hsrp
-
మీ వాహనానికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేదా?
సాక్షి, సిటీబ్యూరో: మీ వాహనానికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ లేదా? అయితే రవాణా శాఖ లెక్కల్లో అది లేనట్టే. అలాంటి వాహనాన్ని అమ్మాలన్నా, కొనాలన్నా కష్టమే. అంతేకాదు.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ చేయడం కూడా సాధ్యం కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ) లేని వాహనాలకు రవాణా శాఖ ఆమోదం లేనట్లుగానే భావించాలి. వాటిపై ఆర్టీఏ నుంచి ఎలాంటి పౌరసేవలు లభించవు. ఇంత కీలకమైన హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ అమలుకు నోచుకోవడం లేదు. వాహనదారులు ఇష్టారాజ్యంగా తమకు నచి్చన నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. కాగా.. ఇప్పటికైనా హెచ్‌ఎస్‌ఆర్‌పీని అమర్చుకోవాలని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. వాహనాల భద్రత, రహదారి భద్రత దృష్ట్యా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఉమ్మడి రాష్ట్రంలోనే హెచ్ఎస్ఆర్పీ అమల్లోకి వచి్చంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని అమలు తీరు నత్తనడకను తలపిస్తోంది. లక్షలాది వాహనాలు హెచ్ఎస్ఆర్పీకి దూరంగానే ఉన్నాయి. నాణ్యతపై నమ్మకం లేక.. ఆరీ్టఏలో రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతీ వాహనానికి ఒక కోడ్‌ను కేటాయిస్తూ హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లో హోలోగ్రామ్‌ను ఏర్పాటు చేస్తారు. దీనిలో నమోదైన కోడ్ ఆధారంగానే రవాణా శాఖ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. వాహనం ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేయాలన్నా, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చుకోవాలన్నా, పన్నులు, ఫీజులు చెల్లించాలన్నా ఈ కోడ్ ఆధారంగానే సాధ్యమవుతుంది. చాలామంది వాహనదారులు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ల నాణ్యత నాసిరకంగా ఉందని, అమర్చిన కొద్దిరోజులకే ఇవి పాడవుతున్నాయని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అల్యూమినియం నంబర్ ప్లేట్‌పై నల్లటి రంగులో రాసే అంకెలు సైతం ఎక్కువ కాలం ఉండడం లేదు. ఒకటి రెండేళ్లలోనే చెదిరిపోతున్నాయి. దీంతో వాహనదారులు తమకు నచి్చన విధానంలో నంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ నిర్లక్ష్యానికి బాధ్యులెవరు? ⇒వాహనాల భద్రత దృష్ట్యా 2013లో అప్పటి ప్రభుత్వం హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లను అమల్లోకి తెచి్చంది. దీని అమలు బాధ్యతను అప్పట్లో ఆర్టీసీకి అప్పగించారు. ఓ ప్రైవేట్ సంస్థ సహకారంతో ఆర్టీఏ కార్యాలయాల్లోనే హెచ్ఎస్ఆర్పీ సెంటర్లను ఏర్పాటు చేశారు. కానీ కొత్తగా రిజి్రస్టేషన్ అయ్యే వాహనాల డిమాండ్ మేరకు హెచ్ఎస్ఆర్పీ సరఫరాలో ఆ సంస్థ విఫలమైంది. ⇒ ప్రతిరోజూ సుమారు 2,500 వాహనాలు కొత్తగా నమోదవుతుండగా రోజుకు కనీసం వెయ్యి వాహనాలకు కూడా నంబర్ప్లేట్లు అందడంలేదు. దీంతో వాహనదారులు రిజి్రస్టేషన్ల కోసం 3 నుంచి 6 నెలల వరకు పడిగాపులు కాయాల్సివస్తోంది. ఈ క్రమంలో రవాణాశాఖ అధికారులు తయారీ సంస్థపై ఒత్తిడి పెంచడంతో పాటు నంబర్ ప్లేట్ ఉంటేనే బండి రిజి్రస్టేషన్ తప్పనిసరి చేశారు. అయినా పెద్దగా పురోగతి కనిపించడంలేదు. ఆర్టీఓ స్థాయిలోనే మార్పు హెచ్ఎస్ఆర్పీ లేకపోవడం వల్ల నిలిచిపోయిన ట్రాన్సాక్షన్స్‌ను పునరుద్ధరించే సదుపాయం ఇప్పటి వరకు రవాణా కమిషనర్ కార్యాలయానికే పరిమితం కాగా.. ఇటీవల దీనిని వికేంద్రీకరించారు. కిందిస్థాయిలో జిల్లా, ప్రాంతీయ రవాణా అధికారులు కూడా పునరుద్ధరించే సదుపాయం కలి్పంచారు. వాహనదారులు ఇందుకోసం హెచ్‌ఎస్‌ఆర్‌పీని ఏర్పాటు చేసుకొని అధికారులను సంప్రదించవచ్చు. -
Hyderabad: బుల్లెట్ బండి.. పట్నం వస్తోందండీ
సాక్షి, హైదరాబాద్: దేశ వాణిజ్య రాజధాని ముంబై నుంచి చారిత్రక భాగ్యనగరికి హైస్పీడ్ రైల్ అందుబాటులోకి రానుంది. రెండు నగరాల ప్రజలు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ (హెచ్ఎస్ఆర్) కార్యాచరణ చేపట్టింది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో 650 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఎలివేటెడ్ వయాడక్ట్, టన్నెల్ కారిడార్ కోసం హెచ్ఎస్ఆర్ తాజాగా భూసేకరణ పనులను చేపట్టింది. థానె, నవీ ముంబై, లోనావాలా, పుణె, బారామతి, పండరీపూర్, షోలాపూర్, గుల్బర్గా, వికారాబాద్‌ల మీదుగా ఈ రైలు పరుగులు పెట్టనుంది. మొత్తం 10 స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించనుంది. ఎలివేటెడ్ కారిడార్‌గా ఉంటుందని, అవసరమైన చోట్ల సొరంగ మార్గాల్లో నిర్మించనున్నట్లు హెచ్ఎస్ఆర్ ప్రతినిధి ఒకరు తెలిపారు. రెండు ప్రధాన నగరాల మధ్య రోడ్డు మార్గంలో వాహనాల రద్దీని, కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకొనేలా బుల్లెట్ రైలు అందుబాటులోకి రానుంది. చదవండి: అంగన్వాడి కేంద్రంలో చిన్నారి మృతి! గంటకు 330 కి.మీ వేగం.. హైస్పీడ్ రైలు గంటకు 330 కి.మీ వేగంతో పరుగులు తీస్తుంది. ట్రైన్లో మొత్తం 10 కార్లు ఉంటాయి. 750 మంది హాయిగా ప్రయాణం చేయొచ్చు. ప్రస్తుతం మెట్రో రైలు తరహాలోనే పూర్తిగా ఏసీ బోగీలు ఉంటాయి. ఈ ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 8 జిల్లాల్లో 284 గ్రామాల్లో సుమారు 1197.5 ఎకరాల భూమిని సేకరించనున్నారు. మహారాష్ట్రలో నాలుగు జిల్లాలు థానె, రాయ్‌పూర్, పుణె, షోలాపూర్, కర్ణాటకలోని గుల్బర్గా, తెలంగాణలో వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల మీదుగా హైస్పీడ్ రైల్ కారిడార్ నిర్మించనున్నారు. చదవండి: ప్రధాని అపాయింట్మెంట్ కేసీఆర్ అడగలేదు రైలుకు ఎక్కువ.. ఫ్లైట్‌కు తక్కువ... ప్రస్తుతం హైదరాబాద్– ముంబై మధ్య విమానాలు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. రోడ్డు మార్గం నుంచి కూడా పెద్ద ఎత్తున రాకపోకలు కొనసాగుతున్నాయి. 617 కి.మీ విమాన యానానికి 1.30 గంటల సమయం పడుతోంది. ముంబై– హైదరాబాద్ మధ్య 773 కి.మీ ఉన్న రైలు మార్గంలో 14.20 గంటల సమయం పడుతోంది. రోడ్డు మార్గం 710 కి.మీ వరకు ఉంటుంది. బస్సులు, కార్లు తదితర వాహనాల్లో చేరుకొనేందుకు 13. 15 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం నిర్మించతలపెట్టిన 650 కి.మీ హైస్పీడ్ రైల్ కారిడార్ ద్వారా గంటకు 330 కి.మీ చొప్పున కేవలం 3 గంటల్లో ముంబై నుంచి హైదరాబాద్‌కు చేరుకోవచ్చు. -
వాహనదారులందరికి గమనిక!
న్యూఢిల్లీ : 2019 ఏప్రిల్1 నుంచి అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ) తప్పనిసరిగా ఉండాల్సిందేనని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. అవసరమైతే వాటిపై తప్పనిసరిగా అధికారిక హోలోగ్రామ్ కలిగిన స్టిక్కర్ సైతం ఉండాలని, వాహన తయారీదారులందరూ ఈ విషయాన్ని తమ డీలర్లకు తెలియజేయాలని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ట్యాంపర్ ప్రూఫ్ హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లతో దొంగతనాలను అరికట్టడమే కాకుండా, నకిలీ నెంబర్లకు అడ్డుకట్ట వేయొచ్చు. ఏప్రిల్ 1 నుంచి వాహనాన్ని తయారు చేసే కంపెనీలే వాహనంతోపాటు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్, థర్డ్ రిజిస్ట్రేషన్ మార్క్‌లను డీలర్లకు సరఫరా చేయాలని ఆదేశించినట్లు నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ మేరకు సెంట్రల్ మోటార్ వెహికిల్స్ రూల్స్ 1989లో చేయాల్సిన మార్పులను ప్రజాభిప్రాయం కోసం ఉంచామని, దీనిపై సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. ఈ ఏడాది జూన్ 5న దీనికి సంబంధించి సమావేశం కూడా నిర్వహించినట్లు వెల్లడించారు. -
రేపటి నుంచి హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు
తొలుత హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సాక్షి, హైదరాబాద్: గత కొన్నేళ్లుగా కసరత్తుకే పరిమితమైన హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల (హెచ్ఎస్ఆర్పీ) విధానం బుధవారం నుంచి అమలులోకి వస్తోంది. దశలవారీగా అమలు చేసే క్రమంలో తొలుత హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో దీనిని ప్రారంభిస్తున్నారు. డిసెంబరు 11 నుంచి రిజిస్ట్రేషన్‌కు వచ్చే కొత్త వాహనాలకు ఈ విధానం వర్తించనుంది. నెల రోజుల తర్వాత ఈ రెండు జిల్లాల్లో పాత వాహనాలకు కూడా ఈ విధానాన్ని వర్తింపజేయనున్నారు. వచ్చే 90 రోజుల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని వాహనాలకు దీన్ని అమలుచేస్తారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం మేరకు ఇప్పటికే దేశంలో దాదాపు 18 రాష్ట్రాల్లో ఈ విధానం అమలులోకి రాగా రాష్ట్రంలో ఇప్పుడు అందుబాటులోకి వస్తోంది. ఈ నెంబరు ప్లేట్ల తయారీ బాధ్యతను అప్పగించే విషయంలో రకరకాల వివాదాలు తలెత్తిన నేపథ్యంలో ఈ విధానాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వానికి నాలుగేళ్ల సమయం పట్టింది. ధరలిలా (పన్నులు, ఇతరాలతో కలిపి) ద్విచక్ర వాహనాలు రూ.245 మూడు చక్రాల వాహనాలు రూ. 282 తేలికరకం వాహనాలు/కార్లు రూ.619 మధ్యరకం, భారీ /ట్రెయిలర్లు రూ.649