వాషింగ్టన్: అమెరికా ఆర్థిక మాంద్యం వైపు పరుగులు తీస్తోందేమోనని యూఎస్ అధికారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఐతే అదేం ఉండదని, భయపడాల్సిన అవసరం లేదంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ వారం తరువాత వచ్చే జీడీపీ గణాంకాలు వరుసగా రెండోవ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ పడిపోతున్నట్లు చూపవచ్చు అని చెప్పారు.
ఈ మేరకు బైడెన్ మాట్లాడుతూ...మేము ఆర్థిక మాంద్యంలో ఉండకపోవచ్చునని భావిస్తున్నా. మేము వేగవంతమైన వృద్ధి నుంచి స్థిరమైన వృద్ధి వెళ్తాము. అంతేకాదు ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో తిరోగమనం అనేది అసంభవం అని తేల్చి చెప్పారు. అదీగాక ఆర్థిక వేత్తల ఏకాభిప్రాయ సూచన ఇప్పటికీ స్వల్ప వృద్ధిని కోరుతోందని అన్నారు.
అదే సమయంలో ఫెడరల్ రిజర్వ్ తదుపరి చర్యగా డిమాండ్‌ని తగ్గించే ప్రయత్నంలో వడ్డిరేట్లను మరో మూడోంతులు శాతం పెంచింది. ఈ మేరకు ఫెడరల్ చైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఈ చర్య అత్యవసరం అని చెప్పారు. ఐతే యూఎస్ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా సాధించడమే లక్ష్యం అని నొక్కి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment