ఇదీ..అసలు రంగు | Colour Change To Border Stones In CRDA | Sakshi
Sakshi News home page

ఇదీ..అసలు రంగు

Published Tue, Apr 3 2018 9:07 AM | Last Updated on Tue, Apr 3 2018 9:07 AM

Colour Change To Border Stones In CRDA - Sakshi

సరిహద్దు రాళ్లకు పసుపు రంగు వేస్తున్న కార్మికుడు

అంతా అయోమయం..  అధికారుల అవగాహనలోపం.. ప్లాట్లకేటాయింపుల్లో గందరగోళం..కమర్షియల్‌..రెసిడెన్షియల్‌ ప్లాట్లు విభజనలో సీఆర్డీఏఅధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వైనం.. మాస్టర్‌
ప్లాన్‌లో స్థలాలు చూపి  హడావుడిగా రిజిస్ట్రేషన్‌చేసేందుకు యత్నం..అసలుస్థలాలు ఎక్కడున్నాయోతెలియని సందిగ్ధం. ఇదీరాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులువేదనాభరిత జీవనచిత్రం.తాజాగా ప్లాట్ల కేటాయింపులోఅధికారుల డొల్లతనం తేటతెల్లమైంది. రాజధాని ప్రాంతంలోఎక్కడ రెసిడెన్షియల్, ఎక్కడకమర్షియల్‌ ప్రాంతమో అర్థంకాని పరిస్థితి నెలకొంది. మందడంలో కమర్షియల్‌ ప్లాట్లుగావిభజించి బ్లూరంగు రాళ్లుపాతిన వాటికి తిరిగి మాస్టర్‌ప్లాన్‌లో అవి రెసిడెన్షియల్‌గాఉండడంతో పసుపు రంగువేస్తూ తప్పు దిద్దుకుంటున్నారు
.

సాక్షి, అమరావతి బ్యూరో : రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. నిర్ధిష్టమైన ప్రణాళిక లేకుండా పనులు చేపడుతూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. రైతులకు ప్రభుత్వం ఇచ్చే ప్లాట్ల కేటాయింపుల్లో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. ప్లాట్ల కేటాయింపుల్లో అధికారుల అవగాహనాలేమి మరోసారి తేటతెల్లమవుతోంది.

ప్లాట్లు ఎక్కడున్నాయో చూపితే ఒట్టు...!
రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఒక్కో పరిహారం ఇస్తోంది. జరీభు భూములైతే ఎకరానికి 1450 చ.గజాల స్థలం ఇస్తోంది. ఇందులో 1250 గజాలు నివాసప్రాంతం 200 గజాల కమర్షియల్‌ ప్లాట్లను కేటాయిస్తోంది. అలాగే అసైన్డ్, మెట్ట భూములకు, సీలింగ్‌ భూములకు 200 గజాల చొప్పున కమర్షియల్‌ ప్లాట్లను ఇచ్చింది. రైతులకు ప్లాట్లను పంపిణీ చేసిన సీఆర్డీఏ అధికారులు అవి ఎక్కడున్నాయో చూపలేదు. మాస్టర్‌ప్లాన్‌లో చూపించి హడావుడిగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు.

కమర్షియల్‌ స్థానంలో రెసిడెన్షియల్‌
సీఆర్డీఏ అధికారులు రైతులకు రెసిడెన్షి యల్, కమర్షియల్‌ ప్లాట్లను ఇస్తున్నారు. రెసిడెన్షియల్‌ ప్లాట్లకు సరిహద్దు రాళ్లు పాతి వాటికి పసుపు(ఎల్లో) రంగు వేశారు. అలాగే కమర్షియల్‌ ప్లాట్లకు హద్దు రాళ్లు పాతి వాటికి నీలం(బ్లూ) కలర్‌ వేశారు. రాజధాని ప్రాంతంలో ఎక్కడ కమర్షియల్‌ ప్రాంతం వస్తుందో.. ఎక్కడ రెసిడెన్షియల్‌  వస్తుందో సీఆర్డీఏ అధికారులకు ఇంత వరకు స్పష్టం చేయలేదు. తుళ్లూరు మండలం మందడం గ్రామ శివారుల్లో కమర్షి యల్‌ ప్లాట్ల హద్దు రాళ్లు పాతి వాటిని రైతులకు పంపిణీ చేశారు. ప్రస్తుతం తీరిగ్గా మాస్టర్‌ప్లాన్‌ను పరిశీలించిన అధికారులు ఆ ప్రాంతంలో ఎలాంటి వాణిజ్య సముదా యాలు లేవని నిర్థారణకు వచ్చారు. దీంతో గుట్టుచప్పుడు కాకుండా బ్లూ కలర్‌ ఉన్న హద్దు రాళ్లకు హడావుడిగా పసుపు రంగు వేయడం ప్రారంభించారు. 29 గ్రామాల్లో చాలా చోట్ల హడావిడిగా కమర్షియల్‌ ప్లాట్లను రెసిడెన్షియల్స్‌గా మార్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 

అంతా హడావుడిగానే...
ప్లాట్ల హద్దు రాళ్లపైన సీఆర్డీఏ ఒక నంబర్‌ వేస్తుంది. దాన్ని ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేసా ్తరు. రాయిపై ఉన్న నంబర్‌ రెసిడెన్షియల్‌ ప్లాట్లుకు సంబంధించినదా... లేక కమర్షియల్‌ ప్లాట్లకు సంబంధించినదా అన్న అంశం ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. అయితే మందడంలోని ప్లాట్ల నంబర్లు ఆన్‌లైన్‌లో రెసిడెన్షియల్‌ ప్లాట్లుగా నమోదై ఉన్నాయి. భౌగోళికంగా వచ్చే సరికి హద్దు రాళ్లకు బ్లూ రంగు వేసి వాటిని కమర్షియల్‌ ప్లాట్లుగా అధికారులు ముందు గుర్తిం చారు. తీరిగ్గా ఇప్పుడు మాస్టర్‌ ప్లాన్‌ను పరి శీలించి తప్పు దొర్లినట్లు గుర్తించి హద్దు రాళ్లకు రంగు మారుస్తున్నారు. ఈ చర్యలతో రాజధాని నిర్మాణం, సమగ్ర స్వరూపంపై అటు ప్రభుత్వానికి ఇటు సీఆర్డీఏకు ఒక స్పష్టత లేదనే విషయం అర్థమవుతోందని ప్రజలు చర్చించుకుంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement