మాట్లాడుతున్న దిలీప్‌రాజా
తెనాలి: గుంటూరు జిల్లా తెనాలిలోని సీమాంధ్ర ఫిలిమ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థకు కొత్త సినిమాలకు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ నోటిఫికేషన్ నుంచి అనుమతి లభించింది. స్థానిక చెంచుపేటలోని రత్న ఫార్చ్యూన్ కల్యాణమండపంలో శుక్రవారం సీమాంధ్ర ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్‌రాజా వివరాలను వెల్లడించారు.
చదవండి: తెలంగాణ పర్వతారోహకుడికి సీఎం జగన్ భారీ ఆర్థిక సహాయం
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్ ఆమోదంతో సినిమాలకు టైటిల్స్, బ్యానర్ రిజిస్ట్రేషన్, పబ్లిసిటీ క్లియరెన్సులు, లాబ్ లెటర్లు, డ్యూరేషన్ సర్టిఫికెట్లను జారీ చేసే అవకాశం తమ సంస్థకు లభించిందని చెప్పారు. తాము ఆమోదించిన టైటిల్స్‌కు కేంద్ర సెన్సార్ కార్యాలయం అనుమతిని ఇస్తుందన్నారు. అక్టోబరు మొదటి వారం నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు దిలీప్‌రాజా వెల్లడించారు. నిర్మాత చదలవాడ హరిబాబు, సినీ హీరోయిన్ మౌనికరెడ్డి, మిలటరీ ప్రసాద్, బి.జయకుమార్ ఉన్నారు.
చదవండి: పరీక్ష రాయడానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం..
Comments
Please login to add a commentAdd a comment