అన్ని సమస్యలకు అభివృద్ధే సమాధానమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
న్యూఢిల్లీ: అన్ని సమస్యలకు అభివృద్ధే సమాధానమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ఢిల్లీ-ఫరీదాబాద్ రైలు మార్గాన్ని ప్రారంభించిన అనంతరం మోదీ ప్రసంగించారు.
దేశాభివృద్దే తన లక్ష్యమని మోదీ అన్నారు. హర్యానా తనకు రెండో ఇల్లు వంటిదని చెప్పారు. రాజకీయాల కంటే విధానాలు తమకు ముఖ్యమని మోదీ అన్నారు. ప్రభుత్వ ఏకైక ఎజెండా అభివృద్ధి అని చెప్పారు.