Group-1 Preliminary
-
గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 563 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి జూన్ 9న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా తెలంగాణ పబ్లిక్‌సర్విస్ కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంది. మెయిన్ పరీక్షలకు అభ్యర్థుల ఎంపిక 1:50 నిష్పత్తిలో చేపట్టినట్టు టీజీపీఎస్సీ తెలిపింది. 563 ఉద్యోగాలకుగాను 31,382 మంది అభ్యర్థులు మెయిన్ పరీక్షలకు ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, మల్టీజోన్లు, కమ్యూనిటీ రిజర్వేషన్ల వారీగా అభ్యర్థుల ఎంపిక చేపట్టారు. గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి మార్కులు, కటాఫ్ మార్కులు తదితర వివరాలను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు టీజీపీఎస్సీ కమిషన్ కార్యదర్శి ఇ.నవీన్‌నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. హాల్‌టికెట్లు పరీక్షలకు వారంరోజుల ముందు కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు. టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఫైనల్ కీ కూడా జూన్ 9న నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ఫైనల్ కీని తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ ఆదివారం వెబ్సైట్లో అందుబాటులో పెట్టింది. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో ఈ పరీక్ష నిర్వహించిన కమిషన్... ప్రిలిమినరీ కీతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్‌ను అభ్యర్థుల లాగిన్‌లో అందుబాటులో ఉంచింది.ఆ తర్వాత అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన కమిషన్..విషయ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి వారితో చర్చించి తుది కీని తయారు చేసింది. ఈ కీని వెబ్సైట్లో అందుబాటులో పెట్టినట్టు కమిషన్ కార్యదర్శి ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల స్కాన్డ్ ఓఎంఆర్ పత్రాలు సైతం కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. -
గ్రూప్–1 పరీక్ష రాసి వస్తుండగా విషాదం
ధారూరు: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన జూనియర్ పంచాయతీ కార్యదర్శి తిరుగుప్రయాణంలో దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన మండల పరిధిలోని తాండూరు–హైదరాబాద్ ప్రధాన మార్గంలో గట్టెపల్లి బస్‌స్టేజీ సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. ధారూరు ఎస్ఐ వేణుగోపాల్‌గౌడ్ తెలిపిన ప్రకారం.. బొంరాస్‌పేట మండలం బొట్లోనితండా పంచాయతీ పరిధిలోని దేవులానాయక్ తండాకు చెందిన బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు నెహ్రూనాయక్‌కు, దుద్యాల మండలం ఈర్లపల్లి తండాకు చెందిన సుమిత్రాబాయి(29) తో మూడేళ్ల క్రితం వివాహమైంది. సుమిత్రాబాయి యాలాల మండలం అచ్యుతాపూర్ జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తోంది. వీరిద్దరూ ప్రిలిమినరీ పరీక్ష రాసి తండాకు తిరిగి వెళ్తున్నారు. ధారూరు మండలం గట్టెపల్లి సమీపంలో వర్షం కురుస్తుండడంతో సుమిత్రబాయి గొడుగు తెరిచి పట్టుకుంది. ఈ క్రమంలో బలమైన ఈదురుగాలులు వీయడంతో గొడుగు గాలికి ఉల్టా అవ్వడంతో బైక్ అదుపుతప్పింది. సుమిత్రాబాయి కిందపడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. ఆమెను వెంటనే తాండూరు జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షకు 74% హాజరు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్‌సర్విస్ కమిషన్ ఆదివారం నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 3.02లక్షల మంది మాత్రమే హాజరైనట్టు టీజీపీఎస్సీ ప్రాథమికంగా వెల్లడించింది. క్షేత్రస్థాయి నుంచి వచ్చే లెక్కల తర్వాత హాజరుశాతంపై స్పష్టత వస్తుందని కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రిలిమినరీ పరీక్ష కీ అతి త్వరలో కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని, అభ్యర్థులు వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా చూడాలని సూచించారు. ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి గ్రూప్–1 ప్రధాన పరీక్షలు నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి వెల్లడించారు.సులభతరంగా ప్రశ్నలు... ప్రిలిమినరీ పరీక్షలో వచ్చిన ప్రశ్నలు సులభతరంగా ఉన్నట్టు అభ్యర్థులు చెబుతున్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ మొదటిసారిగా చేపడుతోంది. రెండేళ్ల క్రితం నోటిఫికేషన్ జారీ చేసి, రెండుసార్లు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. వివిధ కారణాల వల్ల వాటిని కమిషన్ రద్దు చేసింది. గత ప్రశ్నపత్రంతో పోలిస్తే తాజాగా వచ్చిన ప్రశ్నలు సులభంగా, కొన్ని అత్యంత సులభంగా ఉన్నాయని పలువురు అభ్యర్థులు చెప్పారు. ఈ క్రమంలో గతంతో పోలిస్తే కటాఫ్ మార్కులు పెరిగే అవకాశం లేకపోలేదు. మధ్యలో బయోమెట్రిక్ హాజరు స్వీకరణ పరీక్ష ఉదయం 10.30గంల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగింది. పరీక్షకు హాజరయ్యే అభర్థులు కనీసం గంట ముందు రావాలని, బయోమెట్రిక్ హాజరు స్వీకరణ ఉంటుందని కమిషన్ తెలిపింది. పరీక్షకు ముందు లేదా పరీక్ష తర్వాత హాజరు స్వీకరణ చేపట్టాల్సి ఉండగా, చాలాచోట్ల అధికారులు పరీక్షకు మధ్యలో బయోమెట్రిక్ హాజరు స్వీకరించారు.సరిగ్గా ప్రశ్నలు చదివి జవాబులు ఇచ్చే సమయంలో బయోమెట్రిక్ హాజరు స్వీకరణ ప్రక్రియ చిర్రెత్తించిందని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల పరీక్షకేంద్రాలకు రవాణా సౌకర్యం సరిగ్గా లేకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడినట్టు చెప్పారు. నగర శివారు ప్రాంతాల్లోని చాలా పరీక్ష కేంద్రాలు ప్రధానరహదారికి లోపలికి ఉండడం..ఆదివారం కావడంతో ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలు సైతం దొరక్క అవస్థలు పడినట్టు వాపోయారు. సీసీ కెమెరాల ద్వారా పరిశీలన టీజీపీఎస్సీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ యూనిట్(సీసీకెమెరా) ద్వారా పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించినట్టు నవీన్ నికోలస్ తెలిపారు. పరీక్ష పక్కాగా నిర్వహించామని, నిర్వహణలో కీలకపాత్ర పోషించిన కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బందికి కమిషన్ తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మద్యంమత్తులో గ్రూప్–1 విధులకు..- కరీంనగర్ జిల్లాలో రెవెన్యూ ఉద్యోగి నిర్వాకం తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తించే అన్వర్ మీర్జా పర్వేజ్‌బేగ్‌కు తిమ్మాపూర్‌లోని జ్యోతిష్మతి ఇంజినీరింగ్ కళాశాల బీ–వింగ్‌లో గ్రూప్–1 పరీక్ష విధులు కేటాయించారు. మద్యం తాగి విధులకు హాజరయ్యాడు. విధి నిర్వహణలో అనుచితంగా ప్రవర్తించడంతో తోటి సిబ్బంది ఎల్ఎండీ ఎస్సైకి ఫోన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై చేరాలు పరీక్షకేంద్రం వద్దకు వెళ్లి అన్వర్ మీర్జాను అదుపులోకి తీసుకున్నారు. బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షించగా.. రీడింగ్ 173 వచ్చింది. దీంతో అతడిని విధుల నుంచి తప్పించారు. -
రేపే గ్రూప్1 ప్రిలిమ్స్.. అభ్యర్థులు ఈ విషయాలు మర్చిపోకండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9న నిర్వహించనుంది.. రేపు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పరీక్ష జరగనుంది. అభ్యర్థులు ఉదయం 10 గంటలలోపు ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు. పది తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని పేర్కొన్నారు. పది తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని అధికారులు పేర్కొన్నారు.మొత్తం 897 పరీక్ష కేంద్రాల్లో 4.03 లక్షలమంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష రాసే అభ్యర్థులకు కీలక మార్గదర్శకాలను జారీ చేశారు.అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు బూట్లు ధరించకుడదు, చప్పల్స్ మాత్రమే వేసుకోవాలిబయోమెట్రిక్ వేలిముద్ర వివరాల రికార్డింగ్ ఉన్న క్రమంలో అభ్యర్థులు తమ వేళ్లపై మెహెందీ లేదా ఏదైనా ఇతర ప్రింటెడ్ రంగులు ఉంచుకోరాదుకాలిక్యులేటర్లు, పేజర్లు, సెల్ఫోన్లు, టాబ్లెట్లు, పెన్ డ్రైవ్‌లు, బ్లూటూత్ పరికరాలు, గడియారాలు తీసుకురావడం నిషేధంలాగ్ బుక్‌లు, లాగ్ టేబుల్లు, వాలెట్లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, పౌచ్‌లు, రైటింగ్ ప్యాడ్లు, నోట్స్, చార్ట్‌లు, లూజ్ షీట్లు, ఆభరణాలు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు కూడా తీసుకురావద్దుఐడీకార్డు, హాల్ టిక్కెట్ తప్పనిసరిగా తెచ్చుకోవాలని, హాల్ టికెట్ ఫోటో సరిగా లేకుంటే మరొక ఫోటో తెచ్చుకోవాలని అధికారులు సూచించారుఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారుTSPSC గ్రూప్ 1 సర్వీస్‌లోని 563 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. దీనిలో డిప్యూటీ కలెక్టర్, జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, జిల్లా పంచాయితీ రాజ్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ వంటి పోస్టులుంటాయి. -
గ్రూప్–1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: గ్రూప్–1 ప్రిలిమ్స్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) విడుదల చేసింది. మెయిన్స్‌కు 4,496 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరికి మెయిన్స్ పరీక్షలను సెప్టెంబర్ 2–9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ శనివారం తెలిపారు. మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలో 4,496 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. కేవలం 26 రోజుల్లోనే మొత్తం ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు వెల్లడించడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన 81 గ్రూప్–1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ గతేడాది డిసెంబర్ 8న నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులకు 3 నెలలు సమయమిచ్చి ప్రిలిమ్స్‌ను మార్చి 17న రాష్ట్రంలోని 18 జిల్లాల్లో నిర్వహించగా, 91,463 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరికి మరో ఐదున్నర నెలల సమయం ఇచ్చి సెప్టెంబర్‌లో మెయిన్స్ నిర్వహిస్తారు. నోటిఫికేషన్లో పేర్కొన్న 81 పోస్టులకు అనంతరం మరో 8 పోస్టులను చేర్చడంతో గ్రూప్–1 పోస్టుల సంఖ్య 89కి పెరిగింది. ఇటీవల గ్రూప్–2 ఫలితాలను వెల్లడించిన ఏపీపీఎస్సీ 1:100 నిష్పత్తిలో 905 పోస్టులకు 92,250 మంది అభ్యర్థులను మెయిన్స్ కోసం ఎంపిక చేసింది. చరిత్రలో ఇంత మంది అభ్యర్థులకు అవకాశం కల్పించడం ఇదే తొలిసారి. ఫలించని ఎల్లో బ్యాచ్ వ్యూహం మార్చి 17న నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను అడ్డుకునేందుకు చంద్రబాబు బృందం చేయని ప్రయత్నం లేదు. దీనికోసం రాష్ట్రానికి ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో పరీక్షను వాయిదా వేయాలని కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేయించారు. ఈ ప్రయత్నం కూడా ఫలించకపోయేసరికి బాబుకు దిక్కుతోచలేదు. చివరికి 2018 గ్రూప్–1 పోస్టుల భర్తీపై ఎన్నోసార్లు ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు వేసి, ఓడిపోయిన అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఏపీపీఎస్సీ నిర్వహించిన 2018 గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని పరీక్షను రద్దు చేయమని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుతో చంద్రబాబు చెలరేగిపోయారు. పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ మీడియాకు స్క్రీన్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. గత మూడేళ్లల్లో ఏపీపీఎస్సీ నిర్వహించిన అన్ని పరీక్షలను సకాలంలో నిర్వహించి, ముందే ప్రకటించిన షెడ్యూల్ మేరకు పోస్టులను భర్తీ చేసింది. అయినప్పటికీ ఏపీపీఎస్సీ ఇచ్చిన పలు నోటిఫికేషన్లు, పోస్టుల భర్తీని అడ్డుకునేందుకు చంద్రబాబు బృందం చేయని ప్రయత్నమంటూ లేదు. గత ఫిబ్రవరిలో గ్రూప్–2 ప్రిలిమ్స్‌ను అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేశారు. అప్పటికే తన బృందంతో కేసులు వేయించి పరీక్షను రద్దు చేయించాలని యత్నించారు. ఆ చిక్కులను అధిగమించి ఏపీపీఎస్సీ ఫిబ్రవరి 25న గ్రూప్ 2 ప్రిలిమ్స్‌ను నిర్వహించింది. తాజాగా గ్రూప్–1 విషయంలోనూ తన కుట్రలు ఫలించకపోవడంతో బాబు కంగుతిన్నారు. -
AP: గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
ఎన్టీఆర్, సాక్షి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించింది. మార్చి 27వ తేదీన ప్రిలిమ్స్ నిర్వహించిన ఏపీపీఎస్సీ.. రికార్డు స్థాయిలోనే 27 రోజుల్లో ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. గ్రూప్ వన్‌కి మొత్తం 1,48,881 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకున్నారు. పరీక్ష రాసిన వాళ్ల నుంచి 4,496 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. కిందటి ఏడాది డిసెంబర్ 08వ తేదీన గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో మొత్తం 81 Group 1 పోస్టులను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 02, 09 తేదీల మధ్య మెయిన్స్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని ప్రెస్ నోట్లో ఏపీపీఎస్సీ పేర్కొంది. ఫలితాల కోసం క్లిక్ చేయండి పోస్టుల వివరాలివే.. ఏపీ సివిల్ సర్వీస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 9; ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ 18; డీఎస్పీ (సివిల్) 26; రీజనల్ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్ 6; కోఆపరేటివ్ సర్వీసెస్‌లో డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు 5; జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ 4; జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 3; అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ అధికారి పోస్టులు 3; అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 2; జైళ్ళ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ II, అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. -
సుప్రీం ఏం చెబుతుందో!
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. ఏడాదిన్నర సన్నద్ధత అంతా వృథా అయిపోతుందా?, ఎన్నో ఆశలతో గ్రూప్–1 కొలువు కోసం చేసిన ప్రయత్నాలు మళ్లీ మొదటికి వస్తాయా? అనే ఆందోళన నెలకొంది. మొత్తం మీద రెండోసారి రాసిన పరీక్షను హైకోర్టు రద్దు చేయడమే ఇందుకు కారణం. ప్రశ్నపత్రాల కుంభకోణం నేపథ్యంలో తొలిసారి ప్రభుత్వం ఈ పరీక్షను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా హైకోర్టు తాజా తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని నిర్ణయించిందనే సమాచారం ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఊరటనిస్తోంది. అప్పుడలా..ఇప్పుడిలా..! రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి గతేడాది ఏప్రిల్‌లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది అక్టోబర్ 16న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన కమిషన్ కేటగిరీల జాబితా తయారు చేసి 1:50 నిష్పత్తిలో మెయిన్‌కు అర్హుల జాబితాను ప్రకటించి పరీక్ష తేదీలు సైతం వెల్లడించింది. అయితే టీఎస్పీఎస్సీ కార్యాలయ పరిధిలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరులో ప్రశ్నపత్రాల కుంభకోణం వెలుగు చూసింది. కమిషన్ సిబ్బంది కొందరు వివిధ పరీక్షల ప్రశ్నపత్రాలు బయటకు లీక్ చేశారనే ఆరోపణలతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తులో అక్రమాలు వెలుగు చూడడంతో టీఎస్పీఎస్సీ వరుసగా వివిధ పరీక్షలను రద్దు చేసింది. ఈ క్రమంలోనే గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షను సైతం రద్దు చేసింది. గత జూన్ 11వ తేదీన తిరిగి ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహించింది. రెండోసారి పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరినీ అనుమతించింది. రెండోసారి 2,33,248 మంది అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష రాశారు. అయితే రెండోసారి నిర్వహించిన పరీక్షలను కమిషన్ అత్యంత లోపభూయిష్టంగా నిర్వహించిందంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి కమిషన్ నిర్లక్ష్యాన్ని తప్పుబట్టారు. పరీక్షను రద్దు చేస్తూ ఈనెల 23న తీర్పు ఇచ్చారు. దీంతో ఎంతకాలంగానే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. కాగా దీనిపై టీఎస్పీఎస్సీ అప్పీల్‌కు వెళ్లింది. పరీక్ష నిర్వహణలో టీఎస్పీఎస్సీ నిర్లక్ష్య వైఖరి వల్లే గందరగోళం నెలకొందంటూ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం సైతం స్పష్టం చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థిoచింది. దీంతో అభ్యర్థులు మరింత ఆవేదనకు గురయ్యారు. అయితే దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించినట్లు సమాచారం. మళ్లీ చిగురిస్తున్న ఆశలు హైకోర్టు తీర్పు తుది కాపీ రాగానే వచ్చేవారంలో టీఎస్పీఎస్సీ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. దీంతో ఉద్యోగాల కోసం ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. అయితే సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది, ఏ విధమైన తీర్పు వెలువడుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సర్వోన్నత న్యాయస్థానంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలు బలంగా విన్పించాలని, మళ్లీ పరీక్ష నిర్వహించే పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్త వహించాలని అభ్యర్థులు కోరుతున్నారు. గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ, ఆ తర్వాత గాంధీ జయంతి నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వరుస సెలవులున్నాయి. కాగా సుప్రీంకోర్టు తీర్పుపైనే గ్రూప్–1 పరీక్ష భవితవ్యం ఆధారపడి ఉంది. ఇతర గ్రూప్ పరీక్షలు కూడా ఉన్న నేపథ్యంలో గ్రూప్–1 మళ్లీ నిర్వహణ ప్రభుత్వానికి కూడా సవాలుగానే మారే అవకాశం ఉంది. -
గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు.. అప్పీల్‌కు వెళ్లిన టీఎస్పీఎస్సీ
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీఎస్పీఎస్సీ అప్పీలుకు వెళ్లింది. ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ ఈనెల 23న సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌ను టీఎస్పీఎస్సీ ఆశ్రయించింది. అత్యవసర విచారణకు లంచ్‌మోషన్ అనుమతి కోరింది. అయితే లంచ్‌మోషన్ పిటిషన్ విచారణకు నిరాకరించిన హైకోర్టు.. రేపు (మంగళవారం) విచారణ జరిపేందుకు హైకోర్టు డివిజన్ బెంచ్ అంగీకరించింది. కాగా జూన్ 11న నిర్వహించిన గ్రూప్ -1 ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ ఈ నెల 23న హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. వాస్తవానికి 11 ఏళ్ల తర్వాత గతేడాది అక్టోబరు 16న తొలిసారి ప్రిలిమ్స్ నిర్వహించారు. తరువాత ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం వెలుగుచూడటంతో కమిషన్ ఆ పరీక్షను రద్దు చేసింది. తిరిగి జూన్ 11న ప్రిలిమ్స్ నిర్వహించగా.. ఈ పరీక్షను కూడా రద్దు చేస్తున్నట్లు ఈనెల 23న హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలు ఇచ్చింది. దీంతో గ్రూప్-1 ప్రిలిమ్స్ రెండుసార్లు రద్దవడంతో ఇటు అభ్యర్థులతోపాటు కమిషన్లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. గ్రూప్1 పరీక్ష రద్దు కావడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. పదే పదే పరీక్షలు రద్దు చేస్తే ఎలా చదవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం వల్ల తమ జీవితాలు నాశనం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ స్పందించక పోవడంపై మండిపడుతూ.. వెంటనే టీఎస్పీఎస్సీ ఛైర్మెన్ జనార్దన్ రెడ్డిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేయాలని కోరుతున్నారు. చదవండి: కాంగ్రెస్‌లో చేరాలని డిసైడ్ అయ్యా: మైనంపల్లి -
హైకోర్టు సీరియస్..గ్రూప్ 1 పరీక్ష రద్దు..
-
ప్రశ్నపత్రాల లీకేజీ: టీఎస్పీఎస్సీ పరీక్షలన్నీ రీషెడ్యూల్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్టేట్ పబ్లిక్ సర్వి స్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించనున్న ఉద్యోగ అర్హత పరీక్షల తేదీల్లో మార్పులు జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే జరిగిన నాలుగు పరీక్షలను రద్దు చేసిన కమిషన్.. మరో రెండు పరీక్షలను నిర్వహించకుండానే వాయిదా వేసింది. వీటితోపాటు వచ్చే నెలలో నిర్వహించే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను కొత్తగా తయారు చేసేందుకు చర్యలు చేపట్టారు. వీటన్నింటి క్రమంలో ఇప్పటికే నిర్దేశించిన తేదీల్లో ఉద్యోగ అర్హత పరీక్షల నిర్వహణ సాధ్యమయ్యే పరిస్థితి లేదని.. కొంతకాలం వాయిదా పడే అవకాశం ఉందని అధికారవర్గాలు చెప్తున్నాయి. దీనిపై టీఎస్పీఎస్సీ నుంచి త్వరలోనే ప్రకటన వెలువడవచ్చని అంటున్నాయి. కొత్త ప్రశ్నపత్రాల రూపకల్పన కోసం.. టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో పరీక్షల నిర్వహణ గందరగోళంగా మారింది. గతేడాది అక్టోబర్‌లో నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీతోపాటు ఏఈఈ, డీఏఓ, ఏఈ అర్హత పరీక్షలను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. ఈ నెల 12న జరగాల్సిన టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్.. 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను వాయిదా వేసింది. ఈ ఆరు పరీక్షలను తిరిగి నిర్వహించాలి. మరో తొమ్మిది రకాల పోస్టులకు సంబంధించిన పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. లీకేజీ, రద్దు, వాయిదాల క్రమంలో ప్రశ్నపత్రాలను కొత్తగా రూపొందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నిపుణులతో సంప్రదింపులు, కొత్త ప్రశ్నపత్రాల తయారీ, అందులో ఇప్పటికే రూపొందించిన ప్రశ్నపత్రాలతో సంబంధం లేకుండా ప్రశ్నల ఎంపిక, వివిధ దశల్లో ఆమోదం, పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు వంటి కార్యాచరణ అవసరం. ఇదంతా పూర్తయ్యేందుకు దాదాపు రెండు నెలల సమయం పడుతుందని అంచనా. రద్దయిన పరీక్షలను ముందుగా నిర్వహించాలంటే.. ఇప్పటికే నిర్దేశించిన ఇతర పరీక్షల తేదీల్లో మార్పులు చేయాల్సి రానుంది. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని భావించినా.. రద్దయిన, వాయిదా పడిన పరీక్షలకు ఇబ్బంది వస్తుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ పరీక్షల షెడ్యూళ్లలో మార్పులు చేసి.. కొత్త తేదీలను ప్రకటించాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నట్టు తెలిసింది. కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. గ్రూప్–1 మెయిన్స్‌కు తప్పని వాయిదా! గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసిన టీఎస్పీఎస్సీ.. ఈ ఏడాది జూన్ 11న తిరిగి నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ పరీక్ష నిర్వహణ, ఫలితాల ప్రకటన తర్వాత మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేసి.. మెయిన్స్ పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రకటించిన గ్రూప్–1 మెయిన్స్ తేదీలు దాదాపు రద్దయినట్లేనని అధికారులు చెప్తున్నారు. ప్రిలిమ్స్ ఫలితాల తర్వాత మెయిన్స్ షెడ్యూల్ విడుదల అవుతుందని అంటున్నారు. -
సూత్రధారి రాజశేఖరే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పబ్లిక్ సర్వి స్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్ష పేపర్ల లీకేజీ స్కామ్‌లో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వ్యవహారంలో కమిషన్ కార్యదర్శి వద్ద పీఏగా పని చేస్తున్న ప్రవీణ్‌కుమార్ సూత్రధారి అని ఇప్పటివరకు భావించగా.. అతడిని పథకం ప్రకారం ప్రేరేపించినది రాజశేఖరేనని అధికారులు గుర్తించినట్టు తెలిసింది. రాజశేఖర్‌కు రాజకీయ సంబంధాలు సైతం ఉండటంతో.. ఆ కోణంలోనూ దర్యాప్తు చేపట్టినట్టు సమాచారం. ఇక లీకేజీ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శుక్రవారం టీఎస్పీఎస్సీకి ప్రాథమిక నివేదికను అందించింది. మొత్తం ఐదు పరీక్షల పేపర్లు లీకైనట్టుగా గుర్తించినట్టు తెలిసింది. ముందస్తు ప్లాన్‌తోనే.. రాజశేఖర్ టీఎస్టీఎస్ నుంచి టీఎస్పీఎస్సీకి డిప్యుటేషన్‌పై రావడంలోనూ కుట్ర ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. పేపర్లపై కన్నేసిన రాజశేఖర్.. లీకేజీ కోసం ముందుగా ప్లాన్ చేసుకునే వచ్చాడని.. కార్యదర్శికి ప్రవీణ్ పీఏగా మారిన తర్వాత ప్లాన్ అమలు చేశాడని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రవీణ్‌తో సన్నిహితంగా ఉన్నాడని అంటున్నారు. సిస్టమ్ అడ్మిన్ అయిన రాజశేఖరే కస్టోడియన్ శంకరలక్ష్మి కంప్యూటర్ను హ్యాక్ చేసి, పేపర్లు తస్కరించాడని.. వాటిని ప్రవీణ్‌కు ఇచ్చి రేణుకతో అమ్మించాడని అనుమానిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్నీ రాజశేఖర్ ఇలానే చేజిక్కించుకుని ప్రవీణ్‌కు ఇచ్చి ఉంటాడని.. దాని ఆ«ధారంగా పరీక్ష రాయడంతోనే ప్రవీణ్‌కు 103 మార్కులు వచ్చి ఉంటాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రాజశేఖర్ పాత్ర కీలకం పేపర్ల లీకేజీపై సిట్ అధికారి, ఏసీపీ వెంకటేశ్వర్లు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో రాజకీయ నాయకుడైన రాజశేఖర్ పాత్ర కీలకంగా మారనుందని.. అతడే ప్రవీణ్‌తో కలిసి ఈ లీకేజ్ చేసినట్టుగా ఆధారాలు లభించాయని తెలిపారు. రాజశేఖర్ కొందరు రాజకీయ నాయకులతో కలిసి దిగిన ఫొటోలు లభ్యమయ్యాయని.. ఈ నేపథ్యంలో ఆయా రాజకీయ నేతల పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇక కస్టోడియన్ శంకరలక్ష్మి కంప్యూటర్ నుంచి మొత్తం ఐదు పేపర్లు తస్కరణకు గురయ్యాయని.. వాటిలో ఏయే పేపర్లు లీక్ అయ్యాయనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. గ్రూప్–1 ప్రిలిమ్స్ పేపర్ వ్యవహారంతోపాటు, ఆ పరీక్ష రాసిన ప్రవీణ్‌కు అన్ని మార్కులు రావడంపైనా దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రవీణ్ ఈ పరీక్ష పేపర్లను ఎవరెవరికి ఇచ్చాడన్నది ఆరా తీస్తున్నామ ని చెప్పారు. ప్రవీణ్, రాజశేఖర్ సహా నిందితుల ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని, ఆ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని తెలిపారు. పోలీసు కస్టడీకి నిందితులు ఈ కేసులో అరెస్టయిన తొమ్మిది మంది నిందితులను పోలీసు కస్ట డీకి ఇస్తూ నాంపల్లి కోర్టు శు క్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. శనివారం నుంచి 23వ తేదీ వ రకు పోలీసులు వారి ని ప్రశ్నించి.. ఈ వ్యవహారంలో అన్ని వివరాలను ఆరా తీయనున్నా రు. ఇదే సమయంలో ప్రవీణ్, రాజశేఖర్, శంకరలక్ష్యలను కలిపి విచారించి.. వాస్తవాలను వెలికితీయాలని అధికారులు నిర్ణయించారు. ఐడీ, పాస్వర్డ్ దొరికిందెలా? కస్టోడియన్ శంకరలక్ష్మి నోట్‌బుక్ నుంచి యూజర్ ఐడీ, పాస్వర్డ్స్ తస్కరించామని.. వాటి ఆధారంగానే ఆమె కంప్యూటర్ను యాక్సెస్ చేసి పరీక్ష పేపర్లు కాపీ చేసుకున్నామని అరెస్టు సమయంలో ప్రవీణ్, రాజశేఖర్ చెప్పారు. కానీ అధికారులు శంకరలక్ష్యని ప్రశ్నించగా.. తాను యూజర్ ఐడీ, పాస్‌వర్డ్స్‌ను ఎక్కడా రాసుకోలేదని చెప్పినట్టు తెలిసింది. దీనితో ఆమె నుంచి అధికారికంగా స్టేట్మెంట్ తీసుకోవడానికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. -
ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: గ్రూపు–1 ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (ఏపీపీఎస్సీ) శుక్రవారం ప్రకటించింది. ఈ నెల 8న ఇందుకు సంబంధించి రాతపరీక్షలు నిర్వహించారు. అయితే, ఏపీపీఎస్సీ చరిత్రలోనే రికార్డు వ్యవధిలో కేవలం 19 రోజుల్లో ఫలితాలు వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబరు 30న ప్రభుత్వం గ్రూపు–1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీచేయగా.. రాష్ట్రవ్యాప్తంగా 1,26,449 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 1,06,473 మంది హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో 87,718 మంది ఈనెల 8న రాతపరీక్షకు హాజరయ్యారు. మెరిట్ ఆధారంగా ఒక్కో పోస్టుకు 50 మంది అభ్యర్థుల చొప్పున మొత్తం 6,455 మందిని ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షలకు ఎంపిక చేస్తూ అందుకు సంబంధించిన ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. మరోవైపు.. ఏప్రిల్ 23 నుంచి వారం రోజులపాటు జరిగే మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను కూడా ఏపీపీఎస్సీ ప్రకటించింది. ప్రిలిమినరీ పరీక్షల తుది కీ వివరాలు ఠీఠీఠీ.pటఛి.్చp.జౌఠి.జీn వెబ్సైట్లో చూసుకోవచ్చని ఏపీపీఎస్సీ కార్యదర్శి జె. ప్రదీప్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేగంగా ఉద్యోగ నియామకాలకు సీఎం ఆదేశాలు ప్రభుత్వోద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యానికి లోనుకాకుండా నియామకాల ప్రక్రియ వేగంగా పూర్తికావాలని బోర్డు చైర్మన్‌కు సీఎం వైఎస్ జగన్ స్పష్టమైన సూచనలు చేశారని ఏపీపీఎస్సీ బోర్డు సభ్యులు సలాం బాబు ‘సాక్షి’కి తెలిపారు. ఏపీపీఎస్సీ చరిత్రలో ఇంత స్వల్ప వ్యవధిలో రాతపరీక్షల ఫలితాలు ప్రకటించడం ఎప్పుడూ జరగలేదని ఆయన వివరించారు. -
ఏపీ వ్యాప్తంగా ఇవాళ గ్రూప్–1 ప్రిలిమ్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–1 పోస్టుల భర్తీకి నేడు (ఆదివారం) ప్రిలిమినరీ పరీక్ష (స్క్రీనింగ్ టెస్ట్) జరగనుంది. పరీక్ష కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల్లోని 297 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 1,26,449 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఉదయం 10 గంటల నుంచి 12 వరకు పేపర్–1, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పేపర్–2 నిర్వహిస్తారు. ఒక్కో పేపర్లో 120 చొప్పున ప్రశ్నలుంటాయి. అభ్యర్థులు హాల్ టిక్కెట్లతోపాటు నిర్దేశిత గుర్తింపు కార్డును పరీక్ష కేంద్రాల వద్ద చూపించాలి. ఉదయం 9 గంటల నుంచి 9.30 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ కింద 9.45 గంటల వరకు అనుమతి ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి 1.30 వరకు పరీక్ష హాల్లోకి వెళ్లాలి. 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ కింద 1.45 గంటల వరకు అనుమతిస్తారు. ఆ తర్వాత ఎవరినీ అనుమతించరు. అభ్యర్థి దరఖాస్తులో బయోడేటా వివరాలను తప్పుగా పేర్కొని ఉంటే ఇన్విజిలేటర్ వద్ద అందుబాటులో ఉన్న నామినల్ డేటాను అప్డేట్ చేసుకోవాలి. అభ్యర్థికి ఇచ్చే ఓఎమ్మార్ సమాధాన పత్రం ఒరిజినల్, డూప్లికేట్ కాపీలుగా ఉంటుంది. పరీక్ష పూర్తయ్యాక అభ్యర్థి ఒరిజినల్ కాపీని ఇన్విజిలేటర్‌కు ఇచ్చి డూప్లికేట్ కాపీని తన వద్ద ఉంచుకోవాలి. ప్రాథమిక ‘కీ’ ఆదివారం రాత్రి లేదా సోమవారం విడుదల చేస్తారు. పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించడమే తమ లక్ష్యమని ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. -
AP: గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో కీలక మార్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–1 పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహిస్తున్న ప్రిలిమ్స్‌లో ఏపీపీఎస్సీ కొన్ని కీలక మార్పులు చేసింది. గ్రూప్–1లో పేపర్–1, పేపర్2గా ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలతో ఆఫ్‌లైన్ ఓఎమ్మార్ ఆధారిత పత్రాలతో పరీక్ష ఉదయం, మధ్యాహ్నం జరుగుతుంది. ఒక్కో పేపర్లో 120 చొప్పున ప్రశ్నలుంటాయి. ఉదయం 10 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. గతంలో లేనివిధంగా ప్రతి పరీక్ష కేంద్రంలో పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్లు, సూపరింటెండెంట్లే కాకుండా జిల్లాస్థాయి అధికారి ఒకరిని ప్రత్యేక పర్యవేక్షకునిగా నియమిస్తున్నారు. కోడింగ్ తప్పయితే.. ఈసారి ప్రిలిమ్స్ పరీక్షలో అభ్యర్థులు అనుసరించాల్సిన విధివిధానాలకు సంబంధించిన సవివర సమాచారం ప్రశ్నపత్రాలు, ఓఎమ్మార్ పత్రాల్లో ముద్రించి ఉంటుంది. వాటిని ముందుగా తెలుసుకునేందుకు వీలుగా వాటి నమూనాలను కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచారు. దీనివల్ల అభ్యర్థికి సమయం కలసి రావడంతోపాటు పరీక్షపై ఒక అవగాహన ఏర్పడుతుంది. ప్రశ్నపత్రం, ఓఎమ్మార్ బుక్లెట్లపై కోడింగ్ సిరీస్ నంబర్లు సరిసమానంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. తప్పు కోడింగ్ ఉంటే కనుక ఆ జవాబు పత్రాలు చెల్లుబాటు కావు. అభ్యర్థి తన రిజిస్టర్ నంబర్‌ను ప్రశ్నపత్రం బుక్లెట్పై నిర్ణీత స్థలంలోనే రాయాలి. అభ్యర్థులు హాల్‌టికెట్లతో పాటు చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును కూడా పరీక్ష కేంద్రాల వద్ద చూపించాలి. అభ్యర్థులు ఉదయం 9 గంటల నుంచి 9.30 వరకు పరీక్ష కేంద్రాల్లోకి ప్రవేశించాలి. ఆ తరువాత 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ కింద 9.45 వరకు మాత్రమే అనుమతిస్తారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 1.30 వరకు అనుమతిస్తారు. 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ కింద 1.45 వరకు అవకాశమిస్తారు. తరువాత ఎవరినీ అనుమతించరు. అభ్యర్థి దరఖాస్తు ఫారంలో బయోడేటా వివరాలను తప్పుగా సమర్పించి ఉంటే ఇన్విజిలేటర్ వద్ద అందుబాటులో ఉన్న నామినల్ రోల్స్‌లో డేటాను అప్డేట్ చేసుకోవచ్చు. ఓఎమ్మార్ సమాధాన పత్రంలో ఇన్విజిలేటర్ సంతకాన్ని తీసుకోవాలి. ఓఎమ్మార్‌లో ఒరిజినల్, డూప్లికేట్ పత్రాలు అభ్యర్థికి ఇచ్చే ఓఎమ్మార్ సమాధాన పత్రం రెండు కాపీలుగా ఉంటుంది. పరీక్ష పూర్తయిన తరువాత అభ్యర్థి పైన ఉండే ఒరిజినల్ కాపీని ఇన్విజిలేటర్‌కు అందించాలి. దిగువన ఉండే డూప్లికేట్ సమాధాన పత్రాన్ని తన రికార్డుకోసం తీసుకువెళ్లాలి. అభ్యర్థి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశ్నపత్రంపై సమాధానాలను ఎంపిక చేయరాదు. కేవలం ఓఎమ్మార్ సమాధాన పత్రంలో ఇచ్చిన స్థలంలో నీలం లేదా నలుపు బాల్‌పెన్నుతో బబుల్ చేయాలి. వైటనర్, మార్కర్, ఎరేజర్లను వినియోగించినా ఆ సమాధాన పత్రం చెల్లదు. అంధత్వం, రెండు చేతులకూ వైకల్యం, మస్తిష్క పక్షవాతం గల అభ్యర్థులకు స్క్రయిబర్లను అనుమతిస్తారు. ఈసారి అత్యధికంగా 714 మంది స్క్రయిబర్లు కావాలని దరఖాస్తు చేశారు. అభ్యర్థులు స్క్రయిబ్‌ను తామే తెచ్చుకుంటే వారికి ఆ పోస్టుకు నిర్ణయించిన అర్హత కన్నా తక్కువ అర్హత ఉండాలి. అభ్యర్థి తెచ్చుకున్న స్క్రయిబ్ అర్హుడు కాకుంటే చీఫ్ సూపరింటెండెంటు వేరొకరిని ఏర్పాటు చేస్తారు. ప్రిలిమ్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లు రాష్ట్రంలో గ్రూప్–1 క్యాడర్ పోస్టుల భర్తీకి ఈ నెల 8వ తేదీన ప్రిలిమనరీ (స్క్రీనింగ్ టెస్ట్) పరీక్ష కోసం పకడ్బందీ ఏర్పాట్లు పూర్తిచేశామని ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్ డి.గౌతమ్ సవాంగ్ తెలిపారు. గురువారం ఏపీపీఎస్సీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 18 జిల్లాల్లోని 297 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షకు 1,26,449 మంది హాజరవుతారన్నారు. పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించి సకాలంలో పూర్తిచేయాలన్నది కమిషన్ లక్ష్యమని చెప్పారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే.. యూపీఎస్సీ తరహాలోనే.. ఈ సారి గ్రూప్–1లో 92 పోస్టుల భర్తీకి వీలుగా నోటిఫికేషన్ ఇచ్చాం. గత గ్రూప్–1లో మిగిలిన 16 నుంచి 18 వరకు పోస్టులను క్యారీఫార్వర్డ్ కింద ఈ నోటిఫికేషన్‌కు జత చేసేందుకు కసరత్తు చేస్తున్నాం. న్యాయపరమైన సలహాల అనంతరం ప్రిలిమ్స్ నిర్వహించే 8వ తేదీలోపు వాటిని ప్రకటిస్తాం. యూపీఎస్సీ మాదిరిగా గ్రూప్–1 పోస్టులను నిర్ణీత కాలపట్టిక ప్రకారం పూర్తి చేయించాలని భావిస్తున్నాం. ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని అదే రోజు రాత్రి లేదా మరునాడు ప్రకటిస్తాం. రెండు లేదా మూడు వారాల్లోపు ప్రిలిమ్స్ ఫలితాలు ప్రకటిస్తాం. అనంతరం మెయిన్స్ సన్నద్ధతకు తగిన వ్యవధి ఇచ్చి ఏప్రిల్ నెలాఖరున మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తాం. ఆపై రెండు నెలల్లో మూల్యాంకనం ముగించి జూన్‌కల్లా ఫలితాలు విడుదల చేస్తాం. అనంతరం రెండువారాలు గడువు ఇచ్చి ఇంటర్వ్యూలు నిర్వహిస్తాం. ఆగస్టు నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తిచేయిస్తాం. అనంతరం ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో మరో కొత్త గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేస్తాం. ప్రాథమిక కీపై అభ్యంతరాల సంఖ్య వేలల్లో ఉంటున్నందున ప్రశ్నకు రూ.100 చొప్పున చెల్లించాలన్న నిబంధన పెట్టాం. సరైన అభ్యంతరమైతే ఆ మొత్తాన్ని వెనక్కు ఇచ్చేస్తాం. ఇంటర్వ్యూలకు మూడు బోర్డులు గ్రూప్–1లో ఇంటర్వ్యూలను గతంలో వద్దనుకున్నా ప్రజలతో నేరుగా సంబంధాలు నెరిపి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన క్యాడర్ పోస్టులు కాబట్టి అభ్యర్థుల పర్సనాలిటీకి సంబంధించిన అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలన చేయాల్సి ఉంటుంది. అందుకే ఇంటర్వ్యూలను పునరుద్ధరించారు. గతంలో ఒకే బోర్డుతో ఈ ఇంటర్వ్యూలు నిర్వహించగా.. ఇప్పుడు మూడు వరకు బోర్డులతో చేపడుతున్నాం. ఇందులో కమిషన్ చైర్మన్, సభ్యుడితో పాటు ఇద్దరు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సబ్జెక్టు నిపుణులైన వీసీ లేదా సీనియర్ ప్రొఫెసర్లు, రిటైర్డు ప్రొఫెసర్లను బోర్డులో నియమిస్తున్నాం. అత్యంత పారదర్శకంగా కేవలం మెరిట్ ప్రాతిపదికనే ఎంపికలు ఉంటాయి. కనుక ఏ ఒక్కరూ బయట వ్యక్తులు, మధ్యవర్తుల మాటలు విని మోసపోవద్దు. గ్రూప్–2 సిలబస్‌ను హేతుబద్ధీకరిస్తాం గ్రూప్–2 పోస్టుల భర్తీపైనా ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి నోటిఫికేషన్ ఇస్తాం. గ్రూప్–2కు సంబంధించి సిలబస్ విధానంలో మార్పులు తీసుకురానున్నాం. సిలబస్‌లో రేషనలైజేషన్ చేస్తాం. ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఒకే రకమైన సిలబస్‌ను అనుసరిస్తున్నందున దానిని హేతుబద్ధం చేస్తాం. గ్రూప్–2 స్కీమ్, ప్యాట్రన్‌లో మాత్రం ఎలాంటి మార్పులుండవు. -
గూప్–1 ప్రిలిమ్స్‌లో 5 ప్రశ్నలు రద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి గత నెల 6న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష తుది ‘కీ’ని టీఎస్పీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. అభ్యంతరాల పరిశీలనకు ఏర్పాటైన నిపుణుల కమిటీ పిలిమ్స్‌లోని 150 ప్రశ్నల్లో ఐదు ప్రశ్నలను రద్దు చేయాలని, మూడు ప్రశ్నలకు ఆప్షన్లలో మార్పులు చేయాలని సిఫార్సు చేయడంతో ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు కమిషన్ వెల్లడించింది. ఈ విషయంలో ఇకపై ఎలాంటి అభ్యంతరాలకు తావులేదని తేల్చిచెప్పింది. ఈ ప్రశ్నలు రద్దు... గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష పేపర్ కోడ్–22040 ‘కీ’ని పరిగణనలోకి తీసుకుంటే ఇందులో 29, 48, 69, 82, 138 ప్రశ్నలు రద్దయ్యాయి. దీంతో వాటిని మూల్యాంకనంలో పరిగణనలోకి తీసుకోరు. ప్రిలిమినరీ పరీక్షలో ఇచ్చిన 150 మార్కులకుగాను 145 ప్రశ్నలనే పరిగణిస్తారు. మొత్తం మార్కులను 145 ప్రశ్నలకు విభజిస్తారు. ఈ ప్రశ్నల్లో సరైన జవాబులు రాసిన వారికి విభజించిన (మూడో డెసిమల్ వరకు) మార్కుల ప్రకారం లెక్కిస్తారు. ఉదాహరణకు ఒక అభ్యర్థి 145 ప్రశ్నల్లో 120 ప్రశ్నలకు సరైన జవాబులు రాసినట్లయితే ఒక్కో ప్రశ్నకు 150/145 చొప్పున 120 జవాబులకు 124.137 మార్కులు నిర్దేశిస్తారు. మూడు ప్రశ్నలకు మారిన ఆప్షన్లు... ప్రిలిమినరీ పరీక్షలో 3 ప్రశ్నలకు జవాబులు మారాయి. 57వ ప్రశ్నకు జవాబు 1, 107వ ప్రశ్నకు జవాబులు 1, 2, 3, 4, చివరగా 133వ ప్రశ్నకు జవాబు 1, 2గా నిపుణుల కమిటీ సూచించగా కమిషన్ ఖరారు చేసింది. అతిత్వరలో మెయిన్ పరీ క్షలకు ఎంపికయ్యే అభ్యర్థుల జాబితాను టీఎస్పీ ఎస్సీ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఆ విద్యార్థులకే నిజాం కాలేజీ కొత్త హాస్టల్: మంత్రి సబితా -
మే 7న గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 73 గ్రూప్–1 పోస్టుల భర్తీ కోసం ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) మే 7న ప్రిలిమినరీ (స్క్రీనింగ్ టెస్టు) పరీక్ష నిర్వహించనుంది. ఈ పోస్టులకు 93,482 మంది దరఖాస్తు చేశారని, వీరికి ఏపీలోని 174 కేంద్రాల్లో ప్రిలిమ్స్ నిర్వహించనున్నామని ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ సాయి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుంది. హాల్‌టికెట్లను ఏపీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచారు. అభ్యర్థులను ఉదయం 9.30–10.00 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. గ్రేస్ పీరి యడ్ కింద మరో 15 నిమిషాలు అంటే 10.15 వరకు అనుమతిస్తారు.