Group -1 Exam
-
గ్రూప్ -1 పరీక్ష పూర్తయిన తరువాత అభ్యర్థుల స్పందన
-
గ్రూప్-1 సమస్యపై రాహుల్ గాంధీ స్పందించాలి: హరీష్ రావు
సిద్దిపేట, సాక్షి: గ్రూప్-1 అభ్యర్థుల ఆర్తనాదాలు కాంగ్రెస్‌కు వినిపించటం లేదా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ప్రశ్నించారు. ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడారు. ‘‘గ్రూప్-1 అభ్యర్థులు సమస్యలపై రాహుల్ గాంధీ స్పందించాలి. జీవో 29లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యర్థులు అన్యాయం అవుతారు. రైతులు, ఉద్యోగులను నిరుద్యోగులను దగా చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తోంది. ఈ ఖరీఫ్ సీజన్‌కు రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చావు కబురు చల్లగా చెప్పారు. .. సీఎం రేవంత్ రెడ్డి నువ్వు ముక్కు నేలకు రాయాలి. మాట తప్పినందుకు. మూసి కోసం రూ. లక్షా 50 వేలు ఉంటాయి. కానీ రైతులకు రూ. 15 వేలు ఇవ్వలేవా? రుణమాఫీ విషయంలో మోసం చేశావు. బోనస్ విషయంలో మోసం చేశావు. ఇప్పుడు రైతు బంధు విషయంలో మోసం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడిక్కడ నిలదీయాలని పిలుపునిస్తున్నాం’’ అని అన్నారు.చదవండి: కేటీఆర్ వల్లే బీఆర్ఎస్కు ఇలాంటి పరిస్థితి: బండి సంజయ్ -
గూప్–1 ప్రిలిమ్స్‌లో 5 ప్రశ్నలు రద్దు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీకి గత నెల 6న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష తుది ‘కీ’ని టీఎస్పీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. అభ్యంతరాల పరిశీలనకు ఏర్పాటైన నిపుణుల కమిటీ పిలిమ్స్‌లోని 150 ప్రశ్నల్లో ఐదు ప్రశ్నలను రద్దు చేయాలని, మూడు ప్రశ్నలకు ఆప్షన్లలో మార్పులు చేయాలని సిఫార్సు చేయడంతో ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు కమిషన్ వెల్లడించింది. ఈ విషయంలో ఇకపై ఎలాంటి అభ్యంతరాలకు తావులేదని తేల్చిచెప్పింది. ఈ ప్రశ్నలు రద్దు... గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష పేపర్ కోడ్–22040 ‘కీ’ని పరిగణనలోకి తీసుకుంటే ఇందులో 29, 48, 69, 82, 138 ప్రశ్నలు రద్దయ్యాయి. దీంతో వాటిని మూల్యాంకనంలో పరిగణనలోకి తీసుకోరు. ప్రిలిమినరీ పరీక్షలో ఇచ్చిన 150 మార్కులకుగాను 145 ప్రశ్నలనే పరిగణిస్తారు. మొత్తం మార్కులను 145 ప్రశ్నలకు విభజిస్తారు. ఈ ప్రశ్నల్లో సరైన జవాబులు రాసిన వారికి విభజించిన (మూడో డెసిమల్ వరకు) మార్కుల ప్రకారం లెక్కిస్తారు. ఉదాహరణకు ఒక అభ్యర్థి 145 ప్రశ్నల్లో 120 ప్రశ్నలకు సరైన జవాబులు రాసినట్లయితే ఒక్కో ప్రశ్నకు 150/145 చొప్పున 120 జవాబులకు 124.137 మార్కులు నిర్దేశిస్తారు. మూడు ప్రశ్నలకు మారిన ఆప్షన్లు... ప్రిలిమినరీ పరీక్షలో 3 ప్రశ్నలకు జవాబులు మారాయి. 57వ ప్రశ్నకు జవాబు 1, 107వ ప్రశ్నకు జవాబులు 1, 2, 3, 4, చివరగా 133వ ప్రశ్నకు జవాబు 1, 2గా నిపుణుల కమిటీ సూచించగా కమిషన్ ఖరారు చేసింది. అతిత్వరలో మెయిన్ పరీ క్షలకు ఎంపికయ్యే అభ్యర్థుల జాబితాను టీఎస్పీ ఎస్సీ విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఆ విద్యార్థులకే నిజాం కాలేజీ కొత్త హాస్టల్: మంత్రి సబితా -
నిన్న కార్మికురాలు.. నేడు అధికారి
సాక్షి, చెన్నై: నిన్నటి వరకు బాణసంచా పరిశ్రమలో తండ్రితో కలిసి చేదోడు వాదోడుగా ఉన్న కార్మికురాలు, మరికొన్ని రోజుల్లో ›గ్రూప్–1 అధికారి కాబోతున్నారు. గ్రూప్–1 ఫలితాల్లో ఆ కార్మికురాలు రాష్ట్రంలోనే టాప్–4 స్థానంలో నిలవడం విశేషం. ఇక, ఈ ఫలితాల్లో మహిళల హవా సాగింది. రాష్ట్రంలో ప్రతి ఏటా పట్టభద్రుల సంఖ్య పెరుగుతూనే ఉన్న విషయం తెలిసిందే. ప్రైవేటు ఉద్యోగాల కోసం ఓ వైపు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం మరో వైపు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు నిరుద్యోగులు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వంలో ఖాళీల భర్తీ నిమిత్తం టీఎన్పీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే చాలు లక్షల్లో దరఖాస్తులు దాఖలు కావడం తథ్యం. ఆ దిశగా గత ఏడాది సబ్ కలెక్టర్, డీఎస్పీ సహా ఎనిమిది రకాల పోస్టుల భర్తీకి టీఎన్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. 181 పోస్టులకు రెండు లక్షల 29 వేల మంది దరఖాస్తులు చేసుకుని పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 9,442 మంది మెయిన్‌కు అర్హత సాధించారు. వీరిలో ప్రస్తుతం 363 మంది ప్రత్యక్ష ఇంటర్వ్యూకు ఎంపికయ్యారు. టాప్–10లో ఎనిమిది మంది మహిళలకు చోటు దక్కింది. మొదటి ఆరు ర్యాంకులు మహిళల ఖాతాలో పడ్డాయి. ఈ ఫలితాలను టీఎన్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచారు. ఇందులో శివగంగైకు చెందిన ఐటీ ఉద్యోగి అర్చన తొలిస్థానాన్ని దక్కించుకున్నారు. ఐటీ ఉద్యోగాన్ని పక్కన పెట్టి మరీ గ్రూప్ –1 పరీక్ష కోసం తానుపడ్డ శ్రమకు ఫలితం దక్కిందని అర్చన ఆనందం వ్యక్తం చేశారు. సబ్ కలెక్టర్ కావాలన్నదే తన లక్ష్యంగా పేర్కొన్నారు. ఇక, చెన్నైలోని ప్రముఖ సంస్థలో శిక్షణ పొందిన యురేకా అనే మహిళ రెండో స్థానంలో, ప్రస్తుతం డీఎస్పీగా ఉన్న ధనలక్ష్మి మూడో స్థానంలో నిలిచారు. అయితే, నాలుగో స్థానాన్ని దక్కించుకున్న మహా లక్ష్మి ప్రస్తుతం అందరి దృష్టిలో పడ్డారు. బాణసంచా తయారీలో మహాలక్ష్మి బాణసంచా కూలీ నుంచి.. విరుదునగర్ జిల్లా తిరుకులై గ్రామానికి చెందిన గురుస్వామి, రాజ్యలక్ష్మి దంపతుల కుమార్తె మహాలక్ష్మి. ఈ కుటుంబం కడు పేదరికంలో ఉంది. తల్లిదండ్రులు ఇద్దరు బాణసంచా పరిశ్రమలో కూలీలు. బాణసంచా తయారీ పరిశ్రమలో పీస్ రేటుకు ఇచ్చే వేతనమే ఆ కుటుంబానికి పోషణ. అయినా, ఆ కుటుంబంలోని మహాలక్ష్మి చదువుల తల్లి సరస్వతిగా మారింది. పట్టువదలకుండా ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో చదువుకుంది. అంతే కాదు, తల్లిదండ్రులతో కలిసి బాణసంచా తయారీలో కార్మికు రాలిగా కూడా పనిచేసింది. ఇప్పుడు ఆమె పడ్డ శ్రమకు, నేర్చుకున్న విద్యకు తగిన ఫలితం తగ్గింది. గ్రూప్ –1లో ఆమె టాప్ –4 స్థానాన్ని దక్కించుకున్నారు. తనకు ర్యాంకు రావడంతో మహాలక్ష్మి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో చేరడం లక్ష్యంగా ఇప్పటికే రెండు సార్లు తాను టీఎన్పీఎస్సీ పరీక్షలు రాయడం జరిగిందని, ఇది మూడోసారిగా పేర్కొన్నారు. చదివించేందుకు తన తల్లిదండ్రులు పడ్డ కష్టానికి ఫలితం దక్కిందని ఉద్వేగానికి లోనయ్యారు. -
ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులకు నో ఎంట్రీ
విజయవాడ (వించిపేట) : ఏపీపీఎస్సీ ఆధ్వర్యాన బుధవారం చిట్టినగర్‌లోని రుత్విక్స్ కళాశాలలో నిర్వహించిన గ్రూప్–1 పరీక్షలకు పలువురు అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో అధికారులు లోపలికి అనుమతించలేదు. సుమారు 30 మంది అభ్యర్థులు నిర్దేశిత సమయానికి రాకపోవడంతో అధికారులు పరీక్షకు పంపలేదు. దీంతో దూరప్రాంతా నుంచి వచ్చామని, అడ్రస్ తెలియక ఇబ్బందులు పడుతూ ఇక్కడికి చేరుకున్నామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తంచేశారు. తమను అనుమతించాలని కొద్దిసేపు ఆందోళన చేసినా ప్రయోజనం లేకపోవడంతో వెళ్లిపోయారు.