betterdotcom
-
‘ఈ చిన్న లాజిక్ ఎలా మిస్సయ్యా’..మూడు నిమిషాల్లో 900 మంది తొలగింపుపై..
అనాలోచితమైన నిర్ణయాల కారణంగా నిత్యం వార్తల్లో నిలిచే మోర్టగేజ్ లెండింగ్ కంపెనీ బెటర్ డాట్ కామ్ సీఈవో విశాల్ గార్గ్ మంచి నాయకుడిగా ఎదిగేందుకు శిక్షణ తీసుకుంటున్నట్లు తెలిపారు. తాజాగా టెక్నాలజీ మీడియా సంస్థ టెక్‌క్రంచ్ విశాల్ గార్గ్‌తో ఇంటర్వ్యూ జరిపింది. ఈ సందర్భంగా బెటర్ డాట్ కామ్‌లో మంచి బాస్‌గా ఉండేందుకు చాలా ప్రయత్నించినట్లు తెలిపారు. 2021 డిసెంబర్ నెలలో సీఈవో విశాల్ జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఆ మీటింగ్ జరిగే సమయంలో కేవలం 3 నిమిషాల్లో 900 మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు మూటగట్టుకున్నారు. లేఆఫ్స్ బాధితుల్లో అధిక వేతనాలు తీసుకున్న 250 మందికి పైగా ఉన్నారు. వాళ్లే చేయాల్సి పనివేళల గంటే ఎక్కువ సేపు పనిచేశారని ఫార్చ్యూన్ మ్యాగజైన్ తెలిపింది. శిక్షణ తీసుకున్నా అయితే, ఆ భారీ లేఆఫ్స్ తర్వాత మంచి బాస్‌గా ఎదిగేందుకు, సిబ్బంది తనని నమ్మేలా ప్రయత్నించినట్ల, ఇందుకోసం ట్రైనింగ్ తీసుకున్నట్లు టెక్ క్రంచ్‌కు చెప్పారు. తద్వారా ఉద్యోగులను చూసే ధోరణి మార్చుకున్నానని, వారిపట్లు సానుభూతితో మెలిగేలా శిక్షణ తీసుకున్నారు. కస్టమర్లతో సైతం అదే తరహాలో ఉండేలా కష్టపడినట్లు వెల్లడించారు. చిన్న లాజిక్ అర్ధమైంది కంపెనీ లక్ష్యం, సంస్థ ఎదుగుదలతో పాటు కస్టమర్లకు సంతృప్తి కలిగించడంపై దృష్టి సారించినట్లు గార్గ్ పేర్కొన్నారు. తన క్లయింట్లు సంతృప్తి చెందాలంటే తన ఉద్యోగులు సంతోషంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉందని తాను గ్రహించినట్లు చెప్పారు. ప్రస్తుతం Better.com లో వెయ్యి మంది ఉద్యోగులు ఉన్నారని గార్గ్ తెలిపారు. ఇటీవలే అరోరా అక్విజిషన్ కార్ప్ అనే సంస్థతో గార్గ్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఈ డీల్ కొంతకాలం వాయిదా పడింది. బెటర్.కామ్ షేర్లు నాస్డాక్ స్టాక్ మార్కెట్లో బీఈటీఆర్ గుర్తును ఉపయోగించి ట్రేడింగ్ ప్రారంభించాయి. అయితే ట్రేడింగ్ ప్రారంభం కాగానే షేరు విలువ 90 శాతానికి పైగా పడిపోయింది. ఇక, తాజాగా టెక్‌క్రంచ్ జూమ్ ఇంటర్వ్యూతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. సంస్థ బాగుండాలంటే ఉద్యోగులు సంతోషంగా ఉండాలనే లాజిక్‌ను ఎలా మిస్ అయ్యారని ప్రశ్నిస్తున్నారు. తనని తాను మార్చుకునే దిశగా విశాల్ గార్గ్ శిక్షణ తీసుకోవడంపై అభినందనలు తెలుపుతున్నారు. .@betterdotcom’s CEO @vishalgarg_ lays off ~900 employees right before the holidays and ahead of the company’s public market debut. The firm also got a $750 million cash infusion from its backers THIS WEEK, which include @SoftBank. pic.twitter.com/F8EfSkCRF6 — Benjamin Young Savage (ᐱᓐᒋᐱᓐ) (@benjancewicz) December 3, 2021 -
బెటర్ డాట్ కామ్ రియల్ ఎస్టేట్ యూనిట్ షట్‌డౌన్.. వేల మంది ఉద్యోగుల తొలగింపు
ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. తాజాగా, ఆర్ధిక మందగమనం వెంటాడుతుండటంతో మార్ట్గేజ్ సంబంధిత సేవలను అందించే ఆన్లైన్ ప్లాట్‌ఫాం బెటర్.కాం (Better.com) సంచలన నిర్ణయం తీసుకుంది. తన రియల్ ఎస్టేట్ విభాగాన్ని మూసివేసింది. మొత్తం సిబ్బందిని విధుల నుంచి తొలగించినట్టు బెటర్.కాం వ్యవస్ధాపక సీఈవో విశాల్ గార్గ్ వెల్లడించారు. మార్ట్గేజ్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కంపెనీ పేర్కొంది. అయితే, మార్ట్గేజ్ వడ్డీ రేట్ల పెరుగుదలతో ఈ పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు కంపెనీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపధ్యంలో 4,000 మంది ఉద్యోగుల తొలగింపు ముందే ఊహించినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మరోవైపు సోషల్ మీడియా సంస్థ రెడిట్ 90 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. వ్యయ నియంత్రణ చర్యలు, ఆర్ధిక అనిశ్చితి కారణగా గ్లోబల్ టెక్ దిగ్గజాలతో పాటు భారతీయ స్టార్టప్‌లు కూడా గత ఏడాదిగా ఏకంగా 27,000 మందికిపైగా విధుల నుంచి తొలగించినట్లు వెలుగులోకి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. -
ఉద్యోగులందరూ లేఆఫ్.. రియల్ ఎస్టేట్ యూనిట్ మూసివేత
ఆన్లైన్ మార్ట్గేజ్ సంస్థ బెటర్ డాట్ కామ్ (Better.com) తాజా లేఆఫ్‌లలో భాగంగా తమ రియల్ ఎస్టేట్ యూనిట్‌ను మొత్తానికే ఎత్తేసి అందులోని ఉద్యోగులందరినీ తొలగిస్తున్నట్లు ప్రకటించింది. టెక్లూసివ్ (TECHLUSIVE) నివేదిక ప్రకారం.. బెటర్ డాట్ కామ్ సీఈవో భారత సంతతికి చెందిన విశాల్ గార్గ్ 2021 డిసెంబర్ నుంచి నుంచి ఇప్పటివరకు యూఎస్, భారత్ దేశాల్లో 4,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించారు. అయితే తాజా రౌండ్ తొలగింపుల ప్రభావం ఎంత మంది ఉద్యోగులపై పడుతుందో స్పష్టత లేదు. బెటర్ డాట్ కామ్ అంతర్గత ఏజెంట్ మోడల్ నుంచి భాగస్వామ్య ఏజెంట్ మోడల్‌కు మారాలని యోచిస్తున్నట్లు నివేదికల ప్రకారం తెలుస్తోంది. 2021 డిసెంబర్ లో జూమ్ కాల్ ద్వారా 900 మంది ఉద్యోగులను తొలగించినందుకు విశాల్ గార్గ్ విమర్శలు ఎదుర్కొన్నారు. 2022 మే లో ఉద్యోగులు స్వచ్ఛందంగా తప్పుకొనేందుకు అవకాశం ఇవ్వగా దాదాపు 920 మంది రాజీనామాలు చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో అమెజాన్, బెటర్ డాట్ కామ్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీని ద్వారా అమెజాన్ ఉద్యోగులు తమ కంపెనీ షేర్లను తనఖా కోసం అవసరమైన ప్రారంభ చెల్లింపునకు ఉపయోగించుకోవచ్చు. ఇందు కోసం 'ఈక్విటీ అన్‌లాకర్' అనే ప్రోగ్రామ్‌ను బెటర్ డాట్ కామ్ పరిచయం చేసింది. ఇది అమెజాన్ ఉద్యోగులు తమ వెస్టెడ్ ఈక్విటీని సెక్యూరిటీగా ఉపయోగించుకోవడానికి అనుమతిస్తుంది. ఇల్లు కొనుగోలు చేసేటప్పుడు డౌన్ పేమెంట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. బెటర్ డాట్ కామ్ తరచూ ప్రకటిస్తున్న లేఆఫ్‌లు మార్ట్గేజ్ రంగంలో ప్రస్తుతం ఉన్న అనిశ్చిత మార్కెట్ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఇదీ చదవండి: Oldest Real Estate Agent: 74 ఏళ్ల వయసులో రియల్ఎస్టేట్ ఏజెంట్! పరీక్ష రాసి మరీ.. -
లైవ్‌లో తొలగింపు..ఉద్యోగుల ఫ్రస్టేషన్‌తో జడుసుకున్న దిగ్గజ సంస్థ సీఈవో!
అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్‌కు చెందిన వాషింగ్టన్ పోస్ట్ సీఈవో మీటింగ్ పెట్టి ఫైర్ చేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు.అంతేకాదు తమని ఎందుకు తొలగిస్తున్నారో చెప్పాలంటూ ప్రశ్నించిన ఉద్యోగుల ఫ్రస్టేషన్ దెబ్బకు జడుసుకొని సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. ప్రస్తుతం లైవ్ ‘లే ఆఫ్స్’కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఈకామర్స్ రంగంతో పాటు ఇతర రంగాల్లో వ్యాపార కార్యకాలాపాలు నిర్వహిస్తున్నారు. వాటిలో మీడియా విభాగానికి చెందిన వాషింగ్టన్ పోస్ట్‌లోపనిచేస్తున్న ఉద్యోగుల్ని తొలగించినట్లు ఆ సంస్థ సీఈవో ఫ్రెడ్ ర్యాన్ ఆఫీస్ మీటింగ్‌లో తెలిపారు. ఆర్ధిక మాంద్యం ముంచుకొస్తుందనే వార్తల నేపథ్యంలో ఉద్యోగులతో సీఈవో బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్‌లో 2,500మంది పనిచేస్తున్న సంస్థలో సింగిల్ డిజిట్ పర్సంటేజ్ సిబ్బందిని ఫైర్ చేస్తున్నట్లు ప్రకటించారు. తొలగించిన వారి స్థానాల్ని భర్తీ చేసేలా మరికొంత మందిని నియమించుకుంటామని, ఉద్యోగుల సంఖ్య తగ్గదని ర్యాన్ పేర్కొన్నారు. అంతేకాదు ఉద్యోగాల కోత మా ఆశయాలకు వ్యతిరేకం కాదు. కానీ మా కస్టమర్ల అవసరాలను తీర్చని కార్యక్రమాలలో పెట్టుబడులు పెట్టడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ప్రకటనలపై ఆధారపడే కంపెనీలకు ఆర్ధిక ఇబ్బందులు తలెత్తడమే ఉద్యోగుల తొలగింపులకు కారణమని కంపెనీ పేర్కొంది. ర్యాన్ తొలగింపుల ప్రకటనపై కంపెనీ ఉద్యోగులు మూకుమ్ముడిగా ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. కానీ ఉద్యోగుల తీరుతో జడుసుకున్న సీఈవో రిప్లయి ఇవ్వకుండానే అక్కడి నుంచి నిష్క్రమించారు. Today, we came into WaPo’s so-called town hall with questions about recent layoffs and the future of the company. Our publisher dropped a bombshell on us by announcing more layoffs and then walking out, refusing to answer any of our questions. pic.twitter.com/ajNZsZKOBr — Washington Post Guild (@PostGuild) December 14, 2022 సమావేశంలో ఉద్యోగుల ప్రశ్నలకు రిప్లయి ఇచ్చేందుకు సీఈవో ర్యాన్ ఎందుకు నిరాకరించారో వాషింగ్టన్ పోస్ట్ గిల్డ్ (సంఘం) ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రవర్తన ఏ నాయకుడికి ఆమోదయోగ్యం కాదు. కానీ పారదర్శకత, జవాబుదారీతనం వంటి ప్రధాన విలువలు కలిగిన వార్తా సంస్థ నాయకుడు ర్యాన్ అని గిల్డ్ పేర్కొంది. కొద్ది వారాల క్రితం వాషింగ్టన్ పోస్ట్ వీక్లీ మ్యాగజైన్‌ను క్లోజ్ చేసింది.11 మంది న్యూస్‌రూమ్ ఉద్యోగులపై కోత విధించింది. ఆ ప్రకటన చేసిన కొద్ది వారాల తర్వాత..తాజాగా ఆర్థిక ప్రతికూలతల్ని కారణంగా చూపిస్తూ ఉద్యోగుల తొలగింపు ప్రకటన చేసింది. పత్రిక వీక్లీ చివరి మ్యాగజైన్‌ను డిసెంబర్ 25న ప్రచురించబడుతుందని వాషింగ్టన్ పోస్ట్ నివేదిక పేర్కొంది. -
మరోసారి వార్తల్లో కెక్కిన బెటర్ డాట్ కామ్ సీఈవో విశాల్ గార్గ్!
ప్రముఖ మార్టిగేజ్ సంస్థ బెటర్‌డాట్ కామ్ ఉద్యోగులకు షాకిచ్చింది. మొత్తం మూడు దశల్లో 4వేల మందిని ఉద్యోగుల్ని తొలగించిన ఆ సంస్థ తాజాగా మరో 250 మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. వెలుగులోకి వచ్చిన రిపోర్ట్‌ల ప్రకారం.. ఆగస్ట్ 23న బెటర్ డాట్ కామ్ 250 ఉద్యోగులపై వేటు వేసింది. వేటు వేసిన ఉద్యోగులు ఏ విభాగానికి చెందిన వారనేది తెలియాల్సి ఉండగా.. తాజాగా ఆ సంస్థ సీఈవో తీసుకున్న నిర్ణయం మరోసారి సంచలనంగా మారింది. ఎందుకంటే ? గతేడాది డిసెంబర్ నెలలో బెటర్ డాట్ కామ్ సీఈవో విశాల్ గార్గ్ ఉద్యోగులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. జూమ్ మీటింగ్ జరిగే సమయంలో కేవలం 3 నిమిషాల వ్యవధిలో 900 మంది ఉద్యోగుల్ని తొలగించి వారి ఆగ్రహానికి కారణమయ్యారు. అలా నాటి నుంచి ఉద్యోగుల తొలగింపుల్ని ముమ్మరం చేశారు విశాల్ గార్గ్. గతేడాది డిసెంబర్ నెలలో జూమ్ మీటింగ్ జరిగే సమయంలో 900మందిని, ఈ ఏడాది మార్చిలో 2వేల మందిని, ఏప్రిల్‌లో వెయ్యిమందిని ఇంటికి సాగనంపారు. ఇప్పటి వరకు సుమారు 4వేల మందిపై వేటు వేయగా..తాజాగా 250మందిని తొలగించడంతో చర్చాంశనీయమయ్యారు. ఫైర్ చేసిన ఉద్యోగులు, స్వచ్ఛందంగా బయటకు వెళ్లేందుకు సిద్ధపడుతున్న ఉద్యోగులకు హెల్త్ ఇన్స్యూరెన్స్‌తో పాటు కొంత మొత్తాన్ని చెల్లిస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. కాగా, కానీ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితులు బెటర్ డాట్ కామ్ సీఈవో గార్గ్‌ను ఆర్ధికంగా దెబ్బతీశాయి. దీంతో తీసుకున్న రుణాల్ని తీర్చేందుకు భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగిస్తున్నారు. చదవండి👉 పీకల్లోతు అప్పుల్లో ఉన్నా! నన్ను క్షమించండి!