తొలుత హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో
సాక్షి, హైదరాబాద్: గత కొన్నేళ్లుగా కసరత్తుకే పరిమితమైన హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) విధానం బుధవారం నుంచి అమలులోకి వస్తోంది. దశలవారీగా అమలు చేసే క్రమంలో తొలుత హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో దీనిని ప్రారంభిస్తున్నారు. డిసెంబరు 11 నుంచి రిజిస్ట్రేషన్‌కు వచ్చే కొత్త వాహనాలకు ఈ విధానం వర్తించనుంది. నెల రోజుల తర్వాత ఈ రెండు జిల్లాల్లో పాత వాహనాలకు కూడా ఈ విధానాన్ని వర్తింపజేయనున్నారు. వచ్చే 90 రోజుల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని వాహనాలకు దీన్ని అమలుచేస్తారు.
దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం మేరకు ఇప్పటికే దేశంలో దాదాపు 18 రాష్ట్రాల్లో ఈ విధానం అమలులోకి రాగా రాష్ట్రంలో ఇప్పుడు అందుబాటులోకి వస్తోంది. ఈ నెంబరు ప్లేట్ల తయారీ బాధ్యతను అప్పగించే విషయంలో రకరకాల వివాదాలు తలెత్తిన నేపథ్యంలో ఈ విధానాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వానికి నాలుగేళ్ల సమయం పట్టింది.
ధరలిలా (పన్నులు, ఇతరాలతో కలిపి)
ద్విచక్ర వాహనాలు రూ.245
మూడు చక్రాల వాహనాలు రూ. 282
తేలికరకం వాహనాలు/కార్లు రూ.619
మధ్యరకం, భారీ /ట్రెయిలర్లు రూ.649
రేపటి నుంచి హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు
Published Tue, Dec 10 2013 1:46 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement