భారత పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టును వీసా సమస్య వెంటాడుతోంది. తాజాగా మరో ఇంగ్లీష్ ఆటగాడికి వీసా సమస్య ఎదురైంది. ఇంగ్లండ్ జట్టు స్వల్ప విరామం తర్వాత మూడో టెస్టు కోసం దుబాయ్ నుంచి రాజ్‌కోట్‌కు సోమవారం చేరుకుంది. ఈ క్రమంలో సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో ఆ జట్టు ఆ యువ స్పిన్నర్ రెహాన్ అహ్మద్‌ను రాజ్‌కోట్ హిస్సోర్ విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు.
స్పోర్ట్‌స్టార్ రిపోర్ట్ ప్రకారం.. అహ్మద్ కేవలం సింగిల్-ఎంట్రీ వీసాను మాత్రమే కలిగి ఉన్నందున విమానాశ్రయంలో అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అయితే మూడో టెస్టుకు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉన్నందున అత్యవసర పరిస్థితి కింద స్ధానిక అధికారులు 2 రోజుల వీసాను రెహాన్‌కు మంజూరు చేసినట్లు సమాచారం.
అదే విధంగా మరో రెండు రోజుల్లో వీసా సమస్యను పూర్తిగా పరిష్కరించాలని ఇంగ్లండ్ మేనెజ్‌మెంట్ అధికారులు సూచించినట్లు స్పోర్ట్‌స్టార్ తమ నివేదికలో పేర్కొంద. అయితే దుబాయ్ నుంచి వచ్చిన ఇంగ్లండ్ జట్టులో రెహాన్ ఒక్కడే ఈ సమస్యను ఎదుర్కొన్నాడు.
మిగితా జట్టు సభ్యులందరూ తాము బసే చేసే హోటల్‌కు చేరుకున్నారు. రెహాన్ కాస్త ఆలస్యంగా జట్టుతో చేరాడు. కాగా అంతకుమందు మరో యువ స్పిన్నర్ షోయబ్ బషీర్‌కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. వీసా జారీలో జాప్యం కారణంగా జట్టుతో పాటు సకాలంలో భారత్ చేరుకోలేకపోయాడు.
చదవండి: IND vs ENG: సెంచరీల మోత మోగించాడు.. టీమిండియాలో చోటు కొట్టేశాడు! 3 ఏళ్ల తర్వాత
Comments
Please login to add a commentAdd a comment