ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి చొరవ
నేడు నాగులపేటకు రాక
కరీంనగర్: రాయికల్ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన చింతలపెల్లి అఖిలేందర్‌రెడ్డి ఉపాధి నిమిత్తం అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన భార్య కేతిరెడ్డి శ్రుతిరెడ్డి తండ్రి కోరుట్ల మండలం నాగులపేటకు చెందిన మోహన్‌రెడ్డి ఈ నెల 5న రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తన తండ్రి అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 6న డల్లాస్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరగా.. ఖత్తర్ ఎయిర్‌వేస్ సిబ్బంది ఆరు నెలల చిన్నారికి యశ్నకు ఫెలైట్ ఎక్కడానికి అనుమతించలేదు.
శ్రుతిరెడ్డి భారతీయ పౌరురాలు. అమెరికాలో జన్మించిన ఆమె కూతురు యశ్నకు అమెరికా పౌరసత్వం ఉన్నా.. భారతీయ మూలాలున్నవారికి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా(ఓసీఈ) కార్డు లేదా ఇండియా విజిట్ వీసా ఉండాలి. ఈ ఆరు నెలల పాపకు ఈ రెండు లేకపోవడంతో.. అక్కడ ఖత్తర్ ఎయిర్‌వేస్ సిబ్బంది ఫెలైట్ ఎక్కడానికి అనుమతి ంచలేదు.
విషయం తెలుసుకున్న అఖిలేందర్ తండ్రి కొత్త పేట మాజీ ఎంపీటీసీ చింతలపెల్లి గంగారెడ్డి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి దృష్టికి శనివారం తీసుకెళ్లగా.. వెంటనే స్పందించిన జీవన్‌రెడ్డి తెలంగాణ ఎన్నారై అధికారి చిట్టిబాబు, టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి సమన్వయంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అధికారులతో మాట్లాడి చిన్నారి యశ్నకు అత్యవసర వీసా ఇప్పించారు. దీంతో ఊపిరి పీల్చుకున్న చిన్నారి కుటుంబ సభ్యులు ఆదివారం అంత్యక్రియల కోసం ఫైలెట్‌లో బయలుదేరారు. సోమవారం నాగులపేటలో కేతిరెడ్డి మోహన్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని అంతిమ వీడ్కోలు పలకనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment