీ విభాగం నుంచి 3 లేదా 4 ప్రశ్నలు వస్తాయి. మొత్తంమీద జనరల్ సైన్స, సైన్స అండ్ టెక్నాలజీలకు కలిపి 25 నుంచి 40 మార్కులకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. గతంలో నిర్వహించిన వివిధ పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా ఏ అంశంపై ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి? ప్రశ్నల సరళి ఏవిధంగా ఉంది లాంటి అంశాలను తెలుసుకోవాలి. తదనుగుణంగా ప్రిపరేషన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి. భౌతిక శాస్త్రంలో ముందుగా భౌతిక రాశులు, బలం, ఉష్ణం, కాంతి, ధ్వని, అయస్కాంతత్వం, విద్యుత్ మొదలైన పాఠ్యాంశాలపై పట్టు సాధించాలి. వీటి కోసం 10వ తరగతి వరకు ఉన్న భౌతిక శాస్త్ర పాఠ్యపుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. వీటితోపాటు శుద్ధగతిక శాస్త్రం, విశ్వ గురుత్వాకర్షణ, ప్రవాహిలు, తలతన్యత, ద్రవ్యరాశి కేంద్రం, ఆధునిక భౌతిక శాస్త్రం లాంటి అంశాలపై కూడా ఇటీవల ప్రశ్నలు అడుగుతున్నారు. వీటి కోసం 6 నుంచి 10వ తరగతి పాఠ్యపుస్తకాలతోపాటు ఇంటర్మీడియట్ స్థాయి పుస్తకాలను కూడా చదవాలి. అభ్యర్థికి 10వ తరగతి వరకు ఉన్న అన్ని అంశాలపై సాధారణ అవగాహన ఉండాలనేది జనరల్ స్టడీస్ ముఖ్య ఉద్దేశం. పరీక్షల దృష్ట్యా జనరల్ సైన్సలో భౌతిక శాస్త్రానికి వెయిటేజీ ఉంది. శిక్షణా సంస్థల్లో కొంతమంది అధ్యాపకులు తరచుగా కొన్ని టాపిక్స్‌ను మాత్రమే బోధించి, వాటి నుంచే ప్రశ్నలు వస్తాయని చెబుతారు. కానీ పోటీ పరీక్షలకు సంబంధించి నిర్దిష్టంగా ఒక టాపిక్ నుంచి ప్రశ్నలు వస్తాయని చెప్పలేం. వర్తమాన అంశాల ప్రాధాన్యాల ఆధారంగా ఏ పాఠ్యభాగం నుంచైనా ప్రశ్నలు ఇవ్వవచ్చు. అందువల్ల అభ్యర్థులు గత ప్రశ్నపత్రాలను పరిశీలించడం ద్వారా ప్రశ్నల సరళిపై అవగాహన పెంచుకొని వాటికి అనుగుణంగా సన్నద్ధమవ్వాలి. భౌతిక శాస్త్రంలో సాధారణంగా స్టాండర్డ జీకే, ప్యూర్ సైన్స, అప్లయిడ్ సైన్స లేదా జనరల్ సైన్స అనే మూడు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. శాస్త్రవేత్తలు, పరికరాల పేర్లు, ఆవిష్కరణలు- సంవత్సరాలు మొదలైనవి స్టాండర్డ జీకేకు సంబంధించిన అంశాలు. కొన్ని ఉదాహరణలు.. 1. టెలిస్కోప్‌ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? 2. అచ్చుయంత్రాన్ని కనుగొన్నదెవరు? 3. విశ్వ గురుత్వ నియమాన్ని ప్రతిపాదించిందెవరు? 4. ఐన్‌స్టీన్‌కు ఏ సిద్ధాంతానికి నోబెల్ బహుమతి లభించింది? 5. ఐన్‌స్టీన్‌కు నోబెల్ బహుమతి ఏ సంవత్సరంలో లభించింది? 6. ‘యురేకా’ అని అరిచిందెవరు? సమాధానాలు 1) గెలీలియో 2) జాన్ గూటన్ బర్గ 3) న్యూటన్ 4) ఐన్‌స్టీన్ ‘ఫొటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్’ కనుగొన్నందుకు నోబెల్ బహుమతి లభించింది. వాస్తవానికి ఈయన సాపేక్ష సిద్ధాంతానికి నోబెల్ వస్తుందని భావించారు. 5)1921 6) ఆర్కిమెడిస్. గ్రీకు భాషలో ‘యురేకా’ అంటే ‘కనుగొన్నాను’ లేదా ‘తెలుసుకున్నాను’ అని అర్థం. నూతన విషయాన్ని కనుగొన్న సందర్భంలో ఆర్కిమెడిస్ ‘యురేకా’ అని గట్టిగా అరుస్తూ వీధుల వెంట తిరిగారు. ప్యూర్ సైన్సలో భాగంగా ఒక్కోసారి ఫిజిక్స్‌లో సమస్య (ప్రాబ్లం)లపై కూడా ప్రశ్నలు అడగవచ్చు. సులభమైన అంశాలు, దాదాపుగా నేరుగా సమాధానం గుర్తించేవిధంగా ఈ ప్రశ్నలు ఉంటాయి. గతంలో ఏపీపీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో సమస్యలపై అడిగిన కొన్ని ప్రశ్నలను గమనించండి. 1. ఒక వస్తువు వేగాన్ని రెట్టింపు చేస్తే దాని గతిశక్తి ఎన్నిరెట్లు అవుతుంది? 2. ఒక రేడియోధార్మిక మూలకం అర్ధజీవిత కాలం 4 సంవత్సరాలు. అయితే అది 3/4వ వంతు విఘటనం చెందడానికి పట్టే కాలం ఎంత? 3. ఒక గ్రహం, దాని నక్షత్రానికి మధ్య ఉన్న దూరం రెట్టింపు అయితే దాని ఆవర్తన కాలం ఎన్ని రెట్లు అవుతుంది? సమాధానాలు 1) 4 రెట్లు 2) 8 సంవత్సరాలు 3) 2శీ2 రెట్లు మూడో విభాగమైన అప్లయిడ్ సైన్స నుంచి అత్యధిక ప్రశ్నలు వస్తాయి. ఫిజిక్స్‌లో సుమారు తొంభై శాతం ప్రశ్నలు ఈ విభాగం నుంచే ఉంటాయి. దీంట్లో భాగంగా మౌలికాంశాలతో పాటు వివిధ ధర్మాలు, నియమాలు, సూత్రాలు, సిద్ధాంతాలు, వాటి అనువర్తనాలపై ప్రశ్నలు అడుగుతారు. ఉదా: కాంతి ధర్మాలు, అయస్కాంతాల సాధారణ ధర్మాలు, ధ్వని ధర్మాలు. నియమాలకు సంబంధించి న్యూటన్ గమన నియమాలు, కెప్లర్ గ్రహగమన నియమాలు, న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమం, ఆర్కిమెడిస్ సూత్రం, ప్లవన సూత్రం, బెర్నౌలీ సిద్ధాంతం, ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతం, పాస్కల్ సూత్రం మొదలైనవాటిని క్షుణ్నంగా చదవాలి. వీటి ఆధారంగా నిజ జీవితంలో జరిగే సంఘటనల్ని విశ్లేషించుకోవాలి. అభ్యర్థి సబ్జెక్ట్‌కు సంబంధించిన విషయ పరిజ్ఞానాన్ని పరిశీలించడంతో పాటు జనరల్ సైన్సలో ప్రశ్నలను అడగడంలో ఉన్న మరో ముఖ్య ఉద్దేశం విశ్లేషణా సామర్థ్యాన్ని పరీక్షించడం. విషయాన్ని బట్టీపట్టడం కంటే అర్థం చేసుకుంటూ చదివినప్పుడే ఎలాంటి ప్రశ్నలు ఇచ్చినా సులభంగా సమాధానాలను గుర్తించవచ్చు. ఎక్కువగా ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలను చదవడం వల్ల నిర్మాణాత్మక పరిజ్ఞానం, సామర్థ్యం, తార్కిక విశ్లేషణ సాధ్యం కాదు. అందువల్ల ప్రధాన కాన్సెప్టులను క్షుణ్నంగా అధ్యయనం చేయడం ప్రయోజనకరం. పాఠ్యాంశాలపై పట్టు సాధించిన తర్వాత సాధ్యమైనంత ఎక్కువగా ప్రశ్నలను సాధన చేయాలి. అభ్యర్థులు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని చదివితే మంచి మార్కులు సంపాదించవచ్చు. మాదిరి ప్రశ్నలు 1. కిందివాటిలో ఒక వస్తువు భారం దేంట్లో గరిష్ఠంగా ఉంటుంది? 1) శూన్య ప్రదేశం 2) హైడ్రోజన్ 3) గాలి 4) నీరు 2. నీటిలో తేలియాడుతున్న వస్తువు దృశ్యభారం ఎంత? 1) శూన్యం 2) వస్తువు నిజ భారంలో సగం 3) వస్తువు నిజ భారానికి సమానం 4) వస్తువు నిజ భారానికి రెట్టింపు 3. ఒక ప్రవాహిలో మునిగి ఉన్న వస్తువు ఘ.ప. 200 ఘనపు సెంటీమీటర్లు. అయితే అది ఎంత ఘనపరిమాణం ఉన్న నీటిని స్థానభ్రంశం చెందిస్తుంది? 1) 0 2) 50 ఘ.సెం.మీ. 3) 200 ఘ.సెం.మీ. 4) 400 ఘ.సెం.మీ 4. ఒక ప్రవాహిలో వేలాడుతున్న వస్తువు దృశ్యభారం ఎంత? 1) దాని నిజ భారానికి రెట్టింపు 2) నిజ భారానికి సమానం 3) నిజ భారంలో సగం 4) శూన్యం 5. ఆకుపచ్చని కాంతిలో పసుపు పచ్చని పుష్పం ఏ వర్ణంలో కనిపిస్తుంది? 1) తెలుపు 2) నలుపు 3) ఆకుపచ్చ 4) పసుపు పచ్చ 6. కిందివాటిలో ప్రాథమిక వర్ణం కానిది? 1) ఎరుపు 2) ఆకుపచ్చ 3) పసుపుపచ్చ 4) నీలం 7. అణు రియాక్టర్లలో మితకారిణి విధి ఏమిటి? 1) చర్యా వేగాన్ని మార్చడం 2) న్యూట్రాన్ల వేగాన్ని పెంచడం 3) న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడం 4) ఉష్ణోగ్రతను తగ్గించడం 8. భారజలం రసాయనిక నామం? 1) డై హైడ్రోజన్ ఆక్సైడ్ 2) హైడ్రోజన్ డయాక్సైడ్ 3) డ్యుటీరియం ఆక్సైడ్ 4) హైడ్రోజన్ పెరాక్సైడ్ 9. ఒకే సైజు, ఒకే ఆకృతిలో ఉన్న అ, ఆ అనే రెండు లోహపు డబ్బాలను ఒకే పదార్థంతో తయారు చేశారు. వాటిని 40ఇ ఉష్ణోగ్రత వద్దనున్న నీటితో పూర్తిగా నింపి ఒకదాన్ని వేడిచేసి, మరో దాన్ని చల్లారిస్తే ఆ రెండింటిలో నీటి ఘనపరిమాణం ఏమవుతుంది? 1) అలో పెరిగి ఆలో తగ్గుతుంది 2) అలో తగ్గి ఆలో పెరుగుతుంది 3) రెండింటిలో పెరుగుతుంది 4) రెండింటిలో తగ్గుతుంది 10. పీడనం పెరగడం వల్ల నీటి భాష్పీభవన స్థానం? 1) పెరుగుతుంది 2) తగ్గుతుంది 3) స్థిరంగా ఉంటుంది 4) పెరగవచ్చు లేదా తగ్గవచ్చు 11. కిందివాటిలో డయా అయస్కాంత పదార్థం కానిది? 1) బంగారం 2) వజ్రం 3) కోబాల్ట్ 4) ఆల్కహాల్ 12. మాక్ నంబర్ దేనికి సంబంధించింది? 1) ఉష్ణోగ్రత 2) వేగం 3) పీడనం 4) భారం 13. ఒక ట్యూబ్ లైట్ 40 వాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దాన్ని ఎన్ని గంటలపాటు వెలిగిస్తే 1 యూనిట్ కరెంట్ వినియోగం అవుతుంది? 1) 40 2) 25 3) 24 4) 10 14. ఉష్ణోగ్రతతో నీటి స్పర్శ కోణం? 1) పెరుగుతుంది 2) తగ్గుతుంది 3) స్థిరంగా ఉంటుంది 4) స్పర్శ కోణం ఉష్ణోగ్రతపై ఆధారపడదు 15. భూస్థావర ఉపగ్రహాలు భూ ఉపరితలం నుంచి ఎంత ఎత్తు వద్ద తిరుగుతాయి? 1) 1000 కి.మీ. 2) 3200 కి.మీ. 3) 3600 కి.మీ. 4) 36,000 కి.మీ. 16. భూ ఉపరితలం నుంచి పైకి వెళ్లేకొద్ది పీడనం? 1) తగ్గుతుంది 2) పెరుగుతుంది 3) స్థిరంగా ఉంటుంది 4) పెరగవచ్చు లేదా తగ్గవచ్చు 17. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిందెవరు? 1) టాలమీ 2) కోపర్నికస్ 3) గెలీలియో 4) న్యూటన్ 18. భూమిపై ప్రదేశం లేదా విశ్వంలోని ఏదైనా స్థానం ఆధారంగా ఒక వస్తువు ద్రవ్యరాశి, భారానికి సంబంధించి కిందివాటిలో సరైంది ఏది? 1) ద్రవ్యరాశి, భారం రెండూ స్థిరంగా ఉంటాయి 2) ద్రవ్యరాశి, భారం రెండూ మారతాయి 3) ద్రవ్యరాశి స్థిరంగా ఉంటుంది కానీ భారం మారుతుంది 4) భారం స్థిరంగా ఉంటుంది కానీ ద్రవ్యరాశి మారుతుంది 19. 1 కేజీ, 10 కేజీల ద్రవ్యరాశి ఉన్న రెండు వస్తువులను సమాన వేగాలతో నిటారుగా పైకి విసిరితే, ఆ రెండింటిలో ఏది గరిష్ఠ ఎత్తుకు చేరుతుంది? 1) 1 కేజీ ద్రవ్యరాశి ఉన్న వస్తువు 2) 10 కేజీ ద్రవ్యరాశి ఉన్న వస్తువు 3) రెండూ సమాన గరిష్ఠ ఎత్తునకు చేరుకుంటాయి 4) వాటి గరిష్ఠ ఎత్తు అనేది పైకి విసిరిన సాధారణ వేగంపై ఆధారపడి ఉంటుంది 20. కాలానికి ప్రామాణిక ప్రమాణం ఏది? 1) సెకన్ 2) నిమిషం 3) గంట 4) రోజు సమాధానాలు 1) 1; 2) 1; 3) 3; 4) 4; 5) 2; 6) 3; 7) 3; 8) 3; 9) 3; 10) 1; 11) 3; 12) 2; 13) 2; 14) 2; 15) 4; 16) 1; 17) 2; 18) 3; 19) 3; 20) 1