Published
Fri, Sep 16 2016 8:37 PM
| Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
మిర్యాలగూడ టౌన్ : మున్సిపాలిటీలోని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, సమభావన సంఘాలను బలోపేతం చేసుకునేందుకు పట్టణ మహిళా సమాఖ్యలు Mýృషి చేయాలని మున్సిపల్ చైర్ పర్సన్ తిరునగరు నాగలక్ష్మీభార్గవ్ అన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన పట్టణ స్థాయి సమాఖ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతి నెల సమావేశాలను ఏర్పాటు చేసుకొని సంఘాల పనితీరుపై చర్చించుకోవాలన్నారు. మహిళలు డబ్బులను పొదుపు చేసుకొని ఉపాధి అవకాశాలను పొందాలన్నారు. ప్రభుత్వం మహిళా సంఘాలకు రుణాలను ఇవ్వడం జరుగుతుందని, వాటిని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకొని ఉపాధి అవకాశాలను పొందాలన్నారు. బ్యాంకుల ద్వారా ఏ విధంగా రుణాలను తీసుకుంటున్నారో.. అదే విధంగా డబ్బులను తిరిగి కట్టి కొత్త లోన్లు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో శ్రీనిధి ఏపీఎం లక్ష్మణ్, డివిజనల్ మేనేజర్ మధుసూధన్, పీఆర్‌పీ శ్రీనివాస్, సీవోలు శ్రీనివాసాచారి, వెంకటేశ్వర్లు, పార్వతి, పట్టణ సమాఖ్య నాయకురాళ్లు అనసూర్య, అనిత తదితరులున్నారు.