ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందన్న ఆర్ధిక నిపుణుల అంచనాలతో ప్రపంచ వ్యాప్తంగా చిన్న చిన్న కంపెనీల నుంచి దిగ్గజ టెక్ సంస్థల వరకు కాస్ట్ కటింగ్ పేరుతో వర్క్ ఫోర్స్‌ను తగ్గించుకుంటున్నాయి. రానున్న రోజుల్లో ఉద్యోగుల తొలగింపులు నిపుణులు అంచనాలకు మించి ఉంటాయంటూ కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
ఇటీవల ప్రకటించిన కంపెనీ ఫలితాల్లో నష్టాలు రావడంతో మెటా 11 వేల మందిని ఫైర్ చేసింది. రెసిషన్ ముప్పుతో సంస్థలు అడ్వటైజ్‌మెంట్‌పై చేసే ఖర్చు తగ్గించుకోవడం వల్లే నష్టాలు వచ్చిపడుతున్నాయని, కాబట్టే ఉద్యోగుల తొలగింపు నిర్ణయం తీసుకోక తప్పలేదని తెలిపింది. ఇక తాజాగా మెటా దారిలో గూగుల్, అమెజాన్‌లు మరోసారి భారీ ఎత్తున లేఆఫ్స్‌కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.
20వేలు కాదు అంతకంటే ఎక్కువే?
మెటా తర్వాత అమెజాన్ ఉద్యోగుల తొలగింపులపై అధికారిక ప్రకటన చేసింది. ఇప్పటి నుంచి 2023 ప్రారంభం వరకు సంస్థలోని అన్నీ విభాగాల్ని రివ్యూ చేస్తున్నాం. ఆ రివ్యూ ఆధారంగా ఒక్కసారిగా కాకుండా దశల వారీగా ఉద్యోగుల్ని తొలగిస్తామని అమెజాన్ సీఈవో జెఫ్‌బెజోస్ తెలిపారు.
అయితే ఎంతమందికి అమెజాన్ పింక్ స్లిప్‌లు జారీ చేయనుందనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. పలు నివేదికల ప్రకారం.. 20వేల మంది ఉద్యోగుల్ని పక్కన పెట్టనుందని తెలిపగా.. నవంబర్ నెలలో 10వేల మందిపై వేటు వేసింది. త్వరలో 20 వేలు, అంతకంటే ఎక్కువ మందిని ఇంటికి సాగనంపనుందని సమాచారం. ఖర్చు తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా అమెజాన్ పలు ప్రాజెక్ట్‌ల్ని బీటా టెస్టింగ్‌కే పరిమితం చేసింది. ఏ మాత్రం లాభాసాటి లేని వ్యాపారాల్ని (భారత్‌లో అమెజాన్ అకాడమీ) షట్ డౌన్ చేస్తుంది.
అమెజాన్ దారిలో గూగుల్
గూగుల్ సైతం తన మొత్తం వర్క్ ఫోర్స్‌లో 6 శాతం అంటే 10వేల మందిని ఫైర్ చేయగా.. 2023 ప్రారంభం నాటికి పనితీరును బట్టి ఉద్యోగులకు గుడ్‌బై చెప్పనుంది. ఇందుకోసం ఉద్యోగుల పనితీరును అంచనా వేయాలని సెర్చ్ దిగ్గజం మేనేజర్లను కోరింది. తద్వారా పేలవ పనితీరు కనబరిచిన వారిని తొలగించే అవకాశం ఉంది.
ఈ ఏడాది క్యూ4 నిరాశజనకమైన ఫలితాలతో అసంతృప్తిగా ఉన్న యాజమాన్యం నియామకాల్ని నిలిపేసింది. ఖర్చులను ఆదా చేయడానికి ఇతర టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తే నష్టపరిహారం చెల్లిస్తున్నాయి. కానీ ఉద్యోగుల్ని ఫైర్ చేయడం, పింక్ స్లిప్‌లు జారీ చేసిన ఉద్యోగులకు ఇతర బెన్ఫిట్స్ అందించ లేమని తేల్చి చెప్పింది.
చదవండి👉 ‘ఇక నిద్ర పోండి’, ట్విటర్ ఆఫీస్‌లో ఎలాన్ మస్క్ సరికొత్త ప్రయోగం!
Comments
Please login to add a commentAdd a comment