ప్రపంచవ్యాప్తంగా బాగా జనాదరణ పొందిన మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ లలో వాట్సాప్ ఒకటి. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో తీసుకొచ్చే వాట్సాప్ ఇప్పుడు కొత్తగా రాబోయే అప్‌డేట్‌తో యూజర్స్‌కి షాకివ్వబోతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 8 నుండి కొత్త నిబంధనలు తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త టర్మ్స్ అండ్ కండీషన్స్‌ను అంగీకరించని వాట్సప్ వివినియోగదారుల ఫోన్లలో పనిచేయదని వాట్సప్ తన బ్లాగ్ ద్వారా తెలిపింది. కొత్తగా తీసుకురాబోయే టర్మ్స్ అండ్ కండీషన్స్ యొక్క స్క్రీన్ షాట్స్ ని వాబీటాఇన్‌ఫోలో షేర్ చేసింది. ఈ స్క్రీన్ షాట్ లో కొత్త నిబంధనలను అంగీకరించండి లేదా మీ వాట్సప్ ఖాతాను డిలీట్ చేసుకోండి అని ఉంది. (చదవండి: వాట్సాప్ vs టెలిగ్రామ్: ఏది సేఫ్?)
సాధారణంగా వాట్సాప్ పరీక్షా దశలో లేదా ఇంకా విడుదల చేయని ఫీచర్స్ పై వ్యాఖ్యానించదు. కానీ ఈ సారి కొత్తగా త్వరలో తీసుకురాబోయే టర్మ్స్ అండ్ కండీషన్స్‌ను షేర్ చేసింది. వాట్సాప్ కొత్త అప్‌డేట్ లో యూజర్ డేటాను వాట్సాప్ మాతృ సంస్థ ఫేస్‌బుక్ ఎలా ఉపయోగిస్తుందనేది దానిపై మరింత సమాచారంతో రానున్నట్లు తెలిపింది. అలానే ఫేస్‌బుక్ అందించే అన్ని రకాల సేవలకు సంబంధించిన ఛాటింగ్ సమాచారాన్ని వ్యాపార అవసరాల కోసం ఎలా ఉపయోగిస్తారనేది కూడా అందులో తెలియజేయనున్నట్లు తెలిపింది. అలాగే 2021 ఫిబ్రవరి 8 తర్వాత కొత్తగా తీసుకొచ్చిన టర్మ్స్ అండ్ కండీషన్స్‌ను అంగీకరించని యూజర్ల వాట్సప్ అకౌంట్ డిలీట్ కానున్నట్లు స్క్రీన్ షాట్ లో తెలిపింది. త్వరలో ఈ కొత్త నిబంధనలను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
19 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంలో భాగంగా ఫేస్‌బుక్ 2014లో కొనుగోలు చేసినప్పటి నుండి ఇది ఎలా పనిచేస్తుందనే దానిపై వాట్సాప్ విమర్శలను ఎదుర్కొంది. గోప్యత మరియు డేటా భద్రత గురించి ఆందోళనల మధ్య 2018లో వాట్సాప్ వ్యవస్థాపకుడు జాన్ కౌమ్ సంస్థ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవి నుంచి వైదొలిగారు. "ఈ రోజుల్లో కంపెనీలు మీ గురించి, మీ స్నేహితులు, మీ ఆసక్తుల గురించి అక్షరాలా ప్రతిదీ తెలుసు, మరియు వారు ప్రకటనల అమ్మకం కోసం ఇవన్నీ ఉపయోగిస్తారు" అని ఫేస్బుక్ అమ్మకానికి ముందు బ్లాగ్ పోస్ట్‌లో రాశారు.
Comments
Please login to add a commentAdd a comment