కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని అంచనా వేస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది మాంద్యంలోకి జారుకోనుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. కోవిడ్-19 సృష్టించిన విలయానికి ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో అపూర్వమైన ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నందున ఈ ముప్పు ఏర్పడనుందని తెలిపింది. ఈ సంక్షోభం నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలను ఆదుకోవాలంటే 2.5 ట్రిలియన్ డాలర్ల సహాయ ప్యాకేజీ అవసరమని ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ధి (యుఎన్‌సిటిఎడి) కాన్ఫరెన్స్ అంచనావేసింది.
‘అభివృద్ధి చెందుతున్న దేశాలకు కోవిడ్-19 షాక్’ పేరుతో ఒక నివేదికను సంస్థ విడుదల చేసింది. ఎక్కువగా వినియోగ వస్తువుల ఎగుమతులపై ఆధారపడిన ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలు మళ్లీ గాడిలో పడాలంటే వచ్చే రెండేండ్లలో రెండు నుంచి మూడు ట్రిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు అవసరమవుతాయని తెలిపింది. అంతేకాదు అనేక అభివృద్ధి చెందుతున్నదేశాలలో ఆరోగ్య సంక్షోభం ముదరనుందని తెలిపింది. ఆరోగ్యం సంక్షోభం వస్తే, ఈ దేశాలు మరింత ఆర్థిక కష్టాల్లో కూరకుపోతాయని అంచనావేసింది. ఆర్థిక ఆరోగ్య సంక్షోభం కలయిక చాలా దుర్మార్గంగా వుంటుందని వ్యాఖ్యానించింది. కాబట్టి ఆ దేశాలలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, సేవలను బలోపేతం చేసే మార్గాలను అన్వేషించాలని పేర్కొంది.
2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో పోల్చితే, మహమ్మారి కరోనా ఆర్ధిక షాక్ అభివృద్ధి చెందుతున్న దేశాలను భారీగా తాకనుందని యుఎన్‌సిటిఎడి తెలిపింది. ప్రపంచ ఆర్ధికవ్యవస్థ ఈ ఏడాది ట్రిలియన్ డాలర్లలో ప్రపంచ ఆదాయాన్ని కోల్పోతుందని తెలిపింది. చైనా, భారతదేశం మినహా అభివృద్ధి చెందుతున్న దేశాలకు తీవ్రమైన ఇబ్బందిని కలిగిస్తుందని పేర్కొంది. కొనసాగుతున్న ఆర్ధిక పతనాన్ని ఊ హించడం చాలా కష్టం, కానీ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు మెరుగుపడకముందే పరిస్థితులు మరింత దిగజారిపోతాయనేస్పష్టమైన సూచనలు ఉన్నాయని యుఎన్‌సిటిఎడి సెక్రటరీ జనరల్ ముఖిసా కిటుయ్ చెప్పారు. ఈ సంవత్సరం దూసుకుపోతున్న ఆర్థిక సునామీ నేపథ్యంలో రాబోయే రెండేళ్లలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు 2-3 ట్రిలియన్ డాలర్ల రెస్క్యూ ప్యాకేజీని కేటాయించాలన్నారు. అలాగేమాంద్యాన్ని నివారించేందుకు అభివృద్ధి చెందిన దేశాలతోపాటు చైనా కూడా తమ ఆర్థిక వ్యవస్థల్లోకి భారీ ఎత్తున నిధులను కుమ్మరిస్తున్నాయని, జీ 20 కూటమి దేశాలు కూడా ఇటీవలే తమ ఆర్థిక వ్యవస్థల్లోకి 5 ట్రిలియన్ డాటర్లను పంపింగ్ చేయాలని నిర్ణయించినట్లు గుర్తుచేసింది. ఇది అసాధారమైన సంక్షోభానికి అసాధారణమైన ప్రతిస్పందన లాంటిదని పేర్కొంది. ‘ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోతుండటంతో మాంద్యంలోకి జారుకుంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది చాలా ఇబ్బందికరమైన అంశం. అయితే ఈ మ్యాంద్యం ప్రభావం ఇండియా, చైనాలపై ఉండకపోవచ్చు అని వెల్లడించింది.
నాలుగు పాయింట్ల రికవరీ ప్రణాళిక
ఇందుకు నాలుగు పాయింట్లు రికవరీ ప్రణాళికను ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి ప్రతిస్పందనగా 2009 కేటాయింపులకు మించిన ఆర్థిక కేటాయింపులు ప్రస్తుతం జరగాలిల. బలహీ ఆర్థికవ్వవస్థలకు ఒక ట్రిలయన్ డాలర్లకు పైగా పెట్టుబడులను అందించాలి. రెండవ చర్యగా రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జర్మనీ అప్పులో సగం రద్దు చేసిన మాదిరిగా ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశాలకు ఆర్థిక వ్యవస్థలకు రుణాలను రద్దు చేయాలి. లేదా గణనీయంగా తగ్గించాలి. మూడవ చర్యగా పేద దేశాల్లో అత్యవసర ఆరోగ్య సేవలు, సంబంధిత సామాజిక సహాయ కార్యక్రమాలకుగాను 500 బిలియన్ల పెట్టుబడులను కల్పించాలి. చివరగా, ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి ఇప్పటికే పెరుగుతున్న మూలధన ప్రవాహాన్ని తగ్గించడానికి నియంత్రణలను ఆయా దేశాలు అమలు చేయాలని పిలుపునిచ్చింది.
UNCTAD urgently calls for a $2.5 trillion #coronavirus aid package to help developing countries avoid worst-case scenarios and impacts. https://t.co/0ORP07QKkd#COVID19 pic.twitter.com/0B97uMweju
— UNCTAD (@UNCTAD) March 30, 2020
Comments
Please login to add a commentAdd a comment