ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే మూడేళ్లలో ఐరోపాలో 3,800 మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితులు, మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ దృష్ట్యా ఖర్చుల్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది.
ఇందులో భాగంగా జర్మనీలో 2,300 మందిని, యూకేలో 200 మందిని తొలగిస్తున్నట్లు ఫోర్డ్ వెల్లడించింది. ఈ సందర్భంగా ఫోర్డ్ భవిష్యత్ ప్రణాళికల్ని వివరించింది.
2035 నాటికల్లా యూరప్ అంతటా ఈవీ కార్లను అమ్మాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని, ఈ ఏడాదిలోనే కంపెనీ ఐరోపాలో తయారు చేసిన తొలి విద్యుత్తు కారును విడుదల చేయనున్నట్లు ఆ సంస్థ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇక కొనుగోలు దారులు ఈవీ కార్ల కొనుగోళ్లకు మొగ్గుచూపుతున‍్న తరుణంలో ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగుల అవసరం తక్కువ ఉంటుందని భావిస్తుంది. యూరప్‌లో 3,400 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఉండగా.. 2025 నాటికి వారిలో 2,800 మంది ఇంజనీర‍్లకు పింక్ స్లిప్‌లు జారీ చేయనుంది. ఇక మిగిలిన 1000 మందిని అడ్మినిస్ట్రేటీవ్ విభాగాల నుంచి తొలగించనున్నట్లు తెలుస్తోంది.
ఇది అంత్యత కఠినమైన నిర్ణయం. మా టీం సభ్యుల మధ్య ఈ తొలగింపులతో అనిశ్చితి నెలకొంది. తొలగించిన ఉద్యోగులకు మా మద్దతు ఉంటుందని యూరప్ ఫోర్డ్ ఈ మోడల్ జనరల్ మేనేజర్ మార్టిన్ సుందర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment