
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల ప్రక్షాళనకు ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే ప్రభుత్వ రంగ బ్యాంకులు (పంజాబ్ ఎండ్ సింధ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూకో బ్యాంక్, ఐడీబీఐ) తదితర బ్యాంక్‌లలో కేంద్ర ప్రభుత్వం మెజారిటీ వాటా ఉంది. అయితే కరోనా వైరస్, ఆర్థిక మాంధ్యం ప్రభావంతో బ్యాంకుల అభివృద్ధికి నిధుల కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో బ్యాంకుల పనితీరును మెరుగు పరిచేందుకు ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.
ఈ క్రమంలో పైన పేర్కొన్న (నాలుగు బ్యాంకుల) వాటాలో కొంత ప్రైవేట్ సంస్థలకు అమ్మకానికి ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు పీఎమ్‌ఓ ఆఫీస్ వర్గాలు తెలిపాయి. కాగా గత నెలలో సగానికిపైగా బ్యాంకులను ప్రైవేట్ సంస్థలకు వాటా ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నట్లు ర్యూటర్స్ సంస్థ పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకుల వాటాల అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం వేగవంతంగా చర్యలు చేపట్టవచ్చని బ్యాంకింగ్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చదవండి: బంధన్ బ్యాంక్‌కు వాటా విక్రయ షాక్
Comments
Please login to add a commentAdd a comment