గూప్‌–1 ప్రిలిమ్స్‌లో 5 ప్రశ్నలు రద్దు | TSPSC Has Released The Final Key Of Goop-1 Prelims Exam | Sakshi
Sakshi News home page

గూప్‌–1 ప్రిలిమ్స్‌లో 5 ప్రశ్నలు రద్దు

Published Wed, Nov 16 2022 1:42 AM | Last Updated on Wed, Nov 16 2022 2:52 AM

TSPSC Has Released The Final Key Of Goop-1 Prelims Exam - Sakshi

గత నెల 6న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష తుది ‘కీ’ని టీఎస్‌పీఎస్సీ మంగళవారం విడుదల చేసింది.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 503 గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీకి గత నెల 6న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష తుది ‘కీ’ని టీఎస్‌పీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. అభ్యంతరాల పరిశీలనకు ఏర్పాటైన నిపుణుల కమిటీ పిలిమ్స్‌లోని 150 ప్రశ్నల్లో ఐదు ప్రశ్నలను రద్దు చేయాలని, మూడు ప్రశ్నలకు ఆప్షన్లలో మార్పులు చేయాలని సిఫార్సు చేయడంతో ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు కమిషన్‌ వెల్లడించింది. ఈ విషయంలో ఇకపై ఎలాంటి అభ్యంతరాలకు తావులేదని తేల్చిచెప్పింది.

ఈ ప్రశ్నలు రద్దు...
గ్రూప్‌–1 ప్రిలిమినరీ పరీక్ష పేపర్‌ కోడ్‌–22040 ‘కీ’ని పరిగణనలోకి తీసుకుంటే ఇందులో 29, 48, 69, 82, 138 ప్రశ్నలు రద్దయ్యాయి. దీంతో వాటిని మూల్యాంకనంలో పరిగణనలోకి తీసుకోరు. ప్రిలిమినరీ పరీక్షలో ఇచ్చిన 150 మార్కులకుగాను 145 ప్రశ్నలనే పరిగణిస్తారు. మొత్తం మార్కులను 145 ప్రశ్నలకు విభజిస్తారు. ఈ ప్రశ్నల్లో సరైన జవాబులు రాసిన వారికి విభజించిన (మూడో డెసిమల్‌ వరకు) మార్కుల ప్రకారం లెక్కిస్తారు. ఉదాహరణకు ఒక అభ్యర్థి 145 ప్రశ్నల్లో 120 ప్రశ్నలకు సరైన జవాబులు రాసినట్లయితే ఒక్కో ప్రశ్నకు 150/145 చొప్పున 120 జవాబులకు 124.137 మార్కులు నిర్దేశిస్తారు.

మూడు ప్రశ్నలకు మారిన ఆప్షన్లు...
ప్రిలిమినరీ పరీక్షలో 3 ప్రశ్నలకు జవాబులు మారాయి. 57వ ప్రశ్నకు జవాబు 1, 107వ ప్రశ్నకు జవాబులు 1, 2, 3, 4, చివరగా 133వ ప్రశ్నకు జవాబు 1, 2గా నిపుణుల కమిటీ సూచించగా కమిషన్‌ ఖరారు చేసింది. అతిత్వరలో మెయిన్‌ పరీ క్షలకు ఎంపికయ్యే అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీ ఎస్సీ విడుదల చేయనున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి: ఆ విద్యార్థులకే నిజాం కాలేజీ కొత్త హాస్టల్‌: మంత్రి సబితా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement