చీటింగ్‌ కేసులో నలుగురి అరెస్ట్‌ | cheating case.. four persons arrest | Sakshi
Sakshi News home page

చీటింగ్‌ కేసులో నలుగురి అరెస్ట్‌

Published Sat, Sep 3 2016 2:04 AM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

cheating case.. four persons arrest

జంగారెడ్డిగూడెం : ఒక వ్యక్తిని మోసం చేసిన కేసులో నలుగురిని అరెస్ట్‌ చేసినట్లు ఎస్‌ఐ ఎ.ఆనందరెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. స్థానిక బిల్డర్‌ డి.ఎస్‌.బి.రవికిరణ్‌ తన భవననాన్ని నారాయణ ఎడ్యుకేషనల్‌ సొసైటీకి అద్దెకు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో డబ్బులు అవసరం రావడంతో ఆ భవనాన్ని సేల్‌ రిజిస్ట్రేషన్‌పై కుదువ పెట్టి  కర్పూరం గవరయ్య గుప్త, అద్దంకి వెంకట సతీష్, బచ్చు నారాయణరావు, కర్పూరం కేశవరావు వద్ద రూ.25 లక్షలు తీసుకున్నాడు. దీనికి మొదట్లో 1.50పైసలు వడ్డీ అని చెప్పారు. అంతేకాకS అదే భవనం ముందు ఉన్న రవికిరణ్‌కు ఉన్న ఖాళీ స్థలాన్ని వారు రూ.30 లక్షలకు కొన్నారు. రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నా.. డబ్బులు ఇవ్వలేదు. దీంతో రవికిరణ్‌ ప్రశ్నించగా, నువ్వు తీసుకున్న అప్పుకు వడ్డీ రూ.2 అని, ఇంకా తమకే రూ.రెండు కోట్లు ఇవ్వాలని ఆ నలుగురూ రవికిరణ్‌ను భయపెట్టి  చెక్కులు, నోట్లపై సంతకాలు చేయించుకుని మోసం చేశారు. దీంతో రవికిరణ్‌ ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్టు చేసినట్లు ఎస్సై చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement