
న్యూఢిల్లీ: రోజురోజుకీ అమెరికా వీసాల కోసం నిరీక్షణ సమయం పెరిగిపోతోంది. అమెరికా బిజినెస్ (బీ–1), టూరిస్ట్ (బీ–2) వీసాల కోసం ఎదురుచూడాల్సిన సమయంతొలిసారిగా వేయి రోజులకు చేరింది. ఇప్పటికిప్పుడు అమెరికన్ వీసా కోసం భారతీయులు దరఖాస్తు చేసుకుంటే 2025 నాటికి ఇంటర్వ్యూకి పిలుపు వస్తుందని అమెరికా విదేశాంగ శాఖ నివేదించింది.
ముంబై వాసులు 999 రోజులు, హైదరాబాద్‌వాసులు 994 రోజులు, ఢిల్లీ 961 రోజులు, చెన్నై 948 రోజులు, కోల్‌కతా వాసులు 904 రోజులు ఇంటర్వ్యూ కోసం నిరీక్షించాల్సి ఉందని ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారి చెప్పారు. అత్యవసరంగా ఎవరైనా అమెరికా వెళ్లాలనుకుంటే కారణాలు చూపిస్తే అపాయింట్‌మెంట్ వెంటనే ఇస్తామని అమెరికా విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. ప్రస్తుతం అమెరికా కళాశాలల్లో అడ్మిషన్లు ఉండటంతో విద్యార్థి వీసాలు మంజూరుకు ప్రాధాన్యతనివ్వడంతో ఇతర వీసాల వెయిటింగ్ పీరియడ్ పెరిగిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment