Rehan Ahmed
-
శ్రీలంకతో టెస్ట్ సిరీస్.. మైఖేల్ వాన్, ఫ్లింటాఫ్ కుమారుల అరంగేట్రం
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్లు మైఖేల్ వాన్, ఆండ్రూ ఫ్లింటాఫ్ కుటుంబాల్లో రెండో తరం వచ్చింది. వీరిద్దరి కుమారులు ఆర్కీ వాన్, రాకీ ఫ్లింటాఫ్ ఒకేసారి ఇంగ్లండ్ అండర్-19 జట్టుకు ఎంపికయ్యారు. శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్‌తో వీరిద్దరు ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేయనున్నారు.ఆర్కీ, రాకీతో పాటు ప్రస్తుత ఇంగ్లండ్ టెస్ట్ జట్టు సభ్యులు జో డెన్లీ, రెహాన్ అహ్మద్ సంబంధీకులు కూడా ఇంగ్లండ్ అండర్-19 జట్టుకు ఎంపికయ్యారు. జో డెన్లీ అల్లుడు జైడన్ డెన్లీ.. రెహాన్ అహ్మద్ తమ్ముడు ఫర్హాన్ అహ్మద్ కూడా శ్రీలంక సిరీస్‌లో ఆడనున్నారు.ఆర్కీ వాన్, రాకీ ఫ్లింటాఫ్ విషయానికొస్తే.. ఈ ఇద్దరు అప్‌కమింగ్ క్రికెటర్లు తమ తండ్రుల లాగే బ్యాటింగ్, బౌలింగ్ స్టయిల్లను ఎంచుకున్నారు. ఆర్కీ తన తండ్రి లాగే రైట్ హ్యాండ్ టాపార్డర్ బ్యాటర్ కమ్ ఆఫ్ స్పిన్ బౌలర్ కాగా.. రాకీ ఫ్లింటాఫ్ తన తండ్రి ఆండ్రూ ఫ్లింటాఫ్లా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.ఆర్కీ వాన్, రాకీ ఫ్లింటాఫ్ ఒకేసారి అరంగేట్రం చేస్తున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్కీ, రాకీ ఒకేసారి తమ కెరీర్లు ప్రారంభించనుంటే.. మైఖేల్ వాన్, ఆండ్రూ ఫ్లింటాఫ్ కలిసి ఇంగ్లండ్ తరఫున 48 టెస్ట్‌లు (1999-2008) ఆడారు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్, శ్రీలంక అండర్-19 జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జులై 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. జులై 8, 16 తేదీల్లో రెండు మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.ఇంగ్లండ్ U19 స్క్వాడ్: హంజా షేక్ (కెప్టెన్), ఫర్హాన్ అహ్మద్, చార్లీ బ్రాండ్, జాక్ కార్నీ, జైద్న్ డెన్లీ, రాకీ ఫ్లింటాఫ్, కేశ్ ఫోన్సెకా, అలెక్స్ ఫ్రెంచ్, అలెక్స్ గ్రీన్, ఎడ్డీ జాక్, ఫ్రెడ్డీ మెక్కాన్, హ్యారీ మూర్, నోహ్ థైన్, ఆర్కీ వాన్. -
ఐదో టెస్టు నుంచి కీలక బౌలర్ అవుట్.. ప్రకటించిన ఇంగ్లండ్
India vs England Test Series 2024: ఇంగ్లండ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ స్వదేశానికి పయనమయ్యాడు. టీమిండియాతో మిగిలిన టెస్టుల నుంచి అతడు తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా రెహాన్ అహ్మద్ ఇంగ్లండ్‌కు పయనమయ్యాడని తెలిపింది. భారత్‌తో ఐదో టెస్టుకు అతడు అందుబాటులో ఉండడని తెలిపిన బోర్డు.. రెహాన్ అహ్మద్ స్థానంలో ఇతర ఆటగాడెవరికీ చోటు ఇవ్వలేదని వెల్లడించింది. కాగా 19 ఏళ్ల రెహాన్ అహ్మద్.. రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్నర్ . గతేడాది పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అరంగేట్ర మ్యాచ్‌లో మొత్తంగా ఏడు వికెట్లు తీసిన అహ్మద్.. టీమిండియాతో తాజా సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లలో ఆడాడు. లీచ్ లేని లోటు తీర్చాడు హైదరాబాద్, విశాఖపట్నం, రాజ్‌కోట్ టెస్టులలో ఆడిన ఈ యువ బౌలర్ మొత్తంగా పదకొండు వికెట్లు పడగొట్టాడు. సీనియర్ స్పిన్నర్ జాక్ లీచ్ జట్టులో లేనిలోటు తీర్చాడు. అయితే, రాంచి వేదికగా నాలుగో టెస్టులో మాత్రం అతడికి తుదిజట్టులో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ ఎమర్జెన్సీ దృష్ట్యా రెహాన్ అహ్మద్ సెలవు కోరినట్లు ఇంగ్లండ్ బోర్డు వెల్లడించింది. ధర్మశాల టెస్టులో అతడు ఆడబోడవడం లేదని స్పష్టం చేసింది. కాగా జాక్ లీచ్ ఇప్పటికే గాయం కారణంగా దూరం కాగా.. రెహాన్ రూపంలో మరో కీలక స్పిన్నర్ జట్టుకు దూరం కావడం ఎదురుదెబ్బ లాంటిదే! ఇదిలా ఉంటే.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా ఇంగ్లండ్‌పై రెండింట గెలిచి 2-1తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు.. ఈ సిరీస్ ఆరంభానికి ముందే ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాల దృష్ట్యా జట్లకు దూరమైన విషయం తెలిసిందే. చదవండి: IND vs ENG: దురదృష్టమంటే నీదే భయ్యా.. క్లీన్ బౌల్డ్ చేసి! వీడియో వైరల్ -
సిరాజ్ కళ్లు చెదిరే యార్కర్.. దెబ్బకు ఇంగ్లండ్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్
రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చేరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లతో సిరాజ్ అదరగొట్టాడు. పోప్, బెన్ ఫోక్స్, రెహన్ అహ్మద్ వంటి కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. ముఖ్యంగా రెహాన్ అహ్మద్‌ను సిరాజ్ ఔట్ చేసిన విధానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అహ్మద్‌ను అద్బుతమైన యార్కర్‌తో సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 70వ ఓవర్లో ఐదో బంతిని యార్కర్‌గా సంధించాడు. ఈ క్రమంలో సిరాజ్ వేసిన యార్కర్‌కు అహ్మద్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. అహ్మద్ బ్యాట్‌తో అడ్డుకునే లోపే బంతి ఆఫ్ స్టంప్‌ను గిరాటు వేసింది. ఇది చూసిన అహ్మద్‌కు దెబ్బకు ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 319 పరుగుల వద్ద ముగించింది. 207/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. అదనంగా 112 పరుగులు చేసి ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్(153) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. భారత బౌలర్లలో సిరాజ్‌తో పాటు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసింది. చదవండి: IND Vs ENG: సర్ఫరాజ్ ఖాన్‌ను ముంచేశాడు.. రోహిత్‌కు నచ్చలేదు! 𝗔𝗹𝗹 𝘁𝗮𝗿𝗴𝗲𝘁𝘀 🎯𝗱𝗲𝘀𝘁𝗿𝗼𝘆𝗲𝗱 🚀☝️ Siraj wraps up the England innings with finesse 🔥👏#INDvENG #JioCinemaSports #BazBowled #IDFCFirstBankTestSeries pic.twitter.com/WOO1DRVDHE — JioCinema (@JioCinema) February 17, 2024 -
ఇంగ్లండ్ క్రికెటర్‌కు వీసా సమస్య.. ఎయిర్‌పోర్ట్‌లోనే నిలిపివేత!?
భారత పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ జట్టును వీసా సమస్య వెంటాడుతోంది. తాజాగా మరో ఇంగ్లీష్ ఆటగాడికి వీసా సమస్య ఎదురైంది. ఇంగ్లండ్ జట్టు స్వల్ప విరామం తర్వాత మూడో టెస్టు కోసం దుబాయ్ నుంచి రాజ్‌కోట్‌కు సోమవారం చేరుకుంది. ఈ క్రమంలో సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో ఆ జట్టు ఆ యువ స్పిన్నర్ రెహాన్ అహ్మద్‌ను రాజ్‌కోట్ హిస్సోర్ విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. స్పోర్ట్‌స్టార్ రిపోర్ట్ ప్రకారం.. అహ్మద్ కేవలం సింగిల్-ఎంట్రీ వీసాను మాత్రమే కలిగి ఉన్నందున విమానాశ్రయంలో అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అయితే మూడో టెస్టుకు కేవలం రెండు రోజుల సమయం మాత్రమే ఉన్నందున అత్యవసర పరిస్థితి కింద స్ధానిక అధికారులు 2 రోజుల వీసాను రెహాన్‌కు మంజూరు చేసినట్లు సమాచారం. అదే విధంగా మరో రెండు రోజుల్లో వీసా సమస్యను పూర్తిగా పరిష్కరించాలని ఇంగ్లండ్ మేనెజ్మెంట్ అధికారులు సూచించినట్లు స్పోర్ట్‌స్టార్ తమ నివేదికలో పేర్కొంద. అయితే దుబాయ్ నుంచి వచ్చిన ఇంగ్లండ్ జట్టులో రెహాన్ ఒక్కడే ఈ సమస్యను ఎదుర్కొన్నాడు. మిగితా జట్టు సభ్యులందరూ తాము బసే చేసే హోటల్‌కు చేరుకున్నారు. రెహాన్ కాస్త ఆలస్యంగా జట్టుతో చేరాడు. కాగా అంతకుమందు మరో యువ స్పిన్నర్ షోయబ్ బషీర్‌కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. వీసా జారీలో జాప్యం కారణంగా జట్టుతో పాటు సకాలంలో భారత్ చేరుకోలేకపోయాడు. చదవండి: IND vs ENG: సెంచరీల మోత మోగించాడు.. టీమిండియాలో చోటు కొట్టేశాడు! 3 ఏళ్ల తర్వాత -
ఆండర్సన్ టెస్ట్‌ల్లో ఎంట్రీ ఇచ్చేనాటికి "ఆ ఇద్దరు" పుట్టనేలేదు..!
విశాఖ వేదికగా భారత్‌తో రేపటి నుంచి ప్రారంభంకాబోయే రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టును ఇదివరకే ప్రకటించారు. 41 ఏళ్ల ఇంగ్లండ్ వెటరన్ జేమ్స్ ఆండర్సన్ రేపటి మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. జట్టు కూర్పు కారణంగా తొలి టెస్ట్ ఆడే అవకాశం దక్కని ఆండర్సన్‌ను రెండో టెస్ట్‌లో బరిలోకి దించాలని ఇంగ్లండ్ మేనేజ్మెంట్ నిర్ణయించింది. ఆండర్సన్ ఎంట్రీతో తొలి టెస్ట్ ఆడిన మరో పేసర్ మార్క్ వుడ్‌పై వేటు పడింది. టీమిండియాపై, ప్రత్యేకించి భారత గడ్డపై ఘనమైన ట్రాక్ రికార్డు కలిగిన ఆండర్సన్ రేపటి మ్యాచ్‌లో ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి. ఈ మార్పుతో పాటు రెండో టెస్ట్ కోసం ప్రకటించిన ఇంగ్లండ్ తుది జట్టులో మరో మార్పు కూడా చోటు చేసుకుంది. తొలి టెస్ట్‌లో ఆడిన సీనియర్ స్పిన్నర్ జాక్ లీచ్ గాయపడటంతో అతని స్థానంలో పాక్ మూలాలున్న స్పిన్నర్ షోయబ్ బషీర్‌కు ఇంగ్లండ్ మేనేజ్మెంట్ అవకాశం కల్పించింది. ఈ రెండు మార్పులతో ఇంగ్లండ్ రేపటి నుంచి ప్రారంభంకాబోయే మ్యాచ్‌లో భారత్‌ను ఢీకొంటుంది. Shoaib Bashir and Rehan Ahmed were not even born when Jimmy Anderson made his Test debut. - Tomorrow Anderson will take the field with both Bashir and Rehan...!!! 🫡🐐 pic.twitter.com/i7PgpMVb5g — Mufaddal Vohra (@mufaddal_vohra) February 1, 2024 ఇదిలా ఉంటే, వెటరన్ పేసర్ ఆండర్సన్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర అంశం ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఆండర్సన్ టెస్ట్ అరంగేట్రం చేసే నాటికి అతని ప్రస్తుత సహచరుల్లో ఇద్దరు పుట్టనే లేదు. ఆండర్సన్ 2003, మే 22న తన తొలి టెస్ట్ మ్యాచ్ (జింబాబ్వేపై) ఆడగా.. ప్రస్తుత ఇంగ్లండ్ జట్టు సభ్యులు షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ అప్పటికి జన్మించలేదు. బషీర్ 2003, అక్టోబర్ 13న పుట్టగా.. రెహాన్ 2004, ఆగస్ట్ 13న జన్మించాడు. ఈ ఆసక్తికర అంశం గురించి తెలిసి ఆండర్సన్ ఫిట్నెస్ను, ఆట పట్ల అతనికి ఉన్న అంకితభావాన్ని అందరూ కొనియాడుతున్నారు. ఆండర్సన్ ప్రస్తుత పరిస్థితి చూస్తే, అతను మరో రెండేళ్లు కూడా ఆడేలా ఉన్నాడంటు కామెంట్లు చేస్తున్నారు. రేపటి మ్యాచ్‌లో ఆండర్సన్.. షోయబ్, రెహాన్లతో కలిసి బరిలోకి దిగనున్నాడు. ఇదిలా ఉంటే, ఆండర్సన్ ప్రస్తుతం టెస్ట్ క్రికెట్లో మూడో అత్యధిక వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. అతను 183 టెస్ట్‌లు ఆడి 690 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన ఘనత లంక దిగ్గజం ముత్తయ్య మురళీథరన్‌కు (800 వికెట్లు) దక్కింది. అతనికి తర్వాతి స్థానంలో షేన్ వార్న్ (708) ఉన్నాడు. వీరిద్దరి తర్వాతి స్థానాన్ని ఆండర్సన్ ఆక్రమించాడు. టీమిండియాతో రెండో టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్.