ప్రపంచంలో శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితాలో భారత్‌కు 80వ స్థానం
ూకేకు చెందిన హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్–2024 నివేదిక వెల్లడి
అగ్రస్థానంలో సింగపూర్,జపాన్‌తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ దేశాలు
ఈ ఆసియా, ఐరోపా దేశాల పౌరులకు 194 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ
దశాబ్దంగా క్షీణిస్తున్న అమెరికా పాస్‌పోర్టు సామర్థ్యం
అట్టడుగున ఆఫ్ఘనిస్తాన్ పాస్‌పోర్టు
సాక్షి, అమరావతి: వీసా రహిత విదేశీ పర్యటనలకు భారతీయ పాస్‌పోర్టు విస్తృత అవకాశం కల్పిస్తోంది. ప్రపంచంలోని విభిన్న సంస్కృతులు, సుందరమైన ప్రకృతి దృశ్యాలు, చారిత్రక అద్భుతాలను అన్వేíÙంచడానికి మార్గాన్ని సులభతరం చేస్తోంది. యూకేకు చెందిన హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్–2024 నివేదిక ప్రకారం.. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాలో భారత్ 80వ స్థానంలో నిలిచింది. గతేడాది నుంచి పాస్‌పోర్టు ర్యాంకింగ్స్‌లో భారత్ స్థిరంగా ఉన్నప్పటికీ, వీసా రహిత గమ్యస్థానాల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. ఈ క్రమంలోనే వీసా అవసరంలేకుండా భారతీయులు ప్రయాణించగలిగే దేశాల సంఖ్య
57 నుంచి 62కు పెరిగింది. ముఖ్యంగా భారతీయ పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంతోనే ఆగ్నేయాసియా, యూరప్, ఆఫ్రికా, కరేబియన్ దేశాలు తమ ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లు, సహజమైన బీచ్‌లు, సాంస్కృతిక ప్రదేశాల్లో వీసా రహిత ప్రయాణాలకు అనుమతిస్తున్నాయి.
టాప్‌లో ఆరు దేశాలు..
అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టు ప్రయాణాల్లో ఆసియా, ఐరోపా దేశాలు అగ్రస్థానాన్ని
పంచుకున్నాయి.
👉 సింగపూర్, జపాన్‌తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్ దేశాలు 227 విదేశీ గమ్యస్థానాలకుగాను 194 ప్రదేశాలకు వీసా రహిత ప్రయాణాలు చేసేందుకు అనుమతిస్తున్నాయి.
👉 దక్షిణ కొరియా, స్వీడన్, ఫిన్‌లాండ్‌ల పాస్‌పోర్టులు 193 గమ్యస్థానాలకు యాక్సెస్‌గా ఉంటూ రెండో స్థానంలో..
👉 ఆ్రస్టియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ 192 దేశాలకు ఉచిత వీసా అనుమతులను అందిస్తూ మూడో స్థానంలో నిలుస్తున్నాయి.
👉యూఏఈ గడిచిన దశాబ్దంగా అత్యతంగా వేగంగా వృద్ధి చెందుతూ 11వ స్థానానికి చేరుకుని 183 దేశాల్లో ఫ్రీ వీసా ప్రయాణ సౌలభ్యాన్ని సాధించింది.
👉 ఇక గతేడాదితో పోలిస్తే చైనా రెండు స్థానాలు ఎగబాకి 62వ స్థానంలో 85 దేశాలకు వీసాలేని ప్రయాణాలకు అనుమతిస్తోంది.
ఏడో స్థానానికి యూఎస్ వీసా పరిమితం..
అమెరికా పాస్‌పోర్టు సామర్థ్యం దశాబ్దకాలంలో దిగజారింది. 2006–2014 మధ్య అగ్రస్థానంలో కొనసాగగా 2020 నుంచి ఏడో స్థానానికి పరిమితమైంది. పాస్‌పోర్టు ర్యాంకుల్లో ఆఫ్ఘనిస్తాన్ అట్టడుగున నిలుస్తూ కేవలం 28 దేశాలకు మాత్రమే ఫ్రీ వీసా ప్రవేశాలు లభిస్తున్నాయి. సిరియా 29, ఇరాక్ 31, పాకిస్తాన్ 34, యెమెన్ 35 దేశాలకు ఉచిత వీసా ప్రయాణాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వీసా అవసరంలేకుండా సగటు ప్రయాణికులు వెళ్లిన గమ్యస్థానాల సంఖ్య 2006లో 58 నుంచి 2024 నాటికి 111కి రెట్టింపు కావడం విశేషం.
భారత్ పాస్‌పోర్టుతో వీసాలేకుండా ప్రయాణించే దేశాలు..
అంగోలా, బార్బడోస్, భూటాన్, బొలీవియా, బ్రిటిష్ వర్జిన్ దీవులు, బురుండి, కంబోడియా, కేప్ వెర్డే దీవులు, కొమొరో దీవులు, కుక్ దీవులు, జి»ౌటి, డొమినికా, ఎల్ సల్వడార్, ఇథియోపియా, ఫిజీ, గాబన్, గ్రెనడా, గినియా–బిస్సావు, హైతీ, ఇండోనేసియా, ఇరాన్, జమైకా, జోర్డాన్, కజఖస్తాన్, కెన్యా, కిరిబాటి, లావోస్, మకావో (ఎస్‌ఏఆర్ చైనా), మడగాస్కర్, మలేసియా, మాల్దీవులు, మార్షల్ దీవులు, మౌరిటానియా, మారిషస్, మైక్రోనేíÙయా, మోంట్సెరాట్, మొజాంబిక్, మయన్మార్, నేపాల్, నియు, ఒమన్, పలావు దీవులు, ఖతార్, రువాండా,ౖ సమోవా, సెనెగల్, సీషెల్స్, సియర్రా లియోన్, సోమాలియా, శ్రీలంక, సెయింట్ కిట్స్–నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్–గ్రెనడైన్స్, టాంజానియా, థాయ్‌లాండ్, తైమూర్–లెస్టే, ట్రినిడాడ్–టొబాగో, ట్యునీíÙయా, తువాలు, వనాటు, జింబాబ్వే.
Comments
Please login to add a commentAdd a comment