Google CEO Sundar Pichai Message To Employees For Layoffs - Sakshi
Sakshi News home page

‘ఇక చాలు.. దయ చేయండి’.. గూగుల్ ఉద్యోగులకు సీఈఓ ఈ మెయిల్

Published Sun, Jan 22 2023 11:36 AM | Last Updated on Sun, Jan 22 2023 12:39 PM

Google Ceo Sundar Pichai Message To Employees For Layoffs - Sakshi

సాఫ్ట్‌వేర్‌ రంగం ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. కరోనా సమయంలో ఎన్నో రంగాలు కుదేలైనా ఐటీ పరిశ్రమ పడిపోలేదు. ఇంకా కొత్త ఉద్యోగుల్ని తీసుకొని వర్క్‌ హోమ్‌తో ఆదుకున్నాయి. ఇలా దూసుకుపోతున్న సాఫ్ట్‌ వేర్‌ సెక్టార్‌కు ప్రస్తుతం పరిస్థితులు ఏమాత్రం కలిసి రావడం లేదు. ఆయా దేశాల్లో ద్రవ్యోల్బణం లెక్కకు మించి పడిపోతుంది. దీనిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలకు చెందిన బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోతున్నాయి.

గత ఏడాది అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను పెంచడంతో ఆ భారం విదేశీ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పటికే కొన్ని చోట్ల ఆర్ధిక మాంద్యం సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల శ్రీలంకతో పాటు పాకిస్తాన్‌ ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలమైంది. ఇలా అనేక కారణాలతో  ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బడా కంపెనీలు తమ ఖర్చుల్ని తగ్గించుకోవడానికి ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఇప్పటికే యాపిల్‌, ట్విటర్‌, మెటా, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ కంపెనీలు వేలల్లో ఉద్యోగుల్ని తొలగించాయి. తాజాగా గూగుల్‌ సైతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 12వేల మంది ఉద్యోగులకు పింక్‌ స‍్లిప్‌లు జారీ చేసినట్లు ఆ సంస్థ సీఈవో సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. 

ఇటీవల బడా టెక్‌ కంపెనీలు మైక్రోసాఫ్ట్‌, ఫేస్‌బుక్‌, అమెజాన్‌ ప్రపంచలోకి ఆర్థిక మాంద్యం’ అంటూ ఉద్యోగుల్ని ఫైర్‌ చేశాయి. తాజాగా సుందర్‌ పిచాయ్‌ ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు మెయిల్‌ చేశారు. ఆ మెయిల్స్‌లో ఏముందంటే?

‘‘గూగులర్స్‌..ఈ వార్త షేర్‌ చేయడం నాకు కష్టంగా ఉంది. మేము మా వర్క్‌ఫోర్స్‌ను సుమారు 12,000 వేలు తగ్గించాలని నిర్ణయించుకున్నాము. యూఎస్‌లో లేఆఫ్స్‌కు సంబంధించి ఇప్పటికే ఉద్యోగులకు మెయిల్స్‌ పంపాము. ఇతర దేశాల్లో సంస్థ తొలగించిన ఉద్యోగులకు మెయిల్స్‌ పంపేందుకు సమయం పడుతుంది. కష్టపడి పనిచేసిన, పని చేయడానికి ఇష్టపడే మరికొంత మంది ప్రతిభావంతులైన ఉద్యోగుల్ని కోల్పోవడాన్ని చింతిస్తున్నాం. సంస్థ తీసుకునే నిర్ణయాలు ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతాయనే వాస్తవం వినడానికే భారంగా ఉంది. మమ్మల్ని ఈ పరిస్థితుల్లోకి నెట్టేలా తీసుకున్న నిర్ణయాలకు పూర్తి బాధ్యత వహిస్తాను’ అని ఉద్యోగులకు పంపిన మెయిల్స్‌లో సుందర్‌ పిచాయ్‌ పేర్కొన్నారు.’’ 

యూఎస్‌లో గూగుల్‌ లేఆఫ్స్‌ ఉద్యోగులకు 

గూగుల్‌ ఫైర్‌ చేసిన యూఎస్‌ ఉద్యోగులకు నోటిఫికేషన్ వ్యవధిలో (కనీసం 60 రోజులు) ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నట్లు తెలిపింది. 

 కోతకు ప్రభావితమయ్యే ఉద్యోగులకు గూగుల్‌ సెవరెన్స్‌ ప్యాకేజ్‌ను ఆఫర్‌ చేస్తోంది. గూగుల్‌లో ప్రతి అదనపు సంవత్సరానికి 16 వారాల జీతంతో పాటు, రెండు వారాల సెవరెన్స్‌ ప్యాకేజీ ఇ‍వ్వనుంది. మరో 16 వారాల్లో జీఎస్‌యూ సర్టిఫికెట్‌ను జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేయనుంది. 

2022 బోనస్‌లు,మిగిలిన సెలవులకు వేతనం చెల్లిస్తాము.

6 నెలల హెల్త్‌ కేర్‌, ఉద్యోగ నియామక సేవలు, ఇమ్మిగ్రేషన్ సపోర్ట్‌ చేస్తుంది. 

యూఎస్‌ కాకుండా మిగిలిన దేశాలకు చెందిన ఉద్యోగులకు స్థానిక చట్టాల ప్రకారం చెల్లింపులు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుందర్‌ పిచాయ్‌ వెల్లడించారు.

చదవండి👉 పాక్‌ అభిమాని గూబ గుయ్‌మ‌నేలా..సుందర్‌ పిచాయ్‌ రిప్లయ్‌ అదిరింది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement