సాక్షి, న్యూఢిల్లీ: 2023లో భారతీయులకు 14 లక్షల వీసాలను జారీ చేసినట్లు ఢిల్లీలోని అమెరికా దౌత్య కార్యాలయం తెలిపింది. 2022తో పోలిస్తే ఇది 60 శాతం ఎక్కువని వివరించింది. ఏ దేశానికీ ఇన్ని వీసాలు జారీ కాలేదని పేర్కొంది. విజిటింగ్ వీసా అపాయింట్‌మెంట్ వెయిటింగ్ సమయం 1,000 రోజుల నుంచి 250 రోజులకు (75 శాతం) తగ్గిందని పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి 10 మందిలో ఒకరు భారతీయులేనని ప్రకటించింది. బీ1, బీ2 కేటగిరీల విజిటర్ వీసాల కోసం మునుపెన్నడూ లేనంతగా 7 లక్షల దరఖాస్తులు అందాయని తెలిపింది. స్టూడెంట్ వీసాల జారీలో దేశంలో ముంబై, డిల్లీ, హైదరాబాద్, చెన్నై టాప్‌లో ఉన్నాయంది. అమెరికాలో చదివే 10 లక్షల పైచిలుకు అంతర్జాతీయ విద్యార్థుల్లో 2.5 లక్షల మంది భారతీయులేనని ఢిల్లీ ఎంబసీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment