Jack Leach
-
ఐదో టెస్టు నుంచి కీలక బౌలర్ అవుట్.. ప్రకటించిన ఇంగ్లండ్
India vs England Test Series 2024: ఇంగ్లండ్ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ స్వదేశానికి పయనమయ్యాడు. టీమిండియాతో మిగిలిన టెస్టుల నుంచి అతడు తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ధ్రువీకరించింది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా రెహాన్ అహ్మద్ ఇంగ్లండ్‌కు పయనమయ్యాడని తెలిపింది. భారత్‌తో ఐదో టెస్టుకు అతడు అందుబాటులో ఉండడని తెలిపిన బోర్డు.. రెహాన్ అహ్మద్ స్థానంలో ఇతర ఆటగాడెవరికీ చోటు ఇవ్వలేదని వెల్లడించింది. కాగా 19 ఏళ్ల రెహాన్ అహ్మద్.. రైటార్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్నర్ . గతేడాది పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అరంగేట్ర మ్యాచ్‌లో మొత్తంగా ఏడు వికెట్లు తీసిన అహ్మద్.. టీమిండియాతో తాజా సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌లలో ఆడాడు. లీచ్ లేని లోటు తీర్చాడు హైదరాబాద్, విశాఖపట్నం, రాజ్‌కోట్ టెస్టులలో ఆడిన ఈ యువ బౌలర్ మొత్తంగా పదకొండు వికెట్లు పడగొట్టాడు. సీనియర్ స్పిన్నర్ జాక్ లీచ్ జట్టులో లేనిలోటు తీర్చాడు. అయితే, రాంచి వేదికగా నాలుగో టెస్టులో మాత్రం అతడికి తుదిజట్టులో చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ ఎమర్జెన్సీ దృష్ట్యా రెహాన్ అహ్మద్ సెలవు కోరినట్లు ఇంగ్లండ్ బోర్డు వెల్లడించింది. ధర్మశాల టెస్టులో అతడు ఆడబోడవడం లేదని స్పష్టం చేసింది. కాగా జాక్ లీచ్ ఇప్పటికే గాయం కారణంగా దూరం కాగా.. రెహాన్ రూపంలో మరో కీలక స్పిన్నర్ జట్టుకు దూరం కావడం ఎదురుదెబ్బ లాంటిదే! ఇదిలా ఉంటే.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా ఇంగ్లండ్‌పై రెండింట గెలిచి 2-1తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు.. ఈ సిరీస్ ఆరంభానికి ముందే ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి వ్యక్తిగత కారణాల దృష్ట్యా జట్లకు దూరమైన విషయం తెలిసిందే. చదవండి: IND vs ENG: దురదృష్టమంటే నీదే భయ్యా.. క్లీన్ బౌల్డ్ చేసి! వీడియో వైరల్ -
భారత్‌తో టెస్ట్ సిరీస్.. ఇంగ్లండ్‌కు భారీ ఎదురుదెబ్బ
భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతున్న ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తొలి టెస్ట్ సందర్భంగా గాయపడ్డ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జాక్ లీచ్ తదుపరి సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం జట్టుతో పాటు అబుదాబీలో ఉన్న లీచ్ 24 గంటల్లో స్వదేశానికి బయల్దేరతాడని ఈసీబీ తెలిపింది. లీచ్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంపిక చేసే ఉద్దేశం లేదని ఈసీబీ పేర్కొంది. లీచ్ ఇంగ్లండ్ మరియు సోమర్సెట్ మెడికల్ టీమ్‌ల పర్యవేక్షణలో ఉంటాడని తెలిపింది. గాయం కారణంగా లీచ్ రెండో టెస్ట్‌లో కూడా ఆడలేదు. కాగా, ఈ సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమంగా ఉన్నాయి. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో గెలుపొందగా.. విశాఖలో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ 106 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజ్‌కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి మూడో టెస్ట్ మొదలవుతుంది. సిరీస్‌లోని తదుపరి మూడు మ్యాచ్‌ల కోసం భారత జట్టును నిన్న ప్రకటించారు. తొలి టెస్ట్ సందర్భంగా గాయపడ్డ జడేజా, రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చారు. విరాట్ కోహ్లి లీవ్‌ను పొడిగించుకున్నాడు. రెండో టెస్ట్ సందర్భంగా గాయపడ్డ శ్రేయస్ అయ్యర్ మిగతా సిరీస్‌కు దూరం కాగా.. ఆకాశ్‌దీప్ సింగ్ కొత్తగా జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కెఎల్ రాహుల్*, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా*, అక్షర్ పటేల్ , వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్ -
Ind vs Eng: ఇంగ్లండ్‌కు షాక్.. కీలక స్పిన్నర్ దూరం
టీమిండియాపై తొలి టెస్టులో జోరు మీదున్న ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కీలక స్పిన్నర్ జాక్ లీచ్ రెండో మ్యాచ్‌కు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మోకాలి కారణంగా అతడు విశాఖ టెస్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. ఈ నేపథ్యంలో జాక్ లీచ్ స్థానంలో పాక్ మూలాలున్న యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఉపఖండ పిచ్‌లపై బంతి బాగా టర్న్ అవుతుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ముగ్గురు స్పెషలిస్టు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. అనుభవజ్ఞుడైన జాక్ లీచ్‌తో పాటు యువ బౌలర్లు రెహాన్ అహ్మద్, టామ్ హార్లీలను తుదిజట్టులో ఆడించింది. వీరంతా మెరుగ్గా ఆడి జట్టు విజయంలో పాలుపంచుకోగా.. పార్ట్‌టైమ్ స్పిన్నర్ జో రూట్ కూడా అద్భుతంగా రాణించాడు. అరంగేట్ర బౌలర్ హార్లీ అత్యధికంగా తొమ్మిది వికెట్లు తీస్తే.. రూట్ ఐదు, రెహాన్ మూడు, జాక్ లీచ్ రెండు వికెట్లు పడగొట్టారు. అయితే, టీమిండియా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా జాక్ లీచ్ ఎడమ మోకాలికి గాయమైంది. ఇదిలా ఉంటే... బ్యాటర్ ఒలి పోప్ అద్భుత ఇన్నింగ్స్‌కు తోడు.. బౌలర్లు రాణించడంతో తొలి టెస్టులో ఇంగ్లండ్ టీమిండియా మీద 28 రన్స్ తేడాతో గెలిచింది. ఇరు జట్ల మధ్య విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2 నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్టేడియంలో రెండో మ్యాచ్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే టీమిండియా- ఇంగ్లండ్ ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు సిద్ధం కాగా.. జాక్ లీచ్ నెట్ సెషన్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: కోహ్లి కెప్టెన్‌గా ఉంటే టీమిండియా గెలిచేది: ఇంగ్లండ్ మాజీ సారథి -
ఇంగ్లండ్ క్రికెటర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం
ఇంగ్లండ్ వెటరన్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2021 సెప్టెంబర్‌లో టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పిన ఇతను.. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) విజ్ఞప్తి మేరకు అలీ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. దీంతో ఈసీబీ మొయిన్‌ను జూన్ 16 నుంచి ప్రారంభంకానున్న యాషెస్ సిరీస్‌కు ఎంపిక చేసింది. తొలి రెండు టెస్ట్‌లకు ఎంపిక చేసిన జట్టులోని జాక్ లీచ్ గాయపడటంతో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు మొయిన్‌ను రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కు తీసుకోవాలని ఈసీబీ కోరగా, అందుకు అతను అంగీకరించాడు. కాగా, మొయిన్ 2021లో టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాక రెడ్ బాల్‌తో కనీసం ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు కూడా ఆడలేదు. అయినా ఈసీబీ ఇతనిపై నమ్మకంతో రిటైర్మెంట్ను సైతం వెనక్కు తీసుకునేలా చేసి, జట్టులోకి ఆహ్వానించింది. మొయిన్ రాకతో ఇంగ్లండ్ బలం పుంజుకున్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఓ విషయం మాత్రం ఈసీబీని లోలోపల కలవరపెడుతుంది. అదేంటంటే.. మొయిన్‌కు ఆస్ట్రేలియాపై చెత్త రికార్డు ఉండటం. ఆసీస్‌పై 11 టెస్ట్‌లు ఆడిన మొయిన్.. బ్యాటింగ్‌లో కాస్త పర్వాలేదనిపించినా, బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. ఇతని యావరేజ్ ఆసీస్‌పై ఏకంగా 64.65గా ఉంది. ఇది అతని కెరీర్ యావరేజ్‌కు రెండింతలు. కెరీర్లో ఇప్పటివరకు 64 టెస్ట్‌లు ఆడిన మొయిన్.. 195 వికెట్లు పడగొట్టి, 2914 పరుగులు సాధించాడు. యాషెస్ సిరీస్ తొలి రెండు టెస్ట్‌లకు ఇంగ్లండ్ జట్టు.. హ్యారీ బ్రూక్, బెన్ డకెట్, జో రూట్, జాక్ క్రాలే, డేనియల్ లారెన్స్, బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, జానీ బెయిర్ స్టో, ఓలీ పోప్, జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, మాథ్యూ పాట్స్, జోష్ టంగ్, మార్క్ వుడ్, ఓలీ రాబిన్సన్, మొయిన్ అలీ ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య ఇంగ్లండ్ వేదికగా జరిగే యాషెస్ సిరీస్ షెడ్యూల్.. తొలి టెస్ట్, జూన్ 16-20, ఎడ్జ్‌బాస్టన్ రెండో టెస్ట్, జూన్ 28-జులై 2, లార్డ్స్ మూడో టెస్ట్, జులై 6-10, హెడింగ్లే నాలుగో టెస్ట్, జులై 19-23, ఓల్డ్ ట్రాఫర్డ్ ఐదో టెస్ట్, జులై 27-31, ఓవల్ చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వర్షం ముప్పు.. చివరి రెండు రోజుల్లో! -
యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు బిగ్ షాక్
జూన్ 16 నుంచి ప్రారంభం కాబోయే యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాలి ఫ్రాక్చర్ కారణంగా ఆ జట్టు స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్ సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు. తాజాగా ఐర్లాండ్‌తో ముగిసిన ఏకైక టెస్ట్ సందర్భంగా లీచ్ ఫ్రాక్చర్ కారణంగా ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. తదనంతరం జరిపిన స్కాన్‌లో లీచ్ పాదంలో పగుళ్లు గుర్తించినట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. లీచ్ ఐర్లాండ్‌తో జరిగిన టెస్ట్‌లో 4 వికెట్లు పడగొట్టగా.. ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా, 31 ఏళ్ల జాక్ లీచ్ 2018లో ఇంగ్లండ్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేసి 35 మ్యాచ్‌ల్లో 124 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 5 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. బ్యాటింగ్‌లో లీచ్ ఓ హాఫ్ సెంచరీ (92) సాధించాడు. 2019లో లీడ్స్‌లో జరిగిన టెస్ట్‌లో చివరి వికెట్‌కు బెన్ స్టోక్స్‌తో నెలకొల్పిన భాగస్వామ్యం లీచ్ కెరీర్లో హైలైట్‌గా నిలిచింది. ఆ మ్యాచ్‌లో లీచ్ చేసింది ఒక్క పరుగే అయినా వికెట్ పడకుంగా స్ట్రయిక్ రొటేట్ చేసి జట్టు విజయానికి దోహదపడ్డాడు. మరో ఎండ్‌లో స్టోక్స్ (135 నాటౌట్) చారిత్రక ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఆ మ్యాచ్‌లో లీచ్ సహకారంతో స్టోక్స్ చివరి వికెట్‌కు ఏకంగా 76 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇదిలా ఉంటే, 5 టెస్ట్ మ్యాచ్‌ల యాషెస్ సిరీస్ జూన్ 16న మొదలై, జులై 31తో ముగుస్తుంది. బిర్మింగ్హమ్ వేదికగా తొలి టెస్ట్ (జూన్ 16-20), లార్డ్స్‌లో రెండో టెస్ట్ (జూన్ 28-జులై 2), లీడ్స్‌లో మూడో టెస్ట్ (జులై 6-10), మాంచెస్టర్‌లో నాలుగో టెస్ట్ (జులై 19-23), ఓవల్ వేదికగా ఐదో టెస్ట్ (జులై 27-31) జరుగుతుంది. చదవండి: WTC Final IND VS AUS: ఐసీసీ ఫైనల్స్‌లో ఎవరెన్ని గెలిచారు..? -
జాక్ లీచ్ మాయాజాలం.. బిత్తరపోయిన బ్యాటర్! వీడియో వైరల్
NZ Vs Eng 2nd Test Day 3: న్యూజిలాండ్‌తో రెండో టెస్టు మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఫాలో ఆన్ ఆడుతున్న కివీస్‌కు శుభారంభం అందించిన డెవాన్ కాన్వేను పెవిలియన్(52.5 ఓవర్)కు పంపి తొలి వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. 61 పరుగులతో రాణించిన కాన్వేను బోల్తా కొట్టించి ఓపెనింగ్ జోడీని విడగొట్టాడు. జాక్ లీచ్ బాటలో జో రూట్ కూడా.. ప్రమాదకరంగా మారుతున్న టామ్ లాథమ్(83)ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. వీళ్లిద్దరూ కలిసి.. మెరుగ్గా ఆడుతున్న ఓపెనర్లను అవుట్ చేయడంతో కివీస్ కష్టాల్లో కూరుకుపోయింది. ఇదిలా ఉంటే... విల్ యంగ్ రూపంలో జాక్ లీచ్‌కు రెండో వికెట్ దక్కింది. అయితే, అతడిని లీచ్ అవుట్ చేసిన తీరు ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది. అరవై రెండో ఓవర్ నాలుగో బంతికి లీచ్ స్పిన్ మాయాజాలం ప్రదర్శించాడు. ఈ క్రమంలో ఆఫ్ స్టంప్ దిశగా వచ్చిన బంతిని అంచనా వేయలేకపోయాడు విల్ యంగ్. ముందుకు రావాలో లేదంటే క్రీజులోనే నిలబడాలో తెలియని సంకట స్థితిలో పడ్డాడు. డిఫెన్స్ చేద్దామని ప్రయత్నించేలోపే బంతి ఆఫ్ స్టంప్‌ను ఎగురగొట్టడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బౌల్డ్ అయిన విల్ యంగ్ 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిరాశగా నిష్క్రమించాడు. జాక్ లీచ్ అద్భుత డెలివరీకి సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. వెల్లింగ్టన్ టెస్టులో ఫాలో ఆన్ ఆడుతున్న న్యూజిలాండ్ మూడో రోజు ముగిసే సరికి 3 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. పర్యాటక ఇంగ్లండ్ కంటే ఇంకా 24 పరుగుల వెనుకబడి ఉంది. కేన్ విలియమ్సన్(25), హెన్రీ నికోల్స్(18) క్రీజులో ఉన్నారు. మరోవైపు.. బజ్‌బాల్ విధానంతో దూకుడు ప్రదర్శిస్తున్న స్టోక్స్ బృందం 8 వికెట్ల నష్టానికి 435 పరుగుల భారీ స్కోరు వద్ద తమ తిలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇక కివీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 209 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. చదవండి: BGT: దానర్థం జట్టు నుంచి తప్పించినట్లు కాదు! రాహుల్‌కు మరిన్ని అవకాశాలు! వైస్ కెప్టెన్‌గా అతడే సరైనోడు.. కాకపోతే.. Vijender Singh: ఉద్యోగం కోసమే మొదలెట్టాడు.. విధిరాత మరోలా ఉంది! ప్రమాదం కొనితెచ్చుకోవడం ఎందుకని వారించినా! That is a 𝙗𝙚𝙖𝙪𝙩𝙮 😍 The Nut with an absolute seed to dismiss Will Young 🔥 England turning the tide late on day 3 🌊#NZvENG pic.twitter.com/veyQdPadMM — Cricket on BT Sport (@btsportcricket) February 26, 2023 -
చెలరేగిన ఆండర్సన్, జాక్ లీచ్.. కష్టాల్లో కూరుకుపోయిన కివీస్
New Zealand vs England, 2nd Test- Day 2 Highlights: న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో ఇంగ్లండ్ బౌలర్లు అద్భుత ఆట తీరు కనబరుస్తున్నారు. రెండో రోజు ఆటలో వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ స్పిన్నర్ జాక్ లీచ్ కివీస్ బ్యాటింగ్ పతనాన్ని శాసించారు. కీలక వికెట్లు పడగొట్టి ఆతిథ్య జట్టుకు కోలుకోలేని షాకిచ్చారు. ఆండర్సన్, జాక్ లీచ్ విజృంభణతో శనివారం నాటి ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 297 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. భారీ ఆధిక్యంలో.. రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ న్యూజిలాండ్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా మౌంట్మాంగనీయ్లో జరిగిన తొలి టెస్టులో పర్యాటక ఇంగ్లండ్ 267 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ క్రమంలో వెల్లింగ్టన్లో శుక్రవారం(ఫిబ్రవరి 24) మొదలైన రెండో టెస్టులోనూ స్టోక్స్ బృందం ఆధిపత్యం కొనసాగిస్తోంది. తొలిరోజు ఆటలో ఇంగ్లండ్ 65 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (169 బంతుల్లో 184 బ్యాటింగ్; 24 ఫోర్లు, 5 సిక్స్‌లు) చెలరేగి సెంచరీ సాధించగా... జో రూట్ (182 బంతుల్లో 100 బ్యాటింగ్; 7 ఫోర్లు) కెరీర్లో 29వ సెంచరీ చేశాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 294 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. వర్షం కారణంగా తొలి రోజు ఆటను 65 ఓవర్ల వద్ద ముగించారు. బ్రూక్, రూట్ సెంచరీలతో చెలరేగి అంతకుముందు ఇంగ్లండ్ 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా బ్రూక్, రూట్ సెంచరీలతో ఆదుకున్నారు. ఈ క్రమంలో రెండో రోజు ఆటలో రూట్ 153 పరుగులతో అజేయంగా నిలవగా.. హ్యారీ బ్రూక్ తన స్కోరుకు మరో రెండు పరుగులు(186) జతచేసి అవుటయ్యాడు. మిగిలిన వాళ్లు పెద్దగా రాణించకపోవడంతో 87.1 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 435 పరుగుల వద్ద పర్యాటక ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు ఇంగ్లండ్ బౌలర్లు ఆది నుంచే చుక్కలు చూపించారు. చెలరేగిన ఆండర్సన్, జాక్ లీచ్ డెవాన్ కాన్వేను జేమ్స్ ఆండర్సన్ తొలి వికెట్ అందించగా.. మరో ఓపెనర్ టామ్ లాథమ్ వికెట్‌ను జాక్ లీచ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక విలియమ్సన్ 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆండర్సన్ బౌలింగ్‌లో వెనుదిరగగా.. 2 పరుగులకే విల్ యంగ్‌ను ఆండర్సన్ పెవిలియన్‌కు పంపాడు. వరణుడి ఆటంకం హెన్రీ నికోల్స్, డారిల్ మిచెల్ వికెట్లను జాక్ లీచ్ పడగొట్టాడు. మిచెల్ బ్రాస్‌వెల్ రూపంలో స్టువర్ట్ బ్రాడ్‌కు ఒక వికెట్ దక్కింది. ఇక వర్షం మరోసారి ఆటంకం కలిగించడంతో రెండో రోజు టీ బ్రేక్ సమయానికే ఆట ముగించాల్సి వచ్చింది. అప్పటికి కివీస్ 42 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు మాత్రమే చేసింది. ఇంగ్లండ్ కంటే 297 పరుగులు వెనుకబడింది సౌథీ బృందం. గత మ్యాచ్‌లో సెంచరీతో మెరిసిన వికెట్ కీపర్ బ్యాటర్ టామ్ బ్లండెల్ 25, కెప్టెన్ టిమ్ సౌథీ 23 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా తొలి టెస్టులో ఏడు వికెట్లు తీసిన ఆండర్సన్ ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్న విషయం తెలిసిందే. చదవండి: Ind Vs Aus: ఏదో ఒకటి చేయండి.. లేదంటే పోటుగాళ్లు కాదు.. పొట్లం అయిపోతారు! WTC NZ Vs SL: కివీస్‌తో సిరీస్‌కు లంక జట్టు ప్రకటన.. అదే జరిగితే టీమిండియాతో పాటు ఫైనల్లో! -
ఎంత కష్టం.. ఒకే ఒక్క వికెట్ కోసం చకోర పక్షుల్లా
రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ సంచలన విజయం నమోదు చేసింది. జీవం లేని పిచ్‌పై మ్యాచ్ నిర్వహించారంటూ విమర్శలు వ్యక్తమయిన వేళ ఇంగ్లండ్ బౌలర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. టెస్టు మ్యాచ్‌లో ఉండే అసలు మజాను రుచి చూపించారు. కానీ ఇంగ్లండ్ పాక్ రెండో ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్లు తీయడానికి ఎంత కష్టపడిందో తెలియదు కానీ చివరి వికెట్ తీయడానికి మాత్రం చాలా ఇబ్బంది పడింది. పాకిస్థాన్ చివరి జోడీ నసీమ్ షా, మహ్మద్ అలీ పదో వికెట్ పడకుండా చాలాసేపు అడ్డుకున్నారు.8.5 ఓవర్ల పాటు పోరాడి మ్యాచ్‌ను డ్రాగా ముగించడానికి ప్రయత్నించారు. ఓవైపు ఓవర్లు కరిగిపోతుండటంతో ఇంగ్లండ్ అన్ని విధాలుగా చివరి వికెట్ తీయడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే ఆ ఒక్క వికెట్ దక్కించుకోవడం కోసం చకోర పక్షుల్లా ఎదురుచూశారు. ఎంతలా అంటే జట్టులో ఉండే 11 మంది ఒక బ్యాటర్ చుట్టూ మోహరించారు. బౌలర్ వేసిన బంతి ఎటు కొడుదామన్న కచ్చితంగా ఫీల్డర్ చేతుల్లోకి వెళుతుంది. అలాంటి స్థితిలోనూ పాక్ బ్యాటర్లు కాసేపు ప్రతిఘటించారు. కానీ చివరికి స్పిన్నర్ లీచ్.. నసీమ్ షా (6)ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చడంతో ఇంగ్లండ్ గెలుపు సంబరాల్లో మునిగిపోయింది. ఇక 343 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో 268 రన్స్‌కు ఆలౌటైంది. ఒక దశలో పాక్ టార్గెట్ దిశగా దూసుకెళ్లి ఇంగ్లండ్‌ను భయపెట్టింది. ఇమాముల్ హక్ (48), అజర్ అలీ (40), సాద్ షకీల్ (76), మహ్మద్ రిజ్వాన్ (46), అఘా సల్మాన్ (30) తలా ఇన్ని పరుగులు చేశారు. అయితే ఇంగ్లండ్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ పాక్‌పై ఒత్తిడి పెంచారు. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 657 పరుగులు చేసింది. ఇంగ్లండ్ నుంచి నలుగురు బ్యాటర్లు శతకాలతో చెలరేగారు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ తామేం తక్కువ తిన్నామా అన్నట్లుగా చెలరేగింది. పాక్ బ్యాటర్లలో ముగ్గురు సెంచరీలతో కథం తొక్కడంతో తొలి ఇన్నింగ్స్‌లో 579 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఇంగ్లండ్‌కు 78 రన్స్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను ఇంగ్లండ్ 7 వికెట్లకు 264 పరుగుల వద్ద డిక్లేర్ చేసి పాకిస్థాన్ ముందు 342 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బౌలర్లలో ఓలీ రాబిన్సన్, జేమ్స్ ఆండర్సన్ నాలుగేసి వికెట్లు తీశారు. The final wicket to fall. Well played, @englandcricket#PAKvENG | #UKSePK pic.twitter.com/Rq3zFvPJSp — Pakistan Cricket (@TheRealPCB) December 5, 2022 చదవండి: ఫలితం రాదనుకున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ అద్బుతం -
Pak Vs Eng: బంతిని ఇలా కూడా షైన్ చేయొచ్చా? నెట్టింట వైరల్‌గా రూట్ చర్య
England tour of Pakistan, 2022 - Pakistan vs England, 1st Test: పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ చేసిన ఓ పని నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘బాల్‌ను ఇలా కూడా షైన్ చేయొచ్చా రూట్?’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్తాన్ గడ్డపై ఇంగ్లండ్ టెస్టు సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. సెంచరీల మోత మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు గురువారం ఆరంభమైంది. ఇందుకు వేదికైన రావల్పిండి పిచ్ పూర్తిగా నిర్జీవంగా ఉండటంతో ఇంగ్లిష్ బ్యాటర్లు సెంచరీల మోత మోగించిన విషయం తెలిసిందే. ఓపెనర్లు జాక్ క్రాలే(122), బెన్ డకెట్(107), ఓలీ పోప్(108), హ్యారీ బ్రూక్(153) పాక్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ఈ క్రమంలో 657 పరుగులకు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగియగా.. శుక్రవారం పాక్ తమ ఆట మొదలుపెట్టింది. ఈ క్రమంలో శనివారం లంచ్ బ్రేక్ సమయానికి 83 ఓవర్లలో3 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే.. పాక్ ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (114), ఇమామ్ ఉల్ హక్(121) సైతం సెంచరీలు చేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జో రూట్ బంతిని షైన్ చేసిన విధానం ఆసక్తికరంగా మారింది. బట్టతలపై అలా బంతిని పాక్ ఇన్నింగ్స్ 72వ ఓవరల్లో తమ స్పిన్నర్ జాక్ లీచ్‌ను దగ్గరికి పిలిచిన రూట్.. అతడి బట్టతలపై చెమటను ఉపయోగించి బాల్‌ను షైన్ చేయడానికి ప్రయత్నించాడు. ఇక ఆ మరుసటి ఓవర్లో రాబిన్సన్ బౌలింగ్‌లో పాక్ కేవలం రెండే పరుగులు రాబట్టడం విశేషం. కాగా కోవిడ్ నేపథ్యంలో బంతిపై సెలైవా(లాలా జలాన్ని) రుద్దడాన్ని నిషేధిస్తూ అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీని కారణంగా బంతిని షైన్ చేసే వీల్లేకుండా పోయింది. బౌలర్ స్వింగ్‌ను రాబట్టలేడు. దీంతో బ్యాటర్ పని సులువు అవుతుందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రూట్ బంతిని రుద్దడానికి ఈ పద్ధతిని ఎంచుకోవడం విశేషం. ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలా కూడా చేయొచ్చా? దీనిపై స్పందించిన నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ‘‘ఈ మ్యాచ్‌లో ఇప్పటి వరకు ఆరు సెంచరీలు. దీన్ని బట్టి పిచ్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే, రూట్ బ్యాటర్‌గా విఫలమైనా.. బంతిని షైన్ చేసే కొత్త విధానానికి శ్రీకారం చుట్టాడు. బట్టతలపై బంతిని షేన్ చేయడం.. బాగుంది.. మరుసటి ఓవర్లో 2 పరుగులు.. అంటే పాచిక పారినట్లేనా?’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రూట్ 23 పరుగులు చేశాడు. చదవండి: IND Vs BAN: షమీకి గాయం.. అతడి స్థానంలో యంగ్ బౌలర్.. బీసీసీఐ ప్రకటన IND-W vs AUS-W: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. టీమిండియాలో ఆదోని అమ్మాయి Joe Root shining the ball with the head of Jack Leach.#PAKvENG pic.twitter.com/iUSGJucAju — Akash Rajput (@Akashrajput66) December 3, 2022 Yes there's been 6 centuries in the first two innings of this test but undoubtedly the best moment so far is Joe Root shining the ball using gje sweat off Jack Leach's head 😂 #PAKvENG — Ross Barnett (@rbarnett08) December 3, 2022 Jack Root shines the ball by rubbing it on Jack Leach's bald, sweaty head. Finally X-wicket SCALP makes sense to me. #ENGvPAK #PakvsEng2022 #rawalpinditest — Stereotypewriter (@babumoshoy) December 3, 2022 -
ఐదేసిన జాక్ లీచ్.. ఇంగ్లండ్ టార్గెట్ 296
హెడింగ్లే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ రసకందాయంగా మారింది. 168/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా కివీస్ ఇంగ్లండ్‌కు 296 పరుగుల ఊరించే టార్గెట్‌ను నిర్ధేశించింది. కివీస్ బ్యాటర్లలో టామ్ లాథమ్ (76), డారిల్ మిచెల్ (56), టామ్ బ్లండెల్ (88 నాటౌట్) అర్ధశతకాలు సాధించగా.. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ 5, మ్యాటీ పాట్స్ 3, జేమీ ఓవర్టన్, జో రూట్ చెరో వికెట్ దక్కించుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లోనూ ఐదేసిన లీచ్.. తాజా ప్రదర్శనతో 10 వికెట్ల ఘనతను నమోదు చేశాడు. అంతకుముందు డారిల్ మిచెల్ (109), టామ్ బ్లండెల్ (55) రాణించడంతో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌట్ కాగా, ఇంగ్లండ్.. బెయిర్‌స్టో (157 బంతుల్లో 24 ఫోర్ల సాయంతో 162 పరుగులు) విధ్వంసకర ఇన్నింగ్స్ సాయంతో 360 పరుగులు చేసి స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. ఇక, 296 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉన్న ఇంగ్లండ్ గత మ్యాచ్ తరహాలోనే వేగంగా పరుగులు సాధించి న్యూజిలాండ్‌పై వరుసగా మూడో టెస్ట్ విజయాన్ని సాధించాలని భావిస్తుంది. ఇంగ్లండ్ బ్యాటర్లు ఆరంభం నుంచి కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి నాలుగో రోజు ఆఖరి సెషన్లో వీలైనన్ని పరుగులు సాధించాలని అనుకుంటారు. రెండో టెస్ట్‌లో బెయిర్‌స్టో (136), స్టోక్స్ (75 నాటౌట్) ఇదే ఫార్ములాను అప్లై చేసి సక్సస్ అయ్యారు. చదవండి: ఇంగ్లండ్ జట్టులోనూ కరోనా కలకలం.. కీలక ఆటగాడికి పాజిటివ్‌గా నిర్ధారణ -
Eng Vs NZ: ఇంగ్లండ్ స్పిన్నర్ తలకు గాయం.. ఆట మధ్యలోనే..
England Vs New Zealand 1st Test 2022 Day 1: న్యూజిలాండ్‌తో తొలి టెస్టు సందర్భంగా ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్ గాయపడ్డాడు. తలకు గాయం కావడంతో మొదటి టెస్టు నుంచి వైదొలిగాడు. మ్యాచ్ ఆరంభమైన తొలిరోజే జట్టును వీడాడు. అతడి స్థానంలో మ్యాట్ పార్కిన్సన్ జట్టులోకి వచ్చాడు. కాగా ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా కివీస్ లార్డ్స్ వేదికగా ఆతిథ్య జట్టుతో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో కివీస్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో జాక్ లీచ్ తలకు గాయమైంది. ఈ నేపథ్యంలో.. ‘‘ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో జాక్ లీచ్ గాయపడ్డాడు. కన్కషన్(తలకు దెబ్బ తగిలిన కారణంగా అపస్మార స్థితికి వెళ్లే అవకాశం)లక్షణాలు కనిపించాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం అతడు మొదటి టెస్టు నుంచి వైదొలిగాడు’’ అని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) గురువారం ప్రకటన విడుదల చేసింది. అతడి స్థానాన్ని పార్కిన్సన్తో భర్తీ చేసింది. దీంతో కన్కషన్ సబ్ట్యూట్గా అతడు ఎంట్రీ ఇచ్చాడు. ఇలా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు కేవలం ఫీల్డింగ్ చేసే అవకాశం మాత్రమే ఉంటుంది. కాగా కివీస్‌తో మ్యాచ్ సందర్భంగా మాథ్యూ పాట్స్ అనే కొత్త కుర్రాడు ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేశాడు. చదవండి 👇 IPL 2023: ఏడు కోట్లా! అంత సీన్ లేదు! సిరాజ్‌ను వదిలేస్తే.. చీప్‌గానే కొనుక్కోవచ్చు! Shakib Al Hasan: మరోసారి బంగ్లాదేశ్ టెస్టు కెప్టెన్‌గా షకీబ్ అల్ హసన్! Jack Leach has symptoms of concussion following his head injury whilst fielding. As per concussion guidelines, he has been withdrawn from this Test. We will confirm a concussion replacement in due course. 🏴 #ENGvNZ 🇳🇿 pic.twitter.com/stuy0CQbYD — England Cricket (@englandcricket) June 2, 2022 -
చరిత్రలో రెండోసారి మాత్రమే.. 145 ఏళ్ల రికార్డు బద్దలు
వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ టెయిలెండర్లు కొత్త చరిత్ర సృష్టించారు. తమ అసాధారణ బ్యాటింగ్‌తో 145 ఏళ్ల చరిత్రను తిరగరాశారు. వారిద్దరే ఇంగ్లండ్ బౌలర్లు జాక్ లీచ్, సాకిబ్ మహమూద్‌లు. తొలిరోజు ఆటలో ఇంగ్లండ్ జట్టు విండీస్ బౌలర్ల దాటికి కుదేలయ్యింది. ఓపెనర్ అలెక్స్ లీస్(31) మినహా మిగతా టాప్ ఆర్డర్, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఈ దెబ్బకు ఇంగ్లండ్ 67 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో క్రిస్ వోక్స్(25), క్రెయిగ్ ఓవర్టన్(14)లు ఇంగ్లండ్‌ను కాసేపు ఆదుకున్నారు. అయితే వరుస ఓవర్లలో ఈ ఇద్దరు ఔట్ కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అప్పటికి ఇంగ్లండ్ స్కోరు 9 వికెట్ల నష్టానికి 114. ఈ దశలో 10వ నెంబర్ బ్యాటర్ జాక్ లీచ్(41 నాటౌట్), సాకిబ్ మహమూద్(49) చివరి వికెట్‌కు రికార్డు స్థాయిలో 90 పరుగుల జత చేశారు. దీంతో ఇంగ్లండ్ 89.4 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌట్ అయింది. జాక్ లీచ్, సాకిబ్ మహమూద్‌లు విండీస్ బౌలర్లను నిలువరిస్తూ చూపించిన తెగువ సూపర్ అనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు కలిసి 145 ఏళ్ల చరిత్రను తిరగరాశారు. ఆఖరి వికెట్‌కు 10,11వ బ్యాట్స్మన్లు ఎక్కువ పరుగులు జోడించడం ఇది రెండోసారి మాత్రమే. ఇంతకముందు 1885లో ఇదే ఇంగ్లండ్‌కు చెందిన టామ్ గారెట్, ఎడ్విన్ ఎవన్స్లు సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగిన టెస్టులో ఆఖరి వికెట్‌కు 81 పరుగులు జోడించడమే ఇప్పటివరకు అత్యుత్తమంగా ఉండేది. తాజాగా ఆ రికార్డును జాక్ లీచ్, సాకిబ్ మహమూద్‌లు బద్దలు కొట్టారు. ఇక జో రూట్ సహా మిగతా టాప్ బ్యాట్స్‌మన్ అంతా దారుణంగా విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో జైడెన్ సీల్స్ మూడు, కీమర్ రోచ్, కైల్ మేయర్స్, అల్జారీ జోసెఫ్‌లు తలా రెండు వికెట్లు తీశారు. -
Ashes: అభిమాని గుండుపై క్రికెటర్ ఆటోగ్రాఫ్.. వీడియో వైరల్
వెర్రి వేయి రకాలు అంటారు... మనం చెప్పుకోబోయే ఓ వీరాభిమానికి ఈ సామెత చక్కగా సరిపోతుంది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా- ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుని.. ఇంగ్లండ్‌ను ఫీల్డింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ఇంగ్లండ్ స్పిన్నర్ జాక్ లీచ్‌ను ఆటోగ్రాఫ్ ఇవ్వాల్సిందిగా ఓ అభిమాని కోరాడు. తన గుండుపై సంతకం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. ఇందుకు సానుకూలంగా స్పందించిన జాక్ లీచ్ చకాచకా వచ్చి ఆటోగ్రాఫ్ ఇచ్చేసి వెళ్లిపోయాడు. చుట్టూ ఉన్న ప్రేక్షకులు ముందు ఆశ్చర్యపోయినా.. ఆ తర్వాత సంతోషంతో చప్పట్లు కొట్టారు. తొలి రోజు ఆటలో భాగంగా ఈ ఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక నెటిజన్లు ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ‘‘అరె ఏంట్రా ఇది... గుండుపై ఆటోగ్రాఫ్.. ఏంటో నీ పిచ్చి అభిమానం’’ అంటూ ఫన్నీ మీమ్స్ షేర్ చేస్తున్నారు. కాగా మొదటి రోజు ఆటకు వరణుడు పదే పదే ఆటంకం కలిగించాడు. ఇక రెండో రోజు ఆటలో భాగంగా 416 పరుగుల వద్ద ఆతిథ్య ఆసీస్ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా... ఇంగ్లండ్ బ్యాటింగ్ కొనసాగిస్తోంది. చదవండి: Ashes: రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ... సెంచరీతో సత్తా చాటాడు.. భావోద్వేగం.. వైరల్ IND Vs SA 2nd Test Day 3: మీ అరుపులకు గుండెపోటు వచ్చేలా ఉంది.. టీమిండియా ఆటగాళ్లపై అంపైర్ అసహనం Jack Leach signing a guy's head 😂 #Ashes pic.twitter.com/g6JL6xaqiC — 7Cricket (@7Cricket) January 5, 2022