న్యూఢిల్లీ : 2019 ఏప్రిల్1 నుంచి అన్ని వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) తప్పనిసరిగా ఉండాల్సిందేనని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. అవసరమైతే వాటిపై తప్పనిసరిగా అధికారిక హోలోగ్రామ్ కలిగిన స్టిక్కర్ సైతం ఉండాలని, వాహన తయారీదారులందరూ ఈ విషయాన్ని తమ డీలర్లకు తెలియజేయాలని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.
ట్యాంపర్ ప్రూఫ్ హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లతో దొంగతనాలను అరికట్టడమే కాకుండా, నకిలీ నెంబర్లకు అడ్డుకట్ట వేయొచ్చు. ఏప్రిల్ 1 నుంచి వాహనాన్ని తయారు చేసే కంపెనీలే వాహనంతోపాటు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్స్, థర్డ్ రిజిస్ట్రేషన్ మార్క్‌లను డీలర్లకు సరఫరా చేయాలని ఆదేశించినట్లు నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ మేరకు సెంట్రల్ మోటార్ వెహికిల్స్ రూల్స్ 1989లో చేయాల్సిన మార్పులను ప్రజాభిప్రాయం కోసం ఉంచామని, దీనిపై సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు. ఈ ఏడాది జూన్ 5న దీనికి సంబంధించి సమావేశం కూడా నిర్వహించినట్లు వెల్లడించారు.
వాహనదారులందరికి గమనిక!
Published Thu, Dec 27 2018 6:05 PM | Last Updated on Thu, Dec 27 2018 6:10 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment