రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చేరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లతో సిరాజ్ అదరగొట్టాడు. పోప్, బెన్ ఫోక్స్, రెహన్ అహ్మద్ వంటి కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. ముఖ్యంగా రెహాన్ అహ్మద్‌ను సిరాజ్ ఔట్ చేసిన విధానం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అహ్మద్‌ను అద్బుతమైన యార్కర్‌తో సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 70వ ఓవర్‌లో ఐదో బంతిని యార్కర్‌గా సంధించాడు. ఈ క్రమంలో సిరాజ్ వేసిన యార్కర్‌కు అహ్మద్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది. అహ్మద్ బ్యాట్‌తో అడ్డుకునే లోపే బంతి ఆఫ్ స్టంప్‌ను గిరాటు వేసింది. ఇది చూసిన అహ్మద్‌కు దెబ్బకు ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 319 పరుగుల వద్ద ముగించింది. 207/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. అదనంగా 112 పరుగులు చేసి ఆలౌటైంది.
ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్(153) అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. భారత బౌలర్లలో సిరాజ్‌తో పాటు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసింది.
చదవండి: IND Vs ENG: సర్ఫరాజ్ ఖాన్‌ను ముంచేశాడు.. రోహిత్‌కు నచ్చలేదు!
𝗔𝗹𝗹 𝘁𝗮𝗿𝗴𝗲𝘁𝘀 🎯𝗱𝗲𝘀𝘁𝗿𝗼𝘆𝗲𝗱 🚀☝️
— JioCinema (@JioCinema) February 17, 2024
Siraj wraps up the England innings with finesse 🔥👏#INDvENG #JioCinemaSports #BazBowled #IDFCFirstBankTestSeries pic.twitter.com/WOO1DRVDHE
Comments
Please login to add a commentAdd a comment