ఐదో టెస్టుకు కీలక స్పిన్నర్ దూరం (PC: England Cricket)
India vs England Test Series 2024: ఇంగ్లండ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ స్వదేశానికి పయనమయ్యాడు. టీమిండియాతో మిగిలిన టెస్టుల నుంచి అతడు తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది.
వ్యక్తిగత కారణాల దృష్ట్యా రెహాన్ అహ్మద్ ఇంగ్లండ్‌కు పయనమయ్యాడని తెలిపింది. భారత్‌తో ఐదో టెస్టుకు అతడు అందుబాటులో ఉండడని తెలిపిన బోర్డు.. రెహాన్ అహ్మద్ స్థానంలో ఇతర ఆటగాడెవరికీ చోటు ఇవ్వలేదని వెల్లడించింది.
కాగా 19 ఏళ్ల రెహాన్ అహ్మద్.. రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్నర్ . గతేడాది పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అరంగేట్ర మ్యాచ్‌లో మొత్తంగా ఏడు వికెట్లు తీసిన అహ్మద్.. టీమిండియాతో తాజా సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లలో ఆడాడు.
లీచ్ లేని లోటు తీర్చాడు
హైదరాబాద్, విశాఖపట్నం, రాజ్‌కోట్ టెస్టులలో ఆడిన ఈ యువ బౌలర్ మొత్తంగా పదకొండు వికెట్లు పడగొట్టాడు. సీనియర్ స్పిన్నర్ జాక్ లీచ్ జట్టులో లేనిలోటు తీర్చాడు. అయితే, రాంచి వేదికగా నాలుగో టెస్టులో మాత్రం అతడికి తుదిజట్టులో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ ఎమర్జెన్సీ దృష్ట్యా రెహాన్ అహ్మద్ సెలవు కోరినట్లు ఇంగ్లండ్ బోర్డు వెల్లడించింది.
ధర్మశాల టెస్టులో అతడు ఆడబోడవడం లేదని స్పష్టం చేసింది. కాగా జాక్ లీచ్ ఇప్పటికే గాయం కారణంగా దూరం కాగా.. రెహాన్ రూపంలో మరో కీలక స్పిన్నర్ జట్టుకు దూరం కావడం ఎదురుదెబ్బ లాంటిదే!
ఇదిలా ఉంటే.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా ఇంగ్లండ్‌పై రెండింట గెలిచి 2-1తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు.. ఈ సిరీస్ ఆరంభానికి ముందే ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాల దృష్ట్యా జట్లకు దూరమైన విషయం తెలిసిందే.
చదవండి: IND vs ENG: దురదృష్టమంటే నీదే భయ్యా.. క్లీన్ బౌల్డ్ చేసి! వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment