
సాక్షి, విజయవాడ: గ్రూప్ 1 రిక్రూట్ మెంట్ లో ఇంటర్వ్యూ విధానం రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అన్ని కేటగిరిల్లోనూ ఇంటర్వ్యూలు రద్దు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ ప్రతిపాదన మేరకు ఇంటర్వ్యూ విధానం రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రూప్ పరీక్షల్లో సంపూర్ణ పారదర్శకత కోసం ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.