సాక్షి,న్యూఢిల్లీ: వాట్సాప్ ఎప్పటికప్పడు కొత్త కొత్త ఫీచర్లతో అప్‌డేట్స్‌ను అందిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే మరో ఫీచర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. గత వారం ప్లేఫుల్ పియోమరు అనే యానిమేటెడ్ స్టిక్కర్లు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పుడు వాట్సాప్ వాటికి మరి కొన్ని స్టిక్కర్లను జత చేయనుంది. (వాట్సాప్‌లో హోంవర్క్)
చుమ్మీ చుమ్ చుమ్స్, రికోస్ స్వీట్ లైఫ్, బ్రైట్ డేట్, మూడీ ఫుడీస్ అనే యానిమేటెక్ స్టిక్కర్లను వాట్సప్ తన స్టోర్ ద్వారా అందించనుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్స్‌లో కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటిని వాట్సాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్టోర్‌లో కనిపించని వారు కొన్ని రోజుల తరువాత వాటిని డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు వాట్సాప్ ను మెసెంజర్‌తో కలపాలనే ఆలోచనలో ఫేస్‌బుక్ ఉంది. దీని ద్వారా మెసేంజర్, వాట్సాప్ రెండు ఫ్లాట్‌ఫ్లాంల ద్వారా కూడా వినియోగదారులు కలుసుకోవచ్చు. ఇది ఇంకా ప్రయోగత్మాక దశలోనే ఉంది. త్వరలో దీన్ని అందుబాటులోకి తెచ్చే ఆలోచనలో ఫేస్‌బుక్ ఉంది. (వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. మల్టీ లాగిన్)
Comments
Please login to add a commentAdd a comment