ప్రపంచ దేశాల్లో ఆయా దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఈబే గ్లోబల్‌గా 4 శాతం వర్క్ ఫోర్స్‌తో భాగమైన సుమారు 500 మందిని విధుల నుంచి తొలగించింది. ఈ సందర్భంగా ఈబే సీఈవో జామీ ఇయనోన్ లేఆఫ్స్ ధృవీకరిస్తూ యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ కమిషన్ ఫైలింగ్‌లో తెలిపారు.
తన కస్టమర్‌లకు మెరుగైన ఎండ్-టు-ఎండ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు, ప్లాట్‌ఫారమ్‌లో మరిన్ని ఇన్నోవేషన్స్, కంపెనీ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు తీసుకున్న చర్యల్లో ఈ లేఫ్స్ భాగమని ఇయనోన్ చెప్పారు.
ఈ మార్పు అధిక పెట్టుబడులు పెట్టేందుకు, భవిష్యత్‌లో కొత్త ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దోహద పడుతుంది. కొత్త టెక్నాలజీలు, కస్టమర్ ఇన్నోవేషన్‌లు, మారుతున్న మ్యాక్రో,ఇ-కామర్స్, టెక్నాలజీ రంగాలకు అనుగుణంగా కంపెనీ కార్యకలాపాల్ని కొనసాగించేలా ప్రభావవంతంగా, మరింత వేగంతో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఫైలింగ్ నోట్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment