న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విరుచుకుపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పిందని మండిపడ్డారు. దేశ ఆర్థిక మందగమనం తొలగిపోయే సూచనలే కనిపించడం లేదన్న ఓ మీడియా కథనాన్ని ఉటంకిస్తూ.. దేశంలోకి ఆర్థిక మాంద్యం పూర్తిస్థాయిలో ముంచుకొస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అసమర్థురాలని విమర్శించిన రాహుల్.. త్వరలోనే ఈ మాంద్యం నుంచి బయటపడతామని ఆమె చెప్తే నమ్మవద్దని, మందగమనం నుంచి మాంద్యం శరవేగంగా ముంచుకొస్తుందని ఆయన ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment