జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న కీలక పరిణామాలు, ముఖ్యంగా ఐటీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్ క్యూ4 ఆర్థిక ఫలితాలు అంచనాలు అందుకోలేకపోవడంతో టెక్నాలజీ షేర్లు ఒత్తిడికి గురయ్యాయి. దీంతో సోమవారం దేశీయ స్టాక్ సూచీలు నష్టాలతో ముగిశాయి.
ట్రేడింగ్ నాలుగురోజులే జరిగిన గతవారంలో సెన్సెక్స్ 598 పాయింట్లు, నిఫ్టీ 229 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. అయితే ఈ వారంలో ఆ లాభాలకు బ్రేకులు పడ్డాయి. సోమవారం సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 520 పాయింట్లు నష్టపోయి 59910 వద్ద నిఫ్టీ 121 పాయింట్ల నష్టపోయి 17706 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి.
ఇన్ఫోసిస్,టెక్ మహీంద్రా,హెచ్‌సీఎల్,ఎన్టీపీసీ,లార్సెన్, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ,టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్,సిప్లా షేర్లు నష్టపోగా.. నెస్లే,పవర్ గ్రిడ్ కార్పొరేషన్,ఎస్‌బీఐ, బ్రిటానియా, హిందాల్కో, కొటక్ మహీంద్రా, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు లాభాలు గడించాయి.
Comments
Please login to add a commentAdd a comment