
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆర్థిక మాంద్యంపై స్పందించారు. 2024 మార్చి వరకు ఆర్ధిక మాంద్యం కొనసాగే అవకాశం ఉందని తెలిపారు.
చైనా, ఐరోపాలో తలెత్తిన ఆర్థికమాంద్యం కారణంగా టెస్లా ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు డిమాండ్ తగ్గిందంటూ మస్క్ పేర్కొన్నారు. అదే విషయంపై ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. 2024 వరకు మాంద్యం కొనసాగే అవకాశం ఉన్నట్లు తాను భావిస్తున్నానని మస్క్ అన్నారు. కాగా, టెస్లా కార్లకు గిరాకీ తగ్గిందన్న మస్క్ వ్యాఖ్యల నేపథ్యంలో టెస్లా కంపెనీ షేరు 6.6 శాతం తగ్గి 207.28 డాలర్లకు పడిపోయింది.
చదవండి👉 భారత్‌తో ఎలాన్ మస్క్ చర్చలు.. ప్రధాని మోదీ అందుకు ఒప్పుకుంటారా?
Comments
Please login to add a commentAdd a comment