రాష్ట్రంలో పన్ను ఎగవేస్తున్న సంస్థలు ఎన్నంటే.. | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో పన్ను ఎగవేస్తున్న సంస్థలు ఎన్నంటే..

Published Tue, Jan 9 2024 12:56 PM

GST Tax Evasion In Telugu States - Sakshi

జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చాక పన్ను ఎగవేత అసాధ్యమనుకున్నా.. మోసపూరిత వ్యాపారులు దాన్ని సైతం ఛేదించి అక్రమాలకు పాల్పడుతున్నారు. అంతర్రాష్ట్ర వ్యాపారాల్లో పన్ను ఎగవేస్తున్న వ్యాపారులను పట్టుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 73 వేలకు పైగా జీఎస్టీ నంబర్లకు సంబంధించిన వ్యాపారులు పన్ను సరిగా కట్టకుండా మోసాలకు పాల్పడుతున్నట్లు కేంద్రం అంచనాకు వచ్చింది. క్షేత్రస్థాయిలో గట్టిగా తనిఖీలు చేసి వీరిపై కఠినచర్యలు తీసుకోవాలని తాజాగా అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ దిశగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వాణిజ్య పన్నులశాఖలు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి తనిఖీలు ప్రారంభించాయి. 

నకిలీ జీఎస్టీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తొలగించేందుకు చేపట్టిన డ్రైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేంద్రం రూ.44వేల కోట్ల పన్ను ఎగవేతలను గుర్తించింది. ఎగవేతకు పాల్పడిన 29వేల సంస్థలను పట్టుకుంది. మోసపూరిత పద్ధతులకు వ్యతిరేకంగా పోరాడి రూ.4,646 కోట్లు ఆదా చేసింది. మొత్తం ఏడున్నర నెలల్లో దేశవ్యాప్తంగా నిర్వహించిన డ్రైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 29వేల నకిలీ సంస్థలను, రూ.44వేల కోట్లకు పైగా జీఎస్టీ పన్ను ఎగవేతలను గుర్తించామని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

ఉనికిలో లేని, బోగస్ రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను గుర్తించే ప్రత్యేక డ్రైవ్ ఫలితాలను మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎలాంటి వస్తువులు, సేవల సరఫరా లేకుండా చాలా బోగస్‌ కంపెనీలు ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాయిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తయారు చేశాయని చెప్పింది. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌ (సీబీఐసీ), కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో జీఎస్‌టీ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. 

ఇదీ చదవండి: పన్ను ఆదాలో ఎన్‌పీఎస్‌ టాప్‌.. రెండో స్థానంలో ఈఎల్‌ఎస్‌ఎస్‌

తెలంగాణలో 117 బోగస్‌ సంస్థల ద్వారా రూ.536 కోట్ల పన్ను ఎగవేతను గుర్తించారు. ఇందులో రూ.235 కోట్ల మొత్తాన్ని బ్లాక్‌/ రికవరీ చేయడంతోపాటు ఒకరిని అరెస్టు చేసినట్లు ఆర్థికశాఖ తెలిపింది. రాష్ట్రంలో ప్రతి లక్ష రిజిస్టర్డ్‌ సంస్థల్లో 23 నకిలీ సంస్థలు ఉన్నట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో 19 బోగస్‌ సంస్థలు రూ.765 కోట్ల పన్ను ఎగవేసినట్లు గుర్తించింది. ఇందులో రూ.11 కోట్ల మొత్తాన్ని బ్లాక్‌/రికవరీ చేసినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి లక్ష రిజిస్టర్డ్‌ సంస్థల్లో 5 నకిలీవి ఉన్నట్లు తెలిపింది. జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను బలోపేతం చేయడానికి ఆధార్‌ ధ్రువీకరణ విధానాన్ని గుజరాత్‌, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లలో పైలెట్‌ ప్రాజెక్ట్‌గా మొదలుపెట్టారు.

Advertisement
 
Advertisement
 
Advertisement