భారత్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతున్న ఇంగ్లండ్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తొలి టెస్ట్ సందర్భంగా గాయపడ్డ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జాక్ లీచ్ తదుపరి సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం జట్టుతో పాటు అబుదాబీలో ఉన్న లీచ్ 24 గంటల్లో స్వదేశానికి బయల్దేరతాడని ఈసీబీ తెలిపింది.
లీచ్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిని ఎంపిక చేసే ఉద్దేశం లేదని ఈసీబీ పేర్కొంది. లీచ్ ఇంగ్లండ్ మరియు సోమర్‌సెట్ మెడికల్ టీమ్‌ల పర్యవేక్షణలో ఉంటాడని తెలిపింది. గాయం కారణంగా లీచ్ రెండో టెస్ట్‌లో కూడా ఆడలేదు.
కాగా, ఈ సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్ జట్లు చెరో మ్యాచ్ గెలిచి సమంగా ఉన్నాయి. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 28 పరుగుల తేడాతో గెలుపొందగా.. విశాఖలో జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ 106 పరుగుల తేడాతో విజయం సాధించింది. రాజ్‌కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి మూడో టెస్ట్ మొదలవుతుంది.
సిరీస్‌లోని తదుపరి మూడు మ్యాచ్‌ల కోసం భారత జట్టును నిన్న ప్రకటించారు. తొలి టెస్ట్ సందర్భంగా గాయపడ్డ జడేజా, రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చారు. విరాట్ కోహ్లి లీవ్‌ను పొడిగించుకున్నాడు. రెండో టెస్ట్ సందర్భంగా గాయపడ్డ శ్రేయస్ అయ్యర్ మిగతా సిరీస్‌కు దూరం కాగా.. ఆకాశ్‌దీప్ సింగ్ కొత్తగా జట్టులోకి వచ్చాడు.
ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కెఎల్ రాహుల్*, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), కెఎస్ భరత్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా*, అక్షర్ పటేల్ , వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్
Comments
Please login to add a commentAdd a comment