ఇది లేకుంటే వాహనం అమ్మాలన్నా, కొనాలన్నా కష్టమే
అన్ని రవాణా కార్యకలాపాలకు హై సెక్యూరిటీ అనుసంధానం
ఉమ్మడి రాష్ట్రంలోనే అమల్లోకి వచ్చిన హెచ్‌ఎస్‌ఆర్‌పీ
గ్రేటర్‌లో నిత్యం 2,500 కొత్త వాహనాల నమోదు
వీటిలో వెయ్యి వాహనాలకైనా అందని ఈ నంబర్ ప్లేట్లు
సాక్షి, సిటీబ్యూరో: మీ వాహనానికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేదా? అయితే రవాణా శాఖ లెక్కల్లో అది లేనట్టే. అలాంటి వాహనాన్ని అమ్మాలన్నా, కొనాలన్నా కష్టమే. అంతేకాదు.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేయడం కూడా సాధ్యం కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) లేని వాహనాలకు రవాణా శాఖ ఆమోదం లేనట్లుగానే భావించాలి. వాటిపై ఆర్టీఏ నుంచి ఎలాంటి పౌరసేవలు లభించవు.
ఇంత కీలకమైన హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ అమలుకు నోచుకోవడం లేదు. వాహనదారులు ఇష్టారాజ్యంగా తమకు నచి్చన నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. కాగా.. ఇప్పటికైనా హెచ్‌ఎస్‌ఆర్‌పీని అమర్చుకోవాలని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. వాహనాల భద్రత, రహదారి భద్రత దృష్ట్యా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉమ్మడి రాష్ట్రంలోనే హెచ్‌ఎస్‌ఆర్‌పీ అమల్లోకి వచి్చంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని అమలు తీరు నత్తనడకను తలపిస్తోంది. లక్షలాది వాహనాలు హెచ్‌ఎస్‌ఆర్‌పీకి దూరంగానే ఉన్నాయి.
నాణ్యతపై నమ్మకం లేక..
ఆరీ్టఏలో రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతీ వాహనానికి ఒక కోడ్‌ను కేటాయిస్తూ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌లో హోలోగ్రామ్‌ను ఏర్పాటు చేస్తారు. దీనిలో నమోదైన కోడ్ ఆధారంగానే రవాణా శాఖ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. వాహనం ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేయాలన్నా, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చుకోవాలన్నా, పన్నులు, ఫీజులు చెల్లించాలన్నా ఈ కోడ్ ఆధారంగానే సాధ్యమవుతుంది. చాలామంది వాహనదారులు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల నాణ్యత నాసిరకంగా ఉందని, అమర్చిన కొద్దిరోజులకే ఇవి పాడవుతున్నాయని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అల్యూమినియం నంబర్ ప్లేట్‌పై నల్లటి రంగులో రాసే అంకెలు సైతం ఎక్కువ కాలం ఉండడం లేదు. ఒకటి రెండేళ్లలోనే చెదిరిపోతున్నాయి. దీంతో వాహనదారులు తమకు నచి్చన విధానంలో నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు.
ఈ నిర్లక్ష్యానికి బాధ్యులెవరు?
⇒వాహనాల భద్రత దృష్ట్యా 2013లో అప్పటి ప్రభుత్వం హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమల్లోకి తెచి్చంది. దీని అమలు బాధ్యతను అప్పట్లో ఆర్టీసీకి అప్పగించారు. ఓ ప్రైవేట్ సంస్థ సహకారంతో ఆర్టీఏ కార్యాలయాల్లోనే హెచ్‌ఎస్‌ఆర్‌పీ సెంటర్లను ఏర్పాటు చేశారు. కానీ కొత్తగా రిజి్రస్టేషన్ అయ్యే వాహనాల డిమాండ్ మేరకు హెచ్‌ఎస్‌ఆర్‌పీ సరఫరాలో ఆ సంస్థ విఫలమైంది.
⇒ ప్రతిరోజూ సుమారు 2,500 వాహనాలు కొత్తగా నమోదవుతుండగా రోజుకు కనీసం వెయ్యి వాహనాలకు కూడా నంబర్‌ప్లేట్లు అందడంలేదు. దీంతో వాహనదారులు రిజి్రస్టేషన్ల కోసం 3 నుంచి 6 నెలల వరకు పడిగాపులు కాయాల్సివస్తోంది. ఈ క్రమంలో రవాణాశాఖ అధికారులు తయారీ సంస్థపై ఒత్తిడి పెంచడంతో పాటు నంబర్ ప్లేట్ ఉంటేనే బండి రిజి్రస్టేషన్ తప్పనిసరి చేశారు. అయినా పెద్దగా పురోగతి కనిపించడంలేదు.
ఆర్టీఓ స్థాయిలోనే మార్పు
హెచ్‌ఎస్‌ఆర్‌పీ లేకపోవడం వల్ల నిలిచిపోయిన ట్రాన్సాక్షన్స్‌ను పునరుద్ధరించే సదుపాయం ఇప్పటి వరకు రవాణా కమిషనర్ కార్యాలయానికే పరిమితం కాగా.. ఇటీవల దీనిని వికేంద్రీకరించారు. కిందిస్థాయిలో జిల్లా, ప్రాంతీయ రవాణా అధికారులు కూడా పునరుద్ధరించే సదుపాయం కలి్పంచారు. వాహనదారులు ఇందుకోసం హెచ్‌ఎస్‌ఆర్‌పీని ఏర్పాటు చేసుకొని అధికారులను
సంప్రదించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment