eBay Company
-
ఆర్ధిక మాంద్యం గుప్పిట్లో ఈకామర్స్.. వందల మందిని ఫైర్ చేసిన ఈబే
ప్రపంచ దేశాల్లో ఆయా దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఈబే గ్లోబల్‌గా 4 శాతం వర్క్ ఫోర్స్‌తో భాగమైన సుమారు 500 మందిని విధుల నుంచి తొలగించింది. ఈ సందర్భంగా ఈబే సీఈవో జామీ ఇయనోన్ లేఆఫ్స్ ధృవీకరిస్తూ యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ కమిషన్ ఫైలింగ్‌లో తెలిపారు. తన కస్టమర్లకు మెరుగైన ఎండ్-టు-ఎండ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు, ప్లాట్‌ఫారమ్‌లో మరిన్ని ఇన్నోవేషన్స్, కంపెనీ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు తీసుకున్న చర్యల్లో ఈ లేఫ్స్ భాగమని ఇయనోన్ చెప్పారు. ఈ మార్పు అధిక పెట్టుబడులు పెట్టేందుకు, భవిష్యత్‌లో కొత్త ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దోహద పడుతుంది. కొత్త టెక్నాలజీలు, కస్టమర్ ఇన్నోవేషన్లు, మారుతున్న మ్యాక్రో,ఇ-కామర్స్, టెక్నాలజీ రంగాలకు అనుగుణంగా కంపెనీ కార్యకలాపాల్ని కొనసాగించేలా ప్రభావవంతంగా, మరింత వేగంతో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఫైలింగ్ నోట్లో పేర్కొన్నారు. -
ఫేస్‌బుక్‌ను బద్నామ్ చేసింది అతడేనా..!
Facebook Whistleblower Frances Haugen Funded By Founder Of Ebay: గత కొద్ది రోజుల నుంచి ఫేస్‌బుక్‌పై అనేక ఆరోపణలు వస్తోన్న విషయం తెలిసిందే. కొంతమంది వ్యక్తుల కోసమే ఫేస్బుక్ పనిచేస్తుదంటూ వాల్ స్ట్రీట్ జర్నల్ కంపెనీపై దుమ్మెతి పోసింది. కొంత మంది వీఐపీల ప్రైవసీ విషయంలో ఫేస్బుక్ వారిని అందలాలను ఎక్కిస్తోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ ఆరోపణలు చేయగా... జర్నల్‌తో పాటుగా ఫేస్బుక్ విజిల్‌బ్లోయర్ ఫ్రాన్సెస్ హాగెన్ అనే మాజీ ఉద్యోగిని కూడా కంపెనీపై తీవ్ర ఆరోపణలను చేసింది. చదవండి: Facebook: నువ్వేం తోపు కాదు..! చట్టం ముందు అందరు సమానులే..! ఫేస్బుక్ విజిల్ బ్లోయర్ వెనుక..! ఫేస్బుక్ దృష్టిలో యూజర్ల‘భద్రత కంటే లాభాలే ముఖ్యం’ అంటూ యూఎస్ కాంగ్రెస్ వేదికగా పలు సంచలన రహస్య పత్రాలను ఫేస్బుక్ విజిల్‌బ్లోయర్ తెలిపింది. సంచలన విషయాలను బయటపెట్టిన ప్రాన్సెస్ హాగెన్ వెనుక ఎదో అదృశ్య శక్తి ఉండే ఉంటుందని పలువురు నిపుణులు భావించారు. ఇప్పుడు అదే నిజమైంది. యూఎస్ కాంగ్రెస్ ఎదుట ఫేస్బుక్ పరువు తీసిన ఫేస్బుక్ మాజీ ఉద్యోగి హాగెన్ వెనుక ఈబే వ్యవస్థాపకుడు పియరీ ఒమిడ్యార్ ఉన్నట్లు ప్రముఖ యూఎస్ మీడియా సంస్థ పొలిటికో వెల్లడించింది. గత ఏడాది ఈబే సంస్థ సుమారు 150000 లక్షల (సుమారు రూ. 1.12 కోట్లు)డాలర్లను ఫ్రాన్సెస్ హాగెన్ విరాళంగా ఇచ్చినట్లు పొలిటికో పేర్కొంది. పియరీ ఒమిడ్యార్కు చెందిన సంస్థ లూమినేట్ ఫ్రాన్సెస్ హాగెన్కు యూరప్‌లో కూడా పీఆర్ సేవలను అందించింది. కాగా పొలిటికో వెల్లడించిన పలు అంశాలపై హాగెన్, ఒమిడ్యార్ ఎలాంటి వ్యాఖ్యలను చేయలేదు. పియరీ టెక్ క్రిటిక్..! పియరీ ఓమిడ్యార్ సుప్రసిద్థ టెక్ క్రిటిక్. పలు దిగ్గజ టెక్ కంపెనీలను విమర్శించడంలో పియరీ ఎప్పుడు ముందుంటారు. గతంలో హవాయిలో స్వతంత్ర జర్నలిజం కోసం తన వంతుగా న్యాయవాద ప్రయత్నాలను, కంపెనీల గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా అనేక ప్రచారాలు, పలు కంపెనీల్లోని ఉద్యోగులకు క్రియాశీల మద్దతును పియరీ అందించారు. చదవండి: ఫేస్బుక్ పేరు మార్పు..! కొత్త పేరు ఇదేనా...! -
ఇన్సైడర్ ట్రేడింగ్ కేసులో ఇద్దరు ఎన్నారై డాక్టర్లు
న్యూయార్క్: ఇన్సైడర్ ట్రేడింగ్ ద్వారా 3,00,000 డాలర్ల మేర అనుచిత లబ్ధ్ది పొందారంటూ ఆరుగురిపై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. వీరిలో సుకేన్ షా, షిముల్ షా అనే ఇద్దరు ప్రవాస భారతీయ డాక్టర్లు ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. జీఎస్ఐ కామర్స్ అనే సంస్థను 2011లో ఈబే సంస్థ కొనేందుకు సిద్ధమైంది. సదరు జీఎస్ఐ కామర్స్ సీఈవో క్రిస్టొఫర్ సారిడాకిస్.. ఈ విషయాన్ని అనధికారికంగా సుకేన్, షిముల్ తదితరులకు తెలియజేశారు. దీంతో ఆ కంపెనీ షేర్లలో ట్రేడింగ్ చేయడం ద్వారా వీరు లాభాలు పొందారని అభియోగాలు ఉన్నాయి. మొత్తం మీద కేసు సెటిల్ చేసుకోవాలంటే ఎన్నారై డాక్టర్లతో పాటు అయిదుగురు ట్రేడర్లు 4,90,000 డాలర్లు చెల్లించాలని న్యాయస్థానం ఆదే శించింది. క్రిస్టోఫర్‌పై 6,64,822 డాలర్ల పెనాల్టీ విధించింది.