రేపే గ్రూప్‌1 ప్రిలిమ్స్‌.. అభ్య‌ర్థులు ఈ విష‌యాలు మ‌ర్చిపోకండి Group 1 Prelims exam on June 9 candidates should know this things. Sakshi
Sakshi News home page

రేపే గ్రూప్‌1 ప్రిలిమ్స్‌.. అభ్య‌ర్థులు ఈ విష‌యాలు మ‌ర్చిపోకండి

Published Sat, Jun 8 2024 11:30 AM | Last Updated on Sat, Jun 8 2024 11:57 AM

Group 1 Prelims exam on June 9 candidates should know this things

 సాక్షి, హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(టీఎస్‌పీఎస్సీ) గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను  జూన్ 9న నిర్వహించనుంది.. రేపు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష జరగనుంది. అభ్యర్థులు ఉదయం 10 గంటలలోపు ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు. పది తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని పేర్కొన్నారు.  పది తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని అధికారులు పేర్కొన్నారు.

మొత్తం 897 పరీక్ష కేంద్రాల్లో 4.03 లక్షలమంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.   ప‌రీక్ష రాసే అభ్యర్థులకు కీలక మార్గదర్శకాలను జారీ చేశారు.

  • అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు బూట్లు ధరించకుడదు, చప్పల్స్ మాత్రమే వేసుకోవాలి

  • బయోమెట్రిక్ వేలిముద్ర వివరాల రికార్డింగ్‌ ఉన్న క్రమంలో అభ్యర్థులు తమ వేళ్లపై మెహెందీ లేదా ఏదైనా ఇతర ప్రింటెడ్ రంగులు ఉంచుకోరాదు

  • కాలిక్యులేటర్‌లు, పేజర్‌లు, సెల్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, పెన్ డ్రైవ్‌లు, బ్లూటూత్ పరికరాలు, గడియారాలు తీసుకురావడం నిషేధం

  • లాగ్ బుక్‌లు, లాగ్ టేబుల్‌లు, వాలెట్‌లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, పౌచ్‌లు, రైటింగ్ ప్యాడ్‌లు, నోట్స్, చార్ట్‌లు, లూజ్ షీట్‌లు, ఆభరణాలు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు కూడా తీసుకురావద్దు

  • ఐడీకార్డు, హాల్ టిక్కెట్ తప్పనిసరిగా తెచ్చుకోవాలని, హాల్ టికెట్ ఫోటో సరిగా లేకుంటే మరొక ఫోటో తెచ్చుకోవాలని అధికారులు సూచించారు

  • ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు

TSPSC గ్రూప్ 1 సర్వీస్‌లోని 563 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. దీనిలో డిప్యూటీ కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, జిల్లా పంచాయితీ రాజ్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ వంటి పోస్టులుంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement