economic
-
2047 నాటికి అదే లక్ష్యం: ఆర్థిక సంఘం చైర్మన్
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన దేశంగా 2047 నాటికి అవతరించాలనే భారత లక్ష్యం సాకారమయ్యే ఆశయమని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా శనివారం అన్నారు. ఇందుకోసం దేశ తలసరి ఆదాయం ఏటా 7.3 శాతం పెరిగి రాబోయే 24 ఏళ్లలో 14,000 డాలర్లకు చేరుకోవాలని అన్నారు.‘తలసరి ఆదాయంలో ఈ స్థాయి వృద్ధిని సాధించాలంటే భారత జీడీపీ రాబోయే 24 సంవత్సరాలలో 7.9 శాతం దూసుకెళ్లాలి. దేశ తలసరి ఆదాయం 2023–24లో దాదాపు 2,570 డాలర్లు. ఇది దక్షిణ కొరియా, తైవాన్, యూఎస్, ఇతర యూరోపియన్ దేశాలతో పోలిస్తే చాలా తక్కువ.ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం, సహేతుక మూలధన సేకరణ, నైపుణ్య సముపార్జనతో తలసరి ఆదాయం విషయంలో అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరుకోవడానికి భారత్‌కు అపార అవకాశం ఉంది. 21 సంవత్సరాలుగా మన వృద్ధి రేటు (వాస్తవ డాలర్ పరంగా) 7.8 శాతంగా ఉంది. జీడీపీ వృద్ధి రేటుం 7.9 శాతానికి చేరుకోవడం పూర్తిగా సాధ్యమే. వికసిత భారత్ సాకారమయ్యే ఆశయం. ఈ వృద్ధి రేటును రాబోయే 10 సంవత్సరాలు కొనసాగిస్తే 9.5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుంది’ అని వివరించారు.ఇరు దేశాలు తగ్గిస్తే..యూఎస్ ప్రతీకార పన్నులపై పనగరియా మాట్లాడుతూ.. ఇరు దేశాలు సుంకాలను తగ్గిస్తే పరిస్థితులు సానుకూలంగా మారతాయని అన్నారు. ఒకవేళ సుంకాల యుద్ధానికి దారితీస్తే.. అమెరికా భారతదేశంపై సుంకాలు విధించి, న్యూఢిల్లీ తన సొంత సుంకాలతో ప్రతీకారం తీర్చుకుంటే దురదృష్టకర ఫలితం ఉంటుందని ఆయన హెచ్చరించారు. -
కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ అన్నారు: వైఎస్ జగన్
-
పార్లమెంట్ ముందుకు ఎకనామిక్ సర్వే
-
కంపెనీలకు ఆర్థిక మోసాల తాకిడి
న్యూఢిల్లీ: కంపెనీలకు ఆర్థిక మోసాల తాకిడి పెరిగిపోయింది. గడిచిన 24 నెలల్లో తాము ఆర్థిక మోసాల బారిన పడినట్టు 59 శాతం భారత కంపెనీలు వెల్లడించాయి. పీడబ్ల్యూసీ నిర్వహించిన ‘గ్లోబల్ ఎకనమిక్ క్రైమ్ సర్వే 2024’ రూపంలో ఈ వివరాలు తెలిశాయి. ప్రపంచవ్యాప్తంగా 2,446 సంస్థల సీఈవోలు, ఎండీలు, బోర్డు సభ్యుల అభిప్రాయాలను ఈ సర్వే తెలుసుకుంది. భారత్ నుంచి 91 కంపెనీలు సర్వేలో పాల్గొన్నాయి. ‘‘సర్వేలో పాలు పంచుకున్న భారత కంపెనీల్లో 59 శాతం గత రెండేళ్లలో ఆర్థిక మోసాల బారిన పడినట్టు చెప్పాయి. అంతర్జాతీయ సగటు 41 శాతంతో పోలి్చతే 18 శాతం ఎక్కువ. 2022 ఎడిషన్ సర్వే ప్రకారం చూసినా భారత్‌లో 7 శాతం పెరుగుదల కనిపిస్తోంది’’అని ఈ సర్వే తెలిపింది. ప్రధానంగా కంపెనీల్లో ప్రొక్యూర్మెంట్ (కొనుగోళ్లు) విభాగంలో ఈ మోసాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నట్టు పీడబ్ల్యూసీ సర్వే తెలిపింది. తమకు ఇదొక ప్రధాన సమస్యగా 50 శాతం భారత కంపెనీలు తెలిపాయి. అంతర్జాతీయ సగటుతో పోల్చి చూస్తే 21 శాతం ఎక్కువ. ఇక 47 శాతం కంపెనీలకు కస్టమర్ల మోసాలు ఆందోళనకరంగా పరిణమించాయి. సైబర్ నేరాలు తమకు ప్రధాన సమస్య అని అంతర్జాతీయంగా 44 శాతం కంపెనీలు వెల్లడించాయి. ఎప్పటి నుంచో ఉన్నవే.. ‘‘చారిత్రకంగా చూస్తే ప్రొక్యూర్మెంట్ మోసాలు అన్నవి ఎప్పటి నుంచో ఉన్నవే. ఆర్థిక ప్రయోజనం పొందేందుకు కొనుగోళ్లలో (ప్రొక్యూర్మెంట్) అవకతవకలకు పాల్పడడం. ఈ ఏడాది మా సర్వేలో పాల్గొన్న భారత కంపెనీల ప్రతినిధుల్లో సగం మంది ఇదే అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు’’అని పీడబ్ల్యూసీ ఇండియా ఫోరెన్సిక్ సరీ్వసెస్ పార్ట్నర్ పునీత్ గర్ఖేల్ తెలిపారు. ప్రొక్యూర్మెంట్ మోసాలను నివారించేందుకు భారత కంపెనీలు డేటా అనలైటిక్స్‌ను వినియోగిస్తున్నట్టు ఈ సర్వే తెలిపింది. 33 శాతం ఆర్థిక నేరాలు అవినీతి, లంచాలకు సంబంధించినవేనని, గత రెండేళ్లలో టాప్–3 ప్రధాన ఆర్థిక నేరాల్లో ఇవి కూడా ఉన్నట్టు 26 శాతం భారత కంపెనీలు వెల్లడించాయి. -
సమాజం మా ఇజం!
నగరంలో వందల కొద్ది స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. అనాథలు, వయోవృద్ధులు మొదలు.. జంతు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక హక్కులు, మానవ హక్కులు, వికలాంగుల సేవ.. ఇలా విభిన్న అంశాల్లో సమాజ సేవ చేయడానికి ఎన్జీవోలను ఏర్పాటు చేశారు. అయితే ఈ సామాజిక సేవ ఒక సంస్థతోనో.. ఒక వ్యక్తితోనో సంపూర్ణంగా నిర్వహించలేం.. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అన్నీ వలంటీర్స్‌పై ఆధారపడి సేవలు కొనసాగిస్తున్నాయి. నగరం వేదికగా ఉన్న ఎన్జీవోల్లో సగానికి పైగా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ వలంటీర్ల మద్దతుతో కొనసాగుతున్నవే.. ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిస్వార్థంగా విభిన్న రంగాల్లో సేవలందిస్తున్నారు. నేడు ప్రపంచ వలంటీర్ దినోత్సవం నేపథ్యంలో నగరం వేదికగా సేవలందిస్తున్న విభిన్న సామాజిక సేవా విభాగాల్లోని విశేషాలు తెలుసుకుందాం.. కోటిన్నరకుపైగా జనాభా కలిగిన హైదరాబాద్‌లో వేల సంఖ్యలో అనాథలు, నిరాశ్రయులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారికి సేవలందించడానికి ఎన్నో రకాల స్వచ్ఛంద సేవ సంస్థలు నిత్యం కృషి చేస్తున్నాయి. దాతల సహాయంతో కార్పొరేట్ కంపెనీల సీఎస్ఆర్ నిధులతో సామాజిక సేవ చేస్తున్న ఎన్జీవోలకు వలంటీర్ వ్యవస్థ వారధిగా పనిచేస్తుంది. ఇందులో అధిక శాతం యువతనే ఉండటం విశేషం. విద్యార్థులు, ఉద్యోగులుగా వ్యక్తిగత జీవితాన్ని కొనసాగిస్తున్న యువత హ్యాపీగా జీవితాన్ని అన్ని కోణాల నుంచి చూడాలన్న మంచి హృదయంతో వలంటీర్లుగా మారుతున్నారు. వారంలో ఒక రోజైనా లేదా రెండు, మూడు రోజులకు కాసింత సమయమైనా ఎన్జీవోలకు కేటాయిస్తూ తమవంతు బాధ్యత నిర్వర్తిస్తున్నారు. ఇందులో భాగంగా వీధుల్లో ఫుట్‌పాత్‌లపై ఉన్న అనాథలకు, అన్నార్తులను కలిసి వారి పరిస్థితులను తెలుసుకొని వృద్ధాశ్రమాల్లో, అనాథాశ్రమాల్లో చేరి్పంచడం లేదా తాత్కాలికంగా వారి ఆకలి తీర్చడానికి తమవంతు కృషి చేస్తున్నారు. ఈ వలంటీర్లు ఏదో ఒక ఎన్జీవోతో కలిసి తమ సేవలను కొనసాగిస్తున్నారు. అంతేగాకుండా చలికాలంలో దుప్పట్లు పంచడం, వర్షాకాలంలో రెయిన్ కోట్లు పంచడం, ఎండాకాలంలో నీళ్లు అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. జంతువులకు బాసటగా.. నగరం వేదికగా జంతు ప్రేమికులకు ప్రత్యేకంగా సమూహాలు సైతం ఉన్నాయి. ఈ జంతువులకు కొన్ని ఎన్జీవోలతో కలిసి లేదా వారే ఒక సంఘంగా ఏర్పడి నగరంలోని నిరాదరణకు గురైన జంతువులు, సాధుజంతువుల సంరక్షణ కోసం కృషి చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో హింస, దాడులకు గురైనప్పుడు వాటికి కారణమైన వ్యక్తులను వ్యవస్థలను న్యాయపరంగా శిక్షించేందుకు కృషి చేస్తున్నారు. వీరంతా సోషల్ మీడియా వేదికగా వెబ్సైట్లో పేజీలు క్రియేట్ చేసుకుని తమ సేవలను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా పెట్స్ వేగన్స్ క్లబ్, బ్లూ క్రాస్ సొసైటీ వంటి పలు సంస్థలు పని చేస్తున్నాయి.రోగులకు సేవలందిస్తూ.. ప్రస్తుత తరుణంలో వివిధ కారణాలతో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు రక్షణ అందించడం చాలా అవసరం. ఈ విషయంలో నగరం వేదికగా ఎంతోమంది స్వచ్ఛందంగా రక్తదానం చేస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు. పెద్దఎత్తున రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. సోషల్ మీడియాలో లేదా ఏదో ఒక స్వచ్ఛంద సంస్థ ఆహా్వనం మేరకు పలువురు వలంటీర్లు సదరు హాస్పిటల్స్‌కు వెళ్లి స్వచ్ఛందంగా రక్తదానం చేస్తున్నారు.పర్యావరణం.. మన హితం.. పర్యావరణ పరిరక్షణ కోసం పలువురు హౌస్ స్థాయిలో విభిన్న వేదికలుగా విశేష సేవలు అందిస్తున్నారు. వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించడం మొదలు కాలుష్యం పెరగడానికి కారణమైన మొక్కల నరకడానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్న వారు సైతం ఉన్నారు. తప్పనిసరి నరికేయాల్సి వచ్చిన మొక్కలను తిరిగి మళ్లీ పెంచేలా కృషి చేస్తుండటం విశేషం. పర్యావరణ సంరక్షణలో ప్లాస్టిక్ వాడకం తగ్గించడానికి దశాబ్ద కాలంగా కొన్ని సంస్థలు అందులోని వాళ్లు విశేషంగా కృషి చేస్తున్నారు. మూగజీవుల కోసం..సాటి మనుషులకే కాదు మూగజీవాలకు కూడా ప్రత్యేకంగా హక్కులున్నాయి. వాటి గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నా వంతు సామాజిక బాధ్యతగా జంతు సంరక్షణకు సంబంధించిన సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. ఇందులో భాగంగా వీధి కుక్కలకు ఆహారం అందించడం, ఆదరణకు నోచుకొని జంతువులకు అనారోగ్య సమస్యలు ఉంటే వాటికి చికిత్స అందిస్తాం. ఈ మధ్యకాలంలో జంతువులపై దాడులు పెరిగిపోయాయి. వీటికి వ్యతిరేకంగా ఫైట్ చేయడమే కాకుండా హింసకు పాల్పడవద్దంటూ అవగాహన కల్పస్తున్నాం. – గౌతమ్ అభిష్క్, అనిమల్ యాక్టివిటీస్రక్తం అందేందుకు కృషి.. ప్రస్తుత జీవన విధానంలో ప్రమాదాలు కావొచ్చు.. ఇతర అనారోగ్య సమస్యలు కావొచ్చు.. అత్యవసర సమయంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోయిన వారు వేలు, లక్షల సంఖ్యలో ఉన్నారు. సరైన సమయంలో సాటి మనుషులు స్పందించకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి పరిస్థితి రాకూడదనే లక్ష్యంతో నేను వలంటీర్‌గా రక్తదానం చేస్తున్నాను. నేను రక్తదానం చేస్తూనే నా స్నేహితులను ఏకం చేసి నాలుగేళ్లలో దాదాపు నాలుగు వేల మందికి పైగా రక్తం అందించేలా కృషి చేశాను. – ముతీ ఉర్ రెహమాన్, హైదరాబాద్ -
మూడేళ్లలో రూ.8.3 లక్షల కోట్లకు క్రీడారంగం!
ఆర్థికాభివృద్ధిలో క్రీడారంగాన్ని కూడా భాగస్వామ్యం చేసేలా ప్రభుత్వం నిర్దిష్ట మోడల్‌ను రూపొందించాలని ఓ నివేదిక సూచించింది. క్రీడల మౌలిక సదుపాయాలు, ఈవెంట్లు, సంబంధిత ఉత్పత్తులు, సర్వీసుల్లో మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహించేలా విధానాలను తయారు చేయాలని పేర్కొంది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ, నాంగియా నెక్ట్స్ కలిసి ఈ నివేదికను రూపొందించాయి.ఈ నివేదిక ప్రకారం కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ప్రతిభావంతులైన క్రీడాకారులకు తోడ్పాటు అందించేలా, భారీ స్థాయి క్రీడా కార్యక్రమాలకు నిధులు సమకూర్చే ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం తగు ప్రోత్సాహకాలు ఇవ్వొచ్చని నివేదిక తెలిపింది. ఇంటర్నేషనల్ కోచ్‌లు, న్యూట్రిషనిస్టులు, మానసిక, శారీర శిక్షణ నిపుణులతో సహా అత్యుత్తమ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సీఎస్ఆర్ నిధులను వినియోగించేలా చూడొచ్చని పేర్కొంది. భారత క్రీడారంగం ప్రస్తుతం గణనీయమైన వృద్ధిని సాధించే దశలో ఉందని నివేదిక తెలిపింది. 2020లో దాదాపు 27 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ రంగం వృద్ధి 2027 నాటికి 100 బిలియన్ డాలర్ల(రూ.8.3 లక్షల కోట్లు)కు చేరుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి.నివేదికలోని మరిన్ని విశేషాలు..స్పోర్ట్స్ కోచింగ్, మేనేజ్మెంట్ అంశాల్లో నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలు నిర్వహించడం, విధానాలను రూపొందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ద్వితీయ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల ద్వారా ఉపాధికి ఊతమిచ్చేలా క్రీడలకు సంబంధించిన అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటునివ్వాలి.క్రీడారంగం గణనీయంగా పురోగతి సాధించినప్పటికీ, అథ్లెట్లకు ఆర్థిక భద్రత, మౌలిక సదుపాయాల కొరత వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి.ఆర్థిక సహాయాన్నందించే కార్యక్రమాలను విస్తరించడం, కెరియర్‌పరంగా పరివర్తనకు దోహదపడే పటిష్టమైన విధానాలను రూపొందించడం, సమ్మిళిత సంస్కృతిని పెంపొందించడం వంటి చర్యలు ఈ సవాళ్లను పరిష్కరించడంలో ఉపయోగపడగలవు.అంతర్జాతీయ కాంపిటీషన్లు, క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు, వాటిని నిర్వహించేందుకు ప్రభుత్వం క్రియాశీలకమైన చర్యలు తీసుకోవాలి. దేశీయంగా వివిధ రాష్ట్రాలకు ప్రత్యేకమైన క్రీడలను మరింతగా వెలుగులోకి తెచ్చేందుకు స్పోర్ట్స్ టూరిజంను ప్రోత్సహించవచ్చు.ఇదీ చదవండి: విశ్వసనీయ వాణిజ్య కేంద్రంగా భారత్స్పోర్ట్స్ లీగ్‌లు, సాంకేతిక పురోగతి, వైవిధ్యమైన క్రీడలు మొదలైనవి ఈ రంగం వృద్ధికి తోడ్పడుతున్నాయి.స్పోర్ట్స్ గూడ్స్, దుస్తులు, మీడియా హక్కులు కూడా ఇందుకు దోహదపడుతున్నాయి.స్పోర్ట్స్ మీడియా మార్కెట్ 2020లో 1 బిలియన్ డాలర్లుగా ఉండగా 2027 నాటికి 13.4 బిలియన్ డాలర్లకు చేరవచ్చనే అంచనాలు ఉన్నాయి.2023 ఏషియన్ గేమ్స్, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సాధించిన విజయాలు, అంతర్జాతీయంగా పోటీపడే సత్తా పెరుగుతోందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. -
మోదీ 3.0: తొలి బడ్జెట్లో ఆర్థిక ఎజెండాపై దృష్టి
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు మరోసారి ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. నూతన ప్రభుత్వం త్వరలో తన మొదటి బడ్జెట్‌ను సమర్పించనుంది. ఈ నేపధ్యంలో మంత్రి సీతారామన్‌కు అనేక సవాళ్లు ఎదురుకానున్నాయని ఆర్థికరంగ నిపుణులు అంటున్నారు. ద్రవ్యోల్బణంపై ఎలాంటి ప్రభావం చూపకుండా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసే చర్యలను ప్రభుత్వం పరిశీలించాల్సి ఉంటుందని వారు సూచిస్తున్నారు.ఆర్థిక మంత్రిత్వ శాఖ పగ్గాలు చేపట్టిన సీతారామన్ తన ఆర్థిక ఎజెండాలో భారతదేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి కృషి చేయాల్సి ఉంటుంది. అలాగే 2047 నాటికి దేశాన్ని ‘అభివృద్ధి చెందిన భారతదేశం’గా మార్చడానికి తగిన ఆర్థిక సంస్కరణలను వేగవంతం చేసేదిశగా ముందడుగు వేయాలి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ నుండి డివిడెండ్ రూపంలో ప్రభుత్వం అందుకున్న రూ. 2.11 లక్షల కోట్లు దేశ ఆర్థిక స్థితికి మెరుగుదలకు సహాయకారిగా మారినట్లు నిరూపితమయ్యింది.మోదీ 3.0 ప్రభుత్వానికి దేశంలోని వ్యవసాయ రంగంలో ఒత్తిడిని పరిష్కరించడం, ఉపాధి కల్పన, మూలధన వ్యయాల వేగాన్ని కొనసాగించడం, ఆర్థిక ఏకీకరణ మార్గంలో ఉండటానికి ఆదాయ వృద్ధిని పెంచడం వంటివి కీలకంగా మారనున్నాయి. మరోవైపు బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల విషయంలో ప్రభుత్వం ఇప్పటికీ కొంత వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు బీమా కంపెనీల ప్రైవేటీకరణకు పలు ఆటంకాలు ఏర్పడుతున్నాయనే వాదన వినిపిస్తోంది.నిర్మలా సీతారామన్ 2019లో తొలిసారిగా ఆర్థిక శాఖ బాధ్యతలు స్వీకరించారు. నాటి నుండి ఆమె ఈ బాధ్యతలను కొనసాగిస్తున్నారు. సీతారామన్ స్వతంత్ర భారతదేశంలో మొదటి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రిగా గుర్తింపు పొందారు. ఆమె ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో దేశం కోవిడ్ -19 మహమ్మారితో ఉత్పన్నమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని, వాటిని సమర్థవంతంగా దాటగలిగింది. -
రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం రూ.66, 116 కోట్లు నష్టపోయాం
-
రైతులకు మరింత ఆర్థిక చేయూత ఇవ్వండి
సాక్షి, అమరావతి: రైతులకు మరింత ఆర్థిక చేయూతనిచ్చేందుకు బ్యాంకర్లు ఉదారంగా ముందుకు రావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సచివాలయంలో నాబార్డ్ క్రెడిట్ సెమినార్ జరిగింది. ఇందులో 2024–25కు నాబార్డ్ రూ.3.55 లక్షల కోట్ల అంచనాతో రూపొందించిన స్టేట్ ఫోకస్ పేపర్‌ను కాకాణి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. గ్రామీణాభివృద్ధి రంగం బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు అన్ని విధాలుగా చేయూతనిచ్చిన నాబార్డ్‌ను అభినందిస్తున్నానన్నారు. వ్యవసాయం, నీటిపారుదల, సామాజిక, గ్రామీణ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డ్ మద్దతునివ్వడం అభినందనీయమని తెలిపారు. వ్యవసాయ రంగంలో సవాళ్ల పరిష్కారం, స్థిరమైన వృద్ధి సాధన కోసం ప్రభుత్వం, కార్పొరేట్ రంగం, ఆర్థిక సంస్థలతో కలిసి నాబార్డ్ రోడ్‌మ్యాప్ తయారుచేయాలని సూచించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, వ్యవసాయ ఉత్పత్తుల వ్యాల్యూ చైన్, విలువ జోడింపు, కౌలు రైతులకు విరివిగా రుణ సదుపాయం కల్పించాలన్నారు. నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎంఆర్ గోపాల్ మాట్లాడుతూ 2024–25కి రాష్ట్ర రుణ ప్రణాళికను రూ.3.55 లక్షల కోట్లుగా అంచనా వేశామన్నారు. ఇది 2023–24తో పోలిస్తే 24 శాతం అధికమన్నారు. ఈసారి 38 శాతం పంట రుణాలు, 25 శాతం ఎంఎస్ఎంఈ, 13 శాతం వ్యవసాయ టర్మ్, 4 శాతం వ్యవసాయ అనుబంధ అవసరాలకు, 2 శాతం వ్యవసాయ మౌలిక వసతుల కల్పనకు, 18 శాతం ఇతర రంగాలకు రుణాలు ఇచ్చేలా æప్రణాళిక తయారు చేశామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.2.04 లక్షల కోట్లు, పంట రుణాలకు రూ.1.36 లక్షల కోట్లుగా అంచనా వేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, కమిషనర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అహ్మద్ బాబు, వ్యవసాయ, ఉద్యాన శాఖల కమిషనర్లు శేఖర్‌బాబు, శ్రీధర్, పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండ్యన్, ఆర్బీఐ జీఎం ఆర్కే మహానా, ఎస్ఎల్బీసీ కన్వ్నిర్ ఎం.రవీంద్రబాబు, నాబార్డ్ జీఎం డాక్టర్ కేవీఎస్ ప్రసాద్, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ శారదా జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానుండగా, తొలి రోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తొలిసారి పార్లమెంట్ ఉభయ సభలనుద్దేశించి ప్రారంబోపాన్యాసం చేయనున్నారు. ఈసారి ఆర్థిక సర్వే నివేదికను విడుదలచేయట్లేదని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. గురువారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. తొలి రెండు రోజులు ఉభయసభల్లో జీవో అవర్, క్వశ్చన్ అవర్‌ను ఇప్పటికే రద్దు చేస్తూ బులిటెన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగనుంది. ఆ తర్వాత రాజ్యసభ, లోక్‌సభలో దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వనున్నారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటుచేసిన నేపథ్యంలో సాంకేతికంగా రాష్ట్రపతిపాలనలో ఉన్న ఆ ప్రాంతానికి సంబంధించిన జమ్మూకశ్మీర్ బడ్జెట్‌నూ ఆర్థిక మంత్రి నిర్మల లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. వాడీవేడిగా చర్చలు సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు మోదీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండగా, మరోవైపు కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. నిరుద్యోగిత, అధిక ధరలు, ఆర్థిక అసమానతల కారణంగా రైతాంగం, కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలు, జాతుల ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్ అంశాలపై మోదీ సర్కార్‌ను విపక్షాలు నిలదీయనున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగం అంశం సైతం ప్రధానంగా విపక్షాలు ప్రస్తావించవచ్చు. ఢిల్లీలో మద్యం కేసులో ఆప్ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్‌పై, భూమికి ఉద్యోగం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ యాదవ్‌పై ఈడీ, సీబీఐ కేసులనూ విపక్షాలు పార్లమెంట్లో లేవనెత్తనున్నాయి. జార్ఖండ్ సీఎంసోరెన్పై, తమిళనాడులో డీఎంకే నేతలపై ఈడీ, సీబీఐ వరుస దాడులను విపక్షాలు పార్లమెంట్లో ప్రధానంగా ప్రస్తావించనున్నాయి. పశ్చిమబెంగాల్‌కు రావాల్సిన కేంద్ర నిధులను మోదీ సర్కార్ మంజూరుచేయకుండా ఆపేస్తోందని, ఈ అంశంలో కేంద్రాన్ని నిలదీస్తానని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ్ చెప్పారు. 14 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్ ఎత్తివేత గత పార్లమెంట్ సమావేశాల్లో సస్పెండ్ అయిన వారిలో 14 మంది విపక్ష సభ్యులు ఈసారి సెషన్లో పాల్గొననున్నారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. సమావేశాల్లోకి రాకుండా గతంలో వీరిపై విధించిన నిషేధ కేసును సభాహక్కుల కమిటీలకు పంపామని, మా అభ్యర్థనతో ఆ కమిటీల చైర్మన్లు వీరి సస్పెన్షన్‌ను ఎత్తేశారని మంత్రి వెల్లడించారు. సస్పెన్షన్ ఎత్తేసిన 14 మందిలో 11 మంది రాజ్యసభ, ముగ్గురు లోక్‌సభ సభ్యులున్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో భద్రతా వైఫల్యం అంశాన్ని ఎత్తిచూపుతూ లోక్‌సభ, రాజ్యసభ లోపల ప్లకార్డులు పట్టుకుని నినదించినందుకు కేంద్రం ఫిర్యాదుతో 100 లోక్‌సభ, 46 రాజ్యసభ సభ్యులు సస్పెన్షన్‌కు గురైన విషయం తెల్సిందే. ప్రతి ఒక్కరి సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని సభాపతులను కోరామన్నారు. వీరిలో 14 మంది క్షమాపణలు చెప్పడంతో వారికి మాత్రమే ఈ సెషన్లో పాల్గొనే అవకాశం కల్పించారు. బుధవారం నుంచి మొదలయ్యే పార్లమెంట్ ఇరు సభలకు తమ సభ్యులు ఎలాంటి ప్లకార్డులు తీసుకురారని విపక్ష పార్టీలు సమాచారం ఇచ్చాయని మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. -
బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు శుభవార్త!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) స్థిర డిపాజిట్లపై వడ్డీరేట్లను 125 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒక శాతం) పెంచింది. బ్యాంకింగ్ దిగ్గజం– ఎస్బీఐ ఇటీవలే అరశాతం వడ్డీరేటు పెంచిన నేపథ్యంలోనే బీఓబీ తాజా నిర్ణయం తీసుకుంది. 1.25 శాతం వరకూ పెరిగిన వడ్డీరేటు డిసెంబర్ 29వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని బ్యాంక్ ప్రకటన పేర్కొంది. రుణ రేటు పెరుగుదల, నిధుల సమీకరణ అవసరాల నేపథ్యంలో కొన్ని బ్యాంకులు డిపాజిట్ రేటు పెంపు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మరికొన్ని బ్యాంకులు ఇదే బాటలో పయనించే అవకాశం ఉంది. తాజాగా బీఓబీ ఏడాది లోపు స్వల్పకాలిక కాలపరిమితులపై డిపాజిట్ రేట్ల పెంపుపై ప్రధానంగా బ్యాంక్ దృష్టి సారించింది. బీఓబీ తాజా నిర్ణయం ప్రకారం... రూ.2 కోట్ల వరకూ వివిధ టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటు 10 బేసిస్ పాయిట్ల నుంచి 125 బేసిస్ పాయింట్ల వరకూ పెరిగింది. 7 నుంచి 14 రోజుల డిపాజిట్ రేట్లు అత్యధికంగా 3 శాతం నుంచి 1.25 % పెరిగి 4.25 శాతానికి చేరింది. 15 నుంచి 45 రోజుల డిపాజిట్ రేటు 1 శాతం పెరిగి 4.50 శాతానికి చేరింది. -
ఈ ఏడాది 6.5 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది(2023–24) 6.5 శాతం వృద్ధిని సాధించగలదని ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ తాజాగా అంచనా వేశారు. ఈ దశాబ్దం అనిశ్చితికి నిదర్శనంగా నిలవనున్నదని వ్యాఖ్యానించారు. ఒకవేళ కార్పొరేట్ రంగం పెట్టుబడులను ఆలస్యంచేస్తే ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధి సాకారంకావని అభిప్రాయపడ్డారు. ఆర్థిక శాఖ విషయానికివస్తే జీడీపీ వృద్ధి, ఆదాయ పురోగతి తదితరాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేశారు. సగటున 6.5 శాతం ఆర్థికాభివృద్ధిని ఆశిస్తున్న నేపథ్యంలో మరింత పురోగతి అందుకోవడం ద్వారా ఆశ్చర్యాలకు తెరతీసే అవకాశమున్నట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఒక సదస్సులో వివరించారు. కాగా.. గతేడాది(2022–23)లో దేశ ఆర్థిక వ్యవస్థ 7.2 శాతం పుంజుకోగా.. మార్చితో ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) 6.5 శాతం జీడీపీ వృద్ధిని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. ఈ బాటలో అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ సైతం 6.3 శాతం వృద్ధిని మదింపు చేశాయి. అయితే ఈ ఏడాది క్యూ2లో జీడీపీ 7.6 శాతం బలపడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో నాగేశ్వరన్ అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. -
ఈయనే నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోతున్నట్లుంది సార్!
ఈయనే నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోతున్నట్లుంది సార్! -
సంచలన నిర్ణయం.. 600 మంది ఉద్యోగుల తొలగింపులో దిగ్గజ కంపెనీ
ప్రముఖ అడిటింగ్ సంస్థ ప్రైస్‌వాటర్ హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ) కష్టాల్లో చిక్కుకుంది. ఆర్థిక మాంద్యం ప్రభావంతో బ్రిటన్ కేంద్రంగా పని చేస్తున్న ప్రైస్‌వాటర్ హౌస్ కూపర్స్ మొత్తం ఉద్యోగుల్లో సుమారు 600 మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) ఆప్షన్ ఇచ్చాం.. అందుకు అనుగుణంగా సిబ్బంది వీఆర్ఎస్ ఆప్షన్ ఎంచుకోకుంటే వారి తొలగింపు తప్పదని పీడబ్ల్యూసీ ప్రతినిధులు చెబుతున్నారు. పీడబ్ల్యూసీలో 25 వేల మంది పని చేస్తుండగా..అడ్వైజరీ బిజినెస్, ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగులపై వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది. ‘బిగ్ ఫోర్’లో లేఆఫ్స్ అలజడి ప్రపంచ వ్యాప్తంగా అకౌంటింగ్, ప్రొఫెషనల్ సర్వీసులు అందించే అతిపెద్ద ‘బిగ్ ఫోర్’ సంస్థలుగా డెలాయిట్ ఎలోయిట్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ey), ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ (PwC), క్లిన్వెల్డ్ పీట్ మార్విక్ గోర్డెలర్ (KPMG)లు ప్రసిద్ధి చెందాయి. ఆ నాలుగు సంస్థల్లో ఒకటైన పీడబ్ల్యూసీ 600 మంది వర్క్ ఫోర్స్‌ను తగ్గించే పనిలో ఉండగా.. గత నెలలో మరో సంస్థ కేపీఎంజీ యూకే విభాగంలోని డీల్ అడ్వైజరీ విభాగంలో పనిచేస్తున్న 100 మందిని ఇంటికి సాగనంపాలని భావిస్తుండగా.. యూకే 800 కంటే ఎక్కువ మందిని తగ్గించాలని డెలాయిట్ యోచిస్తున్నట్లు పలు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
అధిక రాబడులు ఆశించే వారికి బెస్ట్ ఆప్షన్
భారత ఆర్థిక వ్యవస్థ 6 శాతంపైనే వృద్ధి సాధిస్తుందని ఆర్బీఐ, రేటింగ్ ఏజెన్సీలతోపాటు ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ అంచనా వేస్తున్నాయి. ఈ దశాబ్దం భారత్‌దే అని ఘంటాపథంగా చెబుతున్నాయి. ఆర్థిక వృద్ధి వేగవంతం అయితే ఎక్కువగా లాభపడేది చిన్న, మధ్య స్థాయి కంపెనీలే. ఎందుకంటే ఇవి పెద్ద మొత్తంలో వ్యాపార అవకాశాలను సొంతం చేసుకుంటాయి. కనుక దీర్ఘకాలానికి అధిక రాబడులు ఆశించే వారు, రిస్క్ భరించే సామర్థ్యం ఉన్నట్టు అయితే మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. మిడ్‌క్యాప్ విభాగంలో కోటక్ ఎమర్జింగ్ ఈక్విటీ పథకం మెరుగైన పనితీరు చూపిస్తోంది. రాబడులు ఈ పథకం మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతుంటుంది. దీర్ఘకాలంలో పనితీరును గమనించినట్టయితే రాబడులు మెరుగ్గా కనిపిస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో రాబడులు 18 శాతానికి పైగా రాబడులు వచ్చాయి. గడిచిన మూడేళ్లలో 29 శాతం, ఏడేళ్లలో 16 శాతం, పదేళ్లలో 22 శాతం చొప్పున వార్షిక రాబడులను ఇచ్చి.. మిడ్‌క్యాప్ విభాగంలోని మెరుగైన పథకాల్లో ఒకటిగా నిలిచింది. మిడ్‌క్యాప్ విభాగం సగటు రాబడులతో పోల్చి చూసినప్పుడు మూడేళ్లు, ఐదేళ్లు, ఏడేళ్లు, పదేళ్ల కాలంలో ఈ పథకమే అధిక రాబడులను అందించింది. కోటక్ మ్యూచువల్ ఫండ్ నిర్వహిస్తున్న ఏకైక మిడ్‌క్యాప్ పథకం ఇదే. బీఎస్ఈ 150 మిడ్‌క్యాప్ టీఆర్ఐతో పోల్చి చూసినప్పుడు ఏడాది, ఐదేళ్లు, పదేళ్ల కాలంలో ఈ పథకమే మెరుగైన పనితీరు చూపించింది. పెట్టుబడుల విధానం/పోర్ట్‌ఫోలియో కనీసం 65 శాతం నుంచి గరిష్టంగా 100 శాతం వరకు పెట్టుబడులను మిడ్‌క్యాప్ కంపెనీలకు కేటాయించడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగం. ఎంతో వృద్ధికి అవకాశం ఉన్న ఆణిముత్యాల్లాంటి కంపెనీలను ఈ పథకం గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంటుంది. వ్యాల్యూ స్టాక్స్‌ను సైతం పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవడాన్ని గమనించొచ్చు. మంచి స్టాక్స్‌ను గుర్తించడమే కాదు.. తగిన రాబడులు ఇచ్చే వరకు పోర్ట్‌ఫోలియోలో కొనసాగిస్తుంటుంది. ప్రస్తుతానికి ఈ పథకం నిర్వహణలో రూ.33,918 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోను గమనించినట్టయితే.. 94.27 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. ఈక్విటీ పెట్టుబడుల్లో 71 శాతం మిడ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. లార్జ్‌క్యాప్ కంపెనీల్లో 27 శాతం ఇన్వెస్ట్ చేయగా, స్మాల్‌క్యాప్ కంపెనీల్లో 2 శాతం మేర పెట్టుబడులు కలిగి ఉంది. పోర్ట్‌ఫోలియోలో మొత్తం 80 స్టాక్స్ ఉన్నాయి. పెట్టుబడుల పరంగా క్యాపిటల్ గూడ్స్ కంపెనీలకు అగ్ర ప్రాధాన్యం ఇచ్చింది. ఈ రంగాలకు చెందిన కంపెనీలకు 19 శాతం కేటాయింపులు చేసింది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లో 13 శాతం పెట్టుబడులు ఉన్నాయి. మెటీరియల్స్ కంపెనీల్లో 11 శాతం, కెమికల్స్ కంపెనీల్లో 10 శాతం, కన్జ్యూమర్ డిస్క్రీషనరీ కంపెనీల్లో 10 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసింది. హెల్త్‌కేర్ కంపెనీల్లో 6 శాతం వరకు పెట్టుబడులు ఉన్నాయి. లార్జ్‌క్యాప్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్ విభాగంలో ఆటుపోట్లు ఎక్కువ. కనుక రిస్క్ భరించే వారే ఈ తరహా పథకాలను పరిగణనలోకి తీసుకోవాలి. -
‘చమురు’ ధరలు ముంచేస్తాయి.. భారత్ హెచ్చరిక!
న్యూఢిల్లీ: అధిక చమురు ధరలు ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణపై ప్రభావం చూపుతాయని భారత్ హెచ్చరించింది. అయితే ప్రస్తుత భౌగోళిక రాజకీయ సంక్షోభం పరిస్థితుల నుంచి ప్రపంచం బయటపడగలదన్న విశ్వాసాన్ని వెలిబుచ్చింది. భారత్ ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉన్న సంగతి తెలిసిందే. తన చమురు అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది. ఆర్థిక సేవల సంస్థ– కేపీఎంజీ ఫ్లాగ్షిప్ ఇన్నోవేషన్ అండ్ ఎనర్జీ 14వ ఎడిషన్– ఎన్రిచ్ 2023 కార్యక్రమంలో చమురు వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ, ఇజ్రాయెల్–హమాస్ సైనిక సంఘర్షణను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే ఇప్పటి వరకూ ‘సప్లై చైన్’పై ఈ ‘ఘర్షణ’ ప్రభావం పడలేదని అన్నారు. ఇజ్రాయెల్– పాలస్తీనా ఇస్లామిస్ట్ గ్రూప్ హమాస్ మధ్య సైనిక ఘర్షణల తరువాత చమురు ధరలు సోమవారం బ్యారెల్‌కు దాదాపు 3 డాలర్లు పెరిగాయి. అయితే సరఫరా అంతరాయాలపై ఆందోళనలు అక్కర్లేదన్న వార్తలతో కొంత తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో మంత్రి ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు. ముడి చమురు ధరలు పెరిగితే అది ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ ప్రయత్నాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. గ్లోబల్ మార్కెట్లు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయని నేను భావిస్తున్నాను. సరఫరా మార్గాలకు అంతరాయం కలగకపోతే, భారత్ ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తుందని భావిస్తున్నాను. పెరుగుతున్న జనాభా, క్షీణిస్తున్న వనరులు, పర్యావరణ క్షీణత, పెరుగుతున్న ఆహారం, ఇంధన ధరల వంటి అన్ని అంశాలు ప్రస్తుత ప్రపంచం ముందు సవాళ్లుగా ఉన్నాయి. భారత్ ఇంధన డిమాండ్ విపరీతంగా వృద్ధి చెందుతోంది. భవిష్యత్ ఆర్థిక వృద్ధిలో ఇంధనం కీలకపాత్ర పోషిస్తుంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏమిటంటే.. భారత్ చమురు వినియోగంలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశం. మూడవ అతిపెద్ద ఎల్పీజీ వినియోగదారు. నాల్గవ అతిపెద్ద ఎన్ఎన్జీ దిగుమతిదారు, నాల్గవ అతిపెద్ద రిఫైనర్. నాల్గవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ కలిగి ఉన్న దేశం. రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచ ఇంధన డిమాండ్ వృద్ధిలో భారత్ 25 శాతం వాటాను కలిగి ఉంటుంది. 2050 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్! భారత్ 2050 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంచనా వేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చైర్మన్ మాజీ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతనూ చక్రవర్తి తెలిపారు. బలమైన వినియోగం, ఎగుమతులు ఇందుకు దోహదపడతాయని ఆయన విశ్లేషించారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి దాదాపు 6.3 శాతంగా, ద్రవ్యోల్బణం 6 శాతంగా అంచనా వేస్తున్నట్లు పేర్కొన్న ఆయన, ద్రవ్యోల్బణం సర్దుబాటు చేయకుండా చూస్తే, జీడీపీ వృద్ధి రేటు దాదాపు 12 శాతం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ‘‘ఈ తరహా వృద్ధి వేగం కొన్నాళ్లు కొనసాగితే, 2045–50 నాటికి 21,000 డాలర్ల తలసరి ఆదాయంతో భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుంది’’ అని కేపీఎంజీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో అన్నారు. -
2027 నాటికి మూడో స్థానానికి భారత్
ముంబై: భారత్ 2027 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ మైకేల్ డీ పాత్ర అంచనా వేశారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందన్నారు. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ 3.3 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలో ఐదో స్థానంలో ఉండడం గమనార్హం. నేషనల్ బ్యాంక్ ఆఫ్ కంబోడియా నిర్వహించిన ఓ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాత్రా ప్రసంగించారు. వచ్చే రెండు దశాబ్దాల్లో అంతర్జాతీయ ఆర్థిక కేంద్రం తూర్పు ఆసియావైపు మళ్లుతుందన్నారు. 2023లో ప్రపంచ వృద్ధిలో ఈ ప్రాంతం మూడింట రెండొంతులు ఆక్రమించిందని, ప్రపంచ ఉత్పత్తిలో భారత్ 16.66 శాతం వాటా పోషించినట్టు చెప్పారు. ‘‘మార్కెట్ ఎక్సే్ఛంజ్ రేట్ల పరంగా భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాగా, కొనుగోలు శక్తి పరంగా ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. ప్రపంచంలో 140 కోట్లతో అతిపెద్ద జనాభా కలిగిన దేశం భారత్. 28 ఏళ్లలోపు యువ జనాభా ఎక్కువ. భారత పురోగతికి ఇతర ముఖ్య ప్రేరణ ఏమిటంటే ఫైనాన్షియల్ రంగం నాణ్యత పెరగడం’’అని పాత్రా వివరించారు. భారత్ వృద్ధి ఆకాంక్షలకు కావాల్సిన వనరులు సమకూర్చుకునేందుకు వీలుగా ఆధునికంగా, సమర్థవంతంగా, బలంగా పనిచేసే ఆర్థిక రంగం అవసరమని అభిప్రాయపడ్డారు. -
మెన్స్ అండర్వేర్ విక్రయాలు ఎందుకు తగ్గాయి? మాంద్యంతో సంబంధం ఏమిటి?
అమెరికాతో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆర్థికమాంద్యం భయం చాలా కాలంగా వెంటాడుతోంది. చైనా సైతం ఇటీవల ఆర్థిక రంగంలో అనేక ఒడిదుడుకులను చవిచూసింది. అయితే ఇప్పటి వరకు భారత్‌లో మాద్యం తాలూకా లక్షణాలేమీ కనిపించలేదు. అయితే తాజాగా వెలువడిన ఓ సంకేతం ఆర్థిక నిపుణులను అప్రమత్తం చేసింది. బడ్జెట్‌కు ఆటంకం ఏర్పడినప్పుడు.. దేశంలో ఇటీవలి కాలంలో లోదుస్తుల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం లోదుస్తుల తయారీ కంపెనీలలో ఇన్వెంటరీ పెరిగింది. అమ్మకాలు తగ్గాయి. ఆర్థికవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ద్రవ్యోల్బణం కారణంగా జనం తమ బడ్జెట్‌కు ఆటంకం ఏర్పడినప్పుడు వారు మొదట లోదుస్తుల కొనుగోలును వాయిదా వేస్తారు. దేశంలోని పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇటీవలి కాలంలో లోదుస్తుల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. మందగమనంలో జాకీ బ్రాండ్ విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో లోదుస్తుల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. లోదుస్తుల అమ్మకాలు క్షీణించిన కారణంగా పలు కంపెనీలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. జాకీ బ్రాండ్ లోదుస్తుల తయారీ సంస్థ పేజ్ ఇండస్ట్రీస్‌కి ఆదాయం తగ్గడంతో పాటు అమ్మకాలు కూడా తగ్గాయి.గత కొన్ని నెలలుగా దేశంలో ద్రవ్యోల్బణం ఆర్బీఐ పరిమితులను మించిపోతోంది. ద్రవ్యోల్బణం సామాన్యుల బడ్జెట్‌ను అస్తవ్యస్తం చేస్తోంది. ఫలితంగా వినియోగదారుల సెంటిమెంట్ ప్రభావితమవుతుంది. ఆర్థిక వ్యవస్థను అంచనా వేయడానికి.. నిపుణుల అభిప్రాయం ప్రకారం లోదుస్తుల అమ్మకాలు క్షీణించడం ఆర్థిక వ్యవస్థకు మంచి సంకేతం కాదు. జనం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారనడానికి ఇది సంకేతం. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ మాజీ అధిపతి అలాన్ గ్రీన్‌స్పాన్.. ఆర్థిక వ్యవస్థను అంచనా వేయడానికి పురుషుల లోదుస్తుల సూచికను రూపొందించారు. దీని ప్రకారం ఒక దేశంలో పురుషుల లోదుస్తుల అమ్మకాలు క్షీణించడం అనేది ఆర్థిక వ్యవస్థలో మాంద్యానికి సంకేతం. 2007- 2009 మధ్య కాలంలో యూఎస్‌లో ఆర్థిక మాంద్యం తలెత్తినప్పుడు లోదుస్తుల విక్రయాలు క్షీణించాయి. 2007- 2009 మధ్య అమెరికాలో ఏం జరిగింది? ఆర్థిక నిపుణులు గ్రీన్‌స్పాన్ 1970లలో పురుషుల లోదుస్తుల సూచిక సిద్ధాంతాన్ని వెలువరించారు. పురుషుల లోదుస్తుల విక్రయ గణాంకాలు కీలక ఆర్థిక సూచికలు అని ఆయన అన్నారు. లోదుస్తులు అనేవి ప్రైవేట్ దుస్తులు. అవి పైనున్న దుస్తులలో దాగివుంటాయి. అందుకే ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారినప్పుడు, మనిషి చేసే మొదటి పని లోదుస్తులు కొనుగోలు చేయడం మానివేస్తాడు. ఇది రాబోయే కాలంలో మాంద్యం లేదా ఆర్థిక మందగమనాన్ని సూచిస్తుంది. 2007- 2009 మధ్య అమెరికా తీవ్ర మాంద్యం ఎదుర్కొంది. 2007 ప్రారంభం నుండి ఆ దేశంలో పురుషుల లోదుస్తుల విక్రయాలలో భారీ క్షీణత కనిపించింది. 2010 సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పుడు, పురుషుల లోదుస్తుల అమ్మకాలు ఆటోమేటిక్‌గా పెరిగాయి. ఇది కూడా చదవండి: ప్రపంచ జనాభాలో 1,280 మంది మాత్రమే మిగిలిన విపత్తు ఏది? నాడు ఏం జరిగింది? -
ఫైనాన్షియల్ మీడియా పోస్టులకు చెక్
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ద్వారా ఆర్థికపరమైన(ఫైనాన్షియల్) సలహాలిచ్చేవారిపై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ దృష్టి పెట్టింది. ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లుగా పిలిచే వ్యక్తులు లేదా సంస్థల నియంత్రణకు తాజాగా చర్యలు చేపట్టింది. ఒక్కో పోస్టుకు రూ. 10,000 నుంచి రూ. 7.5 లక్షలవరకూ చార్జ్చేసే సలహాదారులు ఇటీవల అధికమైన నేపథ్యంలో సెబీ తాజా చర్యలకు తెరతీసింది. తద్వారా ఇన్వెస్టర్లకు కచి్చతమైన, నిష్పక్షపాత సమాచారం లభించేందుకు వీలు కలి్పంచనుంది. అదీకృత సలహాలకు అవకాశంతోపాటు.. మోసాలను తగ్గించేందుకు సెబీ చర్యలు తోడ్పడనున్నట్లు ఆనంద్ రాఠీ వెల్త్ డిప్యూటీ సీఈవో ఫిరోజ్ అజీజ్ పేర్కొన్నారు. సెబీ తాజా ప్రతిపాదనల ప్రకారం ఆర్థిక సలహాదారులు(ఫిన్ఫ్లుయెన్సర్లు) సెబీ వద్ద రిజిస్టర్కావలసి ఉంటుంది. అంతేకాకుండా వీటికి సంబంధించిన మార్గదర్శకాలను పాటించవలసి ఉంటుంది. రిజిస్టర్కానివారు ప్రమోషనల్ కార్యక్రమాల కోసం మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకర్లతో జట్టు కట్టేందుకు అనుమతించరు. ఇకపై సెబీ వద్ద రిజిస్టర్కావడంతోపాటు, నిబంధనలు పాటించవలసిరావడంతో ఫిన్ఫ్లుయెన్సర్లు జవాబుదారీతనం(అకౌంటబిలిటీ) పెరుగుతుందని, ప్రమాణాలు, నైపుణ్యాలు మెరుగుపడతాయని రైట్ రీసెర్చ్, పీఎంఎస్ వ్యవస్థాపకుడు, ఫండ్ మేనేజర్ సోనమ్ శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. ఫిన్ఫ్లుయెన్సెర్ల పాత్రకు జవాబుదారీతనం పెంచడం ద్వారా సెబీ ఇన్వెస్టర్లకు రక్షణను పెంచుతున్నదని అజీజ్ పేర్కొన్నారు. దీంతోపాటు పరిశ్రమలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నదని తెలియజేశారు. సెబీ లేదా స్టాక్ ఎక్సే్ఛంజీ లేదా మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్(యాంఫీ) వద్ద రిజిస్టరైన ఫిన్ఫ్లుయెన్సెర్లు తమ రిజి్రస్టేషన్ నంబర్, కాంటాక్ట్ వివరాలు తదితరాలను పొందుపరచవలసి ఉంటుంది. -
మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలకు వేదికగా విశాఖపట్నం మారుతోంది. మాన్యుఫాక్చరింగ్, ఫార్మా, ఐటీ, కార్గో... ఇలా భిన్నమైన రంగాలకు సంబంధించిన పరిశ్రమలు ఒక్కొక్కటిగా విశాఖకు విస్తరిస్తున్నాయి. తాజాగా విశాఖపట్నం స్పెషల్ ఎకనమిక్ జోన్ (వీసెజ్)లో మరో మూడు మాన్యుఫాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. రూ.500 కోట్లకు పైగా పెట్టుబడులతో రెండు బయో డీజిల్ కంపెనీలు, ఒక ఫార్మా కంపెనీ ఏడాదిలోపు ఏర్పాటు కానున్నాయి. వీటి ద్వారా 1,200 మందికి పైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరోవైపు తొలి త్రైమాసికంలో గతేడాదితో పోలిస్తే ఉత్పత్తుల ఎగుమతుల్లో 34 శాతం వృద్ధి కనబరిచిన వీసెజ్... అర్ధ సంవత్సరానికి 50 శాతం వృద్ధి నమోదు దిశగా ముందుకు సాగుతోంది. యూఎస్, కెనడాకు ఎగుమతులే లక్ష్యంగా... ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన మూడు యూనిట్లు విశాఖ సెజ్‌లోనే ఏర్పాటు కానున్నాయి. ఇందులో బయోడీజిల్ తయారీ సంస్థ అద్వైత్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్, బయోకాన్ లిమిటెడ్, ఫార్మాసూ్యటికల్ ఉత్పత్తుల తయారీ సంస్థ గ్రాన్యూల్స్ సీజెడ్‌ఆర్‌వో సంస్థలు ఉన్నాయి. ఈ కంపెనీలు ఏడాదిలోపు తమ కార్యకలాపాలు ప్రారంభించాలని వీసెజ్ నిబంధన విధించింది. అయితే... ఈ సంస్థలన్నీ ఆరు నుంచి పది నెలల్లోపే ఉత్పత్తుల తయారీని మొదలు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని వీసెజ్ అధికారులు చెబుతున్నారు. ఈ మూడు కంపెనీలు ప్రధానంగా కెనడా, యూఎస్‌కు ఎగుమతులే లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. రికార్డు స్థాయిలో ఎగుమతులు ఏపీ, తెలంగాణకు వస్తున్న పరిశ్రమలు వీలైనంత త్వరగా కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు చేపట్టాం. దువ్వాడ వీసెజ్ పరిధిలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సెజ్‌లు, యూనిట్ల ద్వారా రికార్డు స్థాయి ఎగుమతులు సాధించాం. 2023–24 మొదటి త్రైమాసికంలో రూ.50,195 కోట్ల విలువైన వస్తువులు, సేవలను ఎగుమతి చేశాం. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 34 శాతం వృద్ధి రేటు సాధించాం. వివిధ వస్తువులను ఉత్పత్తి చేయడం ద్వారా రూ.35,992 కోట్లు, సేవారంగం ఎగుమతుల్లోనూ 36 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు గణాంకాలను పరిశీలిస్తే రూ.1,04,961 కోట్ల పెట్టుబడులు వీసెజ్ ద్వారా రాగా... మొత్తం 6,61,579 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. – ఎం.శ్రీనివాస్, వీసెజ్‌జోనల్ డెవలప్మెంట్ కమిషనర్ -
సాంస్కృతిక సంబంధాల మెరుగుతోనే ఆర్థిక వృద్ధి
(వారణాసి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) సాంస్కృతిక సంబంధాలు మెరుగుపడటం ద్వారా దేశాల మధ్య ఆర్థిక, దౌత్యపరమైన పురోభివృద్ధి సాధ్యమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. భారత్ నుంచి ఎన్నో విలువైన పురాతన విగ్రహాలు, వెలకట్టలేని అతి పురాతన విగ్రహాలు దేశం దాటి వెళ్లాయని, వాటిని తిరిగి భారత్‌కు తేవడానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. వారణాసిలో జరుగుతున్న జీ20 సాంస్కృతిక శాఖల మంత్రులు, అధికారుల సదస్సులో పాల్గొన్న అనంతరం ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. 2014 ముందు ప్రభుత్వాలు విదేశాల నుంచి కేవలం 13 పురాతన విగ్రహాలను దేశానికి తిరిగి రప్పిస్తే, మోదీ అధికారంలోకి వచ్చాక దాదాపు 400 పురాతన విగ్రహాలను రప్పించి ఆయా రాష్ట్రాలకు అప్పగించిన విషయాన్ని గుర్తు చేశారు. జీ20 సభ్య దేశాలు, ఆహ్వనిత దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థలు ఈ సదస్సులో పాల్గొన్నాయని, అందరి సమ్మతితో శనివారం వారణాసి జీ20 డిక్లరేషన్ ప్రకటిస్తామని మంత్రి వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం అధికారుల స్థాయిలో జరిగిన చర్చల్లో సానుకూల స్పందన వచ్చిందన్నారు. విలేకరుల సమావేశంలో ఆ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖీ, ఆ శాఖ కార్యదర్శి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. యూత్ టూరిజం క్లబ్స్దే కీలకపాత్ర విద్యార్థుల్లో వివేకం పెంపొందించేందుకు యూత్ టూరిజం క్లబ్స్ కీలకపాత్ర పోషిస్తాయని కిషన్‌రెడ్డి అన్నారు. ‘సాంస్కృతిక విరాసత్ స్పర్ధ –2023’లో భాగంగా యువ టూరిజం క్లబ్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భారత భవిష్యత్తు అంతా విద్యార్థులదేనని, అందుకు అధ్యాపకులు, ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో అందిస్తున్న కృషి ఎనలేనిదన్నారు. 99 శాతం విద్యపై దృష్టి పెడితే.. కనీసం ఒక్క శాతమైనా పాఠ్యేతర అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. స్పోర్ట్స్, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో గానీ, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో గానీ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల్లో సేవా తత్పరతతోపాటు దేశం పట్ల అవగాహన పెంచే లక్ష్యంతోనే ‘యువ టూరిజం క్లబ్స్’ను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతీ ఇంట్లో కుటుంబసమేతంగా పర్యాటక క్షేత్రాలను సందర్శించాలంటే.. ఎక్కడకు వెళ్లాలో నిర్ణయించేది ఆ కుటుంబంలోని చిన్నారులు, విద్యార్థులేనని అన్నారు. అందుకే వారికి దేశంలోని, సమీపంలోని పర్యాటక క్షేత్రాలపై, ప్లాస్టిక్ రహిత పర్యాటకాన్ని ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. -
వరదల నష్టం ఎన్ని వేల కోట్లో తెలుసా? ఎస్బీఐ రిపోర్ట్
దేశవ్యాప్తంగా ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో వరదలు విధ్వంసం సృష్టించాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టాలు కలిగించాయి. అయితే ఈ వరదలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంత నష్టం కలిగించాయి అనే దానిపై ఎస్బీఐ (SBI) రీసర్చ్ రిపోర్ట్ ఎకోర్యాప్ (Ecowrap) ఓ నివేదిక విడుదల చేసింది. వరదల వల్ల కలిగిన ఆర్థిక నష్టం రూ. 10,000 కోట్లు నుంచి రూ.15,000 కోట్ల పరిధిలో ఉంటుందని ఎస్బీఐ ఎకోర్యాప్ నివేదిక అంచనా వేసింది. ఈ భారీ వరదలతోపాటు ఇటీవల సంభవించిన బిపార్జోయ్ తుఫాను వంటి ప్రకృతి వైపరీత్యాలు దేశానికి తీవ్ర ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది. దేశ స్థానిక, భౌగోళిక స్వరూపాలు కూడా సహజ విపత్తులకు కారణమని అభిప్రాయపడింది. మూడో స్థానంలో భారత్ 1990 నుంచి తీసుకుంటే అమెరికా, చైనాల తర్వాత భారత్‌లోనే అత్యధిక ప్రకృతి వైపరీత్యాలు సంభవించాయి. కొండచరియలు విరిగిపడటం, తుఫానులు, భూకంపాలు, వరదలు, కరువులు వంటి విపత్తులతో సహా భారతదేశం 1900 సంవత్సరం నుంచి 764 ప్రకృతి వైపరీత్యాలను నమోదు చేసింది. 1900 నుంచి 2000 వరకు 402 సంఘటనలు, 2001-2022 మధ్య 361 విపత్తులు సంభవించాయి. ఇలాంటి విపత్తులు తరచూ సంభవించడం వల్ల ఆర్థిక ఒత్తిడికి సంబంధించి కొత్త రికార్డులను నెలకొల్పిందని నివేదిక పేర్కొంది. ప్రకృతి వైపరీత్యాలు భారతదేశంలో ఎక్కువగా వరదల రూపంలోనే సంభవించాయని, ఇవి దాదాపు 41 శాతం, ఆ తర్వాత తుఫానులు సంభవించాయని నివేదిక పేర్కొంది. ఇదీ చదవండి ➤ ITR filing: పన్ను రీఫండ్‌ను పెంచుకునేందుకు పంచ సూత్రాలు ఇవే.. ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన బీమా విషయంలో భారతదేశంలో చాలా అంతరం ఉందని ఎస్బీఐ నివేదిక గుర్తు చేసింది. 2022లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా 275 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లగా 125 బిలియన్ డాలర్లు మాత్రమే బీమా పరిధిలోకి వచ్చాయంది. అంటే అంతరం 150 బిలియన్ డాలర్లు. ఇది 10 సంవత్సరాల సగటు 130 బిలియన్ డాలర్ల కంటే చాలా ఎక్కువ. మొత్తం నష్టాలలో 54 శాతం బీమా చేయనివేనని వెల్లడించింది. భారతదేశంలో ఈ బీమా రక్షణ అంతరం 92 శాతంగా ఉందని, దేశంలో సగటున 8 శాతం మందికి మాత్రమే బీమా రక్షణ ఉందని నివేదిక స్పష్టం చేసింది. ప్రకృతి వైపరీత్యాల రిస్క్‌లను కవర్ చేయడానికి బీమా రంగంలో 'డిజాస్టర్ పూల్' అవసరాన్ని నొక్కి చెప్పింది. దేశంలో 2020 వరదలను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం ఆర్థిక నష్టం 7.5 బిలియన్ డాలర్లు (రూ. 52,500 కోట్లు) అయితే బీమా కవర్ కేవలం 11 శాతం మాత్రమే అని పేర్కొంది. -
ప్రతి పది మందిలో నలుగురికి టోపీ! సర్వేలో విస్తుగొలిపే విషయాలు
న్యూఢిల్లీ: దేశంలో 39 శాతం మంది గడిచిన మూడేళ్లలో ఆర్థిక మోసాల బారిన పడినట్టు లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో తెలిసింది. అంటే ప్రతి పది మందిలో నలుగురు మోసపోయినట్టు తెలుస్తోంది. ఇలా మోసపోయిన వారిలో కేవలం 24 శాతం మందికే తిరిగి ఆ మొత్తం చేరింది. సర్వే వివరాలను లోకల్ సర్కిల్స్ విడుదల చేసింది. ► 23 శాతం మంది క్రెడిట్ లేదా డెబిట్ కార్డు మోసాలను ఎదుర్కొన్నట్టు తెలిపారు. ► 13 శాతం మంది కొనుగోళ్లు, అమ్మకాలు, ప్రకటనల వెబ్సైట్ల ద్వారా మోసపోయారు. ► 10 శాతం మంది వెబ్సైట్లలో కొనుగోళ్లకు డబ్బులు చెల్లించినా, అవి డెలివరీ చేయలేదు. ► 10 శాతం మంది ఏటీఎం మోసాల బారిన పడగా, 10 శాతం మంది బ్యాంకు మోసాలు, 16 శాతం మంది ఇతర మోసాల బారిన పడినట్టు తెలిసింది. ► దేశవ్యాప్తంగా 331 జిల్లాల్లో 32,000 మంది అభిప్రాయాలను సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. 66 శాతం పురుషులు కాగా, 34 శాతం మంది మహిళలు ఉన్నారు. ► మోసపోయిన మొత్తం తిరిగి తాము వెనక్కి పొందామని 24 శాతం మంది తెలిపారు. 70 శాతం మంది తమ ఫిర్యాదులకు ఇంత వరకు పరిష్కారం లభించలేదని చెప్పారు. ► సంబంధిత ప్లాట్ఫామ్లో ఫిర్యాదు చేయడం ద్వారా 18%మంది మోసపోయిన మొత్తాన్ని వెనక్కి పొందగా, 6 శాతం మంది అధికార యంత్రాంగానికి ఫిర్యాదు చేయడం ద్వారా మోసపోయిన మొత్తాన్ని రాబట్టుకున్నారు. ► 41 శాతం మంది తమ ఫిర్యాదు అపరిష్కృతంగా ఉందని చెప్పగా, 17 శాతం మంది ఎలాంటి పురోగతి లేదని తెలిపారు. ఇక 12 శాతం మంది ఫిర్యాదు చేయకూడదనే నిర్ణయం తీసుకోగా, 6 శాతం మంది ఏమీ చెప్పలేదు. ► సర్వేలో పాల్గొన్న 30% కుటుంబాల్లో కనీసం ఒక సభ్యుడు మోసపోగా, 9 శాతం కుటుంబాల్లో ఒకరికి మించి బాధితులుగా మారారు. ► 57 శాతం మంది ఆర్థిక మోసాల నుంచి తప్పించుకున్నామని తెలిపారు. ► కాస్త ఊరటనిచ్చే విషయం ఏమిటంటే 2022లో మోసపోయిన, తిరిగి వెనక్కి పొందిన వారు 17 శాతంగా ఉంటే, 2023లో ఇలా వెనక్కి పొందిన వారి శాతం 24 శాతానికి చేరింది. -
విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురు
న్యూఢిల్లీ: దేశీయ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి పరారీలో ఉన్న వ్యాపార వేత్త విజయ్ మాల్యాకు మరోమారు చుక్కెదురైంది. ఇప్పటికే దర్యాప్తు సంస్థలు ఆర్థిక నేరస్థుడుగా ప్రకటించిన మాల్యా పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈ విషయంలో పిటిషనర్ నుంచి ఎలాంటి ఆదేశాలు అందడం లేదని మాల్యా తరపు న్యాయవాది కోర్టుకు చెప్పడంతో సుప్రీం తాజా ఆదేశాలిచ్చింది. తనను పరారీలో ఉన్నఆర్థిక నేరగాడిగా ప్రకటించి, తన ఆస్తులను జప్తు చేయాలంటూ ముంబై కోర్టులో జరుగుతున్న విచారణను సవాలు చేస్తూ మాల్యా సుప్రీంను ఆశ్రయించారు. దీన్ని విచారించిన న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, రాజేష్ బిందాల్‌లతో కూడిన ధర్మాసనం నాన్ ప్రాసిక్యూషన్ కారణంగా పిటిషన్ కొట్టివేస్తున్నట్టు పేర్కొంది. ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియంకు రూ. 9 వేల కోట్లకు పైగా ఎగవేసిన మాల్యా 2016లో లండన్‌కు చెక్కేశాడు. దీనిపై సీబీఐ , ఈడీ సులు నమోదు చేశాయి. ఈ క్రమంలోనే జనవరి 5, 2019న ముంబై ప్రత్యేక న్యాయస్థానం చట్టం ప్రకారం మాల్యాను ‘పరారీదారు’గా ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను దేశానికి తిరిగి వేగంగా రప్పించడం, ఆస్తుల రికవరీనిపై ద్వైపాక్షిక సమన్వయం కాకుండా బహుపాక్షిక చర్యలపై కేంద్రం తీవ్ర కసరత్తు చేస్తోంది. అటు గురుగ్రామ్‌లో జరిగిన జీ20 దేశాల అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశంలో కేంద్ర సిబ్బంది సహాయ మంత్రి జితేంద్ర సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతిపరులు తమ అవినీతి సొమ్మును డబ్బును టెర్రర్ ఫండింగ్ , యువతను నాశనం చేస్తున్న అక్రమ మాదక ద్రవ్యాలు, మానవ అక్రమ రవాణా, అక్రమ ఆయుధాల అమ్మకం లాంటి అనేక విధ్వంసక సంస్థలకు నిధులు సమకూరుస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా విజయ్ మాల్యాతో సహా పీఎన్బీ స్కాం నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తదితర పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లను రప్పించేందుకు దేశం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
సంక్షోభానికి చివరి అంచున నిలబడ్డ పాక్! చివరికి శ్రీలంకలానే..
పాక్‌లో ఆర్థిక పరిస్థితులు చాల ఘోరంగా ఉన్నాయి. మరోవైపు ఐఎంఎఫ్ అధికారులు నగదు విషయమై చర్చించేందుకు మంగళవారం పాకిస్తాన్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పాక్‌లో తీవ్ర ఆందోళనలో మొదలయ్యాయి. ఒక పక్క రూపాయి విలువ పతనమవ్వడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి కారణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అక్టోబర్‌లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న భయంతో.. నెలల తరబడి అంతర్జాతీయ ద్రవ్య నిధి డిమాండ్ చేసిన పన్నుల పెంపు, సబ్సిడీ కోతలకు వ్యతిరేకంగా పోరాడారు. దీంతో ఇటీవల పాక్ దివాలా దిశగా అడుగులు వేసింది. అదీగాక స్నేహ పూర్వక దేశాలు సాయం చేసేందుకు రాకపోవడంతో పాక్ ఐంఎఫ్ డిమాండ్లకు తలొగ్గక తప్పలేదు. అంతేగా యూఎస్ డాలర్ల బ్లాక్‌మార్కెట్‌ని నియంత్రించడానికి ప్రభుత్వం రూపాయిపై నియంత్రణలను సడలించింది. దీంతో కరెన్సీ రికార్డు స్థాయికి పడిపోయింది. అలాగే తక్కువ ధరకే లభించే కృత్రిమ పెట్రోల్ ధరలను సైతం పెంచారు. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు ఆర్థికవేత్త అబిద్ హసన్ మాట్లాడుతూ.."తాము సంక్షోభానికి చివర అంచులో ఉన్నాం. తమ ప్రభుత్వం ఐఎంఎఫ్ డిమాండ్లను నెరవేర్చడం గురించి ప్రజలకు తెలియజేయాలి. లేదంటే దేశం కచ్చితంగా సంక్షోభంలో మునిగిపోతుంది. చివరికి శ్రీలంకలా అయిపోతుంది. ఐతే మా పరిస్థితి మాత్రం బహుశా అక్కడికంటే ఘోరంగా ఉండొచ్చు." అని ఆవేదనగా చెప్పారు. కాగా, శ్రీలంక కూడా పాక్ మాదిరిగానే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయి, చివరికి ఆ దేశ నాయకుడు దేశం విడిచి పారిపోయే పరిస్థితికి దారితీసింది. అదీగాక పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ ఎకనామిక్స్‌కి చెందిన విశ్లేషకుడు నాసిర్ ఇక్బాల్ రాజకీయ అనిశ్చితి కారణంగా ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సరిగా లేదని, వాస్తవంగా కుప్పకూలిపోతుందని హెచ్చరించారు కూడా. కొనుగోలు చేయలేని స్థితిలో ప్రజలు ప్రపంచంలోనే ఎక్కువ వినియోగదారులు ఉన్న ఐదవ అతిపెద్ద స్టేట్ బ్యాంకులో సుమారు రూ. 30 వేల కోట్లు (3.7 బిలియన్ డాలర్లు) మాత్రమే ఉన్నాయి. ఇది కేవలం మూడు వారాల దిగుమతులను కొనుగోలు చేయడానికే సరిపోతుంది. దీంతో కొనుగోలు చేయలేని సరుకంతా కరాచీ పోర్టులోని వేలాది షిప్పింగ్ కంటైనర్లలోనే ఉంటుంది. రూపాయి పతనంలో పరిశ్రమలు కుదేలయ్యాయి. ప్రజా నిర్మాణ ప్రాజెక్టు ఆగిపోయాయి. టెక్స్టైల్స్ ప్యాక్టరీలు పాక్షికంగా మూతపడ్డాయి. దీంతో పెట్టుబడులు మందగించాయి. డజన్ల కొద్ది కూలీలు ఉపాధి లేక అల్లాడుతున్నారు. ఫలితంగా బిక్షాటన చేసే వారి సంఖ్య పెరిగింది. ద్రవ్యోల్బణం కారణంగా ప్రజల ఆదాయం మార్గాలు తగ్గడంతో నిత్యావసర వస్తువులను కొనుగోలు చేయలేని దారుణ స్థితిలో ఉన్నారు. గందరగోళంగా ఉన్న రాజకీయ పరిస్థితులు జూన్‌లో ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు 33 మిలియన్ డాలర్ల రుణాలు ఇతర విదేశీ చెల్లింపులు చెల్లించాల్సి ఉందని స్టేట్ బ్యాంకు గవర్నర్ జమిల్ అహ్మద్ గత నెలలో వెల్లడించారు. మరోవైపు దేశం తీవ్ర ఇంధన కొరతతో అల్లాడుతోంది. గత వారం ఖర్చుల కోత చర్యల కారణంగా.. విద్యుత్ గ్రిడ్‌లో సాంకేతిక లోపం సంభవించి.. ఒక రోజంతా అంధకారంలోనే ఉండిపోయింది. ఐతే పాక్ పెట్రోలియం మంత్రి ముసాదిక్ మాలిక్ ఏప్రిల్ నుంచి రష్యా చమురు దిగుమతులు ప్రారంభమవుతాయని, ఒప్పందంలో భాగంగా స్నేహ పూర్వక దేశాల మధ్య కరెన్సీలలో చెల్లింపులు జరుగుతాయని ఆశాభావంగా చెప్పారు. ఇదిలా ఉండగా పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముందస్తు ఎన్నికల కోసం తన ప్రయత్నంలో భాగంగా పాలక కూటమిపై ఒత్తిడి పెంచారు. గతేడాది అవిశ్వాస తీర్మానం కారణంగా పదవి నుంచి తొలగించబడ్డ ఖాన్ 2019లో ఐఎంఎఫ్‌తో బహుళ బిలియన్ డాలర్ల రుణ ప్యాకేజీపై చర్చలు జరిపారు. ఐతే ఈ కార్యక్రమం అనుహ్యంగా నిలిచిపోయింది. ఇప్పటికే రెండు డజన్లకు పైగా ఖరారు చేసుకున్న ఐఎంఎఫ్ ఒప్పందాలు విచ్ఛిన్నమయ్యాయి. ఒకవేళ పాకిస్తాన్ ఈ పరిస్థితి నుంచి తాత్కాలికంగా తప్పించుకున్నప్పటికీ భవిష్యత్తులో పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారడమే గాక పేదరికి తీవ్రతరం అవుతుందని రాజీకీయ విశ్లేషకుడు మైఖేలే కుగెల్ మాన్ ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశంలో పెద్దస్థాయిలో సంస్కరణలు తీసుకురాలేకపోతుందని, తదుపరి సంక్షోభాన్ని ఎదుర్కోనే దేశంగా చిట్టచివరి అంచున నిలబడి ఉందని అన్నారు. (చదవండి: పుతిన్‌నే ఎక్కువగా నమ్ముతా! ట్రంప్ సంచలన వ్యాఖ్యలు) -
పాకిస్థాన్ లో ఆర్థిక, ఆహార సంక్షోభం
-
గ్రీన్ ఫైనాన్స్ నిర్వచనం... వర్గీకరణ అవశ్యం
ముంబై: పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ప్రాజెక్టులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడానికి, సంబంధిత (పర్యావరణ) కార్యకలాపాలకు ఆర్థిక వ్యవస్థలో ప్రాధాన్యతన ఇవ్వడానికి ఉద్దేశించిన– గ్రీన్ ఫైనాన్స్‌పై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గ్రీన్ ఫైనాన్స్‌కు అంటే ఏమిటో స్పష్టమైన నిర్వచనం, వర్గీకరణ చేయాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. దీనివల్ల ఆయా పర్యావరణ పరిరక్షణా కార్యకలాపాలకు, ప్రాజెక్టులకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. బిజినెస్ స్టాండెర్డ్ ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గ్రీన్ ఫైనాన్స్‌కు తగిన నిర్వచనం, వర్గీకరణ వల్ల పర్యావరణ పరిరక్షణకు అంటే ఏమిటి? తమ రుణ పోర్ట్‌ఫోలియోలో గ్రీన్ ఫైనాన్స్‌కు ఎంతమేర ప్రాముఖ్యతను ఇవ్వాలి? వంటి అంశాలను బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మదింపు చేసుకోగలుగుతాయని అన్నారు. అలాగే గ్రీన్ ఫైనాన్స్‌ను నిర్లక్ష్యం చేసే అవకాశాలు కూడా గణనీయంగా తగ్గిపోతాయని అన్నారు. గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లకు ప్రాధాన్యత దేశంలో పర్యావరణ పరిరక్షణ కార్యకలాపాలకు ఫైనాన్స్‌ను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని రాజేశ్వర్‌రావు ఉద్ఘాటించారు. ఈ దిశలో గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు దేశంలో గ్రీన్ ఫైనాన్స్‌ను పెంచడంలో సహాయపడతాయని చెప్పారు. వాతావరణ మార్పు.. భౌతిక, పరివర్తన ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందన్నారు. వెరసి ఆయా అంశాలు ఆర్థిక పటిష్టతకు, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి చిక్కులను తెచ్చిపెట్టే అవకాశమూ లేకపోలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో భౌగోళిక వాతావారణ మార్పుల వల్ల చోటుచేసుకునే ఆర్థిక నష్టాలను అర్థం చేసుకోవడానికి, అంచనా వేయడానికి, వీటిని నివారించే దిశలో సమగ్ర ఫ్రేమ్‌వర్క్‌లను అభివృద్ధి చేయడానికి, అమలు చేయడానికి నియంత్రణా సంస్థల ఏర్పాటు అవసరం ఉందని పేర్కొన్నారు. సావరిన్ గ్రీన్ బాండ్ (ఎస్జీబీ)ఇష్యూ నుండి రూ. 16,000 కోట్ల వరకు సమీకరించాలన్న బడ్జెట్ ప్రతిపాదనను డిప్యూటీ గవర్నర్ స్వాగతించారు. గ్రీన్ ప్రాజెక్టుల్లోకి నిధుల ప్రవాహానికి ఈ చర్య దోహదపడుతుందని అన్నారు. -
ఇండియన్ ఎకానమీకి వచ్చే పదేళ్లు అద్భుతం: నందన్ నీలేకని
న్యూఢిల్లీ: భారత్ రానున్న పది సంవత్సరాల్లో ‘‘కీలకమైన ఆర్థిక క్రియాశీలత’’ను ప్రదర్శించనుందని ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకులు, చైర్మన్ నందన్ నీలేకని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యయుతమైన రీతిలో విస్తృత ప్రాతిపదికన, ప్రజలందరి భాగస్వామ్యంతో ఈ క్రియాశీలత ఉంటుందని కూడా ఆయన విశ్లేషించారు. డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్వర్క్ (ఓఎన్డీసీ), రికార్డ్ అగ్రిగేటింగ్ సిస్టమ్, వస్తు సేవల పన్ను (జీఎస్టీ), ఫాస్ట్‌ట్యాగ్, ఈ-వే బిల్లుల వంటి ప్రభుత్వ చర్యలు భారత్ ఆర్థిక వృద్ధి బాటన దోహదపడే అంశాలుగా వివరించారు. కార్నెగీ ఇండియా నిర్వహించిన బల్ టెక్నాలజీ సమ్మిట్ 7వ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 2014లో 60 కోట్ల మందికి ఆధార్ గుర్తింపు ఉంటే, ప్రస్తుతం 130 కోట్ల మంది భారతీయులకు ఈ ఐడీలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది దేశంలో ఎక్కడైనా ఉపయోగించగల ఆన్లైన్ ఐడీ అని పేర్కొంటూ, బయోమెట్రిక్స్, ఓటీపీల ద్వారా ఒక వ్యక్తి ప్రమాణీకరణకు ఇది దోహదపడుతుందని అన్నారు. (టీవీఎస్ అపాచీ స్పెషల్ ఎడిషన్, న్యూ లుక్ చూస్తే ఫిదానే!) ఇవీ చదవండి: అమెజాన్‌కు ఏమైంది? వారంలో మూడో బిజినెస్‌కు బై..బై..! ఎన్డీటీవీ: ప్రణయ్ రాయ్, రాధిక గుడ్‌బై, కేటీఆర్ రియాక్షన్ -
Climate Transparency Report 2022: భారత్‌ను దెబ్బతీసిన వాతావరణ మార్పులు
న్యూఢిల్లీ: వాతావరణ మార్పులు మన దేశాన్ని ఆర్థికంగా కూడా తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నాయి. 2021లో వడగాడ్పులకి భారత్‌కి 15,900 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని క్లైమేట్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్–2022 వెల్లడించింది. పర్యావరణం, వాతావరణ మార్పులపై అధ్యయనం చేస్తున్న కొన్ని అంతర్జాతీయ సంస్థలు కలసికట్టుగా ఈ నివేదిక రూపొందించాయి. వ్యవసాయం, నిర్మాణం, తయారీ, సేవా రంగాల్లో ఈ నష్టం వాటిల్లింది. దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో 5.4% నష్టం జరిగినట్టు ఆ నివేదిక వివరించింది. ఆ నివేదికలో ఏముందంటే..! ► మండే ఎండలతో గత ఏడాది దేశంలో 16,700 పని గంటలు వృథా అయ్యాయి. 1990–1999తో పోల్చి చూస్తే 39% పెరిగింది. ► 2016–2021 మధ్య కాలంలో తుపానులు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి 3.6 కోట్ల హెక్టార్లలో పంటలకి నష్టం వాటిల్లింది. దీంతో రైతన్నలు 375 కోట్ల డాలర్లు నష్టపోయారు. ► దేశంలో 30 ఏళ్లలో వర్షాలు పడే తీరులో ఎన్నో మార్పులు వచ్చాయి. వ్యవసాయం, అటవీ, మత్స్య ఆర్థిక ప్రభావాన్ని కనబరిచింది. ► 1850–1900 మధ్య కాలంతో పోల్చి చూస్తే భూ ఉష్ణోగ్రతలు 1.1 డిగ్రీల సెల్సియస్ పెరిగాయి ► వాతావరణ మార్పుల ప్రభావం అన్ని దేశాలతో పాటు భారత్‌పై రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నిలువ నీడ లేని వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ► వాతావరణ మార్పులతో జరుగుతున్న నష్టాన్ని అరికట్టాలంటే ప్రపంచ దేశాలు భూ ఉష్ణోగ్రతల్ని 2 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గించడానికి కృషి చేయాలి. 2015 పారిస్ ఒప్పందాన్ని అన్ని దేశాలు వినియోగించడమే దీనికి మార్గం. ► పర్యావరణ మార్పుల్ని కట్టడి చేయాలంటే మనం వాడుతున్న ఇంధనాలను మార్చేసి, పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు చేపట్టాల్సి అవసరం ఉందని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్‌లో ఎర్త్ సైన్సెస్, క్లైమేట్ చేంజ్ డైరెక్టర్ సురుచి భద్వాల్ పేర్కొన్నారు. -
6వ అతిపెద్ద బీమా మార్కెట్‌గా అవతరించనున్న భారత్!
న్యూఢిల్లీ: భారత్ వచ్చే పదేళ్లలో ఆరో అతిపెద్ద బీమా మార్కెట్‌గా అవతరిస్తుందని ‘స్విస్ రీ ఇనిస్టిట్యూట్’ అంచనా వేసింది. నియంత్రణ సంస్థ నుంచి మద్దతు, ఆర్థిక కార్యకలాపాల విస్తరణ ఇందుకు చేదోడుగా నిలుస్తాయని అభిప్రాయపడింది. ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది. ఆరో అతిపెద్ద బీమా మార్కెట్‌గా అవతరించేందుకు భారత్.. వచ్చే పదేళ్ల కాలం పాటు ఏటా 14 శాతం మేర బీమా ప్రీమియంలో వృద్ధి నమోదు కావాలని సూచించింది. ప్రస్తుతం బీమా ప్రీమియం పరంగా భారత్ ప్రపంచంలో పదో స్థానంలో ఉంది. భారత జీవిత బీమా రంగం 2022లో 6.6 శాతం మేర, 2023 నుంచి 7.1 శాతం మేర వృద్ధిని సాధిస్తుందని స్విస్‌రీ అంచనా వేసింది. మొత్తం జీవిత బీమా ప్రీమియం 2022లో మొదటిసారి 100 బిలియన్ డాలర్లు దాటుతుందని తెలిపింది. జీవితేతర బీమా మారెŠక్ట్ గురించి చర్చిస్తూ.. 2021లో 5.8 శాతం మేర ప్రీమియంలో వృద్ధి నమోదైనట్టు, 2022లో 4.5 శాతం వృద్ధికి పరిమితం కావచ్చని పేర్కొంది. అధిక ద్రవ్యోల్బణాన్ని ఇందుకు కారణంగా పేర్కొంది. 2023–2032 మధ్య ఏటా 8 శాతం కాంపౌండెడ్ వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంచనా వేసింది. ముఖ్యంగా కరోనా మమమ్మారి ప్రవేశం తర్వాత వ్యవస్థీకృత మార్పు జీవితేతర బీమా (ఆరోగ్య బీమా)లో చోటు చేసుకున్నట్టు తెలిపింది. కరోనా వల్ల రిస్క్‌పై అవగాహన ఏర్పడి, హెల్త్ ఇన్సూరెన్స్‌కు డిమాండ్ గణనీయంగా పెరిగినట్టు వివరించింది. 2022లో భారత్ ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని స్విస్ రీ ఇనిస్టిట్యూట్ అంచనా వేసింది. -
తగ్గేదెలే! అగ్రరాజ్యం బ్రిటన్ను దాటేసిన భారత్.. మరింత బలంగా..
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లను తట్టుకొని నిలబడ్డ భారత్ ప్రపంచ పటంలో బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. అగ్రరాజ్యమైన బ్రిటన్ను దాటి అయిదోస్థానంలోకి దూసుకుపోయింది. 2022 మార్చి చివరి నాటికి భారత్ ప్రపంచంలోని బలమైన ఆర్థిక దేశాల్లో అయిదో స్థానంలో ఉందని బ్లూమ్‌బర్గ్ సంస్థ తాజా కథనంలో వెల్లడించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి సేకరించిన జీడీపీ గణాంకాలు, డాలర్‌తో మారకపు రేటు ఆధారంగా బ్లూమ్‌బర్గ్ లెక్కలు వేసి ఒక నివేదికను రూపొందించింది. ప్రపంచంలో బలమైన ఆర్థిక దేశంగా అమెరికా మొదటి స్థానంలోనూ, చైనా రెండో స్థానంలో ఉంటే జపాన్, జర్మనీ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. పదేళ్ల క్రితం పదకొండో స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు బ్రిటన్ను ఆరో స్థానానికి నెట్టేసి అయిదో స్థానానికి ఎగబాకింది. 2021 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారత్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 854.7 బిలియన్ డాలర్లు ఉంటే, బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 816 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది భారత్‌రూపాయితో పోల్చి చూస్తే బ్రిటన్ పౌండ్ విలువ 8% మేరకు క్షీణించింది. మరోవైపు భారత్ ఆర్థిక వృద్ధి ఈ ఏడాది 7శాతానికి పైగా నమోదు చేయవచ్చునని అంచనాలున్నాయి. 2021–22లో మన దేశం 8.7% వృద్ధి నమోదు చేసింది. అయితే తలసరి ఆదాయం, మానవ అభివృద్ధి సూచిలో మాత్రం మనం బ్రిటన్ కంటే వెనుకబడి ఉండడం గమనార్హం. విద్య, ఆరోగ్యం, ప్రజల జీవన ప్రమాణాలతో కొలిచే మానవ అభివృద్ధిలో బ్రిటన్ 1980లో ఉన్నప్పటి స్థితికి చేరాలన్నా మనకు మరో పదేళ్లు పడుతుందని ఆర్థిక వేత్తలంటున్నారు. వలస పాలకుల్ని నెట్టేయడం గర్వకారణం దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకొని ఆజాదీ అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ మన దేశం అయిదో స్థానానికి చేరుకోవడంతో కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన దేశాన్ని వలస రాజ్యంగా మార్చి పరిపాలించిన బ్రిటన్నే ఆర్థికంగా వెనక్కి నెట్టేయడం ప్రతీ భారతీయుడు గర్వించాల్సిందేనని ట్వీట్లు చేశారు. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కర్మ సిద్ధాంతం పని చేసిందని, దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన ప్రతీ భారతీయుడి గుండె ఉప్పొంగిపోతుందని ట్వీట్ చేస్తే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ‘‘రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్’’ అన్న సూత్రంతోనే విజయం సాధించామని, ప్రధాని నరేంద్ర మోదీకే ఈ క్రెడిట్ దక్కుతుందని ట్విటర్లో పేర్కొన్నారు. ఆర్థిక కష్టాల్లో బ్రిటన్ బ్రిటన్ గత కొన్నేళ్లుగా ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుంది. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరుకుంది. ధరలు ఆకాశాన్నంటడంతో సామాన్యులకి బతుకు భారమైపోయింది. ఆర్థిక మాంద్యం ప్రమాదాన్ని కూడా ఎదుర్కొంటోంది. 2021 ద్వైమాసికంలో బ్రిటన్ జీడీపీ కేవలం 1% మాత్రమే పెరిగింది. కరోనా మహమ్మారి విసిరిన సవాళ్లను ఎదుర్కోలేక ఆర్థికంగా చతికిల పడిపోయింది. ఈ నేపథ్యంలోనే రాజకీయ అస్థిరత్వం, బోరిస్ జాన్సన్ రాజీనామా వంటివి ఆ దేశాన్ని మరింత కుదేల్ చేశాయి. 2024 వరకు ఇవే పరిస్థితులు ఉంటాయని బ్యాంకు ఆఫ్ ఇంగ్లండ్ అంచనా వేస్తోంది. -
అమెరికా ఆర్థిక మాంద్యం వైపు పయనిస్తోందా?... భయాందోళనలో అధికారులు
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక మాంద్యం వైపు పరుగులు తీస్తోందేమోనని యూఎస్ అధికారులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఐతే అదేం ఉండదని, భయపడాల్సిన అవసరం లేదంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ వారం తరువాత వచ్చే జీడీపీ గణాంకాలు వరుసగా రెండోవ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ పడిపోతున్నట్లు చూపవచ్చు అని చెప్పారు. ఈ మేరకు బైడెన్ మాట్లాడుతూ...మేము ఆర్థిక మాంద్యంలో ఉండకపోవచ్చునని భావిస్తున్నా. మేము వేగవంతమైన వృద్ధి నుంచి స్థిరమైన వృద్ధి వెళ్తాము. అంతేకాదు ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలో తిరోగమనం అనేది అసంభవం అని తేల్చి చెప్పారు. అదీగాక ఆర్థిక వేత్తల ఏకాభిప్రాయ సూచన ఇప్పటికీ స్వల్ప వృద్ధిని కోరుతోందని అన్నారు. అదే సమయంలో ఫెడరల్ రిజర్వ్ తదుపరి చర్యగా డిమాండ్‌ని తగ్గించే ప్రయత్నంలో వడ్డిరేట్లను మరో మూడోంతులు శాతం పెంచింది. ఈ మేరకు ఫెడరల్ చైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ఈ చర్య అత్యవసరం అని చెప్పారు. ఐతే యూఎస్ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా సాధించడమే లక్ష్యం అని నొక్కి చెప్పారు. (చదవండి: ‘శ్రీలంకలో మరో 12 నెలల పాటు ఇంధన కొరత తప్పదు’) -
సెజ్‌లకు కొత్త రూపు..
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఎగుమతులకే పరిమితమవుతున్న ప్రత్యేక ఆర్థిక మండళ్లను (సెజ్) సమగ్ర ఆర్థిక హబ్‌లుగా తీర్చిదిద్దాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా ఆర్థిక మండళ్లలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు నిబంధనలను సడలించడం, ప్రోత్సాహకాలు ఇవ్వడం తదితర చర్యలు తీసుకునే యోచనలో ఉంది. అలాగే సెజ్‌లలోని యూనిట్లు దేశీయంగా కూడా విక్రయించుకునేందుకు అనుమతించాలని యోచిస్తోంది. ఈ క్రమంలో రూపొందించిన ముసాయిదా చర్చా పత్రం ప్రకారం హబ్‌లను డెవలప్మెంట్ ఎంటర్ప్రైజ్ అండ్ సర్వీస్ హబ్‌లు (దేశ్)గా వ్యవహరించనున్నారు. వాటిల్లోని సంస్థలు దేశీయంగా విక్రయించుకోవడంతో పాటు జోన్‌కు వెలుపలి సంస్థల కోసం కాంట్రాక్టు తయారీ కార్యకలాపాలు కూడా చేపట్టేందుకు అనుమతించనున్నారు. కొంత మేర ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు, వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే చర్యలు కూడా తీసుకోనున్నారు. సంయుక్తంగా ఏర్పాటు.. ఇలాంటి హబ్‌లను కేంద్రం, రాష్ట్రం విడివిడిగా లేదా కలిసి నెలకొల్పవచ్చు. తయారీ లేదా సర్వీసు కార్యకలాపాల కోసం లేదా ఈ రెండింటి కోసం వ్యక్తులు కూడా ఏర్పాటు చేయవచ్చు. సెజ్‌ల వెలు పలి సంస్థలతో సమానంగా పన్ను భారం వర్తించే లా హబ్‌లలోని యూనిట్లు దేశీయంగా జరిపే విక్ర యాలపై ఈక్వలైజేషన్ లెవీ విధించే అవకాశం ఉంది. పరిశ్రమ వర్గాలతో సంప్రదింపుల తర్వాత రాబోయే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రాలను కూడా అభివృద్ధిలో భాగం చేసే ఉద్దేశంతో సెజ్ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తేనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధన్యం సంతరించుకున్నాయి. -
12 దేశాల భాగస్వామ్యంతో... ఐపీఈఎఫ్
టోక్యో: కరోనా, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావాల నుంచి బయట పడి ఆర్థికంగా మరింత బలోపేతం కావడంతో పాటు చైనాకు చెక్ పెట్టే లక్ష్యంతో 12 ఇండో పసిఫిక్ దేశాల మధ్య ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపీఈఎఫ్) పేరిట సరికొత్త వర్తక ఒప్పందం కుదిరింది. ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ పీఎం ఫుమియో కిషిడాతో కలిసి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం ఈ మేరకు ప్రకటన చేశారు. ఐపీఈఎఫ్‌లో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, మలేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయ్‌లాండ్, సింగపూర్, బ్రూనై భాగస్వాములు. భావి సవాళ్లను కలసికట్టుగా ఎదుర్కొనేందుకు ఐపీఈఎఫ్ దోహదపడుతుందంటూ ఈ 12 దేశాలూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ, ‘‘21వ శతాబ్దపు ఆర్థిక వ్యవస్థను శాసించేది ఇండో పసిఫిక్ ప్రాంతమే. సగానికి పైగా ప్రపంచ జనాభాకు, 60 శాతానికి పైగా ప్రపంచ జీడీపీకి ఈ ప్రాంతం ప్రాతినిధ్యం వహిస్తోంది. అందుకే తాజా ఒప్పందానికి ఎంతో ప్రాధాన్యముంది’’ అని అన్నారు. ఐపీఈఎఫ్‌లో మున్ముందు మరిన్ని దేశాలు భాగస్వాములు అవుతాయన్నారు. సరఫరా వ్యవస్థ, డిజిటల్ వర్తకం, స్వచ్ఛ ఇంధనం, ఉద్యోగుల భద్రత, అవినీతి నిరోధం తదితర రంగాల్లో సభ్య దేశాలన్నీ మరింత సన్నిహితంగా కలిసి పని చేసేందుకు ఐపీఈఎఫ్ వీలు కల్పిస్తుందని వైట్‌హౌస్ ఒక ప్రకటనలో పేర్కొంది. దీని స్వరూప స్వభావాలపై అక్టోబర్‌కల్లా స్పష్టత వస్తుందని తెలిపింది. చైనాను రెచ్చగొట్టొద్దనే ఉద్దేశంతో ప్రస్తుతానికి తైవాన్ను ఐపీఈఎఫ్‌లో భాగస్వామిగా చేసుకోకపోయినా ఆ దేశంతో సన్నిహిత ద్వైపాక్షిక ఆర్థిక బంధం కొనసాగుతుందని అమెరికా ప్రకటించింది. మూడు ‘టి’లే మూలస్తంభాలు: మోదీ ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఇండో–పసిఫిక్‌ను ప్రధాన చోదక శక్తిగా మార్చేందుకు ఐపీఈఎఫ్ భాగస్వామిగా భారత్ కృషి చేస్తుందని మోదీ ప్రకటించారు. ఈ ప్రాంతంలో శాంతి, సౌభాగ్యాలు నెలకొనాలన్న సభ్య దేశాల ఉమ్మడి ఆకాంక్షలకు, ఆర్థిక సవాళ్లను అధిగమించాలన్న సమిష్టి సంకల్పానికి ఐపీఈఎఫ్ ప్రతిరూపమన్నారు. ఇలాంటి భాగస్వామ్యానికి రూపమిచ్చినందుకు బైడెన్‌కు కృతజ్ఞతలన్నారు. ‘‘నిర్మాణ, ఆర్థిక కార్యకలాపాలకు, అంతర్జాతీయ వర్తక, పెట్టుబడులకు ఇండో పసిఫిక్ ప్రాంతం ప్రధాన కేంద్రం. ఈ ప్రాంతంలో వర్తక కార్యకలాపాలకు భారత్ ప్రధాన కేంద్రం. ఇందుకు చరిత్రే సాక్షి’’ అని చెప్పారు. ప్రపంచంలోనే అతి పురాతన వాణిజ్య నౌకాశ్రయం గుజరాత్‌లోని లోథాల్లో ఉందని గుర్తు చేశారు. ఒప్పందంలో భాగంగా సభ్య దేశాల మధ్య నెలకొనబోయే కీలక సరఫరా వ్యవస్థలకు ట్రస్ట్ (నమ్మకం), ట్రాన్స్పరెన్సీ (పారదర్శకత), టైమ్లీనెస్ (సమయపాలన) అనే మూడు ‘టి’లు మూల స్తంభాలుగా నిలవాలని పిలుపునిచ్చారు. విఫల యత్నమే: చైనా భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఇండో పసిఫిక్ భాగస్వామ్యంపై చైనా మరోసారి అక్కసు వెలిగక్కింది. 12 ఇండో పసిఫిక్ దేశాల భాగస్వామ్యంతో తాజాగా తెరపైకి వచ్చిన ఐపీఈఎఫ్ విఫలయత్నంగా మిగిలిపోతుందని జోస్యం చెప్పింది. వీటి ముసుగులో ఇండో పసిఫిక్‌లో సైనిక స్థావరాల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించింది. వాటిని అడ్డుకోవాలని ఇండో పసిఫిక్ దేశాలకు పిలుపునిచ్చింది. భారత్ చలో.. భారత్ సే జుడో జపాన్ ఎన్నారైలకు మోదీ పిలుపు భారత్, జపాన్ సహజ భాగస్వాములని ప్రధాని మోదీ అన్నారు. భారత అభివృద్ధి యాత్రలో జపాన్ పెట్టుబడులు ప్రధాన పాత్ర పోషించాయన్నారు. ముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్, ఢిల్లీ–ముంబై ఇండస్ట్రియల్ కారిడార్, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల వంటివి ఇరు దేశాల పరస్పర సహకారానికి నిదర్శనాలని చెప్పారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం జపాన్‌లోని ఎన్నారైలతో టోక్యోలో ఆయన భేటీ అయ్యారు. ‘భారత్ చలో, భారత్ సే జుడో’ ఉద్యమంలో భాగస్వాములు కావాల్సిందిగా పిలుపునిచ్చారు. అరాచకం, ఉగ్రవాదం, వాతావరణ మార్పుల వంటి సవాళ్లను అధిగమించేందుకు బుద్ధుని బాటే ఆదర్శమన్నారు. ప్రతి భారతీయుడూ జీవితంలో ఒక్కసారైనా జపాన్ సందర్శించాలని అప్పట్లో స్వామి వివేకానంద అన్నారు. ప్రతి జపాన్ పౌరుడూ ఒక్కసారైనా భారత్ సందర్శించాలని నేనంటున్నా’’ అని చెప్పారు. మంగళవారం ఆయన క్వాడ్ శిఖరాగ్రంలో పాల్గొనడంతో క్వాడ్ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. -
నాడు కూలీ.. నేడు వ్యాపారి.. నవరత్నాలతో ఆర్థిక స్వావలంబన
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో మహిళలు శ్రీమంతులయ్యారు. కుటుంబాలను చక్కదిద్దుకున్నారు. సమాజంలో గౌరవంగాబతుకుతున్నారు. చిరు వ్యాపారాలు చేస్తూ కొందరు, చేతి వృత్తుల్లో రాణిస్తూ మరికొందరు, పశు పోషణలో పట్టు సాధిస్తూ ఇంకొందరు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. కర్నూలు(అర్బన్): మహిళల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. నవరత్నాల్లో భాగంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి కోట్లాది రూపాయల నిధులను జమచేస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలు ఈ నిధులను సద్వినియోగం చేసుకుంటున్నారు. తమ జీవనోపాధులను మెరుగుపరచుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు రోజుకు 100 రూపాయల కూలికి వెళ్లిన అనేక మంది మహిళలు నేడు చిరు వ్యాపారులయ్యారు. ప్రభుత్వం అందిస్తున్న రుణాలు, ఆర్థిక సహకారంతో స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నారు. సమాజంలో ఉన్నతంగా జీవిస్తున్నారు. పిల్లలను ఉన్నత విద్య చదివిస్తున్నారు. ఆర్థికాభివృద్ధికి ‘చేయూత’ వైఎస్సార్ చేయూత పథకంతో 45 నుంచి 60 ఏళ్లలోపు వయస్సు కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళల జీవితాలు మెరుగుపడ్డాయి. అర్హులైన వారి ఖాతాలో ఏటా ప్రభుత్వం రూ. 18,750 జమ చేస్తోంది. అంతేకాకుండా బ్యాంకుల ద్వారా రుణం కూడా ఇప్పిస్తోంది. వైఎస్సార్ చేయూత కింద ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు 2020–21 ఆర్థిక సంవత్సరంలో 1,98,480 మందికి రూ. 372.15 కోట్లు, 2021–22 మొదటి విడతలో 1,91,783 మందికి రూ.359.59 కోట్లు, 2021–22 రెండవ విడతలో 21,674 మందికి రూ.40.64 కోట్లను ప్రభుత్వం అందజేసింది. చేయూత పథకం కింద బ్యాంకుల ద్వారా అందిన రుణంతో 3,251 మంది మహిళలు కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం 2,727 కిరాణా దుకాణాలకు 12.10 కోట్ల రుణాలు మంజూరు చేసింది. లబ్ధిదారులకు వైఎస్సార్ చేయూత జీవన క్రాంతి పథకంలో భాగంగా 16,004 యూనిట్ల పాడి పశువులు, గొర్రెలు, మేకలను ఇప్పించారు. చేతి వృత్తులకు ‘చేదోడు’ బీసీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జగనన్న చేదోడు, వైఎస్సార్ కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాల ద్వారా రూ. 96.47 కోట్లను ఇప్పటి వరకు విడుదల చేసింది. 2020–21, 2021–22 ఆర్థిక సంవత్సరాల్లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని మొత్తం 47,550 మంది రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్లకు జగనన్న చేదోడు ద్వారా ఒక్కొక్కరికి రూ.10 వేల ప్రకారం మొత్తం రూ.47.55 కోట్లను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన కాపు, ఒంటరి, తెలగ కులాలకు చెందిన 45 సంవత్సరాలు పైబడి 60 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకు కాపు నేస్తంలో భాగంగా ఒక్కొక్కరికి రూ.15 వేల ప్రకారం రూ.18,28,50,000 విడుదల చేశారు. అగ్రవర్ణ పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన మహిళలకు ఆర్థిక చేయూతను అందించేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఈబీసీ నేస్తం పథకం కింద 2021–22 ఆర్థిక సంవత్సరంలో రూ.30,64,50,000 విడుదల చేశారు. ఉన్నత విద్యకు అధిక ప్రాధాన్యం గత ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు, ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థుల ఉన్నత విద్యకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేసింది. ఈ నేపథ్యంలో సంక్షేమ క్యాలెండర్లో ప్రకటించిన విధంగానే నవరత్నాల్లో భాగంగా జగనన్న వసతి, విద్యా దీవెన పేరుతో ఆయా వర్గాలకు చెందిన విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి 2019– 20 నుంచి 2021–22 ఆర్థిక సంవత్సరం వరకు దాదాపు రూ.559.49.46,813 జమ చేసింది. ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన అనేక మంది పేదింటి బిడ్డలు నేడు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, డాక్టర్లు, ఇతరత్రా ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లో ఉద్యోగాలు చేస్తూ తమ కుటుంబాలకు ఆర్థిక చేయూతను అందిస్తున్నారు ఉన్నత విద్యకు మార్గం సుగమం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న జగనన్న విద్యా, వసతి దీవెన కార్యక్రమాలతో నాలాంటి ఎంతో మంది పేద, మధ్య తరగతికి చెందిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలు కలుగుతోంది. భర్త ప్రైవేటు ఉద్యోగం చేస్తూ నన్ను చదివిస్తున్నారు. డిగ్రీ రెండో సంవత్సరంలో రూ.21,505, మూడో సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.13,835 విద్యా, వసతి దీవెన ద్వారా విడుదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ఇస్తున్న అధిక ప్రాధాన్యత వల్ల నాలాంటి ఎంతో మంది పేద, మధ్య తరగతి విద్యార్థులకు మేలు జరుగుతోంది. – లక్ష్మీప్రవల్లిక, డిగ్రీ ఫైనలియర్, సాధన డిగ్రీ కళాశాల, నంద్యాల పెరిగిన జీవనాధారం గొర్రెలను కాస్తున్న ఈమె పేరు కరణం పార్వతి. పత్తికొండ మండలం జూటూరు గ్రామానికి చెందిన ఈమె సంజువాణి పొదుపు గ్రూప్ సభ్యురాలు. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా గ్రూపులోని సభ్యులు గొర్రెలను కొనుగోలు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పల్లెల్లోని తమ లాంటి పేద మహిళలు ఒకరిపై ఆధారపడకుండా జీవనం సాగిస్తున్నారని పార్వతి తెలిపారు. తమకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూనే మరోవైపు గొర్రెల పెంపకాన్ని అభివృద్ధి చేసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు. నాడు కూలీ.. నేడు వ్యాపారి చీరలు అమ్ముతున్న ఈమె పేరు ఫక్కుర్బీ. దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామవాసి. గతంలో కూలి పనులకు వెళ్లేవారు. భర్త ఆటో నడిపేవారు. కుటుంబం గడవడం కష్టంగా ఉండేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరి ఆర్థిక పరిస్థితిలో మార్పు వచ్చింది. సున్నా వడ్డీ పథకం ద్వారా ఒకసారి రూ.50 వేలు, మరోసారి రూ.లక్ష రుణం తీసుకొని ఈమె గ్రామంలోనే రెడీమేడ్ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. రోజుకు రూ.4 వేల వరకు వ్యాపారం జరుగుతోంది. రూ.500 వరకు ఆదాయం వస్తున్నట్లు ఈమె తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా తన కూతురికి ఒకసారి రూ.15 వేలు, మరో సారి రూ.14 వేలు వచ్చినట్లు ఆమె చెప్పారు. అల్లికలకు చేయూత గంప అల్లుతున్న ఈమె పేరు పి.చంద్రమ్మ. తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామ వాసి. ఈమెకు వైఎస్సార్ చేయూత ద్వారా ప్రభుత్వం రూ.18,750లను అందించింది. ఈమె కులానికి చెందిన మరికొంత మందితో కలిసి ఒక ఈత చెట్ల వంకను లీజ్‌కు తీసుకున్నారు. ఆ వంకలో నుంచి ఈత ఆకు కోసుకువచ్చి గంపలు, చీపుర్లు తయారు చేస్తున్నారు. వీటిని గుత్తి, పత్తికొండ తదితర ప్రాంతాలకు తీసుకువెళ్లి అమ్ముకుంటూ వచ్చిన దాంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. చేయూత పథకం తమలాంటి పేదలకు ఎంతో ఉపయోగపడుతోందని చంద్రమ్మ తెలిపారు. ఈ వార్త కూడా చదవండి: ఆరుగురితో విద్యుత్ ‘కోర్ కమిటీ’ -
తీర్పుల్లో మానవీయ కోణం
చెన్నై/సాక్షి ప్రతినిధి, చెన్నై: న్యాయమూర్తులు తీర్పులిచ్చేటప్పుడు నిబంధనలు, పద్ధతులను గుడ్డిగా అనుసరించరాదని, మానవీయ కోణాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. తీర్పులిచ్చే ముందు సామాజిక–ఆర్థికాంశాలను, సమాజంపై వాటి ప్రభావాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ‘‘నేటి ఇన్స్టంట్ నూడుల్స్ కాలంలో జనం కూడా ఇన్స్టంట్ జస్టిస్ (తక్షణ న్యాయం) కోరుకుంటున్నారు. దానివల్ల అసలైన న్యాయానికి అన్యాయం జరుగుతుందనే నిజాన్ని అర్థం చేసుకోవడం లేదు’’ అన్నారు. చెన్నైలో మద్రాస్ హైకోర్టు ప్రాంగణంలో పరిపాలనా భవన నిర్మాణానికి ఆయన శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ, కోర్టులతో న్యాయం జరుగుతుందని సామాన్య జనం గట్టిగా నమ్ముతున్నారని పేర్కొన్నారు. అయితే, ‘‘కోర్టుల పద్ధతులు, భాషతో వారు మమేకం కాలేకపోతున్నారు. న్యాయ వ్యవస్థలో సామాన్యులను సైతం భాగస్వాములుగా మార్చాలి. పెళ్లి మంత్రాల్లా కాకుండా కోర్టు వ్యవహారాలను, కేసుల పురోగతిని కక్షిదారులు అర్థం చేసుకోగలగాలి’’ అన్నారు. న్యాయ వ్యవస్థ, సంస్థల బలోపేతానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నానని వివరించారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలన్నారు. రాజ్యాంగ విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉందన్నారు. తీర్పు ఇవ్వడం అనేది కేవలం రాజ్యాంగ ధర్మం కాదు, అదొక సామాజిక బాధ్యత అని వెల్లడించారు. న్యాయమూర్తులు ఎప్పటికప్పుడు పరిజ్ఞానం పెంచుకోవాలని, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు. హైకోర్టుల్లో స్థానిక భాషలను ప్రవేశపెట్టడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయని జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. సమీప భవిష్యతులో ఈ సమస్య పరిష్కారమవుతున్న నమ్మకం తనకు ఉందన్నారు. కృత్రిమ మేధ (ఏఐ)తో ఇది సాధ్యం కావొచ్చని అభిప్రాయపడ్డారు. గుర్తింపును, భాషను, సంస్కృతిని కాపాడుకోవడంలో తమిళ ప్రజలు ముందంజలో ఉంటారని ప్రశంసించారు. కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. దక్షిణాది రాష్ట్రాల కోసం సుప్రీంకోర్టు బెంచ్‌ను చెన్నైలో ఏర్పాటు చేయాలని స్టాలిన్ ఈ సందర్భంగా సీజేఐని కోరారు. మాతృభాషను మరవొద్దు మాతృభాష పరిరక్షణ విషయంలో తెలుగువారు తమిళులను ఆదర్శంగా తీసుకోవాలని జస్టిస్ ఎన్వీ రమణ ఉద్బోధించారు. చెన్నైలో ప్రపంచ తెలుగు సమాఖ్య (చెన్నై) 29వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘‘తెలుగు వారిని ఒకప్పుడు మదరాసీలు అనేవారు. తెలుగు భాష, సంస్కృతికి గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్‌ను ఈ సమయంలో స్మరించుకోవాలి. తెలుగు భాష పరిరక్షణకు కృషి చేయాలని ఇటీవల తెలుగు రాష్ట్రాల సీఎంలను కలిసినప్పుడు కోరా. చెన్నైలో ఒకప్పుడు తెలుగు వారు కూడా భాగస్వాములే. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం విడిపోయాక కర్నూలు, తర్వాత హైదరాబాద్, ప్రస్తుతం అమరావతిని రాజధానులుగా చేసుకున్నాం. మాతృభాషలో మాట్లాడేందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నేను డిగ్రీ దాకా తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నా’’ అని చెప్పారు. తెలుగు ప్రజలు తమ మూలాలను ఎప్పటికీ మర్చిపోవద్దని సూచించారు. ఇతర భాషలు కూడా నేర్చుకోవాలని, మాతృభాషలో మాట్లాడడం వల్ల ప్రావీణ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. -
ఆర్థిక సాధికారతకు ఫిన్‌టెక్ చేయూత
న్యూఢిల్లీ: సామాన్య ప్రజానీకానికి ఆర్థిక సాధికారత కల్పించే దిశగా ఫిన్‌టెక్ విప్లవాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఫిన్‌టెక్ రంగం భారీ స్థాయిలో విస్తరించిందని, ప్రజల్లోనూ ఆమోదయోగ్యత పొందిందని శుక్రవారం ఇన్ఫినిటీ ఫోరం సదస్సును ప్రారంభించిన సందర్భంగా ఆయన తెలిపారు. ‘ఇప్పుడు ఈ ఫిన్‌టెక్ ఆవిష్కరణలను ఫిన్‌టెక్ విప్లవంగా మల్చుకోవాల్సిన సమయం వచ్చింది. దేశంలోని ప్రతి పౌరుడికి ఆర్థిక సాధికారత కల్పించేందుకు ఈ విప్లవం తోడ్పడాలి‘ అని ప్రధాని చెప్పారు. ఆర్థిక రంగంలో టెక్నాలజీ గణనీయంగా మార్పులు తెస్తోందని, గతేడాది మొబైల్ ద్వారా చెల్లింపులు .. ఏటీఎంల ద్వారా నగదు విత్‌డ్రాయల్స్‌కు మించి జరిగాయని పేర్కొన్నారు. అలాగే భౌతికంగా శాఖలు లేని పూర్తి స్థాయి డిజిటల్ బ్యాంకులు ఇప్పటికే వచ్చేశాయని, భవిష్యత్తులో ఇవి సర్వసాధారణంగా మారగలవని మోదీ వివరించారు. టెక్నాలజీ వినియోగంలో ఇతర దేశాలకేమీ తీసిపోమని భారత్ నిరూపించిందని ఆయన చెప్పారు. డిజిటల్ ఇండియా నినాదం కింద చేపట్టిన వివిధ చర్యలతో.. పాలనలో నూతన ఫిన్‌టెక్ పరిష్కార మార్గాలను ఉపయోగించేందుకు ద్వారాలు తెరుచుకున్నాయని మోదీ పేర్కొన్నారు. ఆ నాలుగు కీలకం..: ఫిన్‌టెక్ విప్లవమనేది .. ఆదాయం, పెట్టుబడులు, బీమా, సంస్థాగత రుణాలు అనే నాలుగు స్తంభాలపై ఆధారపడి ఉందని మోదీ చెప్పారు. యూపీఐ, రూపే వంటి సాధనాలు ప్రతీ దేశానికీ ఉపయోగపడేవేనన్నారు. సమిష్టిగా టెక్నాలజీ నియంత్రణ: ఆర్థిక మంత్రి ఎప్పటికప్పుడు మారిపోతున్న టెక్నాలజీని, టెక్ ఆధారిత పేమెంట్ వ్యవస్థలను సమర్ధమంతంగా నియంత్రించేందుకు అంతర్జాతీయ స్థాయిలో సమిష్టి కృషి అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రస్తుతం కొత్త టెక్నాలజీల నియంత్రణ విషయంలో ప్రత్యేక ఫార్ములా అంటూ లేదని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా టెక్నాలజీలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఇన్ఫినిటీ ఫోరం సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు. -
అమ్మకానికి మరో ఆరు సంస్థలు... కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగంలోని ఆరు సంస్థల (సీపీఎస్ఈ) ప్రైవేటీకరణ ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. ఇందుకోసం డిసెంబర్–జనవరిలోగా ఫైనాన్షియల్ బిడ్లను ఆహ్వానించాలని కేంద్రం భావిస్తోంది. డిజిన్వెస్ట్‌మెంట్ ప్రక్రియకు సంబంధించిన పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే బుధవారం ఈ విషయాలు తెలిపారు. ‘దాదాపు 19 ఏళ్ల తర్వాత ఈ ఏడాది 5–6 సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ చూడబోతున్నాం. బీపీసీఎల్ మదింపు ప్రక్రియ జరుగుతోంది. దీనితో పాటు బీఈఎంఎల్, షిప్పింగ్ కార్పొరేషన్, పవన్ హన్స్, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్, ఎన్ఐఎన్ఎల్ ఆర్థిక బిడ్లను డిసెంబర్–జనవరిలోనే ఆ హ్వానించవచ్చు’ అని ఆయన వివరించారు. బీమా రంగ దిగ్గజం ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (జనవరి–మార్చి) ఉండవచ్చని చెప్పారు. సీఐఐ గ్లోబల్ ఎకనామిక్ పాలసీ సదస్సు 2021లో పాల్గొన్న సందర్భంగా పాండే ఈ విషయాలు వివరించారు. అటు విమానయాన సంస్థ ఎయిరిండియాను డిసెంబర్‌లోగా కొనుగోలుదారుకు అప్పగించడం పూర్తవుతుం దని పేర్కొన్నారు. వేలంలో సుమారు రూ. 18,000 కోట్లకు ఎయిరిండియాను టాటా గ్రూప్ సంస్థ టాలేస్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఎయిరిం డియా విక్రయం పూర్తవడంతో సీపీఎస్ఈల ప్రైవేటీకరణ మరింత వేగవంతం కాగలదని పాండే చెప్పారు. ఇందుకోసం ప్రైవేట్ రంగం నుంచి కూడా సహకారం అవసరమని ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉప సంహరణ ద్వారా రూ. 1.75 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా రూ.9,300 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. ఈ నేపథ్యంలోనే ఎల్ఐసీ లిస్టింగ్‌పై ప్రభుత్వం మరింతగా దృష్టి పెడుతోంది. రిస్కులు తీసుకోండి సామర్థ్యాలు పెంచుకునేందుకు ఇన్వెస్ట్ చేయండి దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించండి పరిశ్రమ వర్గాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపు న్యూఢిల్లీ: కరోనాపరమైన సవాళ్ల నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ నేపథ్యంలో రిస్కులు తీసుకోవాలని, సామర్థ్యాల పెంపుపై మరింతగా పెట్టుబడులు పెట్టాలని పరిశ్రమ వర్గాలకు ఆమె పిలుపునిచ్చారు. తద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నారు. ‘సామర్థ్యాలను పెంచుకోవడంలోనూ, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంలోను, టెక్నాలజీని ఇచ్చే భాగస్వాములతో చేతులు కలపడంలోనూ భారతీయ పరిశ్రమ మరింత జాప్యం చేయొద్దని కోరుతున్నాను’ అని సీఐఐ గ్లోబల్ ఎకనమిక్ పాలసీ సదస్సు 2021లో పాల్గొన్న సందర్భంగా సీతారామన్ తెలిపారు. దేశీయంగా తయారీ కోసం విడిభాగాలు, పరికరాలను దిగుమతి చేసుకోవడం వల్ల సమస్యేమీ లేదని.. కాని పూర్తి స్థాయి ఉత్పత్తుల దిగుమతులను మాత్రం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. దిగుమతులపై ఎక్కువగా ఆధారపడటం వల్ల రిస్కులు ఉన్నందున.. దీనిపై పునరాలోచించాలని అభిప్రాయపడ్డారు. ‘మన దగ్గర మార్కెట్ ఉన్నప్పుడు, కొన్ని కమోడిటీలకు కొరత ఎందుకు ఏర్పడుతోంది, దిగుమతులపైనే పూర్తిగా ఆధారపడటం సరైనదేనా? దిగుమతులకు మనం తలుపులు మూసేయడం లేదు. కానీ మొత్తం ఉత్పత్తిని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందా. ఇలాంటి అంశాలను మనం పునరాలోచించుకోవాలి’ అని మంత్రి చెప్పారు. ఆదాయ అసమానతలు తగ్గించాలి .. ఆదాయ అసమానతలను తగ్గించేలా ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఫినిష్డ్ ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవాలని పరిశ్రమకు నిర్మలా సీతారా>మన్ సూచించారు. వృద్ధికి ఊతమివ్వడానికి ప్రభుత్వం కృషి చేస్తున్న నేపథ్యంలో.. దేశీ పరిశ్రమ మరింతగా రిస్కులు తీసుకోవాలని, దేశానికి ఏం కావాలన్నది అర్థం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. కొన్ని కాలం చెల్లిన చట్టాలను తీసివేయడంతో ఆగటం కాకుండా .. పరిశ్రమకు ఎదురవుతున్న ఆటంకాలను తొలగించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. వ్యాపారాలపై నిబంధనల భారాన్ని తగ్గించే దిశగా ఇంకా ఏమేమి చర్యలు తీసుకోవచ్చో పరిశీలించాలంటూ ప్రతి శాఖ, విభాగానికి ప్రధాని సూచించారని పేర్కొన్నారు. బ్యాంకింగ్ భేష్.. బ్యాంకింగ్ రంగం విశేష స్థాయిలో కోలుకుందని, రికవరీలు పెరిగే కొద్దీ మొండి బాకీలు క్రమంగా తగ్గడం మొదలైందని సీతారామన్ తెలిపారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు మార్కెట్ నుంచి రూ. 10,000 కోట్లు సమీకరించాయని, ప్రభుత్వంపై ఆధారపడటం లేదని ఆమె పేర్కొన్నారు. ప్రత్యేక ప్రోగ్రాం కింద దీపావళితో ముగిసిన మూడు వారాల్లో నాలుగైదు వర్గాల వారికి బ్యాంకులు ఏకంగా రూ. 75,000 కోట్ల మేర రుణాలు ఇచ్చినట్లు మంత్రి చెప్పారు. వర్ధమాన దేశం అత్యం వేగంగా కోలుకోవడంతో పాటు రెండంకెల స్థాయికి దగ్గర్లో వృద్ధి రేటును అందుకోవడం సాధ్యమేనంటూ ప్రపంచానికి భారత్ చాటి చెప్పిందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. -
ఆర్థిక వివక్ష విసురుతున్న సవాలు
సమాజం తాను ఏ రకంగా రూపుదిద్దుకోదలిచిందో నిర్ణయించుకొని, అందుకు తగిన లక్ష్యాలను విద్యా రంగానికి నిర్దేశిస్తుంది. విద్యా లక్ష్యాలను సమాజం నిర్దేశిస్తే, సమాజ నిర్మాణాన్ని విద్య ప్రభావితం చేస్తుంది. అంతటి ప్రాముఖ్యత కలిగిన విద్య కాలక్రమేణా లింగ, కుల, మత, వర్ణ వివక్షత చవి చూసింది. కొన్ని వర్గాలకే పరిమితమైన వేద కాలం నాటి నుంచి నేటి అందరికీ విద్య వరకు సమాజాన్ని మాత్రమే కాకుండా తనను తానూ సంస్కరించుకుంటూ వచ్చింది. సామాజిక వివక్షలెన్నింటినో అధిగమించి సామాజిక వికాసానికి దోహదపడిన విద్య ఇప్పుడు ఆర్థిక వివక్ష (పెట్టుబడి) విసురుతున్న సవాలును స్వీకరించే మలుపు వద్ద నిలిచి, వేచి ఉంది. అనాదిగా సమాజం విద్యను, విద్య నేర్పే గురువును అత్యున్నత స్థానంలో నిలుపుతూ వచ్చింది. కానీ, నేడు సమాజానికి, ప్రభుత్వ విద్యకు మధ్య ఘర్షణను నెలకొల్పడం జరుగుతోంది. ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో ఎందుకు చదివించరని, ఆదాయం సమకూరే ఇతర పనులు ఎందుకు చేస్తున్నట్లనే ప్రశ్నలు అందులో భాగమే. సమాజం మొత్తం డబ్బు చుట్టూ, విలాసవంతమైన జీవితం కోసం పరిగెడుతూ తనను మాత్రం అందుకు అతీతంగా జీవిం చాలంటే ఎలా సాధ్యమని ఉపాధ్యాయుడి వాదన. సమాజానికి, ఉపాధ్యాయుడికి మధ్య జరుగుతున్న ఈ సంభాషణను రెండు వర్గాలకు చెందకుండా, మూడో పక్షంగా బయట నుంచి చూసినప్పుడు మాత్రమే నిజానిజాలను విశ్లేషించడం సాధ్యం. ప్రభుత్వవిద్య పరిరక్షణ సమాజానికి సంబంధం లేనిదిగా మారితే, ఉపాధ్యాయునికి అప్రధానమైనదిగా మారింది. విద్య పరాయీకరణ (ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ)ను ఈ రెండు విషయాలే సులభతరం చేస్తున్నాయి. వీట న్నింటినీ బట్టి పెట్టుబడి ఎంతటి బలమైన బంధాలు, అనుబంధాల మధ్యనైనా ఘర్షణ సృష్టించగలదని స్పష్టమవుతోంది. అది నేర్పుతున్న భావజాలం విద్యను, సమాజాన్ని కూడా మింగే శక్తిమంతమైనదని స్పష్టంగా కనిపిస్తోంది. ఈ స్పష్టతను అర్థం చేసుకోగలిగే వివేచన, అవకాశం, అవసరం ఉపాధ్యాయులకే ఎక్కువగా ఉన్నాయి. మూడు దశాబ్దాల క్రితం అందరికీ విద్య అనే జనామోదిత నినాదంతో జిల్లా ప్రాథమిక విద్యా పథకం (డీపీఈఎఫ్) పేరుతో విద్యా రంగంలోకి ప్రపంచ బ్యాంకు ప్రవేశించింది. దాని ద్వారా అమెరికా, బ్రిటన్, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నుండి విదేశీ పెట్టుబడి ప్రవాహం మొదలైంది. సేవ, సాయం పేరుతో ఎల్లలు దాటిన ద్రవ్యం వామన పాదంలా మారి సంప్రదాయ, ప్రభుత్వ విద్యా వ్యవస్థలన్నిటినీ అణగదొక్కిన స్థితి కళ్ళ ముందు ఉంది. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతీ ఆవాస ప్రాంతంలో ఒక పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆ ఉపాధ్యాయ పోస్టులనే నేడు హేతుబద్ధీకరణ పేరుతో మిగులుగా ముద్ర వేస్తున్నారు. నాడు ఏర్పాటైన ఏక గదితో కూడిన ఏకోపాధ్యాయ పాఠశాలలే నేడు మూసివేతకు గురవుతున్నాయి. ఇవే ప్రభుత్వ విద్యా వ్యవస్థ అప్రతిష్ఠ మూటగట్టుకోవడానికి మూల కారణం. ఇవే పదిహేనేళ్ల తర్వాత అంటే సుమారు 2010 నుండి ఊపందుకున్న విద్యా వ్యాపారానికి, బోధనా దుకాణాలకు పెట్టుబడి వ్యూహకర్తలు వేసిన పునాదిరాళ్లు. ఒక్క ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాల కంటే పక్కనే 10 మంది ఉపాధ్యాయులున్న ప్రైవేట్ బడి వైపు తల్లిదండ్రుల దృష్టి మరల్చింది. దానికి తోడు ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తున్న ఆంగ్ల మాధ్యమం ఆకర్షణ మంత్రంగా మారింది. మాతృభాషలో విద్యా బోధనను ప్రైవేట్ వ్యవస్థలో అమలు చేయకుండా ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం కొనసాగించింది. ఇవన్నీ ప్రభుత్వ బడి, ఉపాధ్యాయుల మీద కావల్సినంత దుష్ప్రచారం చేయడానికి భూమికను అందించాయి. విద్య తనను తాను కాపాడుకోవడానికి సంఘటిత ఉపాధ్యాయ శక్తి కోసం ఎదురుచూస్తుందనేది కళ్ళ ముందున్న వాస్తవం. సంఘటితంగా ఉద్యమించి, విద్యా వినాశకర వ్యూహాలను చిత్తు చేయకపోతే భవిష్యత్ తరాలు క్షమించవని, చరిత్ర దోషులుగా నిలబెడుతుందనేది కూడా స్పష్టం. దోషులుగా కాకుండా పెట్టుబడి చెరలో చిక్కిన విద్యను విడుదల గావించిన మహోద్యమకారులుగా నిలిచిపోగల అరుదైన అవకాశం ఈ తరానికి ఉంది. బడిలో విద్యార్థుల సంఖ్యను పెంచుతూ, పెట్టుబడి అనర్థాల పట్ల ప్రజలను చైతన్యం చేస్తూ, ఆ ప్రజలను పోరాటాలలో భాగస్వామ్యం చేయాల్సి ఉంది. అంటే మండల, జిల్లా, రాజధాని కేంద్రాలతో పాటు ప్రతీ గ్రామాన్ని ఒక విద్యా ఉద్యమ క్షేత్రంగా మార్చాలి. అప్పుడు మాత్రమే అది ప్రజా ఉద్యమంగా మారుతుంది. అది మాత్రమే చరిత్ర సృష్టించగలదు. ప్రభుత్వ విద్యను పరిరక్షించగలదు. - చుంచు శ్రీశైలం ఉపాధ్యాయులు -
కేంద్ర ఉద్యోగులకు బోనస్
న్యూఢిల్లీ: 2020–21 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు తాత్కాలిక బోనస్‌ను మంజూరుచేసింది. కేంద్ర పారా మిలటరీ బలగాలు, సాయుధ బలగాలకూ ఈ బోనస్‌ను మంజూరుచేసినట్లు కేంద్ర ఖర్చుల వ్యవహారాల విభాగం పేర్కొంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఉద్యోగంలో ఉన్నవారు, 2020–21 కాలంలో మధ్యలో ఎలాంటి విరామంలేని ఆరునెలల కనిష్ట సర్వీస్కాలం ఉన్నవారు ఈ బోనస్ పొందేందుకు అర్హులు. ఉత్పత్తి ఆధారిత బోనస్ పథకాలతో లబ్దిపొందని గ్రూప్–బి నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, గ్రూప్–సీ ఉద్యోగులకు ఈ తాత్కాలిక బోనస్‌ను ఇవ్వనున్నారు. ఈ బోనస్‌ను లెక్కించేటపుడు గరిష్టంగా రూ.7,000 వేతనాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. 30 రోజుల వేతనాన్ని బోనస్‌గా చెల్లిస్తారు. చదవండి: టీకా రెండో డోస్‌పై దృష్టి పెట్టండి -
పెట్రో పిడుగు.. పెరిగిన హోల్‌సేల్ ధరల సూచి
పెట్రోల్ ధరల పెరుగుదల తయారీ పరిశ్రమపై ప్రభావం చూపుతోంది. అందుకు తగ్గట్టే ఆగస్టుకి సంబంధించి హోల్‌సేల్ ప్రైజ్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) పెరిగింది. జులైలో డబ్ల్యూపీఐ 11.16 శాతం ఉండగా ఆగస్టుకి వచ్చే సరికి 11.39 శాతానికి పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరమంతా డబ్ల్యూపీఐ రెండంకెలకు పైగానే నమోదు అవుతూ వస్తోంది. కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో నెగిటివ్‌గా ద్రవ్యోల్బణం నమోదైంది, 2020 మేలో డబ్ల్యూపీఐ - 3.4 శాతంగా ఉండగా ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2020 ఆగస్టున డబ్ల్యూపీఐ నెటటీవ్ను దాటి 0.4 శాతంగా నమోదు అవగా ఏడాది తిరిగే సరికి అది 11.39 శాతానికి చేరుకుంది. ఆహారేతర ఉత్పత్తులు, ఖనిజాలు, పెట్రో కెమికల్స్ తదితర వస్తువుల ధరల్లో హెచ్చుల వల్ల తయారీ రంగంలో ధరలు పెరుతుండగా మరోవైపు కన్సుమర్ ప్రైస్ ఇండెక్స్‌కి సంబంధించి ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. డబ్ల్యూపీఐ, సీపీఐల మధ్య ఈ తేడా ఎప్పుడూ ఉంటుందని ఇండియా రేటింగ్ , రీసెర్చ్ చీఫ్, ప్రముఖ ఎకనామిస్ట్ దేవేంద్ర పంత్ తెలిపారు. చదవండి : పెట్రోల్-డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురాబోతున్నారా? -
సుస్థిర ఆర్థికాభివృద్ధి: టాప్-5 రాష్ట్రాల జాబితాలో ఏపీ
సాక్షి, న్యూఢిల్లీ, సాక్షి, అమరావతి: సుస్థిర అభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ) సూచీలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన పురోగతి సాధించి టాప్ –5 రాష్ట్రాల జాబితాలో నిలిచింది. 2018లో కేవలం 64 పాయింట్లను మాత్రమే సాధించిన ఏపీ తాజాగా 72 స్కోర్ పాయింట్లను పొందడం, అగ్రశ్రేణి కోవలో నిలవడం, పలు అంశాల్లో టాప్ స్కోర్లను దక్కించుకోవడం రాష్ట్రం సత్తాను, అభివృద్ధి పథంలో పరుగులను రుజువు చేస్తోంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో 75 శాతం స్కోర్‌తో కేరళ మొదటి స్థానంలో నిలవగా 74 శాతం స్కోర్‌తో హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి. 72 శాతం స్కోర్‌తో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. మూడో విడత ఎస్డీజీ సూచీ నివేదికను నీతిఆయోగ్ గురువారం ఢిల్లీలో ఆవిష్కరించింది. ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలన, అసమానతలు తొలగింపు, జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, సామాజిక భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నవరత్నాలు’ ఇతోధికంగా దోహదం చేస్తున్నాయని నీతి అయోగ్ ప్రశంసించింది. ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచీ; డాష్ బోర్డ్ 2020–21 ః దశాబ్ద కాలపు కార్యాచరణలో భాగస్వామ్యాలు’ పేరుతో సూచీని నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్ డాక్టర్ రాజీవ్‌కుమార్ ఆవిష్కరించారు. నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకేపాల్, సీఈవో అమితాబ్ కాంత్, సలహాదారు సంయుక్త సమద్దార్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. పేదరికం, ఆకలి లేని రాష్ట్రంగా.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల మేరకు నవరత్నాల పథకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. నవరత్నాలు పేదరిక నిర్మూలనతో పాటు ఆహార భద్రతకు ఎంతో దోహదం చేస్తున్నాయని నీతి అయోగ్ ప్రశంసించింది. పేదరికం, ఆకలి లేని రాష్ట్రంగా అవతరించే దిశగా ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అడుగులు వేస్తోందని నివేదికలో పేర్కొంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మొదటిదైన పేదరిక నిర్మూలనలో ఆంధప్రదేశ్ 81 శాతం స్కోర్ సాధించి అగ్రగామి ఐదు రాష్ట్రాల సరసన నిలిచింది. ఆరోగ్యం, సంక్షేమంలో రాష్ట్రం 77 శాతం స్కోర్ సాధించింది. అగ్రవర్ణ పేదలకు కూడా సంక్షేమ పథకాల ద్వారా ప్రయోజనం కల్పిస్తూ అసమానతలను రూపుమాపుతున్నారని నీతి అయోగ్ ప్రశంసించింది. పురుషులతో సమానంగా అవకాశాలు కల్పిస్తూ లింగ సమానత్వంలో రాష్ట్రం 58 శాతం స్కోర్‌తో అగ్రగామి ఐదు రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. అసమానతలు రూపుమాపడంలో 74 శాతం స్కోర్‌తో దూసుకెళ్తోంది. ఏపీలో 2020లో వృద్ధి కనిపించిన ఇండికేటర్లు ఆకలి లేని స్థాయి లక్ష్యంలోని ‘వ్యవసాయ రంగంలో స్థూల అదనపు విలువ’లో పెరుగుదల నమోదు చేసుకుంది. ఆరోగ్యం, సంక్షేమం ఇండికేటర్లో ప్రసూతి మరణాలు, శిశు మరణాల రేటు తగ్గుదల, హెచ్ఐవీ కేసుల సంఖ్య తగ్గుదల నమోదైంది. ప్రతి పది వేల జనాభాకు వైద్య సిబ్బంది పెరుగుదలలో వృద్ధి కనిపించింది. లింగ సమానత్వం కేటగిరీలో మహిళలపై నేరాల సంఖ్య ఇండికేటర్లో తగ్గుదల నమోదైంది. పురుషులతో సమానంగా మహిళలకు వేతనాలు ఇవ్వడం పెరిగింది. పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం పరిధిలో గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత నీటి సరఫరా పెరిగింది. హత్యలు, వివిధ రకాల కేసుల సంఖ్య తగ్గింది. సరసమైన ధరకు నాణ్యమైన విద్యుత్‌లో అగ్రగామి.. 2019 డిసెంబరు 30న ఆవిష్కరించిన ఎస్డీజీ సూచీలో ఆంధ్రప్రదేశ్ 67 పాయింట్ల స్కోరుతో 3వ స్థానంలో నిలిచింది. అంతకుముందు ఏడాది 2018 మొదటి ఎస్డీజీ సూచీలో 64 పాయింట్ల స్కోరుతో నాలుగో స్థానంలో ఉంది. తాజాగా మూడో విడత సూచీలో చౌక, సురక్షిత ఇంధన శక్తిలో వందకు వంద పాయింట్లు సాధించి టాప్‌లో నిలవడం గమనార్హం. సరసమైన ధరకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడంలో అగ్రగామిగా నిలిచింది. అత్యున్నత ప్రమాణాలతో విద్య.. నాణ్యమైన వైద్యం అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యుత్తమంగా పనిచేస్తోందని నీతి అయోగ్ వెల్లడించింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు ద్వారా పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించి కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దారు. ఆరోగ్యశ్రీతోపాటు ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేయడం, వైద్య సిబ్బందిని భారీ ఎత్తున నియమించడం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని.. కరోనాను సమర్థంగా ఎదుర్కోవడమే అందుకు తార్కాణమని పేర్కొంది. శాంతి భద్రతలకు పెద్దపీట వేస్తూ.. సుపరిపాలన ద్వారా ప్రజలకు సామాజిక భద్రత చేకూర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన పనితీరు కనబర్చుతోందని విశ్లేషించింది. 2030 నాటికి సుస్థిరాభివృద్ది లక్ష్యాల సాధన వైపుగా ఏపీ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోందని పేర్కొంది. చదవండి: దేశ చరిత్రలోనే ప్రథమం.. కొత్త చరిత్రకు సీఎం జగన్ శ్రీకారం సీఎం జగన్‌కు ప్రవాసాంధ్రుల కృతజ్ఞతలు -
మీ అడుగులు ఎటువైపు..
సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఎన్నో పాఠాలు నేర్పిన సంవత్సరం.. 2020. ఒక మహమ్మారి (కోవిడ్–19) వ్యక్తుల ఆర్థిక ప్రణాళికలను కుదిపేసింది. పెట్టుబడులపై దీని ప్రభావం గణనీయంగానే పడింది. ఈ అనుభవాలను పాఠాలుగా తీసుకుని.. భవిష్యత్తు పరిస్థితులపై ఒక అంచనాతో 2021 సంవత్సరానికి ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవాలని భావిస్తున్నారా..? పెట్టుబడుల విషయంలో ఏ విభాగంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా..? ఫండ్ మేనేజర్ల అభిప్రాయాల సమాహారమే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం. ఈక్విటీలు రంగాలు.. ప్రస్తుతానికి అయితే అన్ని రకాల స్టాక్స్ ర్యాలీ చేస్తున్నాయి. కొన్ని రంగాల్లో డిమాండ్ బలంగానే ఉంది. వ్యయ నియంత్రణలు, ఆస్తుల నాణ్యత పరంగా మెరుగైన పనితీరు చూపిస్తున్నాయి. మహమ్మారిని నియంత్రించడం ఆలస్యమైనా లేదా వడ్డీ రేట్లు తక్కువ స్థాయిల్లో కొనసాగకపోయినా రంగాల వారీగా ర్యాలీ కొన్ని స్టాక్స్‌కే పరిమితం కావొచ్చు. జీడీపీ వృద్ధి తీరుపైనే మార్కెట్ రాబడులు ఆధారపడి ఉంటాయి. 2–5 ఏళ్ల కాల దృష్టితో ఇన్వెస్టర్లు పెట్టుబడుల నిర్ణయం తీసుకోవాలి. – శ్రేయాష్ దేవల్కర్, సీనియర్ ఫండ్ మేనేజర్, యాక్సిస్ ఏఎమ్‌సీ మిడ్, స్మాల్‌క్యాప్ మార్చి, జూన్ త్రైమాసికాలపై లాక్డౌన్ ప్రభావం చూపించగా.. ఆదాయాల పరంగా మిడ్, స్మాల్‌క్యాప్ కంపెనీలు 2020 సెప్టెంబర్ నాటికి మంచి రికవరీని చూపించాయి. అంతర్జాతీయంగా వెల్లువలా ఉన్న లిక్విడిటీ (నగదు లభ్యత) కూడా స్టాక్స్ ధరలను గరిష్టాలకు తీసుకెళ్లాయి. ఎర్నింగ్స్ రికవరీ ఆలస్యమవుతుందన్న అంచనాలతో మిడ్, స్మాల్‌క్యాప్ విభాగంలో.. ఇప్పటికీ బ్యాంకింగ్, ఎంటర్టైన్మెంట్, రిటైల్ స్టాక్స్ పనితీరు నిరుత్సాహకరంగానే ఉంది. కొన్ని రంగాల/స్టాక్స్ విలువలు చాలా ఎక్కువలోనే ఉన్నాయి. కనుక అధిక ఆశావాదంతో కాకుండా బలహీన కంపెనీల్లో పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఆటోమొబైల్, సిమెంట్, ఇంజనీరింగ్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విలువలు చూడ్డానికి అధికంగా ఉన్నాయి. కానీ, అవి తక్కువ ఆర్జనా సైకిల్లో (కాలంలో) ఉన్నాయి. ఆదాయాల్లో రికవరీ మొదలైతే ఇవి మంచి రాబడులను ఇవ్వగలవు. అధిక వ్యాల్యూషన్ల దృష్ట్యా ఏడాది కోసం అయితే స్మాల్, మిడ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయవద్దనే సూచిస్తున్నాము. ప్రస్తుతం చూస్తున్న అనిశ్చిత పరిస్థితుల్లో 2021 సంవత్సరానికి ప్రత్యేకంగా ఏ అంచనాలు ఇవ్వడం వివేకమని భావించడం లేదు. కనీసం ఐదేళ్ల కంటే ఎక్కువ కాలానికి ఇన్వెస్టర్లు ఈ విభాగంలోని స్టాక్స్‌లో పెట్టుబడుల వైపు చూడొచ్చు. ఏ స్టాక్స్.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నాము. అంతర్జాతీయంగా టెక్నాలజీ అనుసరణ పెరగడం వీటికి కలసివస్తుంది. అలాగే, ఆరోగ్య రంగ అవసరాలు పెరగడం అమెరికాలో స్పెషాలిటీ జనరిక్స్‌కు కలసిరానుంది. కరోనా తర్వాత డిమాండ్ కోలుకోవడం ఇందుకు తోడు కానుంది. అదే విధంగా కన్జూమర్ డిస్క్రిషనరీ రంగం కూడా క్రమంగా తెరిచే ఆర్థిక వ్యవస్థతో ప్రయోజనం పొందే రంగం అవుతుంది. ఆటోమొబైల్, సిమెంట్, ఇంజనీరింగ్ పట్ల కూడా సానుకూల అంచనాతో ఉన్నాము. ఆయిల్, గ్యాస్, పవర్ యుటిలిటీలు, మెటల్స్‌కు ఈ దశలో దూరంగా ఉంటాము. – వినిత్ సంబ్రే, హెడ్ (ఈక్విటీస్), డీఎస్పీ ఇన్వెస్ట్మెంట్ డెట్ వడ్డీ రేట్లు..! రివర్స్ రెపో రేటు 3.35 శాతంగా ఉండడం, ఆర్బీఐ చర్యల కారణంగా విస్తారమైన నిధుల అందుబాటు నెలకొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు లిక్విడిటీ మిగులుగానే ఉంటుంది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనుకూలతల దృష్ట్యా స్వల్ప కాలం నుంచి మధ్య కాలానికి (ఐదేళ్ల వరకు) ఈల్డ్ కర్వ్ అధికంగానే ఉండొచ్చు. పాలసీ సర్దుబాట్లు క్రమంగా ఉండొచ్చు. ఈల్డ్ కర్వ్ చాలా నిటారుగా ఉంది. ఈ పరిస్థితుల దృష్ట్యామూడేళ్ల కంటే ఎక్కువ కాల దృష్టితో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో అస్థిరతలకు సన్నద్ధంగానూ ఉండాలి. – అనురాగ్ మిట్టల్, ఐడీఎఫ్సీ ఫండ్ ఏ స్టాక్స్.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నాము. అంతర్జాతీయంగా టెక్నాలజీ అనుసరణ పెరగడం వీటికి కలసివస్తుంది. అలాగే, ఆరోగ్య రంగ అవసరాలు పెరగడం అమెరికాలో స్పెషాలిటీ జనరిక్స్‌కు కలసిరానుంది. కరోనా తర్వాత డిమాండ్ కోలుకోవడం ఇందుకు తోడు కానుంది. అదే విధంగా కన్జూమర్ డిస్క్రిషనరీ రంగం కూడా క్రమంగా తెరిచే ఆర్థిక వ్యవస్థతో ప్రయోజనం పొందే రంగం అవుతుంది. ఆటోమొబైల్, సిమెంట్, ఇంజనీరింగ్ పట్ల కూడా సానుకూల అంచనాతో ఉన్నాము. ఆయిల్, గ్యాస్, పవర్ యుటిలిటీలు, మెటల్స్‌కు ఈ దశలో దూరంగా ఉంటాము. – వినిత్ సంబ్రే, హెడ్ (ఈక్విటీస్), డీఎస్పీ ఇన్వెస్ట్మెంట్ ఏవి మెరుగు? ఇన్వెస్టర్లు తమ కాల వ్యవధి, రిస్క్ సామర్థ్యం ఆధారంగా పెట్టుబడులను మూడు బకెట్లుగా వర్గీకరించుకోవాలి. లిక్విడిటీ బకెట్‌ను స్వల్ప కాల అవసరాల కోసం కేటాయించుకోవాలి. కోర్ బకెట్ అధిక నాణ్యతతో కూడిన క్రెడిట్ లేదా డ్యురేషన్ ఫండ్స్‌తో ఉండాలి. స్థిరమైన రాబడులను అందించే విధంగా ఎంపిక ఉండాలి. ఇందుకోసం అల్ట్రాషార్ట్, మీడియం టర్మ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక శాటిలైట్ బకెట్ అన్నది దీర్ఘకాల పెట్టుబడుల కోసం ఉద్దేశించినది. మూడేళ్లకు పైన కాలానికి కేటాయింపులు చేసుకునే వారికి ఇది అనుకూలం. కొంత అస్థిరతలను తట్టుకునే విధంగా ఉండాలి. అయితే స్థూల ఆర్థిక అనిశ్చిత వాతావరణంలో, క్రెడిట్ స్ప్రెడ్స్ కుచించుకుపోయిన దృష్ట్యా క్రెడిట్ రిస్క్ ఫండ్స్ అన్నవి రిస్క్‌కు తగ్గ రాబడులు ఇవ్వవని మా అభిప్రాయం. పసిడి లార్జ్‌క్యాప్.. ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ద్రవ్య, పరపతి విధానాలు సులభంగా మారడం కారణంగా వచ్చిన స్టాక్స్ ర్యాలీ ఇది. అధిక ఫ్రీ క్యాష్ ఫ్లో (వ్యాపారంలో నగదు లభ్యత), తక్కువ రుణ భారం, అధిక ఆర్‌వోఈ (ఈక్విటీపై రాబడి) ఉన్న కంపెనీల్లోకి పెట్టుబడులు ప్రవాహంలా వచ్చాయి. గడిచిన రెండు త్రైమాసికాల గణాంకాలను పరిశీలిస్తే.. పండుగుల సీజన్‌తో ధరల పరంగా కంపెనీలకు స్వేచ్ఛ (ప్రైసింగ్ పవర్) తిరిగి లభించింది. డిమాండ్ ఎక్కువగా ఉండడానికి తోడు, ఇప్పటికీ కొన్ని రంగాల్లో సరఫరా పరంగా సమస్యలు ఇందుకు కారణమై ఉండొచ్చు. ముఖ్యంగా 2021లో ఈ డిమాండ్ నిలదొక్కుకోవడం ఎంతో ముఖ్యమైనది. తక్కువ స్థాయిల్లోనే వడ్డీ రేట్లు కొనసాగడం అనేది రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్ వంటి రంగాల్లో దీర్ఘకాలిక రికవరీకి కీలకం అవుతుంది. చాలా కంపెనీల వ్యాల్యూషన్లు అధిక స్థాయిల్లోనే ఉన్నాయి. అయితే, వ్యాక్సిన్లలో పురోగతి, తక్కువ వడ్డీ రేట్లు స్థిరమైన రాబడులకు దారితీయగలవు. ర్యాలీ ముగిసినట్లేనా? కరోనా వ్యాక్సిన్ల తయారీలో పురోగతితో సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్న ఆశావహ ధోరణి ఏర్పడింది. దీంతో రిస్కీ సాధనాలకు (ఈక్విటీ తదితర) డిమాండ్ ఏర్పడడంతో బంగారం ర్యాలీ గత కొన్ని వారాలుగా నిలిచింది. అయితే, సమస్యలు ఇప్పటికీ ఉన్నాయి. పెద్ద ఎత్తున వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. వ్యాక్సిన్లను ఇవ్వడం ఆరంభించినా కూడా.. గడిచిన కొన్ని నెలల్లో ఆర్థిక వ్యవస్థకు ఏర్పడిన నష్టం ఒక్క రాత్రితో పోయేది కాదు. పూర్తిగా కోలుకునేందుకు ఐదేళ్లు పడుతుందని ప్రపంచ బ్యాంకు అంచనా. దీనికి తోడు అభివృద్ధి చెందిన దేశాల్లో వైరస్ ఇన్ఫెక్షన్ కేసులు మరో విడత పెరిగిపోవడంతో ఆర్థిక రికవరీ బలహీనపడనుంది. మరికొన్ని నెలల పాటు ఈ అనిశ్చిత పరిస్థితులు బంగారం ధరలకు మద్దతుగా నిలుస్తాయి. బంగారం ధరల్లో అప్‌మూవ్ కరోనాకు ముందే మొదలైంది. కాకపోతే అద్భుత ర్యాలీకి కారణాల్లో కరోనా వైరస్ కూడా ఒకటి. బంగారం ధరలకు మద్దతుగా నిలిచిన స్థూల ఆర్థిక పరిస్థితులే 2021లోనూ కొనసాగనున్నాయి. అమెరికా, ఇతర పాశ్చాత్య ప్రపంచంలో కనిష్ట వడ్డీ రేట్లు దీర్ఘకాలం పాటు ఉంటాయని అంచనా వేస్తున్నాము. కనుక యూఎస్ ట్రెజరీల్లో కంటే బంగారంలో పెట్టుబడులను కలిగి ఉండడమే మెరుగైన ఆప్షన్ అవుతుంది. అనూహ్యమైన లిక్విడిటీతో ద్రవ్యోల్బణం రిస్క్ ఉండనే ఉంది. ఇది కూడా బంగారానికి మద్దతుగా నిలిచే అంశమే. గోల్డ్ ఈటీఎఫ్‌లు.. భారత్‌లో బంగారంపై పెట్టుబడుల విషయంలో ఈటీఎఫ్‌ల వాటా గతంలో 10 శాతంగా ఉంటే, 2020లో 25 శాతానికి చేరుకుంది. లాక్డౌన్ కారణంగా భౌతికంగా బంగారం కొనుగోలుకు అననుకూలతలు ఇందుకు కారణమై ఉండొచ్చు. అయితే, డిజిటైజేషన్, బంగారంలో స్వచ్ఛత, ధరలు, సౌకర్యం కూడా ఇన్వెస్టర్లను ఈటీఎఫ్‌లకు దగ్గర చేస్తోంది. కనుక ఈటీఎఫ్‌లకు ఆదరణ కొనసాగుతుంది. బంగారం అన్నది రిస్క్‌ను తగ్గించి, పోర్ట్‌ఫోలియోకు వైవిధ్యాన్నిచ్చే సాధనం. మీ పెట్టుబడుల్లో 10–15 శాతం మేర బంగారానికి ఇప్పటికీ కేటాయించనట్టయితే.. అందుకు ఇది సరైన తరుణం అవుతుంది. తక్కువ ధరల నుంచి ప్రయోజనం పొందొచ్చు. – చిరాగ్ మెహతా, సీనియర్ ఫండ్ మేనేజర్, క్వాంటమ్ ఏఎమ్‌సీ రియల్టీ ఇళ్లకు డిమాండ్ 2020 ద్వితీయ ఆరు నెలల్లో (జూలై నుంచి) నివాస గృహాలకు బలమైన డిమాండ్ నెలకొంది. ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖా తీసుకున్న చర్యలు కొనుగోలు దిశగా నిర్ణయానికి దారితీశాయి. గడిచిన కొన్ని త్రైమాసికాల్లో గృహాల ధరలు చాలా మార్కెట్లలో స్థిరంగా ఉండిపోవడం, కొన్ని చోట్ల దిద్దుబాటుకు (తగ్గడం) గురి కావడం చూశాము. దీంతో అవి అందుబాటు ధరలకు వచ్చేశాయి. తక్కువ వడ్డీ రేట్లు, ఇళ్ల ధరలు తగ్గుముఖం పట్టడం వల్ల డిమాండ్ పుంజుకుంది. కొత్త ఏడాది! ఇతర పెట్టుబడి సాధనాల పనితీరు, బడ్జెట్లో ప్రకటనలు, కేంద్రం అందించే రాయితీలు, గృహ రుణాలపై వడ్డీ రేట్లు ఇవన్నీ డిమాండ్‌ను నిర్ణయించేవే. ఆర్థిక వృద్ధిలో సానుకూల ధోరణలు కనిపిస్తున్నప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన సవాళ్లు అంత త్వరగా అంతం కావు. వాణిజ్య రియల్టీ అంతర్జాతీయ, దేశీయ ఐటీ, టెక్నాలజీ రంగంలో క్రమబద్ధమైన వృద్ధి, కార్పొరేట్ల విస్తరణ కారణంగా.. ఆఫీసు స్థలాలకు వృద్ధి కొనసాగుతూనే ఉంది. కీలకమైన వాణిజ్య మార్కెట్లలో ఆఫీస్ స్పేస్ విభాగంలో లావాదేవీల్లో వృద్ధి నెలకొనడమే కాకుండా, సాధారణ స్థితి ఏర్పడుతోంది. వాణిజ్య కార్యకలాపాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నందున ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నాము. – శిశిర్ బైజాల్, చైర్మన్, ఎండీ, నైట్ ఫ్రాంక్ ఇండియా -
ఈ అపోహలు వాస్తవమేనా..?
ఇన్వెస్టర్లు గతంతో పోలిస్తే నేడు కాస్త అవగాహనతోనే ఉంటున్నారు. విస్తృత మీడియా కవరేజీ, డిజిటల్ సాధనాలు, డేటా అందుబాటు, టెక్నాలజీ పట్ల అవగాహన ఇవన్నీ కూడా ఇన్వెస్టర్లలో అవగాహనను పెంచుతున్నాయి. కానీ, అదే సమయంలో ఆర్థిక ప్రణాళిక, పెట్టుబడులకు సంబంధించి కొన్ని తప్పుడు అభిప్రాయాలు, అపనమ్మకాలు చాలా మందిలోనే ఉంటున్నాయి. ఇవి వారి ఆర్థిక ప్రణాళిక, పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాదం లేకపోలేదు. కనుక ఈ తరహా దురభిప్రాయాలు, నమ్మకాల్లో వాస్తవమెంతన్నది ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం ఎంతో అవసరం. దీర్ఘకాల రుణాలను ముందుగా తీర్చేయాలి.. దీర్ఘకాల రుణాలను ముందుగా తీర్చివేయడం ద్వారా వడ్డీని ఆదా చేసుకోవాలన్న సలహా సాధారణంగా వినిపిస్తుంటుంది. దీన్ని నమ్మి దీర్ఘకాలంపై తీసుకున్న గృహ రుణాన్ని ముందుగా తీర్చివేసి, స్వల్ప కాలం కోసం తీసుకున్న పర్సనల్ లోన్‌ను కొనసాగించడం చేయవచ్చు. కానీ, ఇది ఫండమెంటల్‌గా తప్పిదమే అవుతుంది. ఎందుకంటే పర్సనల్ లోన్‌పై వడ్డీ రేటు అధికం. గృహ రుణంపై వడ్డీ రేటు తక్కువ. పైగా దీనిపై ఆదాయపన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ‘‘పన్ను ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే, గృహ రుణం అసలు వ్యయం 30 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి 6 శాతం లోపే ఉంటుంది. దీంతో అధిక ఖర్చుతో కూడిన పర్సనల్ లోన్ కాకుండా గృహ రుణాన్ని ముందస్తుగా తీర్చివేయడం తప్పిదమే అవుతుంది’’ అని ఫిన్‌కార్ట్ సీఈవో తన్వీర్ఆలమ్ సూచించారు. ఆర్థిక సలహాదారే చూసుకుంటారు.. ఆర్థిక పరిజ్ఞానం అంతగా లేని వారు, ఫైనాన్షియల్ అడ్వైజర్ల సాయం తీసుకోవడం మంచి నిర్ణయమే. ఒక్కసారి ఇలా ఆర్థిక సలహాదారుని కలిస్తే చాలు తమ పెట్టుబడుల ప్రణాళికలన్నీ వారే చూసుకుంటారని భావించడం పొరపాటే అవుతుంది. ప్రణాళిక అన్నది ఆరంభమే కానీ, అంతం కాదని అర్థం చేసుకోవాలి. అలాగే, అడ్వైజర్లను గుడ్డిగా నమ్మేయడం కూడా అన్ని సంద ర్భాల్లోనూ సరైనది అనిపించుకోదు. ‘‘ఆర్థిక లెక్కలకు సంబంధించి అంశాలను అడ్వైజర్లకు అప్పగించడం మం చిదే. కాకపోతే నిర్ణయం తీసుకునే బాధ్యత ఇన్వెస్టర్లపైనే ఉంచుకోవాలి’’ అని ప్లాన్‌రూపీ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు అమోల్ జోషి సూచించారు. పెట్టుబడి నిర్ణయాలకు మీరే బాధ్యులు కానీ, ఫైనాన్షియల్ అడ్వైజర్లు కాదు. సిప్‌తో రిస్క్ ఉండదు క్రమానుగత పెట్టుబడుల విధానం (సిప్/సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్)లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఈక్విటీ కొనుగోలు సగటు ధర తగ్గుతుందని (అధిక ధర, తక్కువ ధరలో కొనుగోలు వల్ల), దాంతో రిస్క్ తగ్గుతుందని ఆర్థిక నిపుణులు సాధారణంగా చెబుతుంటారు. కొందరు అయితే రిస్క్‌ను పూర్తిగా దూరం పెట్టేందుకు సిప్ చక్కని సాధనంగా పేర్కొంటారు. ‘‘సిప్ అన్నది రిస్క్‌ను తీసివేయలేదు. ఇదొక పరికరం మాత్రమే, సాధనం కాదు’’ అని ప్లాన్‌రూపీ ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు అమోల్ జోషి సూచించారు. సిప్ కారణంగా కొన్ని సంవత్సరాల్లో రాబడులు పేలవంగా ఉన్నప్పటికీ, కొన్ని సంవత్సరాల్లో మంచి పనితీరు కారణంగా మొత్తం మీద మంచి రాబడులకు అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవాలి. మరో ముఖ్య విషయం.. సిప్ మార్గంలో ఇన్వెస్ట్ చేస్తున్నప్పటికీ.. స్టాక్ మార్కెట్లు ఏళ్ల తరబడి బేర్స్ గుప్పిట్లో ఉండిపోతే అప్పుడు నష్టాలు చవిచూడాల్సి ఉంటుందని తెలుసుకోవాలి. బడ్జెట్ సవివరంగా ఉండాలి.. ప్రతీ కుటుంబానికి సవివరమైన ఆర్థిక ప్రణాళిక ఉండాలన్న దురభిప్రాయం కూడా ఒకటి ఉంది. ‘‘బడ్జెట్ అంటే ప్రతీ ఒక్కటి రాయాలని ఏమీ లేదు. ఖర్చులను మూడు రకాల బకెట్లుగా వర్గీకరించాలి. ఖర్చులు, చెల్లింపులు, పొదుపు’’ అని అమోల్ జోషి సూచించారు. వ్యక్తుల ఆదాయ స్థాయిలు, జీవితంలో వారు ఏ దశలో ఉన్నారన్నదాని ఆధారంగా ప్రతీ బకెట్లో ఏవి ఉండాలన్నది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు అధిక ఆదాయం ఉన్న వారికి ఖర్చులు మూడింట ఒక వంతు మించకూడదు. అలాగే, ఎటువంటి రుణాలు లేని వారికి చెల్లింపుల విభాగం అవసరం లేదు. ప్రతీ విభాగంలో ఎంత, ఏవి ఉండాలన్నది వారి అవసరాలు, ఖర్చులను బట్టే ఉంటుంది. ‘‘భార్యా భర్తలు కూర్చుని చర్చించుకుంటే తమ ఖర్చులపై 15–20 నిమిషాల్లోపే స్పష్టతకు రావచ్చు. విచక్షణారహిత ఖర్చులైన రెస్టారెంట్లో విందు, సినిమాలు.. అలాగే, ప్రయాణ ఖర్చులపై స్పష్టతకు రావాలి’’ అని పేర్కొన్నారు సెడగోపన్. ఇక రూపొందించుకున్న బడ్జెట్‌ను దాటిపోతున్నారేమో కూడా చూసుకోవాలి. అలా జరిగితే దీర్ఘకాల లక్ష్యాలు ప్రభావితం అవుతాయి. ఏ విభాగంలో అధికంగా ఖర్చులు వస్తున్నదీ పరిశీలించాలి. ఉదాహరణకు స్మార్ట్‌ఫోన్ దెబ్బతినడం వల్ల వెంటనే ఫోన్ కొనుగోలు చేయాల్సి వచ్చిందనుకుంటే.. అప్పుడు వార్షిక పర్యటన కోసం పక్కన పెట్టిన పొదుపును వినియోగించుకుంటే నష్టం లేదు. దీనికి బదులు ముఖ్యమైన మీ పిల్లల ఫీజులు లేదా రిటైర్మెంట్ జీవితం కోసం చేస్తున్న పొదుపులను త్యాగం చేస్తే ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి.. మధ్యతరగతికి రిస్క్ సరికాదు.. మధ్యాదాయ వర్గాల వారు రిస్క్ తీసుకోకూడదన్నది మరొక తప్పుడు నిర్వచనం. అన్ని విషయాల్లోనూ కాకుండా కేవలం కొన్నింటికే ఇది వర్తిస్తుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. అవగాహనలేమితో రిస్క్‌కు పూర్తి దూరంగా ఉండిపోవడం వల్ల కావాల్సిన ఫలాలను అందుకోలేకపోవచ్చు. ఈ వర్గం వారికి ఆదాయం మధ్యస్థంగా ఉంటుంది. రిస్క్‌కు వెరసి తమ జీవిత లక్ష్యాల కోసం తక్కువ రిస్క్ ఉండే సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తే... తక్కువ రిస్క్ ఉండే సాధనాల్లో పెట్టుబడులు ఏ మాత్రం ఆశాజనకంగా ఉండవు. చాలా తక్కువ రాబడి వల్ల తమ లక్ష్యాలను చేరుకునే స్థాయిలో నిధిని సమకూర్చుకోలేకుండా ఉండిపోవాల్సి వస్తుంది. నిజానికి ఈ తరహా వర్గీయులు తప్పకుండా కొంత మొత్తాన్ని ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. తద్వారా దీర్ఘకాలంలో అధిక రాబడులను సమకూర్చుకోవచ్చు. ‘‘పరిమిత ఆదాయ వనరులు ఉన్న వారు ఈక్విటీలను విస్మరించకూడదు. అదే జరిగితే వారి పెట్టుబడిని ద్రవ్యోల్బణం మింగేస్తుంది. అయితే, ఈక్విటీలకు ఎంత కేటాయించుకోవాలన్నది ప్రశ్నించుకోవాలి’’ అని లాడర్7 ఫైనాన్షియల్ అడ్వైజరీస్ వ్యవస్థాపకుడు సురేష్ సెడగోపన్ సూచించారు. రిటైర్మెంట్ ప్రణాళిక అంటే డబ్బు గురించే.. పదవీ విరమణ తర్వాతి జీవితానికి ప్రణాళిక వేసుకోవడం అంటే పొదుపు చేయడం ఒక్కటేనన్న దురభిప్రాయంతో కొందరు ఉంటుంటారు. విశ్రాంత జీవన ప్రణాళికలో నిధితో పాటు ఇతర అంశాలకు కూడా చోటు ఉండాలి. ‘‘రిటైర్మెంట్ జీవితం అన్నది 30–40 సంవత్సరాల వరకు ఉంటుంది. డబ్బు, ఇతర కార్యకలాపాల మధ్య సమన్వయం అవసరం. ఖాళీ సమయాన్ని తమ హాబీల కోసం, స్నేహితులతో సంబంధాల పునరుద్ధరణకు వెచ్చించాలి. సామాజిక బాధ్యతపై కొంత సమయం వెచ్చించడం కూడా ఆనందాన్నిస్తుంది’’ అని అమోల్ జోషి సూచించారు. రిటైర్మెంట్ ప్రణాళికను రెండు విభాగాలుగా రూపొందించుకోవాలి. మొదటిది మీరు ఆరోగ్యంగా ఉండే కాలానికి సంబంధించినది. రెండోది ఆ తర్వాత కాలానికి ఉద్దేశించినది. రెండో విభాగంలో మరొకరి సాయం మీకు అవసరపడొచ్చు. పిల్లల సహకారం ఉంటుందన్న భరోసా లేని వారు ఆ సమయంలో ఎలా వ్యవహరించాలో ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిదని నిపుణుల సూచన. -
లాక్డౌన్ 4.0లో మరిన్ని సడలింపులు!
న్యూఢిల్లీ: లాక్డౌన్ 4.0లో మరిన్ని సడలింపులు ఇవ్వాలని పలు రాష్ట్రాలు కోరుతున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకునేందుకు వీలుగా ఆంక్షల సడలింపు ఉండాలంటున్నాయి. కేంద్రం కొన్ని కఠిన నిబంధనలను సడలించాలని యోచిస్తోందని తెలుస్తోంది. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించాలని కోరుతున్నాయి. మూడో దశ లాక్డౌన్ ఈ నెల 17తో ముగియనున్న విషయం తెలిసిందే. ‘లాక్డౌన్ 4.0లో అనేక సడలింపులుంటాయి. గ్రీన్ జోన్లో పూర్తిగా అన్ని కార్యకలాపాలకు అనుమతిస్తారు. ఆరెంజ్ జోన్లో మాత్రం కొన్ని ఆంక్షలుంటాయి. రెడ్‌జోన్‌ల్లోని కంటెయిన్మెంట్ ప్రాంతాల్లో మాత్రం కఠిన ఆంక్షలుంటాయి’ అని కేంద్ర హోం శాఖ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. నిబంధనల సడలింపుల్లో రాష్ట్రాలకు అధికారమివ్వవచ్చన్నారు. లాక్‌డౌన్‌ను కొనసాగించాలని, గ్రీన్, ఆరెంజ్, రెడ్ జోన్లను నిర్ధారించే అధికారం రాష్ట్రాలకు ఉండాలని తెలంగాణ, పంజాబ్, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలు కోరుతున్నాయని హోంశాఖలోని మరో అధికారి తెలిపారు. లాక్డౌన్ 4.0లో జోన్లను నిర్ణయించే అధికారాన్ని రాష్ట్రాలకు ఇచ్చే అవకాశముందన్నారు. పాఠశాలలు, కాలేజీలు, మాల్స్, సినిమా హాల్స్ మూసివేత కొనసాగుతుందన్నారు. కంటెయిన్మెంట్ ప్రాంతాలను మినహాయించి రెడ్ జోన్స్‌లో కూడా క్షౌర శాలలను, ఆప్టికల్ షాపులను తెరిచేందుకు అవకాశమివ్వవచ్చని తెలిపారు. వచ్చే వారం నుంచి అవసరాన్ని బట్టి పరిమితంగా రైళ్లను, విమానాలను నడిపేందుకు అనుమతించే ఆలోచన కూడా ఉందన్నారు. -
బోడో సంస్థలతో కేంద్రం ఒప్పందం
న్యూఢిల్లీ: గత కొన్ని దశాబ్దాలుగా అస్సాంలో ప్రత్యేక బోడోలాండ్ కోసం పోరాడుతున్న ప్రత్యేక బోడో ఉద్యమ సంస్థలతో కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. బోడోలాండ్ ప్రజలకు ప్రత్యేక రాజకీయ, ఆర్థిక హక్కులను కల్పిస్తామని ప్రభుత్వం హామీనిచ్చింది. అస్సాంలో ప్రధాన తీవ్రవాద సంస్థ నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ (ఎన్డీఎఫ్బీ), ప్రత్యేక బోడో రాష్ట్రం కోసం పోరాడుతున్న ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్ (ఏబీఎస్‌యూ)లతో ప్రభుత్వం ఒప్పందంపై సంతకాలు చేసింది. ఒప్పందంపై సంతకాలు చేసినవారిలో యునైటెడ్ బోడో పీపుల్స్ ఆర్గనైజేషన్ ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఈ త్రైపాక్షిక ఒప్పందంపై అస్సాం సీఎం శర్బానంద సోనోవాల్, ఎన్డీఎఫ్బీ, ఏబీఎస్‌యూ నాయకులు, హోంశాఖ జాయింట్ సెక్రటరీ సత్యేంద్ర గార్గ్, అస్సాం చీఫ్ సెక్రటరీ కుమార్ సంజయ్ క్రిష్ణ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడారు. సుదీర్ఘకా లంగా పోరాడుతున్న బోడో ప్రజల సమస్యకు పరిష్కారం చూపే ‘చారిత్రక’ ఒప్పందంగా దీన్ని అభివర్ణించారు. ‘ఈ ఒప్పందం బోడో ప్రాంత ప్రజల సమగ్రాభివృద్ధికోసం కృషిచేస్తుంది. వారి భాష, సంస్కృతీ సాంప్రదాయాలను పరిరక్షిస్తుం ది’ అని అన్నారు. బోడో తీవ్రవాదుల హింసాకాం డ కారణంగా గడిచిన దశాబ్దాల్లో 4,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అమిత్‌షా చెప్పారు. ఒప్పందం తర్వాత అస్సాంలోని ప్రజలు సామరస్యంతో జీవిస్తారన్న ఆశాభావాన్ని అస్సాం సీఎం శర్బానంద సోనోవాల్ వ్యక్తం చేశారు. ఎన్డీఎఫ్బీకి చెందిన 1,550 మంది మిలిటెంట్లు లొంగిపోయినట్టు అస్సాం మంత్రి హేమంత్ బిశ్వ శర్మ చెప్పారు. వచ్చే మూడేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 750 కోట్ల చొప్పున రూ.1,500 కోట్లతో ఒక ఆర్థిక పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. బోడో తీవ్రవాద సంస్థలు ఈ ఒప్పందంతో జనజీవన స్రవంతిలోకి వస్తాయని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 27 ఏళ్లలో మూడోసారి.. ప్రత్యేక బోడోలాండ్ రాష్ట్రం కోసం ఉద్యమం హింసాత్మకంగా మారి, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ ఆస్తి నష్టం జరిగింది. అయితే గత 27 ఏళ్ళలో ఇలా ఒప్పందంపై సంతకాలు చేయడం ఇది మూడోసారి. పరిమిత రాజకీయా«ధి కారాలతో ఆల్ బోడో స్టూడెంట్స్ యూనియన్‌తో 1993లో తొలిసారి ఇలాంటి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇది బోడోలాండ్ అటానమస్ కౌన్సిల్‌కి దారితీసింది. రెండో ఒప్పందం బోడో లిబరేషన్ టైగర్స్ తీవ్రవాద గ్రూప్‌తో 2003లో జరిగింది. ఇది బోడోలాండ్ టెరిటోరియల్ కౌన్సిల్(బీటీసీ)కి దారితీసింది. అస్సాంలోని నాలుగు జిల్లాలు కొక్రాఝార్, చిరంగ్, బాస్కా, ఉదల్‌గిరి కలిపి బోడోలాండ్ టెరిటోరియల్ ఏరియా డిస్టిక్ట్(బీటీఏడీ) ఏర్పాటైంది. తర్వాత బీటీసీని బోడోలాండ్ టెరిటోరియల్ రీజియన్‌గా మార్చారు. రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్ ఆధారంగా బీటీసీని ఏర్పాటు చేశారు. -
7వ ఆర్థిక గణన సర్వే ఆరంభం
సాక్షి, ఒంగోలు:కుటుంబ ఆర్థిక స్థితిగతులపై వివరాల సేకరణకు కసరత్తు మొదలైంది. 7వ ఆర్థిక గణన సర్వేను జిల్లాలో మంగళవారం కలెక్టర్ పోల భాస్కర్ లాంఛనంగా ప్రారంభించారు. సరిగ్గా వంద రోజుల్లో సర్వే పూర్తి చేసి వివరాలను అప్లోడ్ చేయాలి. ఈ సర్వే ద్వారా దారిద్యరేఖకు దిగువ, ఎగువ ఎందరు ఉన్నారో లెక్క తేల్చనున్నారు. ఈ తరహా సర్వేలు ఇప్పటికి ఆరు పూర్తయ్యాయి. ఈ నివేదికల ఆధారంగానే తలసరి గ్రాంటులు విడుదలయ్యాయి. ఇప్పటి వరకు జరిగిన సర్వేలన్నీ మాన్యువల్‌గా జరగగా ఈ ఏడాది సర్వే డిజిటల్ ఇండియాను దృష్టిలో ఉంచుకొని కాగిత రహితంగా చేయనున్నారు. మొట్టమొదటి సారిగా ఆర్థిక గణన సర్వేకి మొబైల్ యాప్‌ను వినియోగిస్తున్నారు. కుటుంబాల ఆర్థిక స్థితి గతులను దృష్టిలో ఉంచుకొనే ప్రభుత్వాల నుంచి సహాయం, వివిధ రకాల సహాకారం అందనుంది. ఎంతో కీలకమైన ఆర్థిక గణన కుటుంబాల్లో తలసరి ఆదాయాల లెక్క తేల్చనుంది. పట్టణాలు, పల్లెల్లో వేర్వేరుగా.. జిల్లాలో 1028 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇవి కాకుండా 35 అటవీ గ్రామాలు ఉన్నాయి. ఒంగోలు నగర పాలక సంస్థతో పాటు కందుకూరు, చీరాల, మార్కాపురం మున్సిపాలిటీలు, కనిగిరి, అద్దంకి, చీమకుర్తి, గిద్దలూరు నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 12.5 లక్షల కుటుంబాలు ఉన్నాయి. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో విడివిడిగా 7వ ఆర్థిక గణన సర్వే జరగనుంది. వీరిలో భూమి కలిగిన వారు 7.22 లక్షలు, మధ్య తరహా రైతులు 4.32 లక్షలు, చిన్నతరహా రైతులు 1.78 లక్షల మంది ఉన్నారు. వీరి వివరాలను సర్వే ద్వారా సేకరిస్తారు. ఎన్యూమరేటర్ల ఎంపిక ఆర్థిక గణన సర్వే కోసం ఎన్యూమరేటర్ల ఎంపిక కార్యక్రమం జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. నగరంతో పాటు మున్సిపాలిటీలు, పట్టణ పాంతాలు, గ్రామీణ ప్రాంతాలలో సర్వే విడివిడిగా జరగనుంది. ఏడవ ఆర్థిక గణన సర్వేను గణాంకాలు కార్యక్రమాల అమలు శాఖ, రాష్ట్ర ప్రభుత్వంలోని ఆర్ధిక గణాంక శాఖ, జాతీయ శాంపుల్ సర్వే, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో చేపట్టింది. ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫ్ర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ వారితో నియమించిన కామన్ సర్వీసెస్ సెంటర్స్.. ఈ గవర్నెన్స్ ఇండియా లిమిటెడ్ ఈ సర్వేను సంయుక్తంగా అమలు చేస్తోంది. ఆర్థిక లెక్క తేలుతుంది.. సర్వే ద్వారా కుటుంబాల ఆర్థిక లెక్క తేలనుంది. కార్యక్రమం దేశం భౌగోళిక సరిహద్దుల్లోని అన్ని సంస్థల పూర్తి లెక్కలను, అసంఘటిత రంగంలోని కుటుంబాల వారి వివరాలను సర్వేద్వారా అందిస్తోంది. అన్ని సంస్థల ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తోంది. సామాజిక ఆర్థిక అభివృద్ధి ప్రణాళికల కోసం ఆర్ధిక కార్యకలాపాల భౌగోళిక వ్యాప్తి జిల్లాలోని రకరకాల యాజమాన్యాల నమూనాలు, ఆర్థిక కార్యకలాపాల్లో నిమగ్నమైన వ్యక్తుల ఉద్యోగులు ఇతర విలువైన సమాచారాన్ని సేకరించనున్నారు. మొబైల్ అప్లికేషన్ ద్వారా సర్వే.. సర్వే కచ్చితత్వం కోసం మొబైల్ యాప్ ద్వారా చేపట్టారు. ఇందు కోసం ప్రత్యేకంగా మొబైల్ అప్లికేషన్‌ను విడుదల చేశారు. గతంలో నిర్వహించిన 6వ గణన కార్యక్రమం మాన్యువల్‌గా చేసినందున సమగ్ర నివేదిక రావడానికి నెలల పాటు కాలహరణం జరిగింది. 2013లో ఈ గణన సర్వే వివరాలు 2016లో గానీ అవుట్‌పుట్ విడుదల కాలేదు. ఈ దఫా సర్వేలో ఈ ఇబ్బందులు లేకుండా డిజిటల్ ఇండియా నియమాలను అనుసరించి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ద్వారా సర్వే చేయనున్నారు. ఇందు కోసం ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇచ్చారు. జియో ట్యాగింగ్, టైమ్ స్టాంపింగ్, యాప్ లెవల్ డేటా ధ్రువీకరణ, డేటాను సంరక్షించేందుకు సురక్షితం కోసం లాగిన్,వెబ్ అప్లికేషన్ ద్వారా సేకరించిన సమాచారాన్ని నివేదికలను పై స్థాయి అధికారులకు అప్లోడు చేయడం కోసం సులభతరంగా వీటిని రూపొందించారు. ఎన్యుమరేటర్ల పైన సూపర్వైజర్లు లెవన్–1 , లెవల్–2 అధికారులు ఉన్నారు. ఎన్యుమరేటర్లకు ప్రైవేటు వ్యక్తులను నియమించారు. వీరికి ఎస్ఎస్సి విద్యార్హత ఉంటే సరిపోతుంది. 1028 మంది ఎన్యుమరేటర్లను నియమించారు. వీరు కాకుండా పట్టణ,నగర పాలక సంస్థ పరిధిలో ఎన్యుమరేటర్లను ప్రత్యేకంగా నియమించారు. ఎన్యుమరేటర్లు సేకరించిన సమాచారాన్ని లెవల్–1 అధికారి తనిఖీ చేసి సర్వే సరిగ్గా వచ్చిందని బావిస్తే లెవల్–2 అధికారికి పంపుతారు. అక్కడి నుంచి యాప్ ద్వారా అప్లోడు చేస్తే సర్వే నివేదికకు చేరుతుంది. ఈ పద్దతిలో సర్వే అవుట్‌పుట్ జనవరి ఆఖరుకే ప్రభుత్వానికి ఇవ్వడానికి వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. సూపర్వైజర్లకు ఇప్పటికే డీఈఎస్, ఎన్ఎస్వో, సీఎస్ఈ సంస్థలు శిక్షణ ఇచ్చాయి. కలెక్టర్ అధ్యక్షతన కమిటీ.. ఆర్థిక సర్వేకి కలెక్టర్ అధ్యక్షతన కమిటీ నియమించారు. జిల్లా స్థాయి కమిటీ ఈ సర్వేను పర్యవేక్షిస్తుంది. జిల్లా ఎస్పీ, సీపీవో, ఇతర 14 శాఖల అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. పోగ్రాం ఇంప్లిమెంట్ జిల్లా మేనేజర్ ప్రమోద్‌కుమార్ సూపర్వైజర్ల పనితీరు, ఆపై అధికారుల పని తీరును పర్యవేక్షిస్తుంటారు. సర్వేని రెండు రకాలుగా చేస్తారు. ప్రతి కుటుంబాన్ని కలుస్తారు. ఇల్లు తీరును పరిశీలించి వివరాలను సేకరిస్తారు. ఇంటి ముందు దుకాణాలు ఉన్నా, ఇంటి ముందు కమర్షియల్ గదులు ఉన్నా, మొత్తంగా కమర్షియల్ దుకాణాలు ఉన్న వివిధ విభాగాల కింద వివరాలను సేకరించి నమోదు చేస్తారు. నార్మల్ హౌస్‌హోల్డ్, సెమి నార్మల్ హౌస్‌హోల్డ్, కమర్షియల్ విభాగాల కింద సర్వే వివరాలను నమోదు చేస్తారు. ఎంతో కీలకమైన ఈ ఏడవ ఆర్ధిక గణన సర్వేను జిల్లాలో వంద రోజుల్లో పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించారు. -
రాష్ట్రాలకు కొరవడుతున్న ఆర్థిక క్రమశిక్షణ
ముంబై: రాష్ట్రాల ఆర్థిక క్రమశిక్షణ విషయంలో జాగరూకత పాటించాల్సిన అవసరాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్పష్టం చేసింది. వ్యవసాయ రుణ మాఫీ, ఆదాయ మద్దతు పథకాలు, విద్యుత్ పంపిణీ కంపెనీలకు ఉదయ్ బాండ్ల వంటి అంశాలు రాష్ట్రాల ద్రవ్య స్థిరత్వానికి ఇబ్బందులను పెంచే అవకాశం ఉందని ఆర్బీఐ పేర్కొంది. 15వ ఆర్థిక సంఘం సభ్యులు, ఆర్బీఐ అధికారుల మధ్య నేడు ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. గవర్నర్ శక్తికాంత్‌దాస్, డిప్యూటీ గవర్నర్లు తదితర అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో చర్చలకు సంబంధించి విడుదలైన ఒక అధికారిక ప్రకటనలో ముఖ్యాంశాలు.. ►సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రంసహా పలు రాష్ట్రాలు సైతం పలు ఆర్థిక వరాలు కురిపించాయి. వివిధ వర్గాల ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా అధికార పార్టీలు, ప్రతిపక్షాలు హామీలు గుప్పించాయి. ఆర్థిక క్రమశిక్షణ కోణంలో ఇది ప్రతికూలాంశమే. ► గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఓటర్లను ఆకర్షించడానికి అలాగే పేదవర్గాలకు ఊరట కలిగించడానికి బీజేపీ పాలిత రాష్ట్రాలు పలు హామీలిచ్చాయి. గత డిసెంబర్లో అధికారం చేపట్టిన మూడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఎన్నికల హామీలను నెరవేర్చడంలో భాగంగా ప్రజాకర్షక పథకాల అమలుకు శ్రీకారం చుట్టాయి. ► ఆయా అంశాలు ద్రవ్యలోటుకు సంబంధించి వార్షిక బడ్జెట్ అంచనాలను తప్పిస్తున్నాయి. ► ఆదాయాల్లో వడ్డీ చెల్లింపుల శాతం తగ్గుతున్నా... స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ప్రభుత్వ రుణ భారాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ► గత డిసెంబర్లో ఆర్బీఐ గవర్నర్‌గా నియమతులుకావడానికి ముందు 15వ ఆర్థిక సంఘంలో శక్తికాంతదాస్ కూడా ఒక సభ్యుడు కావడం గమనార్హం. ► మార్కెట్ రుణాల విషయంలో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సవాళ్లను, సమస్యలపై ఆర్బీఐ ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చింది. మార్కెట్ నుంచి నిధుల సమీకరణ, సెకండరీ మార్కెట్ లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) మెరుగుదల వంటి అంశాలపై సమావేశం చర్చించింది. -
వృద్ధి వేగం... అయినా 6.8 శాతమే!
వాషింగ్టన్: ప్రపంచంలోనే భారత్ వేగవంతమైన వృద్ధిని నమోదుచేసుకుంటోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) పేర్కొంది. అయితే వేగవంతమైన వృద్ధే అయినప్పటికీ, అంత భారీగా ఏమీ లేదని రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తన తాజా అవుట్‌లుక్‌లో పేర్కొంది. 2019–2020 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు అంచనాలను 7 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గించింది. ఊహించినదానికన్నా బలహీనమైన ఆర్థిక పరిస్థితులు దీనికి కారణంగా పేర్కొంది. భారత్ ఆర్థిక వ్యవస్థ గురించి ఐఎంఎఫ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ గ్యారీ రైస్ వివరించిన అంశాలను, ఫిచ్ తాజా అవుట్‌లుక్‌ను క్లుప్తంగా చూస్తే... మరిన్ని సంస్కరణలు అవసరం: ఐఎంఎఫ్ ►గడచిన ఐదు సంవత్సరాలుగా భారత్ పలు ఆర్థిక సంస్కరణలను తీసుకువచ్చింది. మరిన్ని సంస్కరణలనూ తీసుకురావాల్సి ఉంది. అధిక వృద్ధిరేటు పటిష్టతకు ఇది అవసరం. ► ఐదు సంవత్సరాలుగా సగటున భారత్ వృద్ధి రేటు 7 శాతంగా ఉంది. ► భారత్‌లో యువత ఎక్కువగా ఉండడం దేశానికి కలిసివస్తున్న మరో అంశం. దీనిని మరింత వ్యూహాత్మకంగా వినియోగించుకోవాల్సి ఉంది. ► విధానపరమైన అంశాల్లో కొన్నింటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాంకుల మొండిబకాయిల సమస్య పరిష్కారం, కంపెనీ బ్యాలెన్స్ షీట్స్ పరిస్థితుల మెరుగునకు చర్యలు, కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ద్రవ్యోల్బణం కట్టుతప్పకుండా చూడ్డం, అలాగే కార్మిక, భూ సంస్కరణల చర్యలు, వ్యాపార నిర్వహణా అంశాలను మరింత సులభతరం చేయడం ఇందులో ఉన్నాయి. ► వచ్చే నెల్లో ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ స్ప్రింగ్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ (డబ్ల్యూఈఓ) సర్వే నివేదిక విడుదలకానుంది. ఈ నివేదికలో భారత్ ఆర్థిక వ్యవస్థ గురించి మరిన్ని అంశాలు వెల్లడికానున్నాయి. ప్రస్తుతం ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్‌గా ఉన్న ఇండియన్ అమెరికన్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ నేతృత్వంలో ఈ నివేదిక రూపొందుతుండడం గమనార్హం. వృద్ధి అంచనాల కోత: ఫిచ్ ► మందగమన ఆర్థిక పరిస్థితులు నెలకొన్నాయని రేటింగ్ దిగ్గజం ఫిచ్ పేర్కొంది. ఈ నేపథ్యంలో వృద్ధి అంచనాలకు కోత పెడుతున్నట్లూ తన అవుట్‌లుక్‌లో తెలిపింది. ముఖ్యాంశాలు చూస్తే... ► మార్చితో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి 7.2 శాతంగా తొలుత అంచనావేయడం జరిగింది. దీనిని 6.9 శాతానికి తగ్గిస్తున్నాం. కేంద్ర గణాంకాల కార్యాలయం అంచనాలకన్నా (7 శాతం) ఈ రేటు తక్కువగా ఉండడం గమనార్హం. ►అలాగే 2019–2020 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను 7 శాతంనుంచి 6.8 శాతానికి కోత. అయితే 2020–21ల్లో ఈ రేటు 7.1 శాతానికి పెరిగే వీలుంది. (2017–18లో భారత్ వృద్ధి రేటు 7.2 శాతం) ► తక్షణం వృద్ధి తగ్గిపోవడానికి తయారీ రంగంలో క్రియాశీలత లేకపోవడం కారణం. వ్యవసాయ రంగమూ పేలవంగానే ఉంది. దేశీయ అంశాలే దీనికి ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు. ► రుణ లభ్యత దేశంలో తగ్గింది. రుణం కోసం బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆటోలు, ద్విచక్ర వాహనరంగాలు తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటున్నాయి. ► ఇక ఆహార ఉత్పత్తుల ధరలు తగ్గడం రైతుల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపింది. ► డాలర్ మారకంలో రూపాయిది బలహీన బాటే. 2018 డిసెంబర్లో ఇది 69.82గా ఉండవచ్చు. 2019 డిసెంబర్ నాటికి 72, 2020 డిసెంబర్‌కు 73ను తాకే అవకాశం ఉంది. ► ద్రవ్య, పరపతి విధానాలు వృద్ధికి స్నేహపూర్వకమైనవిగా ఉన్నాయి. వడ్డీరేట్ల విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరళతర విధానాలను అనుసరించే వీలుంది. 2019లో మరో పావుశాతం రెపో (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.50 శాతం) తగ్గే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం కట్టడిలో ఉండడం, అంతర్జాతీయంగా సరళతర ద్రవ్య పరిస్థితులు ఈ అంచనాలకు కారణం. ► 2019లో చమురు ధరలు బ్యారల్‌కు సగటున 65 డాలర్లుగా ఉంటాయి. 2020లో 62.5 డాలర్లుగా ఉండే వీలుంది. 2018లో ఈ ధర 71.6 డాలర్లు. ప్రపంచ వృద్ధి అంచనాలకూ కోత... 2018, 2019లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3.3 శాతం, 3.1 శాతంగా ఉండే అవకాశం ఉందన్న తొలి అంచనాలను వరుసగా 3.2 శాతం, 2.8 శాతానికి ఫిచ్ తగ్గించింది. చైనా వృద్ధి రేట్లు 2018, 2019ల్లో 6.6 శాతం, 6.1 శాతంగా ఉంటాయి. -
చేయూతనివ్వండి!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం 15వ ఆర్థిక సంఘం తలుపుతట్టనుంది. రాష్ట్రంలో 32 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించేందుకు చేపడుతున్న బృహత్తర ప్రాజెక్టుకు ఉదారంగా నిధులిచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేయనుంది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ రానున్న ఆర్థిక సంఘం ప్రతినిధుల ముందు ఉంచాల్సిన ప్రతిపాదనలపై ప్రభుత్వం నివేదిక సిద్ధం చేసింది. ఏకంగా కాళేశ్వరం ప్రాజెక్టుకే రూ.20 వేల కోట్ల మేర ఆర్థిక సాయం అందించి చేయూతనివ్వాలని కోరనుంది. నిర్వహణకే భారీ నిధులు అవసరం... కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ వంటి భారీ ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్ణీత ఆయకట్టుకు నీటిని మళ్లించాలంటే విద్యుత్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం)కే రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. 2020–21 నుంచి 2024–25 వరకు ఐదేళ్ల కాలానికి విద్యుత్ అవసరాలకు వెచ్చించే ఖర్చు, నిర్వహణ భారం కలిపి రూ.40,170 కోట్లు ఉంటుందని నీటి పారుదల శాఖ అంచనా వేసింది. వీటిలో విద్యుత్ అవసరాల ఖర్చు రూ.37,796 కోట్లు కాగా, ఓఅండ్‌ఎంకు అయ్యే వ్యయం రూ.2,374 కోట్లు ఉండనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విద్యుత్ అవసరం 4,627 మెగా వాట్లు కాగా, ఇందులో 2020–21 నుంచి విద్యుత్ చార్జీల కిందే రూ.2,310 కోట్లు మేర చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేసింది. మొత్తంగా ఐదేళ్లలో రూ.11,220 కోట్లు అవసరం ఉంటుందని లెక్కలేసింది. ఈ నిర్వహణ భారాన్ని కేంద్రమే భరించేలా చూడాలని ప్రభుత్వం కోరనుంది. ఇక ప్రాజెక్టు పనుల కోసం రూ.66,227 కోట్లతో ఒప్పందాలు జరగ్గా, ఇందులో రూ.35,787 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. మరో రూ.28,291 కోట్ల మేర పనులు చేయాల్సి ఉంది. మిగతావి ఓఅండ్‌ఎంకు కేటాయించారు. ఇందులో రూ.9,874 కోట్ల మేర ఇప్పటికే తీసుకున్న రుణాలు అందాల్సి ఉంది. ఇవి పోనూ భవిష్యత్తు నిధుల అవసరాలు రూ.18,417 కోట్ల మేర ఉండనున్నాయి. ఇందులోనూ కొంత భారాన్ని కేంద్రం భరించాలని రాష్ట్రం కోరే అవకా శం ఉంది. ఇప్పటికే నీతి ఆయోగ్ సైతం కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్ల మేర ఆర్థిక సాయం చేయాలని సిఫార్సు చేసినా, అలాంటిదేమీ జరగ లేదు. దీంతో ఇప్పుడైనా సానుకూల నిర్ణయం చేయాలని కోరే అవకాశం ఉందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా రూ.20 వేల కోట్ల మేర ఆర్థిక సాయం కోరేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించాయి. నేడు కాళేశ్వరం సందర్శన.. 15వ ఆర్థిక సంఘం ప్రతినిధులు ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 12కి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో మేడిగడ్డ చేరుకుని పనులను పరిశీలిస్తారు. తర్వాత ప్యాకేజీ–6లోని పంప్‌హౌజ్ పనులను చూస్తారు. అక్కడే ప్రాజెక్టు పనులపై సీఎస్ ఎస్కే జోషి, ఈఎన్సీ హరిరామ్, సీఈ నల్లా వెంకటేశ్వర్రావుతో కూడిన బృందం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనుంది. అనంతరం మిషన్ కాకతీయ కింద పునరుద్ధరించిన చెరువుల పనులను సంఘం ప్రతినిధులు పరిశీలించే అవకాశం ఉంది. -
చైనా లిక్విడిటీ బూస్ట్!
బీజింగ్: అమెరికాతో ముదురుతున్న వాణిజ్య యుద్ధం, మందగమనం కారణంగా ఆపసోపాలు పడుతున్న చైనా ఆర్థిక వ్యసవ్థకు జోష్‌నిచ్చేందుకు ఆ దేశ కేంద్ర బ్యాంక్ చర్యలను ముమ్మరం చేసింది. బ్యాంకుల రిజర్వ్ రిక్వైర్మెంట్ రేషియో(ఆర్ఆర్ఆర్)ను ఏకంగా ఒక శాతం తగ్గిస్తున్నట్లు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా(పీబీఓసీ) ప్రకటించింది. ఈ నెల 15 నుంచి ఈ కోత అమల్లోకి వస్తుందని వెల్లడించింది. తాజా నిర్ణయంతో చైనా బ్యాంకింగ్ వ్యవస్థలోకి 109.2 బిలియన్ డాలర్ల మేర నగదు(లిక్విడిటీ) అదనంగా అందుబాటులోకి రానుంది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మరింత మందగిస్తుందన్న సంకేతాల నేపథ్యంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లోకి బిలియన్ల కొద్దీ డాలర్లను కుమ్మరిస్తోంది. ఇందులో భాగంగానే బ్యాంకుల రుణ వృద్ధిని పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది పీబీఓసీ ఆర్ఆర్ఆర్ను తగ్గించడం ఇది నాలుగోసారి. -
స్త్రీలోక సంచారం
హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (త్రిపుల్ ఐటీ–హెచ్) లో మెషీన్ లెర్నింగ్ ల్యాబ్‌లో మాస్టర్స్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న శ్రీజా కామిశెట్టి.. గూగుల్ ‘గెట్–ఎహెడ్’ ఇ.ఎం.ఇ.ఎ. (యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా రీజియన్లు) ప్రోగ్రామ్ని విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చారు. టెక్నాలజీ రంగంలో మహిళల నైపుణ్యాలకు పదును పెట్టేందుకు ఆగస్టు 7–9 తేదీలలో లండన్‌లో నిర్వహించిన ఈ ప్రోగ్రామ్‌కు ప్రపంచం మొత్తం మీద గూగుల్ 20 మందిని ఎంపిక చేయగా, భారతదేశం నుంచి శ్రీజ ఒక్కరికే ఈ అరుదైన అవకాశం లభించింది. కేంద్రంతో సంప్రదింపులు జరిపిన అనంతరం ‘నల్సా’ (నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ) రూపకల్పన చేసిన పరిహార పథకానికి అనుగుణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే అక్టోబర్ 2 నుంచి అత్యాచార బాధితురాలికి రు.4 లక్షలు, సామూహిక అత్యాచార బాధితురాలికి రు. 5 లక్షలు తప్పనిసరిగా చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం తమ పరిహార నిధి నుండి అత్యాచార బాధితురాలికి అందిస్తున్న సహాయం పది వేల నుంచి (ఒడిశా), పది లక్షల వరకు (గోవా) ఉండగా, కొన్ని రాష్ట్రాల్లో అసలు పరిహారాన్ని చెల్లించే విధానమే లేకపోవడంతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని దేశం మొత్తం మీద ఈ పథకం విధిగా అమలయ్యేలా చేయడం కోసం ‘నల్సా’ సిఫారసులను పరిగణనలోకి తీసుకుని, ‘స్టేట్ లీగల్ సర్వీసెస్ అ«థారిటీ (ఎస్.ఎల్.ఎస్.ఎ) లతో సమన్వయం కలిగి ఉండాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ‘గూప్’ కంపెనీ వినూత్న ఉత్పత్తి ‘జేడ్ ఎగ్’.. ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదని వస్తున్న ఫిర్యాదులకు పరిహారంగా ఆ కంపెనీ యజమాని, హాలీవుడ్ నటి, బిజినెస్ ఉమన్, లైఫ్‌స్టెయిల్ గురు, సింగర్, ఫుడ్ రైటర్ అయిన 45 ఏళ్ల గ్వినెఫ్ పాల్ట్రో కోటీ నాలుగు లక్షల రూపాయలు (1,45,000 డాలర్లు) చెల్లించేందుకు అంగీకరించారు. జేడ్ ఎగ్‌ను స్త్రీలు తమ జననాంగంలో చొప్పించుకోవడం ద్వారా అపరిమిత లైంగికశక్తిని, లైంగికేచ్ఛను పొందవచ్చని ‘గూప్’ కంపెనీ చేసిన ప్రచారాన్ని నమ్మి, వాటిని ఉపయోగించిన మహిళలు వాటి వల్ల తమకు ఆశించిన ప్రయోజనం చేకూరలేదని ఫిర్యాదు చేయడంతో కాలిఫోర్నియాలోని కోర్టు గ్వినెఫ్ పాల్ట్రోను పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఇండోనేషియాలోని అచ్ ప్రావిన్స్ పరిధిలోని రెస్టారెంట్లు, హోటళ్లలో భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు అయితే తప్ప ఒక ఆడ, ఒక మగ కలిసి భోజనం చేయకూడదని ప్రభుత్వం తాజాగా నిషేధాజ్ఞలు విధించింది. ప్రస్తుతానికి అచ్‌లోని బిరుయన్ జిల్లాకు మాత్రమే పరిమితమైన ఈ నిషేధం ప్రకారం స్త్రీ తన భోజనాన్ని పురుషుడితో పంచుకోవడం కూడా జరిమానాకు దారి తీసే నేరం కాగా.. ఈ విధమైన నియంత్రణ వల్ల బహిరంగ ప్రదేశాలలో స్త్రీ, పురుషులు సభ్యతగా ఉంటారని, స్త్రీలు మరింత సౌకర్యవంతంగా ఉండగలుగుతారని స్థానిక షరియా ఏజెన్సీ అధికారి జుఫ్లివాన్ అంటున్నారు. ట్రంప్ దగ్గర తనకున్న పలుకుబడిని ఉపయోగించి, ఈ ఏడాది ఆరంభంలో మాదక ద్రవ్యాల అక్రమ వ్యాపారి ఒకరిని శిక్ష పడకుండా గట్టెక్కించిన రియాలిటీ టెలివిజన్ స్టార్ కిమ్ కర్దేషియాన్ వెస్ట్ బుధవారం నాడు అనూహ్యంగా వైట్ హౌస్‌లోని అత్యున్నతస్థాయి అధికారుల సమావేశంలో ప్రత్యక్షమయ్యారు! ‘క్షమాభిక్ష, జైలు సంస్కరణలు’ అనే అంశంపై ఏర్పాటైన ఈ సమావేశంలోని ‘లిజనింగ్ సెషన్’లో కనిపించిన కిమ్ కర్దేషియాన్.. ట్రంప్ కూతురు ఇవాంకాను, ఆమె భర్త జేరెడ్ కుష్నర్ను కలిసేందుకు వచ్చిన విషయాన్ని వైట్ హౌస్ సిబ్బంది ఒకరు బహిర్గతం చేశారు. తూర్పు ముంబైలోని ఘట్కోపర్లో ఇటీవల గోకులాష్టమి వేడుకలకు హాజరైన ఘట్కోపర్ ఎమ్మెల్యే రామ్ కడమ్.. ఒక యువకుడు తనకు వినిపించిన ప్రేమ గోడుకు స్పందిస్తూ.. ‘‘నీకు, నీ తల్లిదండ్రులకు ఇష్టమైతే చెప్పు. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయించైనా సరే తెప్పించి, నీతో పెళ్లి జరిపిస్తాను’’ అని భరోసా ఇవ్వడాన్ని తీవ్రంగా పరిగణించిన ‘మహారాష్ట్ర స్టేట్ కమిషన్ ఫర్ ఉమెన్’.. ఆయన అన్న మాటలకు అర్థం ఏమిటో చెప్పాలని నోటీసు జారీ చేయడంతో.. అందుకు తిరుగు సమాధానంగా రామ్ కడమ్ క్షమాపణలు చెప్పారు. బాధ్యత గల ప్రజా ప్రతినిధులు ఆలోచించి మాట్లాడకపోతే ఆ మాటలు సమాజంపై దుష్ప్రభావం చూపించే ప్రమాదం ఉందని రామ్ కడమ్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ, కమిషన్ చైర్ పర్సన్ విజయ రహత్కర్ వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధిలో మహిళల ఆర్థిక సాధికారత ఒక ప్రాధాన్యతాంశం కావాలని ఐశ్వర్యా రాయ్ అన్నారు. ఎన్.ఎస్.సి.ఐ. (నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో బుధవారం నాడు ముంబైలో జరిగిన ఫ్యాషన్ ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవ సభలో కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీ, రాజ్యసభ సభ్యురాలు పూనమ్ మహాజన్, రశ్మీ ఠాక్రే, జూహీ చావ్లా, అమృతా రాయ్చంద్ర, షబానా అజ్మీలతో పాటు పాల్గొన్న ఐశ్వర్య.. ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ, మహిళ ఆర్థిక సాధికారత దేశాభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. 80 ఏళ్ల వయసులో 2005 డిసెంబర్ 24న మరణించిన ప్రముఖ దక్షిణ భారత సినిమా నటి, నిర్మాత, దర్శకురాలు, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు భానుమతి రామకృష్ణ జయంతి నేడు. 1926 సెప్టెంబర్ 7న ప్రకాశం జిల్లా దొడ్డవరంలో జన్మించిన భానుమతి.. ‘వర విక్రయం’తో సినీ రంగ ప్రవేశం చేసి, లైలా మజ్ను, చండీరాణి, తాసీల్దారు, మల్లీశ్వరి వంటి అనేక చిత్రాలతో ప్రేక్షకాదరణ పొందారు. -
ఆర్థిక నేరగాళ్ల బిల్లుకు ఆమోదం
న్యూఢిల్లీ: బడా ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పారిపోకుండా అడ్డుకునేందుకు ఉద్దేశించిన బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. ‘పరారీ ఆర్థిక నేరగాళ్ల బిల్లు–2018’ను లోక్‌సభ గత గురువారమే ఆమోదించగా, రాజ్యసభ బుధవారం ఈ బిల్లుకు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. తాత్కాలిక ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ చట్టాలను తప్పించుకుని దేశాన్ని విడిచి పారిపోతున్న ఆర్థిక నేరగాళ్ల సంఖ్య పెరిగిపోతోందనీ, దీనిని అడ్డుకోవాల్సి ఉందని అన్నారు. ప్రస్తుత చట్టాలతో ఆ పనిని సమర్థంగా చేయలేకపోతున్నామన్నారు. వంద కోట్ల రూపాయల కన్నా ఎక్కువ మొత్తంలో మోసం చేసిన వ్యాపారవేత్తలకే ఈ బిల్లులోని నిబంధనలు వర్తిస్తాయి. ‘నేరగాళ్లు పారిపోకుండా ఆపేందుకు సమర్థమైన, వేగవంతమైన, రాజ్యాంగబద్ధమైన విధానాన్ని ఈ బిల్లు ద్వారా తీసుకొచ్చాం’ అని గోయల్ తెలిపారు. ప్రస్తుత చట్టాల ప్రకారం నేరగాళ్లు కోర్టు ముందు హాజరుకానంత వరకు వారి ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. ఇప్పటికే ఎన్నో చట్టాలు ఉన్నా ప్రభుత్వ సహకారంతోనే విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి ఆర్థిక నేరగాళ్లు దేశాలు దాటి తప్పించుకుపోయారని విపక్షాలు ఆరోపించాయి. ప్రధాని మోదీ, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌లపై కాంగ్రెస్ సభ్యులు ఇచ్చిన సభా హక్కుల నోటీసులు తన పరిశీలనలో ఉన్నాయని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చెప్పారు. -
కొత్త ఆర్డినెన్స్ : విజయ్ మాల్యాకు సమన్లు
సాక్షి, ముంబై: ప్రభుత్వ బ్యాంకులకు భారీ రుణ ఎగవేత దారుడు, పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు తాజాగా మాల్యాకు సమన్లు జారీ చేసింది. భారీగా రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన ఆర్థిక నేరస్తులపై కొరడా ఝుళిపించేందుకు కొత్తగా ప్రకటించిన ఆర్డినెన్స్ కింద ఆగష్టు 27న, లేదా అంతకుముందు కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. లేదంటే ‘పరారీలో ఉన్న నేరస్థుడి’గా ప్రకటించడంతోపాటు మాల్యాకు చెందిన రూ. 12,500కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. పెండింగ్‌లో ఉన్నబ్యాంకు బకాయిలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాననీ, ఇందుకు బ్యాంక్ ఆఫ్ కన్సార్షియంతో చర్చలు జరపడానికి ప్రయత్నిస్తున్నట్లు మాల్యా సంసిద్ధత వ్యక్తం చేసిన సందర్భంలో సమన్లు జారీ చేయడం విశేషం. ఈ ఏడాది ప్రారంభంలో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్యుజిటివ్ ఎకనామిక్ నేరస్థుల ఆర్డినెన్స్ ప్రకారం రుణదాతల "అన్ని లింక్డ్ ఆస్తులను" స్వాధీనం చేసుకోవడానికి అనుమతి లభిస్తుంది. దేశంలో ఈ ఆర్డినెన్స్ తరువాత ఈడీ తీసుకున్న మొదటి కేసు.. మొదటి చర్య మాల్యాపైనే. ఈ క్రమంలో బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద కుంభకోణంగా నిలిచిన పీఎన్బీ స్కాంలో ప్రధాన నిందితులు, వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీ, గీతాంజలి జెమ్స్ అధిపతి మెహుల్ చోక్సీ పై చర్యలకు ఈడీ సిద్ధం కానుంది. మరోవైపు మాల్యా బేరానికి దిగొచ్చారన్న వార్తలపై మాల్యా నేడు(శనివారం) స్పందించారు. తనది బేరమైతే..ఈడీ అధికారులు కూడా అదే సిద్ధాంతాన్ని అనుసరించాలంటూ సెటైర్ వేశారు. ఈ సందర్భంగా ట్విటర్లో ఈడీ ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. తాను బేరసారాలకు ప్రయత్నిస్తున్నానని చెప్పిన ఈడీ అధికారులు ముందు ఈడీ ఛార్జ్‌షీట్ చదవాలని సలహా యిచ్చారు. అదే నిజమైతే ఈడీ అధికారులుకూడా ఇదే సిద్ధాంతాన్ని అనుసరించి.. ఎక్కడైతే తనఆస్తులు ఉన్నాయో ఆ కోర్టుల్లో ఇలాంటి బేరసారాల ఒప్పందానికి రావాలని ఆహ్వానిస్తున్నానంటూ మాల్యా ట్వీట్ చేశారు. -
సెజ్‌ల చుట్టూ రియల్ జోరు!
పోచారం, ఆదిభట్ల, పోలెపల్లి.. ఈ మూడు నగరానికి ఒక్కో దిక్కునున్న ప్రాంతాలు. కానీ, వీటిని కలిపే కామన్ పాయింట్.. స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్)! ఐటీ సెజ్‌తో పోచారం, ఏరోస్పేస్ సెజ్‌తో ఆదిభట్ల ప్రాంతాలు ఎలాగైతే అభివృద్ధి చెందాయో ఇప్పుడు ఫార్మా సెజ్‌తో పోలెపల్లిలో రియల్ జోరందుకుంది. తక్కువ పెట్టుబడితో రెట్టింపు ఆదాయానికి సెజ్ చుట్టూ ఉండే ప్రాంతాలు సరైన వేదికలని పరిశ్రమ వర్గాల సూచన. దీంతో సెజ్‌ల చుట్టూ 10 కి.మీ. పరిధి వరకూ స్థిరాస్తి అభివృద్ధి జోరందుకుంది. పారిశ్రామిక, ఐటీ సెజ్‌లు స్థిరాస్తి రంగానికి వృద్ధి చోదకాలుగా మారుతున్నాయి. ఎస్ఈజెడ్ల చుట్టూ 10 కి.మీ పరిధి లోపు భారీ వెంచర్లు, ప్రాజెక్ట్‌లతో రియల్ అభివృద్ధి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలుండే ప్రతి చోటా రియల్ వృద్ధి కచ్చితంగా ఉంటుందని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) మాజీ జాతీయ అధ్యక్షుడు సీ శేఖర్ రెడ్డి తెలిపారు. దీనికితోడు సామాజిక అవసరాలైన విద్యా సంస్థలు, ఆసుపత్రులు, మౌలిక వసతులైన రహదారులు, విద్యుత్, మంచినీళ్ల వంటి ఏర్పాట్లూ ఉంటే సెజ్‌లు మరింత వేగంగా అభివృద్ధి చెందుతాయని సూచించారు. పోచారం, ఆదిభట్లలోని ఐటీ, ఏరో స్పేస్ సెజ్లే ఇందుకు ఉదాహరణ. పోలెపల్లి ఫార్మా, పారిశ్రామిక హబ్.. హైదరాబాద్– బెంగళూరు జాతీయ రహదారిలో పోలెపల్లి సెజ్ 2,500 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో హెటిరో, అరబిందో, ఎప్సిలాన్, ఏపీఎల్ హెల్త్‌కేర్, మైలాన్ ల్యాబొరేటరీస్, శిల్పా మెడికేర్, ఆప్టిమస్ జెనిరిక్స్ వంటి బహుళ జాతి ఫార్మా కంపెనీలున్నాయి. సుమారు 65 వేల మంది ఉద్యో గులుంటారని అం చనా. ఈ ప్రాంతంలో ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీ, ఎల్ అండ్ టీ నైపుణ్య శిక్షణ కేంద్రం, అశోక్ లేల్యాండ్లూ ఉన్నాయి. దగ్గర్లోనే ఎన్ఆర్ఎస్సీ, డీఎల్ఎఫ్, అమెజాన్, పీ అండ్ జీ, జాన్సన్ అండ్ జాన్సన్‌లు కూడా కొలువుదీరాయి. 10 కి.మీ. దూరంలో బాలానగర్ పారిశ్రామికవాడ ఉండటంతో మొత్తంగా ఈ ప్రాంతమంతా ఫార్మా, పారిశ్రామిక హబ్‌గా అభి వృద్ధి చెందింది. దీంతో ఆయా ప్రాంతంలో స్థలాల ధరలు పెరిగాయి. ‘‘సామాన్య, మధ్యతరగతి ప్రజలు తమ చేతిలో ఉన్న 5–6 లక్షల సొమ్ముతో ముందుగా ఓపెన్ ప్లాట్లను కొనుగోలు చేస్తుంటారు. ఆ తర్వాతే అపార్ట్మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీల వైపు వెళుతుంటారని’’ క్రెడాయ్ హైదరా బాద్ ప్రెసిడెంట్ ఎస్ రాంరెడ్డి తెలిపారు. పోలెపల్లిలో స్థలాల పెరుగుదలకు కారణమిదే. ప్లాట్లు, విల్లాల హవా.. బెంగళూరు జాతీయ రహదారిలో ప్రధానంగా రాజాపురం, బాలానగర్, షాద్‌నగర్, పోలెపల్లి ప్రాంతాల్లో రియల్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ‘‘రెండేళ్ల క్రితం ఉద్దానపురంలో ఎకరం రూ.3.5 లక్షలకు కొనుగోలు చేశాం. ఇప్పుడక్కడ రూ.20 లక్షలకు పైమాటే. ఇక జాతీయ రహదారి వెంబడైతే ఎకరం కోటికి తక్కువ లేదని’’ స్పేస్ విజన్ సీఎండీ నర్సింహా రెడ్డి తెలిపారు. పోలెపల్లిలో ఐటీ పార్క్ ప్రతిపాదన, డ్రైపోర్ట్ వంటి వాటితో వచ్చే ఏడాది కాలంలో 20–40 శాతం ధరలు పెరగడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ స్థలాల ధరలు గజానికి రూ.4 వేల నుంచి ఉన్నాయి. అపార్ట్మెంట్లు చ.అ.కు రూ.2,500 నుంచి చెబుతున్నారు. ఈ ప్రాంతంలో స్పేస్ విజన్, గిరిధారి, దుబాయ్‌కి చెందిన విన్సెంట్ నిర్మాణ సంస్థల వెంచర్లు, ప్రాజెక్ట్‌లున్నాయి. విన్సెంట్ 10 ఎకరాల్లో లగ్జరీ విల్లా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. కొత్త సిటీల అభివృద్ధి.. ఇప్పటికే పోలెపల్లి ఫార్మా సెజ్‌గా అభివృద్ధి చెందింది. దీనికితోడు 10 కి.మీ. దూరంలోని జడ్చర్లలో తెలంగాణ ప్రభుత్వం ఐటీ పార్క్‌ను ప్రతిపాదించింది. మల్టీ లాజిస్టిక్ హబ్ అయిన డ్రై పోర్ట్ కూడా పరిశీలనలో ఉంది. దీంతో పోలెపల్లి నుంచి జడ్చర్ల, బాలానగర్ ప్రాంతాల వరకూ రియల్ వెంచర్లు, ప్రాజెక్ట్‌లు వెలిశాయి. సెజ్ నుంచి నగరానికి మధ్యలో ఉండే ప్రాంతం మరో కొత్త సిటీగా అభివృద్ధి చెందే అవకాశముందని తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జీవీ రావు చెప్పారు. ఉదాహరణకు ఆదిభట్లలో ఇప్పటికే ఏరోస్పేస్ కంపెనీల కార్యకలాపాలు మొదలయ్యాయి కాబట్టి మరిన్ని ఉద్యోగ అవకాశాలొస్తాయి. దీంతో రోజూ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లొచ్చే బదులు స్థానికంగా నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. దీంతో ఇన్నాళ్లూ శివారు ప్రాంతం కాస్త కొత్త నగరంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. -
ప్రభుత్వ విధానాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలు
– కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కర్నూలు (ఓల్డ్‌సిటీ): ప్రభుత్వ విధానాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు. కృష్ణగిరి మండలం లాల్‌మాన్‌పల్లికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు చిన్నకాలేసాహెబ్ నాయకత్వంలో సుమారు 200 మంది ఆ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం స్థానిక జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో వారికి కోట్ల సూర్య పార్టీ కండువాలు కప్పారు. తర్వాత డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. పెద్దనోట్ల రద్దు జరిగినప్పటి నుంచి ప్రజలు బ్యాంకుల్లో డబ్బు వేయడానికి భయపడుతున్నారన్నారు. బ్యాంకుల్లో లావాదేవీలు కూడా 50 శాతం మేర తగ్గిపోయాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా సక్రమంగా నెరవేర్చలేదన్నారు. దేశాన్ని పాలించే సత్తా ఒక్క కాంగ్రెస్‌కే ఉందని, తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంపై రైతులు, ప్రజలు, చివరికి ఆ పార్టీ కార్యకర్తలు కూడా విసిగిపోయారన్నారు. చంద్రబాబుకు అమరావతి తప్ప రాయలసీమ గోడు పట్టడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సర్దార్ బుచ్చిబాబు, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు పూడూరు నాగమధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య
ఆలూరు రూరల్/హొళగుంద: ఆర్థిక ఇబ్బందులతో హొళగుంద మండలం సుళువాయి గ్రామానికి చెందిన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామంలో మౌలాసాహెబ్(45), ఉసేనమ్మ దంపతులకు కుమారుడు, కుమార్తె సంతానం. తనకు ఉన్న రెండెకరాల పొలంలో ఐదేళ్లుగా వివిధ పంటలు సాగు చేసి నష్టపోయాడు. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు. మంగళవారం ఉదయం మౌలాసాహెబ్ పొలానికి వెళ్లి పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు గుర్తించడంతో కుటుంబీకులు వెంటనే ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి సొంతూరు హాలహర్వి మండలం కామినహాల్ గ్రామం కాగా.. 30 ఏళ్ల క్రితమే సుళువాయికి ఇల్లరికం వచ్చాడు. -
ఆలయాల్లో ఆర్థిక సంస్కరణలు
శ్రీశైలం: ఆలయాల్లో ఆర్థిక సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర గవర్నర్ తరఫున రెవెన్యూ ఎండోమెంట్ ప్రిన్సిపల్ కార్యదర్శి జెఎస్వీప్రసాద్, జీఓ( ఆర్టీనెం 1098)ను జారీ చేశారు. నవంబర్ 15 నుంచి 2017 మార్చి 31లోగా ఆర్థిక సలహాదారులు కసరత్తు పూర్తి చేసి ఏయే సంస్కరణలో చేయాలో సూచించాలన్నారు. సంస్కరణలపై పూర్తిస్థాయిలో కసరత్తు పూర్తి చేయాలని సూచించారు. ఇందుకోసం ముగ్గురు ఆర్థిక నిపుణులను ఆర్థిక సలహదారులు నియమించుకోవాల్సిందిగా ఆదేశించారు. ప్రిన్సిపల్ కార్యదర్శి ఆర్థికసలహాదారులు, దేవాదాయ కమిషనర్, ఐటీ ప్రాజెక్టు ఉన్నతాధికారిలతో కలిసిన హైలెవెల్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రతినెలా ఆయా దేవాలయాల ఆర్థిక పురోభివృద్ధిపై నివేదిక ఇస్తుందని పేర్కొన్నారు. ఈ నిపుణుల కమిటీ ఏడు దేవాలయాలను సందర్శిస్తుందని, ఒక్కొక్క దేవస్థానంలో రెండు, మూడురోజులు ఉండి ప్రస్తుత పరిస్థితులను అంచనా వేస్తుంది. పూర్తిస్థాయిలో నివేదికలు రూపొందించిన తరువాత శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, విజయవాడ కనకదుర్గ, ద్వారక తిరుమల, అన్నవరం, సింహచలం దేవాలయాల్లో ఈ సంస్కరణలను అమలు చేయనున్నారు. డిసెంబర్‌లోగా నిపుణుల కమిటీని ఏడు దేవాలయాలు నియమించుకుంటే జనవరి 2017 ట్రయల్ రన్ ప్రారంభించే అవకాశం ఉంది. -
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
మిర్యాలగూడ టౌన్ : మున్సిపాలిటీలోని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, సమభావన సంఘాలను బలోపేతం చేసుకునేందుకు పట్టణ మహిళా సమాఖ్యలు Mýృషి చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ తిరునగరు నాగలక్ష్మీభార్గవ్ అన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన పట్టణ స్థాయి సమాఖ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి నెల సమావేశాలను ఏర్పాటు చేసుకొని సంఘాల పనితీరుపై చర్చించుకోవాలన్నారు. మహిళలు డబ్బులను పొదుపు చేసుకొని ఉపాధి అవకాశాలను పొందాలన్నారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు రుణాలను ఇవ్వడం జరుగుతుందని, వాటిని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలను పొందాలన్నారు. బ్యాంకుల ద్వారా ఏ విధంగా రుణాలను తీసుకుంటున్నారో.. అదే విధంగా డబ్బులను తిరిగి కట్టి కొత్త లోన్లు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో శ్రీనిధి ఏపీఎం లక్ష్మణ్, డివిజనల్ మేనేజర్ మధుసూధన్, పీఆర్పీ శ్రీనివాస్, సీవోలు శ్రీనివాసాచారి, వెంకటేశ్వర్లు, పార్వతి, పట్టణ సమాఖ్య నాయకురాళ్లు అనసూర్య, అనిత తదితరులున్నారు. -
రే టింగ్ అప్‌గ్రేడ్ చేస్తాం..
వృద్ధిని పెంచే సంస్కరణలు కావాలి న్యూఢిల్లీ: వృద్ధిని పెంచే ఆర్థిక, సంస్థాగత సంస్కరణలను ప్రభుత్వం తీసుకొస్తే భారత రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసే విషయాన్ని పరిశీలిస్తామని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ తెలిపింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన నిబంధనల సరళీకరణ, ఆర్థిక పరిస్థితులకు మరింత స్థిరత్వాన్ని తెచ్చే లా ద్రవ్య విధానాలను రూపొందించడం తది తర సంస్కరణలు అవసరమని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. వృద్ధిని పెంచే, వృద్ధి ని నిలకడగా ఉంచే ఆర్థిక, సంస్థాగత సంస్కరణలను తేవడంలో ప్రభుత్వం విజయం సాధించే అవకాశాలున్నాయని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్(సావరిన్ రిస్క్ గ్రూప్)మారీ డిరోన్ చెప్పారు. ఫలితంగా రేటింగ్‌కు అప్‌గ్రేడ్ అవకాశాలున్నాయని పేర్కొన్నారు. గత ఏడాది ఏప్రిల్‌లో మూడీస్ సంస్థ భారత రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘స్థిరత్వం’ నుంచి ‘సానుకూలం’ నకు మార్చింది. సంస్కరణల జోరు కారణంగా రేటింగ్‌ను మార్చామని, ఏడాది, ఏడాదిన్నర కాలంలో రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేస్తామని పేర్కొంది. అయితే ఆర్థిక, ద్రవ్య, సంస్థాగత పటిష్ట పరిస్థితులు నెలకొనే అవకాశాలు లేకపోయినా, బ్యాంకింగ్ వ్యవస్థ బలహీనపడినా, లేదా చెల్లింపుల శేషంపై ఆందోళనలు నెలకొన్న భారత్ రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘స్థిరత్వం’నకు తగ్గిస్తామని తాజాగా డిరోన్ పేర్కొన్నారు. కాగా భారత్‌కు మూడీస్ సంస్థ ఇచ్చిన సావరిన్ రేటింగ్ ‘బీఏఏ3’గా ఉంది. ఇది కనిష్ట ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్. జంక్ రేటింగ్ కంటే ఇది కొంచెం పై స్థాయి. -
ఆర్థిక వ్యవస్థ రికవరీ: పరిశ్రమ
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో రికవరీ కనబడుతోందని పరిశ్రమలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (2016-17, ఏప్రిల్-జూన్)లో ప్రభుత్వం మౌలిక రంగంపై భారీగా వ్యయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని, ఇది క్యూ1లో చక్కటి వేగవంతమైన ఆర్థికవృద్ధికి దారితీస్తుందని పరిశ్రమ అభిప్రాయపడుతోంది. వివిధ పారిశ్రామిక చాంబర్ల అభిప్రాయాలివి... సీఐఐ: తగిన వర్షపాతం, గ్రామీణ డిమాండ్, సంస్కరణల అమలు వంటి అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశాభివృద్ధి రేటును 8 శాతం వద్ద నిలబెడతాయన్నది తమ అంచనా అని సీఐఐ ప్రెసిడెంట్ నౌషాద్ ఫోర్బ్స్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలో రికవరీ వేగవంతమైందన్నది తమ అభిప్రాయమనీ, రానున్న కొద్ది కాలంలో ఈ ధోరణి మరింత పుంజుకుంటుందని భావిస్తున్నామని కూడా ఆయన పేర్కొన్నారు. పలు రంగాలు దిగువస్థాయి వృద్ధి తీరు నుంచి ఎగువస్థాయి వృద్ధి ఎదిగినట్లు సీఐఐ-అసోకాన్ సర్వేలో వెల్లడైందని కూడా సీఐఐ తెలిపింది. ఫక్కీ: ఊహించినదానికన్నా వేగంగా భారత్ రికవరీ జరుగుతోందని స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు పేర్కొంటున్నాయి. నాల్గవ త్రైమాసికంలో 7.9 శాతం వృద్ధి ఆర్థిక వ్యవస్థ వేగం పుంజుకోడానికి నిదర్శనం. గడచిన రెండు సంవత్సరాలుగా కేంద్రం చేపట్టిన పలు సంస్కరణలు, అమలు దీనికి కారణమని ఫిక్కీ సెక్రటరీ జనరల్ ఏ దిదార్ సింగ్ పేర్కొన్నారు. మున్ముందూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని తాము భావిస్తున్నట్లు తెలిపారు. అసోచామ్: ప్రైవేటు పెట్టుబడులు భారీగా పెరగడానికి ఇది తగిన సమయం. ఉపాధి అవకాశాల మెరుగుదల, పటిష్ట వృద్ధి దీనివల్ల సాధ్యమవుతుంది. పెట్టుబడుల పునరుద్ధరణ భారీ స్థాయిలో జరగడమే వృద్ధి పటిష్టతకు ప్రధానంగా దోహదపడే అంశం. వస్తు సేవల పన్ను అమలుకు రాజకీయ ఏకాభిప్రాయ సాధనసహా, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం విజయవంతానికి తగిన పరిస్థితులను సృష్టించాల్సి ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది. -
ఆర్థిక సంక్షోభంలో చికాగో స్టేట్ యూనివర్సిటీ
-
ఆర్థిక పురోగతికి ‘స్త్రీనిధి’ అండ
►మహిళలకు కోరిన వెంటనే రుణాలు ►జీవనోపాధి కోసం ఈ ఏడాది ప్రత్యేక రుణ సదుపాయం ►సద్వినియోగం చేసుకుంటే స్వయం సహాయక సంఘాలకు వరం ►జిల్లాలో స్త్రీనిధికి కోట్ల రూపాయల కేటాయింపు ►అవగాహన లేమితో మూలుగుతున్న నిధులు ►నాలుగో వంతుకు కూడా చేరని రుణ లక్ష్యం పిడుగురాళ్ళ స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థికాభివృద్ధికి ‘స్త్రీనిధి’ అండగా నిలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 2010లో ప్రారంభించిన స్త్రీనిధి బ్యాంకు ద్వారా కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నారు. కానీ దీనిని పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవం వల్ల జిల్లాలో స్త్రీనిధి ఖాతాలో కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి. స్త్రీనిధి బ్యాంకు 2015-16 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ.122 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు సుమారు 22 శాతం మాత్రమే పంపిణీ జరిగినట్టు సమాచారం. జిల్లాలోని 57 మండలాల్లో 2052 గ్రామ సమాఖ్యలు ఉండగా 478 సమాఖ్యల ద్వారా 2253 సంఘాల సభ్యులు సుమారు రూ.23 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు నెలలు మాత్రమే గడువు ఉండటంతో మిగిలిన 78 శాతం నిధులు ఎప్పటికి సద్వినియోగం చేసుకోవాలనేది ప్రశ్నార్థకంగా మారింది. నిధులు మూలుగుతున్నా, పొదుపు సంఘ సభ్యులు పూర్తి స్థాయిలో వీటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. చిరువ్యాపారాలకూ అవకాశం.. స్త్రీనిధి బ్యాంకు ఈ ఏడాది మహిళల జీవనోపాధి కోసంప్రత్యేక రుణ సదుపాయాన్ని కూడా అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు గ్రూపు ఎంపిక చేసిన సభ్యురాలికి సుమారు రూ.70 వేల రుణం మంజూరు చేస్తారు. ప్రతిపాదన అందిన వారం లేదా పది రోజుల్లోగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. వాటితో బ్యాంకు సూచించిన 300 రకాల వ్యాపారాల్లో ఏదో ఒకటి ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది. ప్రతి మండలంలో ఐదు సంఘాలకు ఈ ఏడాది అవకాశం కల్పించారు. తీసుకున్న రుణం మూడేళ్లలో చెల్లించాల్సి ఉంటుంది. రుణం మంజూరు విధానమిదీ.. రాష్ట్ర ప్రభుత్వం స్త్రీనిధి బ్యాంకును 2010లో {పారంభించింది.స్వయం సహాయక సంఘాల సభ్యులు కోరిన రెండు రోజుల్లోనే సాధారణ రుణం మంజూరు చేస్తుంది. వ్యాపారం, చదువు, పిల్లల వివాహాలతో పాటు వ్యవసాయ పెట్టుబడుల కోసం పొదుపు గ్రూపులోని ఒక్కొక్కరికి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఇస్తారు. రుణం కోసం గ్రామ సమాఖ్య ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. సంఘంలో పది మంది ఉంటే అందులో ఆరుగురికి మాత్రమే రుణం మంజూరు చేస్తారు. అవసరమైతే జీవనోపాధి కోసం మిగిలిన వారికి కూడా ఇస్తారు. మొదటి సారిగా ఒక్కో గ్రూపునకు లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు రుణం ఇస్తారు. ఒక్కో సభ్యురాలికి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు మంజూరు చేస్తారు. రుణం తీసుకునే ముందుకు సంఘం సభ్యులు నెలకు రూ.10 చొప్పున ఏడాది కాలం పొదుపు చేసి బ్యాంకులో డిపాజిట్ చేసి ఉండాలి. బ్యాంకు పొదుపు చేసిన డబ్బులకు వడ్డీ కూడా చెల్లిస్తుంది. సంఘం సభ్యులు తీసుకున్న రుణం 14 శాతం వడ్డీతో కలుపుకుని రెండేళ్లలో చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ బాధలు లేకుండా వ్యాపారం అభివృద్ధి చేసుకున్నా.. నాలుగేళ్లుగా చీరల వ్యాపారం నిర్వహిస్తున్నాను. పొదుపు గ్రూపులో ఏడేళ్లుగా ఉన్నాను. మొదట రూ.50 వేలు రుణం తీసుకుని చీరెల వ్యాపారం ప్రారంభించాను. ఇప్పుడు రూ.1.50 లక్షలతో వ్యాపారం అభివృద్ధి చేసుకున్నాను. స్త్రీనిధిలో తక్కువ వడ్డీకి రుణాలు తీసుకోవడం వల్ల తీర్చుకోవడానికి కూడా సులభంగా ఉంది. తీసుకున్న రుణాలను నిదానంగా చెల్లించుకునే వెసులుబాటు కూడా ఉంది. అధిక వడ్డీల బాధ లేకుండా పొదుపు సంఘాల ద్వారా డబ్బులు తీసుకుని వ్యాపారాన్ని క్రమంగా అభివృద్ధి చేసుకుంటున్నాను. - వి.మల్లేశ్వరి, శ్రీలక్ష్మి మహిళా పొదుపు సంఘం, పిడుగురాళ్ళ ఆర్థికంగా వెసులుబాటు కలిగింది.. 2006 నుంచి పొదుపు గ్రూపులో ఉన్నాను. నా గ్రూపులో పది మంది ఉన్నారు. వారిలో కొంతమందికి స్త్రీ నిధి ద్వారా రుణాలు తీసుకున్నాం. లోను డబ్బులతో నాలుగేళ్లుగా కిరాణా షాపు నిర్వహిస్తున్నాను. దీంతో కుటుంబం గడుస్తుంది. వ్యాపారంతో ఆర్థిక వెసులుబాటు కలిగింది. ఇబ్బంది లేకుండా స్వతంత్య్రంగా నలుగురితో పాటు జీవించగలుగుతున్నాను. - గంధం కుమారి, కల్యాణి పొదుపు గ్రూపు, పిడుగురాళ్ళ కుటుంబ పోషణకు ఇబ్బంది లేదు.. స్త్రీ నిధి ద్వారా వ్యక్తిగత లోను రూ.70 వేలు తీసుకుని కూరగాయల వ్యాపారం పెట్టుకున్నాను. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ రుణం పొందడంతో వ్యాపారం పెట్టుకోగలిగాను. తద్వారా వచ్చే ఆదాయంతో పొదుపు, లోను డబ్బులను ప్రతి నెలా చెల్లిస్తూ కుటుంబ పోషణకు ఇబ్బందిగా లేకుండా చేసుకుంటున్నాను. శ్రీ చెన్నకేశవ పొదుపు గ్రూపులో ఆరేళ్లుగా సభ్యురాలిగా ఉన్నాను. ఈ ఏడాది లోను తీసుకుని కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నాను. - యక్కల దేవి హేమలత, నేతాజీనగర్, శ్రీ చెన్నకేశవ పొదుపు గ్రూపు, పిడుగురాళ్ళ -
పుతిన్‌ను కలవరపెడుతున్న ఆర్థిక సంక్షోభం
మాస్కో: దేశంలో ఆర్థిక వృద్ధి నిరాశాజనకంగా ఉందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. మాస్కోలో బుధవారం సాయంత్రం వార్షిక న్యూస్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో కీలక ప్రసంగం చేసిన ఆయన.. దేశంలో ఆర్థిక సంక్షోభం తారా స్థాయికి చేరుకుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు పతనం కావడం మూలంగా రష్యా ఆర్ధిక వ్యవస్థ తీవ్రంగా ప్రభావితం అయినట్లు వెల్లడించారు. 'మన దేశ ఆర్థిక వ్యవస్థ ముఖ్యంగా ఆయిల్, గ్యాస్ ధరలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ చమురు ధర కనీసం 100 డాలర్లుగా ఉంటే మంచి ఫలితాలు ఉండేవి. ప్రస్తుతం బ్యారెల్ చమురు ధర 50 డాలర్లకు పడిపోవడం తీవ్రంగా ప్రభావితం చూపుతోంది. ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల పైన మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది' అని పుతిన్ అన్నారు. ఆయిల్ ధరలు పతనమైనప్పటికీ వస్తు తయారీ, వ్యవసాయ రంగాల్లో ఆరోగ్యకరమైన వృద్ధి నమోదైనట్లు పుతిన్ తెలిపారు. సిరియాలో రష్యా దాడుల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడి వార్షిక ప్రసంగం ప్రాధాన్యతను సంతరించుకుంది. మూడో సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన పుతిన్‌ను ఆర్థిక సంక్షోభం కలవరపెడుతోంది. -
క్యూ2 జీడీపీ.. అంచనాలు మించిన చైనా
బీజింగ్: ఆర్థికాభివృద్ధికి సంబంధించి రెండవ త్రైమాసికంలో (క్యూ2, ఏప్రిల్-జూన్) చైనా అంచనాలను మించిన ఫలితాన్ని నమోదు చేసుకుంది. ఈ కాలంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 7 శాతంగా నమోదయ్యింది. అయితే 2009 ప్రపంచ ఆర్థిక సంక్షోభం తరువాత ఇంత బలహీన వృద్ధి రేటు ఇదే తొలిసారి. ఈ ఏడాది ఆరు నెలల కాలంలో చూస్తే జీడీపీ వృద్ధి రేటు 7 శాతం పెరుగుదలతో 29.7 ట్రిలియన్ యువాన్ (4.9 ట్రిలియన్ డాలర్లు)లుగా నమోదయినట్లు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఎన్బీఎస్) తెలిపింది. మొదటి ఆరు నెలల కాలంలో జాతీయ ఆర్థికాభివృద్ధి తగిన స్థాయిలో ఉందని ఎన్బీఎస్ తెలిపింది. ఆర్థిక వ్యవస్థ సూచీలు రికవరీ, స్థిరత్వం, మెరుగుదల సంకేతాలను ఇస్తున్నట్లు వివరించింది. ఉద్దీపనలు...: 2014లో దేశ వృద్ధి రేటు 7.4%. 2013లో ఈ రేటు 7.7%గా ఉంది. ఈ ఏడాది 7% వృద్ధి ప్రభుత్వ లక్ష్యం. అయితే షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ భారీ పతనం ఈ లక్ష్య సాధనపై సందేహాలు లేవనెత్తుతోంది. బీజింగ్ మాత్రం ఇన్వెస్టర్ విశ్వాసం వృద్ధికి పలు ఆర్థిక ఉద్దీపన చర్యలను చేపడుతోంది. -
రసాభాస
కరీంనగర్ : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. శుక్రవారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యూరు. కలెక్టర్ వీరబ్రహ్మయ్య, ఎమ్మెల్యేలు టి.జీవన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, పుట్ట మధు, బొడిగె శోభ, దాసరి మనోహర్‌రెడ్డి, ఒడితెల సతీష్‌బాబు, సోమారపు సత్యనారాయణ, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు సంతోష్‌కుమార్, పాతూరి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సభ ప్రారంభం కాగానే బోయినపల్లి, ఇబ్రహీంపట్నం, రామడుగు, సైదాపూర్, మహాముత్తారం, ఎల్లారెడ్డిపేట, ఓదెల జెడ్పీటీసీ సభ్యులు లచ్చిరెడ్డి, సునీత, వీర్ల కవిత, సంజీవరెడ్డి, సదయ్య, ఆగయ్య, గంట అక్షితలు మాట్లాడుతూ జిల్లాలో విద్యా, వైద్య రంగం అస్తవ్యస్తంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో వసతులు లేవని, మోడల్ స్కూళ్లకు రహదారులు, తాగునీటి వసతులు, చాలా పాఠశాలల్లో వంట గదులు లేవని ఆందోళన వ్యక్తంచేశారు.అనుమతిస్తే నాలుగు రోజుల్లో వంటగదులు నిర్మించి చూపిస్తామని ఎల్లారెడ్డిపేట జెడ్పీటీసీ సభ్యుడు తోట ఆగయ్య తెలిపారు. వచ్చే సర్వసభ్య సమావేశాలకల్లా మౌలిక వసతులు కల్పించేలా అధికారులను ఆదేశించాలని మంత్రిని కోరారు. వైద్య రంగం అస్తవ్యస్తం జిల్లా వ్యాప్తంగా డాక్టర్లు, నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ల్యాబ్‌లు లేవని, భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని.. తక్షణమే ప్రక్షాళన చేయాలని జెడ్పీటీసీలు పూర్ణిమ, శరత్‌రావు, పొన్నాల లక్ష్మయ్య, సిద్దం వేణు, చల్లా నారాయణరెడ్డి, గోపగాని సారయ్యగౌడ్, శ్రీకాంత్, కోఆప్షన్ సభ్యుడు జమీలొద్దీన్ డిమాండ్ చేశారు. కోహెడ్ డాక్టర్ అందుబాటులో ఉండడం లేదని జెడ్పీటీసీ లక్ష్మణ్ తెలిపారు. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ప్లేట్లేట్స్ మిషన్ పనిచేసేలా చూ డాలని జమిలొద్దీన్ కోరారు. మహాముత్తారంలో వై ద్యులు ఉండడం లేదని ఎంపీపీ అ న్నారు. వ్యవసాయంపై అట్టుడికిన సభ వ్యవసాయశాఖ పనితీరు అధ్వానంగా ఉందని పంట నష్టపరిహారం చెల్లింపులో ఆదర్శ రైతుల అవినీతికి అంతులేకుండా పోయిందంటూ సభ్యులు ధ్వజమెత్తారు. పరిహారం జాబితా అడిగితే వ్యవసాయ అధికారులు ఇవ్వడం లేదని, జెడ్పీటీసీలంటే అంత చులకనా? అంటూ బెజ్జంకి, శంకరపట్నం, ఎల్లారెడ్డిపేట జెడ్పీటీసీలు తన్నీరు శరత్‌రావు, సంజీవరెడ్డి, తోట ఆగయ్య తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదర్శరైతులకు అనుకూలమైన వారిపేర్లే జాబితాలో చేర్చి డబ్బులు దండుకున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. బెజ్జంకి ఏవో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మంత్రితో వాపోయారు. అభివృద్ధికి బాటలు వేయండి: మంత్రి ‘ఈటెల’ జిల్లా సమగ్రాభివృద్ధికి పార్టీలకతీతంగా సభ్యులు కలిసి రావాలని రాష్ట్ర ఆర్థిక పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కోరారు. జెడ్పీ సమావేశంలో ఆయన శుక్రవారం మాట్లాడారు. బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ముందుకుసాగుదామన్నారు. ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలే అయిందని, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన చేస్తామని తెలిపారు. రుణమాఫీ విషయంలో వెనుకంజ వేయబోమన్నారు. పంట పరిహారం జాబితాలను జెడ్పీటీసీ, ఎంపీపీలకు అందించాలని వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. అధికార పార్టీకి చుక్కెదురు జెడ్పీలో మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతిపాదించిన పనులు తిరస్కరణకు గురయ్యాయి. మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే బొడిగె శోభ, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి కమలాపూర్, గంగాధర, కథలాపూర్, చొప్పదండి, కొడిమ్యాల మండలాల్లో బోర్‌వెల్స్, కమ్యూనిటీ హాళ్లు, రోడ్లు తదితర పనుల నిమిత్తం రూ.36 లక్షల 50 వేలతో ప్రతిపాదనలు పంపించారు. శుక్రవారం ఉదయం జరిగిన వర్క్స్, ఆర్థికస్థాయీ సంఘాల్లో పలువురు సభ్యులు మాట్లాడుతూ జిల్లాలో 13 నియోజకవర్గాలుంటే మూడు నియోజకవర్గాలకు మాత్రమే 24 ప్రతిపాదనలతో నిధులు కేటాయించడమేంటని ప్రశ్నించారు. అన్ని నియోజకవర్గాలకు సమానంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపాదనలను ఏకగ్రీవంగా తిరస్కరించారు. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి చుక్కెదురైనట్లయింది. -
సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అవగాహన కోసమే సర్వే
మిర్యాలగూడ :తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అవగాహన కోసమే ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా తెలిపారు. గురువారం పట్టణంలోని శాంతినికేతన్ కళాశాలలో ఎన్యుమరేటర్ల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాబోయే ఐదేళ్లలో ఆర్థిక, అభివృద్ధి ప్రణాళికలు రూపొందించేందుకు ఈ సర్వే దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈసర్వే వల్ల రేషన్‌కార్డు ఉన్న , పింఛన్ పొందుతున్న లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులుండవని పేర్కొన్నారు. జిల్లాలో భూపంపిణీ కోసం సుమారు 300మంది లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. శుక్రవారం స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా మోతె మండలానికి చెందిన లబ్ధిదారులకు జిల్లా కేంద్రంలో రాష్ట్రవిద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి చేతుల మీదుగా భూమి పట్టాలు పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. జేసీ వెంట మిర్యాలగూడ ఆర్డీఓ బి. కిషన్‌రావు, మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ సురేష్, తహసీల్దార్ మాలి కృష్ణారెడ్డి, మున్సిపల్ మేనేజర్ వసంత, ఆర్ఐ లక్ష్మణాచారి తదితరులు ఉన్నారు. -
సర్వే గడబిడ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఇంటింటి సర్వే’ జిల్లా యంత్రాం గాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సర్వేకు సరిపడా సిబ్బందిని సమకూర్చుకోవడం గండంగా మారింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్ఎంసీ)లోని జిల్లా పరిధి సర్వే బాధ్యత లు గ్రేటర్‌కు అప్పగించి చేతులు దులుపుకున్నా.. గ్రామీణ ప్రాంతంలో సర్వే నిర్వహణకు తగి నంత ఉద్యోగులు లేకపోవడం ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ నెల 19న గ్రేటర్ పరిధి మినహా 7,41,600 ఇళ్లలో ‘ఆర్థిక, సామాజిక సర్వే’ నిర్వహించేందుకు 28,447 మంది అవసరమని లెక్కగట్టారు. దీంట్లో కేవలం 17,617 మంది మాత్రమే అందుబాటులో ఉండడం, ఇంకా 10,830 మంది సిబ్బంది కొరత ఉండడం జిల్లా యంత్రాంగాన్ని వేధిస్తోంది. శుక్రవారం గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రేమండ్ పీటర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సైతం కలెక్టర్ ఎన్.శ్రీధర్ ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. సర్వేకు సరిపడే స్థాయిలో సిబ్బందిని సమకూర్చుకోవడం కష్టతరంగా మారినందున, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులను వినియోగించుకునేందుకు అనుమతించాలని కోరారు. ఇటీవల ఎన్నికల విధుల్లో నూ వీరి సేవలు వినియోగించుకున్నామని, ఇప్పుడు కూడా ఆ వెసులుబాటు కల్పిస్తే సర్వే సిబ్బంది కొరతను అధిగమిస్తామని స్పష్టం చేశారు. కలెక్టర్ అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన రేమండ్ పీటర్.. ఉన్నతస్థాయిలో చర్చించి నిర్ణయం తెలియజేస్తామన్నారు. ఇంటింటి సర్వేలో ప్రైవేటు ఉద్యోగులను వినియోగించుకోకూడదని ప్రభుత్వం నిబంధనలు విధించడంతో దీన్ని సడలిస్తే కానీ గండం గట్టెక్కే పరిస్థితి కనిపించడంలేదు. పట్టణ ప్రాంతాలను సర్వే నుంచి మినహాయిస్తే గ్రామీణ ప్రాంతాలకు సరిపడా సిబ్బందిని సమకూర్చుకోవడం పెద్ద కష్టంకాబోదని భావించిన అధికారగణానికి తాజా పరిణామం మింగుడు పడకుండా ఉంది. సర్వే నిర్వహణపై రెండు రోజుల్లో శిక్షణా తరగతులు నిర్వహించాల్సివుండగా, ఇప్పటివరకు సిబ్బంది సేకరణపై స్పష్టత రాకపోవడం చికాకు కలిగిస్తోంది. -
యాపారం
చెట్టూ పుట్టా, వ్యర్ధం, వ్యసనం, చిన్నా, పెద్దా దేన్నైనా ఎకనామిక్ ఐతో చూడటం మనిషికి ఎప్పట్నుంచో అలవాటు. ఇప్పుడా కన్ను స్మార్ట్‌ఫోన్‌లోని ఆప్స్ మీద పడింది. మొదట్లో ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్లాంటి ఇంటర్ఫేస్లతో పాటు చిన్నా చితకా ఆప్స్ ఫోన్లతో నిక్షిప్తం అయి వచ్చేవి. కాని ఇప్పుడు ఆప్స్ ఉండే ఓఎస్‌కే ఆదరణ లభిస్తుంది. కోట్లకు కోట్లు కుమ్మరిస్తున్నాయి. 19 బిలియన్స్లకి అమ్ముడు పోయినే వాట్సాపే దీనికి ప్రత్యేక నిదర్శనం. ఆ ఊపులో మన నగర విద్యార్థులు కూడా ఇ-కామ్ ఆప్స్ తయారీలో చొరవ చూపించి విజయవంతమయ్యారు. అందులో విజయవంతమైన ఓ ఆప్ గురించి... ‘‘..... ఖార్ఖానా బస్టాప్ వచ్చి, మాయా బజార్ హోటల్ గల్లీలో నాలుగో రైట్ నుండి మూడో లెఫ్ట్, పచ్చ రంగు గేటు, దాని మీద ఏపుగా మనీ ప్లాంట్ పెరిగి ఉంటుంది. అదే మా ఇల్లు’’ ఇలా తన అడ్రస్ చెప్పాడొకడు విదేశాల నుండి వచ్చిన తన మిత్రుడికి. ఆ అడ్రస్ ఆనవాళ్లను పట్టుకొని, ఆ మనీ ప్లాంట్ మొదళ్లని చేరుకునే సరికి ఆ విదేశీ ఆసామి వీసా కాస్తా ఆవిరైపోతుంది. ఇలా ఈ తంటాలేవి చెప్పినా అడ్రస్ని అర్థం చేసుకుని, అవతల వ్యక్తికి డెరైక్షన్‌తో కూడిన మ్యాప్ ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది కదా! అచ్చం ఇలాంటి ఆలోచనే 2011లో ఆదిత్యా పుచి అనే వ్యక్తికి వచ్చింది. అలా ఏర్పడిందే ఈ జిప్పర్ అనే ఆప్. ‘‘స్వతహాగా వైద్యులు అయిన మా నాన్నగారు పేషెంట్లకు మా క్లినిక్‌కి దారి చెబుతుండగా పడ్డ ప్రయాసల నుండి పుట్టింది ఈ జిప్పర్ ఐడియా’’ అని అంటారు 34 ఏళ్ల ఆప్ ఎంటర్ప్రెన్యూర్ ఆదిత్య. హైదరాబాద్ వాస్తవ్యులైన ఆదిత్య స్కూలింగ్ అంతా హెచ్.పి.ఎస్.లోను తరువాత ఇంజినీరింగ్‌ని సి.బి.ఐ.టి.లో పూర్తి చేశారు. 2002లో పై చదువులకు యూఎస్ వెళ్లి వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీలో ఎమ్మెస్ చేసి సిలికాన్ వ్యాలీలో ఎక్స్‌పోనెన్షియల్ అనే కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. తరువాత 7 ఏళ్లకి కంపెనీ పనుల మీద తిరిగి స్వస్థలానికి చేరుకున్నారు ఆదిత్య. ‘‘మన దేశానికి, అమెరికాకు చాలా వ్యత్యాసం ఉంది. ముఖ్యంగా కాలనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. ఇళ్లు - రోడ్ల నిర్మాణం ఒక క్రమ పద్ధతిలో ఉండి, ఒకసారి తిరిగి చూస్తే లే అవుట్ అంతా గుర్తుండిపోతుంది. కాని మన దేశంలో రోడ్డు వ్యవస్థ సంక్లిష్టంగా, తిరిగే దూరం తక్కువే ఉన్నా చిన్న చిన్న సందులు, మలుపుల వల్ల ఎంతో కన్ఫ్యూజన్.’’ ఇది తిరిగి భారత దేశానికి వచ్చిన ఆదిత్యా మదిలో మెదిలిన ఆలోచన. ఈ ఆలోచనతో 2011లో ఆప్ పనులు మొదలు పెట్టాడు. అప్పటికే ‘మింట్ మీడియా’ అనే ఆన్లైన్ సైట్ నడుపుతున్న అనుభవంతో ఆప్ రూపకల్పన మొదలైంది. కోటి రూపాయల బడ్జెట్‌తో తన కంపెనీలో పనిచేస్తున్న స్నేహితులతో జిప్పర్‌ని రూపొందించి 2013 జూన్న విడుదల చేశారు. ఏం చేస్తుందీ జిప్పర్: ఈ ఆప్ ద్వారా మీకు మీ ఇంటి అడ్రస్ కాని, ఏదైనా ప్రదేశం తాలూకు లొకేషన్‌కి ఒక జిప్పర్ కోడ్‌ని క్రియేట్ చేయొచ్చు. తరువాత మీ అడ్రస్ ఎవరికైనా చెప్పాల్సి వచ్చినపుడు, ఆ వ్యక్తికి మీ జిప్పర్ కోడ్‌ని ఎస్.ఎమ్.ఎస్. ద్వారా పంపిస్తే చాలు. సదురు వ్యక్తి కోడ్‌ని జిప్పర్లో ఎంటర్ చేస్తే ఆ వ్యక్తి ఉన్న మ్యాప్ అతని ఫోన్లో ప్రత్యక్షం అవుతుంది. 108తో ఒప్పందం: ఈ ఆప్‌ని మొదలు పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశ్యం ‘అంబులెన్స్ సేవలకు మెరుగైన సేవలు అందించడం’ అని అంటారు ఆదిత్య. జిప్పర్, 108 జీవీకె సేవలతో గత ఏడాది ఒప్పందం చేసుకున్నారు. ఏదైనా ప్రమాద స్థలం తాలూకు అడ్రస్ చెప్పడం క్లిష్టం అయినా, లేక ఆ ప్రదేశం ఏంటో తెలియకున్నా ఫర్వాలేదు. మీరు ఉన్న లొకేషన్‌కి వెంటనే ఒక జిప్పర్ కోడ్ క్రియేట్ చేసి, 108 సిబ్బందికి ఆ కోడ్ ఇస్తే సరి. అంబులెన్స్ ప్రయాణ సమయాన్ని తగ్గించి, ప్రాణాలు కాపాడే అవకాశం ఆప్ ద్వారా కల్పించారు నిర్వాహకులు. ‘‘ఈ రెండేళ్లలో ఎంతో కొంత సాధించామనే అనుకుంటున్నాం. 108తో ఒప్పందం ఒక పెద్ద అచీవ్మెంట్. కోటి రూపాయల బడ్జెట్‌తో మొదలై ఇపుడు లక్షల సెల్ఫోన్స్లలో మా ఆప్ తన సేవలని అందిస్తోంది. మన రాష్ట్రానికి పరిమితం అయిన జిప్పర్‌ని ప్రస్తుతం పక్క రాష్ట్రాలకు కూడా విస్తరింపచేసే పనిలో ఉన్నాం’’ అని అంటున్న ఆదిత్య యాపారం ఇది. - జాయ్ ఏదైనా ప్రమాద స్థలం తాలూకు అడ్రస్ చెప్పడం క్లిష్టం అయినా, లేక ఆ ప్రదేశం ఏంటో తెలియకున్నా ఫర్వాలేదు. మీరు ఉన్న లొకేషన్‌కి వెంటనే ఒక జిప్పర్ కోడ్ క్రియేట్ చేసి, 108 సిబ్బందికి ఆ కోడ్ ఇస్తే సరి. అంబులెన్స్ ప్రయాణ సమయాన్ని తగ్గించి, ప్రాణాలు కాపాడే అవకాశం ఆప్ ద్వారా కల్పించారు నిర్వాహకులు. -
పోలింగ్‌కు తరలిన సీమాంధ్ర ఓటర్లు
- ప్రత్యేక బస్సులు నడిపిన ఏపీఎస్ ఆర్టీసీ - పలు బస్సులు ఎన్నికల విధులకు - ఉన్న బస్సుల్లోనే నిలబడి స్వస్థలాలకు బెంగళూరు, న్యూస్‌లైన్ : సీమాంధ్రలో బుధవారం పోలింగ్‌ను పురస్కరించుకుని ప్రవాసాంధ్రులు పెద్ద సంఖ్యలో సొంత ఊర్లకు తరలి వెళ్లారు. మంగళవారం ఉదయం నుంచే గమ్య స్థానాల వైపు పయనమయ్యారు. మదనపల్లి, చిత్తూరు, నెల్లూరు, తిరుపతి, తంబళ్లపల్లి, పలమనేరు, శ్రీకాళహస్తి, హిందూపురం, కడప, ప్రొద్దుటూరు, కావలి, నెల్లూరు, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులే ఎక్కువగా ఉన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ ప్రొద్దుటూరుకు ఆరు (మూడు కడప మార్గం, మూడు కదిరి మార్గం), నంద్యాల -2, విజయవాడ-5, నెల్లూరు-5, ఒంగోలుకు-1 చొప్పున రిజర్వేషన్ సౌకర్యంతో ప్రత్యేక బస్సులను నడిపింది. వీటితో పాటే కదిరి, అనంతపురం, మదనపల్లి, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు తదితర ప్రాంతాలకు 40 ప్రత్యేక సర్వీసులు నడిపామని ఏపీఎస్ ఆర్టీసీ స్థానిక అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ రవీంద్ర నాథ రెడ్డి తెలిపారు. ఎక్కువ బస్సులను ఎన్నికల విధులకు తరలించినందున ప్రయాణికులకు సరిపడా బస్సులను సమకూర్చడంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. చాలా మంది నిలబడే వెళ్లారని చెప్పారు. ఎన్నికలు అదనుగా ప్రైవేట్ బస్సుల్లో ఛార్జీలను అమాంతం పెంచేశారు. ఆర్టీసీ బస్సులు తక్కువగా ఉండటం, ప్రైవేటు బస్సుల్లో ఛార్జీలు ఎక్కువ కావ డంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.