అమెరికాలో చదవాలనుకునే విద్యార్థులకు కష్టాలు తప్పడంలేదు. అందులో ప్రధానంగా వీసాకోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఇంటర్వ్యూలకు పిలవకుండా కాలం వెళ్లదీస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకునే విద్యార్థులకు వీసా(ఎఫ్1) ఇంటర్వ్యూ స్లాట్ల కోసం ఎదురుచూపులు తప్పట్లేదు.
సాధారణంగా ఫాల్ సీజను ఆగస్టు నెల మధ్యలో ప్రారంభమవుతుంది. అందుకోసం మార్చి నెల నుంచి దశల వారీగా వీసా తేదీలు విడుదలవుతాయి. ఈసారి మార్చి నెల ముగుస్తున్నా ఇప్పటి వరకు విడుదల చేయకపోవటం చర్చనీయాంశంగా మారింది. విద్యా సంవత్సరం ప్రారంభానికి 60 రోజుల ముందుగా మాత్రమే ఇంటర్వ్యూ తేదీలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అందుకు తక్కువ సమయం ఉండగా స్లాట్లు విడుదల చేస్తే ఇబ్బందులు తప్పవనే విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.
రెండు దఫాలే స్లాట్లు జారీ..
గతంలో వీసా స్లాట్లు అందుబాటులో ఉంటే మూడు దఫాల వరకు ఇంటర్వ్యూకు హాజరు అయ్యేందుకు అవకాశం ఉండేది. ఇక నుంచి రెండుసార్లకు పరిమితం చేయాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. జూన్, జులై నెలల్లో విడుదల చేసే స్లాట్లలో వీసా రాకపోతే పరిస్థితి ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆగస్టు రెండో వారం తరవాత నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఇళ్లు అ‘ధర’హో..
Comments
Please login to add a commentAdd a comment