ఉద్యోగుల్లో రోజు రోజుకీ అసహనం పెరిగి పోతుంది. ఒకరి లక్ష్యం కోసం మనమెందుకు పనిచేయాలి’అని అనుకున్నారో.. ఏమో! ఆర్ధిక మాంద్యం భయాలతో సంస్థలు ఖర్చుల్ని తగ్గించుకుంటున్నాయి. ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఇప్పుడా తొలగింపులతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకుంటున్నారు. పీడా విరగడైందని తెగ సంబరపడిపోతున్నారు.
సాధారణంగా ఒక సంస్థ విధుల నుంచి తొలగించిందంటే సదరు ఉద్యోగి కెరియర్‌లో ఆటుపోట‍్లు ఎదురైనట్లే. 1969 జనవరి నుంచి ప్రస్తుతం ఈరోజు వరకు ఎన్నడూ లేనంతగా జాబ్ మార్కెట్‌లో నిరుద్యోగం బాగా పెరిగిపోతుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలు వేలల్లో ఉద్యోగుల్ని ఫైర్ చేస్తున్నాయి. కానీ వాల్ స్ట్రీట్ నుంచి సిలికాన్ వ్యాలీ టెక్ సంస్థల వరకు ఉద్యోగులు ఉపాధి కోల్పోయినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతలనుంచి తప్పుకున్నందుకు సంతోషిస్తున్నారు. కుటుంబ సభ్యులతో గడుపుతూనే.. కొత్త కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు.
తాజాగా లాస్ ఎంజెల్స్‌లో ఈ-స్పోర్ట్స్ కంపెనీలో సోషల్ మీడియా ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్న బోబిన్ సింగ్‌ను ఇంటికి సాగనంపింది సదరు యాజమాన్యం. దీంతో హమ్మాయ్యా... ఇకపై టిక్‌టాక్ లాంటి షార్ట్ వీడియోల కోసం ఫ్రీల్సాన్ వీడియో ఎడిటింగ్ వర్క్ చేసుకోవచ్చు. నా న్యూఇయర్ రెసొల్యూషన్ ఇదే. తక్కువ పని.. నచ్చిన రంగంపై దృష్టిసారిస్తా’ అని అంటోంది. ఈ తరహా ధోరణి జెన్ జెడ్ కేటగిరి ఉద్యోగుల్లో 20 శాతం, 15 శాతం మంది మిలీనియల్స్ ఉన్నట్లు బ్లూమ్ బర్గ్ నిర్వహించిన సర్వేలో తేలింది.
జనవరి 18న జార్జియాకు చెందిన 43 ఏళ్ల రిక్రూటర్‌ను అమెజాన్ వెబ్ సర్వీసెస్ నుండి తొలగించింది. లేఆఫ్స్ గురించి తెలిసి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించింది. చివరికి ఓ కంపెనీలు జాబ్ దొరికింది. ‘నా ఉద్యోగం పోయిందని తెలిసే సమయానికి నన్న తొలగించినందుకు సంతోషించాను. ఎందుకంటే నేను చేరబోయే కొత్త కంపెనీలో ఉద్యోగం నాకు సంతృప్తినిస్తుందని అనిపించింది.
నార్త్ కరోలినాలోని షార్లెట్‌కు చెందిన 47 ఏళ్ల కేసీ క్లెమెంట్‌ను గతేడాది జూలైలో గేమ్‌స్టాప్ సంస్థ అతన్ని ఫైర్ చేసింది. తొలగింపులతో ‘తొలగింపులు నా ఆలోచన ధోరణిని మార్చేశాయి. విభిన్న కోణాలను చూసేందుకు, అవకాశాలను సృష్టించుకోవడానికి సహాయ పడింది అంటూ పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ వైరల్ అవ్వడం..తన రంగంలో ఎక్స్‌పీరియన్స్ కారణంగా వరుసగా ఏడు కంపెనీలు ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు వచ్చాయి.
ఇలా లేఆఫ్స్‌పై సంతోషం వ్యక్తం చేస్తున్న ఉద్యోగుల గురించి.. తొలగింపులు గతంలో కంటే భవిష్యత్‌లో వారి కెరియర్ బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పలువురు నిపుణులు. ఉద్యోగులు సైతం ఇదే తరహా ఆలోచిస్తున్నారంటూ బ్లూమ్ బర్గ్ సర్వేలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment