అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి, మరోవైపు ఆర్థిక మాంద్యం భయాలు వెరసి కంపెనీలకు కునుకు లేకుండా చేస్తోంది. దీంతో దిగ్గజ సంస్థలు సైతం లేఆఫ్‌ల మంత్రం అనుసరిస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ఖర్చులు తగ్గించుకునే చర్యల్లో భాగంగా తమ సిబ్బందిని తగ్గించుకుంటూ పోతున్నాయి. ఈ జాబితాలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కూడా చేరింది. ప్రపంచవ్యాప్తంగా జరగుతున్న పరిణామాలు, కంపెనీ నష్టాలను తగ్గించుకునేందుకు సంస్థలోని 18వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు అమెజాన్ ప్రకటించింది. గతంలో కూడా ఈ దిగ్గజ ఈ కామర్స్ సంస్థ ఉద్యోగులను ఇంటికి సాగనంపిన సంగతి తెలిసిందే.
18 వేల మంది తొలగింపు
‘ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని మేము నవంబర్‌లోనే ప్రకటించాము. ప్రస్తుతం 18,000 సిబ్బందిని తొలగించాలని ప్లాన్ చేస్తున్నామని’ సీఈఓ ఆండీ జాస్సీ ఒక ప్రకటనలో తెలిపారు. జాస్సీ మాట్లాడుతూ.. ఈ ఉద్యోగాల తొలగింపు చాలా మందిని ప్రభావితం చేస్తాయని తెలుసు, కానీ కంపెనీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఈ లేఆఫ్‌లు వల్ల ప్రభావితమైన వారికి సపోర్ట్ ఇచ్చేందుకు కంపెనీ సహకరిస్తుందన్నారు. వారి చెల్లింపులు, ఆరోగ్య బీమా ప్రయోజనాలు, వేరే కంపెనీలో ఉద్యోగం కోసం కావాల్సిన సపోర్ట్ వంటి ప్యాకేజీలను అందిస్తున్నామని చెప్పారు. కొన్ని తొలగింపులు యూరప్‌లో ఉంటాయని, జనవరి 18 నుంచి ఎవరని తొలగించారనేది తెలుస్తుందని జాస్సీ చెప్పారు. ప్రస్తుతం 3 లక్షల మంది ఉద్యోగులుండగా.. తాజా నిర్ణయాలతో 6 శాతం మంది ఉద్యోగులు ఇంటి బాటపట్టనున్నారు.
చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన రైల్వే శాఖ.. జనరల్ టికెట్ కోసం క్యూలో నిలబడక్కర్లేదు!
Comments
Please login to add a commentAdd a comment