న్యూఢిల్లీ: సోషల్ మీడియా ద్వారా ఆర్థికపరమైన(ఫైనాన్షియల్) సలహాలిచ్చేవారిపై క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ దృష్టి పెట్టింది. ఫైనాన్షియల్ ఇన్‌ఫ్లుయెన్సర్లుగా పిలిచే వ్యక్తులు లేదా సంస్థల నియంత్రణకు తాజాగా చర్యలు చేపట్టింది. ఒక్కో పోస్టుకు రూ. 10,000 నుంచి రూ. 7.5 లక్షలవరకూ చార్జ్‌చేసే సలహాదారులు ఇటీవల అధికమైన నేపథ్యంలో సెబీ తాజా చర్యలకు తెరతీసింది. తద్వారా ఇన్వెస్టర్లకు కచి్చతమైన, నిష్పక్షపాత సమాచారం లభించేందుకు వీలు కలి్పంచనుంది.
అదీకృత సలహాలకు అవకాశంతోపాటు.. మోసాలను తగ్గించేందుకు సెబీ చర్యలు తోడ్పడనున్నట్లు ఆనంద్ రాఠీ వెల్త్ డిప్యూటీ సీఈవో ఫిరోజ్ అజీజ్ పేర్కొన్నారు. సెబీ తాజా ప్రతిపాదనల ప్రకారం ఆర్థిక సలహాదారులు(ఫిన్‌ఫ్లుయెన్సర్లు) సెబీ వద్ద రిజిస్టర్‌కావలసి ఉంటుంది. అంతేకాకుండా వీటికి సంబంధించిన మార్గదర్శకాలను పాటించవలసి ఉంటుంది. రిజిస్టర్‌కానివారు ప్రమోషనల్ కార్యక్రమాల కోసం మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకర్లతో జట్టు కట్టేందుకు అనుమతించరు.
ఇకపై సెబీ వద్ద రిజిస్టర్‌కావడంతోపాటు, నిబంధనలు పాటించవలసిరావడంతో ఫిన్‌ఫ్లుయెన్సర్లు జవాబుదారీతనం(అకౌంటబిలిటీ) పెరుగుతుందని, ప్రమాణాలు, నైపుణ్యాలు మెరుగుపడతాయని రైట్ రీసెర్చ్, పీఎంఎస్ వ్యవస్థాపకుడు, ఫండ్ మేనేజర్ సోనమ్ శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. ఫిన్‌ఫ్లుయెన్సెర్ల పాత్రకు జవాబుదారీతనం పెంచడం ద్వారా సెబీ ఇన్వెస్టర్లకు రక్షణను పెంచుతున్నదని అజీజ్ పేర్కొన్నారు. దీంతోపాటు పరిశ్రమలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నదని తెలియజేశారు. సెబీ లేదా స్టాక్ ఎక్సే్ఛంజీ లేదా మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్(యాంఫీ) వద్ద రిజిస్టరైన ఫిన్‌ఫ్లుయెన్సెర్లు తమ రిజి్రస్టేషన్ నంబర్, కాంటాక్ట్ వివరాలు తదితరాలను పొందుపరచవలసి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment