టోక్యో: జపాన్ మాంద్యంలోకి జారిపోయింది. జపాన్ ఆర్థిక వృద్ధి రేటు 2023 చివరి త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్ మధ్య)లో 0.4%, జూలై– సెప్టెంబర్‌లో 2.9% మేర క్షీణించింది. వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వృద్ధి మందగించిన సందర్భాల్లో ఆర్థిక వ్యవస్థను మాంద్యంలో ఉందనేందుకు గుర్తుగా భావిస్తారు.
దీంతోపాటు, జపాన్ కరెన్సీ యెన్ కూడా బలహీ నపడింది. ఫలితంగా ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్..అమెరికా, చైనా, జర్మనీల తర్వాత నాలుగో స్థానానికి పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment